కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 3/8 పేజీ 29
  • ప్రపంచ పరిశీలన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచ పరిశీలన
  • తేజరిల్లు!—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆనందానికి రహస్యం?
  • ట్రాఫిక్‌ సంబంధిత మరణాలు
  • ఏనుగుల బ్యూటీష్యన్‌
  • వస్తోంది: అడవులులేని ప్రప్రథమ ఆసియా దేశం
  • “ఓర్మిగల హంతకులు”
  • గుండెపోటు బాధితులకు నిరీక్షణ
  • మృత సముద్రపు గ్రంథపు చుట్టలను గురించిన నిజాలు ఏమిటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • ఏనుగులు—మిత్రులా లేక శత్రువులా?
    తేజరిల్లు!—1994
  • మందమైన చర్మంగల శాంతియుత ఏనుగులను సంరక్షించుట
    తేజరిల్లు!—1993
  • కుటుంబ సంతోషానికి రహస్యమేదైనా ఉందా?
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 3/8 పేజీ 29

ప్రపంచ పరిశీలన

ఆనందానికి రహస్యం?

లండన్‌ నందలి ద డైలీ టెలిగ్రాఫ్‌లో ఇవ్వబడిన సర్వే ప్రకారం, బ్రిటన్‌ దేశస్థులు 25 సంవత్సరాల క్రితం కన్నా ఇప్పుడు మరింత ఆరోగ్యంగానూ సంపన్నంగానూ ఉన్నప్పటికీ, వారిలో అనేకులు అప్పట్లో ఉన్నంత ఆనందంగాలేరు. అమెరికాకు చెందిన ఓ సమాజ శాస్త్రజ్ఞుడు సెంట్రల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ నుండి వచ్చిన సోషల్‌ ట్రెండ్స్‌ రిపోర్ట్‌ కనుగొన్న విషయాలతో ఏకీభవిస్తూ నిజమైన ఆనందం, “యుక్తమైన గురులను వెంబడించడంతో” సహా “జీవితంలో అర్థం” కల్గివుండడం ద్వారా నిజమైన ఆనందం కలుగుతుందని ఆయన రూఢిపర్చాడు. దీనికి సాదృశ్యంగా, ఇరువురు న్యూజీలాండ్‌ పరిశోధకులు సుమారు 400 మందిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత, “తమ ఉనికిలోని క్రమాన్ని ఉద్దేశాన్ని గుర్తించడంలోనే” ఆనందం ఉందని అనేకులు భావిస్తారనే నిర్ధారణకు వచ్చారు. వివాహిత వ్యక్తులూ దృఢమైన మత విశ్వాసాలుగల వారు అధిక సంతృప్తిని పొందే అవకాశం ఉంది. బ్రిటన్‌ నందు, వివాహాల్లోను మత విశ్వాసాల్లోను తగ్గుదల దృష్ట్యా, “ఒక దేశంగా మనం మరింత అసంతోషకరంగానే కొనసాగుతామని” ఆ వార్తాపత్రిక ముగించింది.

ట్రాఫిక్‌ సంబంధిత మరణాలు

క్లారిన్‌ అనే అర్జెంటీనా వార్తాపత్రిక ప్రకారం, ప్రతి 11,00,000 మంది నివాసుల్లో 26 మంది మరణాల చొప్పున, ప్రతి దిన ట్రాఫిక్‌ ప్రమాదాల్లో ఆర్జెంటీనా ఆగ్రగామిగా ఉంది. ఆ దేశంలో 1993 నందు అలాంటి 8,116 మరణాలు సంభవించాయి. ఆ సంఖ్య 1994లో 9,120కి పెరిగింది. అయితే 1995లోని మొదటి ఆరునెలల్లో ట్రాఫిక్‌ ప్రమాదాల వల్ల 5,000 మరణాలు సంభవించాయి. 1994 నందు వాటికి గురైనవారిలో సుమారు 25 శాతం మంది కాలినడకవారే. బ్యూనోస్‌ ఏర్స్‌ అనే ప్రాంతంలోనే ట్రాఫిక్‌ ప్రమాదాల వల్ల కలిగిన మరణాలు 79 శాతం పెరిగాయి. ఈ ప్రమాదాల్లో అధిక శాతం, ఇతర వాహనాలను దాటేప్పుడు డ్రైవర్లు సరైన లెక్కలు వేసుకోవడంలో విఫలం కావడం వల్లే జరిగాయి.

ఏనుగుల బ్యూటీష్యన్‌

కేరళ రాష్ట్రంలోని ఏనుగులు తరచూ తమ పొడవైన దంతాలపై చాలా బరువైన వస్తువులను తీసుకు వెళుతుంటాయి. అయితే అనేక ఏనుగులు ఆలయ ఊరేగింపుల్లోనూ మతపర వేడుకల్లోనూ ఉపయోగించబడుతుంటాయి. ఈ సందర్భాలముందు, వృత్తిరీత్యా బ్యూటీష్యనైన వ్యక్తి వాటి మొహాన్ని దిద్దడు గానీ ఎక్కువ పొడవున్న ఉన్న దంతాన్ని కోసి చక్కదిద్దుతాడు. కేరళలో ఇలా సరిదిద్దే పనిని చేసే ఒకే ఒక వ్యక్తియైన పి.కె. శశిధరన్‌ తన తాతగారి నుండి ఈ ప్రావీణ్యతను సంపాదించాడు. ఎంత వరకు కత్తిరించాలో ఆయన ఎలా నిర్ణయిస్తాడు? ఏనుగు ప్రత్యేకతలు, అంటే దాని ఎత్తు, సైజు, శరీరాకారం వంటివాటిపై ఆధారపడ్డ వివరాలు ఈ కుటుంబంవారు ఎంతో జాగ్రత్తగా దాచిన గుట్టు. ఏనుగు సహకరిస్తే, ఆ ట్రీట్‌మెంటుకు మూడు గంటలు పడుతుంది, అయితే మొండి ఏనుగు అపాయకరంగా ఉంటుంది, మరి దానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. అందంగా ఉండేందుకు మాత్రమే కాకుండ, పనిచేసే ఈ ఏనుగులు బరువులను మోసేందుకు సులభంగా ఉండేందుకు కూడా ప్రతి రెండు సంవత్సరాలకూ కత్తిరింపు అవసరమౌతుంది.

వస్తోంది: అడవులులేని ప్రప్రథమ ఆసియా దేశం

ఫిలిప్పీన్స్‌ పూర్తి అటవీ నిర్మూలనాన్ని ఎదుర్కోబోతోందని, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం హెచ్చరిస్తోంది (యు.ఎన్‌.డి.పి.). “అధికమైన జనసాంద్రత, చెట్లునరికే అదుపుతప్పిన అలవాట్లూ” ఫిలిప్పీన్స్‌లోని చెట్లున్న ప్రాంతాలను ఇంక లేకుండా చేస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ఆ దేశంలో 60 నుండి 70 శాతం ప్రాంతం అడవులతో నిండి ఉండేది. నేడు, 15 శాతం మాత్రమే ఉంది. “2000 సంవత్సరానికల్లా, అడవులను చెట్లను కోల్పోయిన ఆసియా దేశాల్లో ఫిలిప్పీన్స్‌ మొట్టమొదటిదౌతుంది” అని అప్‌డేట్‌ అనే యు.ఎన్‌.డి.పి. వార్తాలేఖ నివేదిస్తోంది.

“ఓర్మిగల హంతకులు”

64 దేశాల్లో, దాదాపు 11 కోట్ల మందుపాతరలను తీసివేసేందుకు ఐక్యరాజ్య సమితి 7 కోట్ల 50 లక్షల డాలర్ల రుక్కాన్ని సమకూర్చేందుకు ప్రయత్నిస్తోందని ఇంటర్నాషనల్‌ హెరాల్డ్‌ ట్రిబ్యూన్‌ నివేదిస్తోంది. ఒక సిగరెట్టు ప్యాకెట్టు కంటే చిన్నదైన ప్రాణాంతకమైన ఆంటీపర్సనల్‌ (ఏ.పి.) మందుపాతరలను ఉత్పత్తి చేసేందుకు 3 డాలర్లు మాత్రమే ఖర్చౌతుంది. భూమిలోనుండి అలాంటి మందు పాతరను కనిపెట్టి తీసివేసేందుకు 300 నుండి 1,000 డాలర్లు ఖర్చౌతుంది. మందుపాతరలను తీసివేయడాన్ని మరో సమస్య అడ్డగిస్తోంది. ఐక్యరాజ్య సమితి ప్రతినిధి ఇలా అన్నాడు: “అప్పటికే ఉన్న 10 కోట్లకంటే ఎక్కువ మందుపాతరలకు తోడు ప్రతి సంవత్సరమూ 20 లక్షల క్రొత్త ఏ.పి. మందుపాతరలు పాతిపెట్టబడుతున్నాయి.” “ఎన్నడూ అపజయమెందని ఓర్మిగల హంతకులు” అని ఓ కంబోడియా జర్నల్‌ వర్ణించిన వాటిని లోకం నుండి తీసేందుకు కొన్ని దశాబ్దాలు పడుతుందని నిపుణులు ఒప్పుకుంటున్నారు.”

గుండెపోటు బాధితులకు నిరీక్షణ

“తీవ్రమైన హృదయ గాయం తర్వాత గుండె ఆగిపోవడం అనివార్యమని మునుపు భావించబడేది, అయితే వ్యాయామం వల్ల అలా జరగకుండా నివారించవచ్చు” అని టొరొంటొ ఆసుపత్రిలోని హృదయ పరిశోధక డైరెక్టరైన డా. పీటర్‌ లియు చెబుతున్నాడు. ఎలుకలపైన జరిపిన విజయవంతమవ్వగల పరిశీలన తర్వాత, కార్డియాక్‌ ఫంక్షన్‌ క్లినిక్‌ వారు రోగులను “క్రమేణా ప్రతిరోజు ఎక్కువ దూరాలకు నడిపించారు” అని ద గ్లోబ్‌ ఆండ్‌ మెయిల్‌ నివేదిస్తుంది. “ప్రతి రోజూ కనీసం ఒక కిలోమీటరు నడవడం, మానవుల్లో సహితం గుండె ఆగిపోయేంతటి ‘విషమిస్తున్న పరిస్థితిని’ త్రిప్పికొట్టవచ్చు. అయితే, నడిచే వేగం అనేది ఎక్కువగా ఉండాలి అదీ ఒకరి పర్యవేక్షణలో నడవాలి అని డా. లియు చెప్పారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి