కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 3/8 పేజీ 28
  • స్నేహశీలియైన రాబిన్‌

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • స్నేహశీలియైన రాబిన్‌
  • తేజరిల్లు!—1996
  • ఇలాంటి మరితర సమాచారం
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1996
  • దేవుడు నా స్నేహితుడుగా ఉంటాడా?
    తేజరిల్లు!—1997
  • 8 ఆదర్శం
    తేజరిల్లు!—2018
  • బీదరికం దొంగతనాన్ని సమర్థిస్తుందా?
    తేజరిల్లు!—1997
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 3/8 పేజీ 28

స్నేహశీలియైన రాబిన్‌

బ్రిటన్‌లోని తేజరిల్లు! విలేఖరి ద్వారా

కమిలి వర్ణం మా నార్తంబర్లాండ్‌ వనాలను, శరదృతువులోని కమనీయ దృశ్యంలోకి మార్చడానికి ఎంతో ముందు రాబిన్‌ తన సాన్నిధ్యాన్ని తెలుపుతాడు. వాని ప్రకాశవంతమైన ఎర్రటి రొమ్ము, వాని పాటల లయబద్ధమైన స్వరం మా తోటకు మరింత అందాన్నీ ఆనందాన్నీ తెచ్చిపెట్టింది. వాడు ఎంత ఆహ్లాదపర్చేడివాడో!

ఒలీవ-గోధుమ రంగులోనూ భుజాలతోనూ తలతోనూ; నారింజరంగూ ఎరుపు కలగలసిన రొమ్ము, గొంతు, నుదిటితోనూ; మరియు వాని తెల్లటి ఉదరాన్ని బట్టి రాబిన్‌ను సులభంగా గుర్తించవచ్చు. ఎల్లప్పుడూ చురుకుగా ఉండే గుండ్రని ఈ పక్షి, తల నుండి తోకవరకు 14 సెంటీమీటర్ల పొడవుండి, చురుగ్గా, నీటుగా నిటారుగా నిలుచుంటాడు. 1961లో రాబిన్‌ బ్రిటన్‌ జాతీయ పక్షిగా ఎన్నుకోవడంలో ఆశ్చర్యం లేదు.

అమెరికా రాబిన్‌ కంటే బ్రిటన్‌ రాబిన్‌ చిన్నగా ఉంటాడు. ఇంగ్లాండ్‌ నుండి వలసవచ్చి మొదట స్థిరపడినవారు తమకు పరిచయమున్న రాబిన్‌ అన్న పేరును వానికిచ్చారు. అయితే బ్రిటన్‌ రాబిన్‌కు వానిదైన లక్షణం ఉంది.

శరదృతువు సమీపించినప్పుడు, బ్రిటన్‌ తోటలో రాబిన్‌ ఎంతో మనోహరంగా కనిపిస్తాడు. నేలను తవ్వే వ్యక్తికి దగ్గిరగా నిలుచుని పురుగు ఎప్పుడైనా పైకి వస్తుందేమోనని చూస్తుంటాడు. కొన్నిసార్లు, తోటమాలి విశ్రమిస్తుండగా ఆ ప్రాంతాన్ని పరికించేందుకు రాబిన్‌ ఆ పారపై వ్రాలతాడు. ఈ తెలివిగల పక్షి, అడవి ఎలుకను వెంబడించి అది క్రొత్తగా తవ్విన మంటిదిబ్బలను పర్యవేక్షిస్తాడని కూడా పేరుగాంచాడు. రాబిన్‌ ఆహారాలవాట్లు విభిన్నంగా ఉంటాయి—కీటకాలూ విత్తనాలూ వృదుఫలం, అలాగే పురుగులను తింటాడు.

రాబిన్‌ గూడును చూడడం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో! తెరచివున్న ఏ షెడ్డు తలుపైనా కిటికీ అయినా, జతకట్టిన జంటకు ఇట్టే ఆహ్వానాన్ని పలుకుతాయి. పాత పూలతోట్లలోనూ లేక పారేసిన గిన్నెల్లోనూ చుట్టబెట్టిన వైర్లుపైనా, ఏదీ కాకపోతే తోటమాలి వేసుకునే కోటు జేబులోనైనా గూళ్లు కట్టవచ్చు సుమా! గూళ్లు కట్టేందుకు అసాధారణమైన స్థలాలను కనుగొనే రాబిన్‌ తెలివికి అవధులు లేవు.

మీ చేతినుండి ఆహారాన్ని తినడం నేర్పించేందుకు ఎంతో సులభంగా ఉండే పక్షి రాబిన్నే. శీతాకాలం సమీపిస్తూ, వాని సహజ ఆహార సరఫరా కుంటుపడుతుండగా, ఆహారాన్ని—చీస్‌ ముక్కలనూ లేక తినేపురుగులను—తెరచిన మీ అరచేతిలో పెట్టండి, మరికొంత మీకు సమీపంలోని కదలని వస్తువుపై ఉంచండి. రెండు మూడు సార్లు దాని మీది నుండి ఆహారాన్ని తిన్న తర్వాత, వాడు నమ్మకాన్ని పొంది, తెరచివుంచిన మీ చేతినుండి కూడా తింటాడు. రాబిన్‌ మీ వేళ్లపై ఎన్నడూ వ్రాలకపోయినప్పటికీ, అప్పటినుండి వాడు మిమ్మల్ని తన స్నేహితునిగానే ఎల్లప్పుడూ దృష్టిస్తాడు. మీరెలాగైతే మీ స్నేహితుడైన రాబిన్‌ను మర్చిపోరో అలాగే, మరుసటి ఋతువులో తిరిగివచ్చినప్పుడు మిమ్మల్ని వాడు మర్చిపోడు సుమా!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి