కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 3/8 పేజీ 30
  • మా పాఠకుల నుండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మా పాఠకుల నుండి
  • తేజరిల్లు!—1996
  • ఇలాంటి మరితర సమాచారం
  • భూదిగంతముల వరకూ దేవుని జ్ఞానాన్ని తీసుకువెళ్లడం
    తేజరిల్లు!—1996
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1996
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1996
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1996
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 3/8 పేజీ 30

మా పాఠకుల నుండి

క్షమించి మర్చిపోవడం “బైబిలు ఉద్దేశం: క్షమించి మర్చిపోవడం—ఎలా సాధ్యం?” (జూన్‌ 8, 1995) అనే విశిష్టమైన శీర్షికనుబట్టి మీకు కృతజ్ఞతలు. అపరిపూర్ణ మానవుల నుండి అసాధ్యమైనదానిని బైబిలు కోరుతుందా అని నేను ఆశ్చర్యపోయేవాడ్ని. కాని క్షమించి మర్చిపోవడం అంటే ఏమిటో నేనిప్పుడు గ్రహిస్తున్నాను. దేవుని ఆజ్ఞలు భారమైనవి కావనే నిర్ణయానికి నేను రావడానికి ఈ శీర్షిక సహాయపడింది.

సి. ఐ. సి., నైజీరియా

నేను ఈ శీర్షికను ఎంతగా మెచ్చుకుంటున్నానో మీకు వ్రాసి తెలపవలసిందే. చిన్నప్పుడు మా నాన్న సహోదరులలో ఇద్దరు నాపై అత్యాచారం చేశారు. తరువాత, భార్యగా నేను దుర్‌వ్యవహారానికి గురయ్యాను, నీచంగా చూడబడ్డాను. క్రైస్తవురాలిగా మారిన తరువాత, నేను ప్రేమ చూపించడానికి, క్షమించడానికి ప్రయత్నం చేశాను. అయితే, అనేక సంవత్సరాలు నన్ను విపరీతంగా బాధపెట్టిన ఈ ముగ్గురు వ్యక్తులను నేను క్షమించానని నేనెన్నడూ నిజాయితీగా చెప్పలేకపోయాను. యెహోవా చేతుల్లోకి వదిలిపెట్టవలసిన కొన్ని విషయాలున్నాయని నేనిప్పుడు గ్రహిస్తున్నాను, అలా నేను జీవితం కొనసాగించగలను. నాకు కలిగిన ఈ లోతైన గాయం త్వరలోనే మాన్పబడుతుందని ప్రకటన 21:4 నాకు అభయమిస్తుంది.

ఎ. బి., అమెరికా

నేను ఈ శీర్షికను చదవడం ఇప్పుడే ముగించాను, నాకు ఈ నిమిషంలో అనిపించినంతగా నేనెన్నడూ దేవునికి అంత సన్నిహితుడునైనట్లుగా భావించలేదు. కొంత కాలం క్రితం నేను చేసిన గంభీరమైన పాపం వల్ల నేను సంఘ పెద్దల సహాయాన్ని కోరాను. నేను వారి నుండి దయాపూర్వకమైన ప్రేమపూర్వకమైన ఉపదేశాన్ని పొందినప్పటికీ, నేను ప్రార్థనలో యెహోవాతో మాట్లాడకుండా ఆటంకపరచబడినట్లు భావించాను. నేను ఎంతో అవసరతలోనున్న, మన పరలోక తండ్రి మనల్నెలా క్షమించి మర్చిపోతాడో అనేదానిని గూర్చిన అవగాహనను ఈ శీర్షిక నాకిచ్చింది. హృదయపూర్వకమైన ప్రార్థనలో చనువుగా నేను ఆయనను సమీపించేందుకు అది నాకు సహాయం చేసింది—నేను మూర్ఖంగా వదిలిపెట్టుకున్న ఆధిక్యతయది. ‘తగిన వేళ ఆహారమును’ నాకు ఇచ్చినందుకు యెహోవాకు కృతజ్ఞతలు.—మత్తయి 24:45.

డి. జె. ఎస్‌., అమెరికా

అప్పు “మీరు అప్పులు చేయడం యోగ్యమేనా?” అనే మీ శీర్షికనుబట్టి మీకు కృతజ్ఞతలు. (జూన్‌ 8, 1995) నాకు 13 సంవత్సరాలే, కాని నేను నా డబ్బును సరిగ్గా ఉపయోగించేవాడ్ని కాను. ఈ శీర్షిక నాకు చాలా సహాయం చేస్తుందని నేను అనుకుంటున్నాను.

సి. ఎ., అమెరికా.

ప్రపంచ పరిశీలన మీ పత్రికలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. వాటిలో అన్ని రకాల విషయాలు అంటే, ప్రస్తుత సంఘటనలు, క్రీడలు, విజ్ఞానశాస్త్రం వంటి అనేక విషయాలు చర్చించబడతాయి. “ప్రపంచ పరిశీలన” అనేది నిజంగా అత్యంతాసక్తికరమైనది. దూరదర్శిని వార్తలు ఈ ఫీచర్‌ ఆధారంగా ఉండేటట్లయితే, అది ఇంకా ఆసక్తికరంగా ఉంటుందని నేననుకుంటున్నాను.

ఆర్‌. ఎస్‌., ఇటలీ

“ప్రపంచ పరిశీలన” అనే శీర్షికలోని అంశాలను నేను నిజంగా మెచ్చుకుంటాను. మే 8, 1995 సంచికలోని ఒకటి నా విషయంలో ఎంతో భావాన్ని కలిగి ఉంది. “ఉపాధ్యాయులను ఏది ప్రసిద్ధులనుగా చేస్తుంది?” అన్నది అంశం. తక్కువ హోమ్‌ వర్క్‌ ఇచ్చే ఉపాధ్యాయులనే పిల్లలు ఇష్టపడతారని లేదు, దయగలవారును, అయితే శ్రద్ధచూపేవారును న్యాయవంతులునైన ఉపాధ్యాయులను వారు ఇష్టపడతారు. నిజం అది! ప్రసిద్ధులవ్వాలనే కోరికతో ప్రసిద్ధులైన విద్యార్థుల అభిమానాన్ని ఇష్టపడే ఉపాధ్యాయులనేకులు నాకు తెలుసు. అయితే అలాంటి ఉపాధ్యాయులు ఎంతోకాలం ప్రసిద్ధులుగా ఉండలేరు. ఈ విలువైన సమాచారానికి మరోసారి కృతజ్ఞతలు.

ఎల్‌. కె., అమెరికా

దొంగిలించడం నాకు 13 ఏండ్లు, నాకు ఉండిన ఒక బలహీనత దొంగతనం చేయడమే. నేను డబ్బు దొంగిలించేదాన్ని, లేదా ఒక స్టోర్‌కు వెళ్ళి బబుల్‌గమ్‌ దొంగిలించేదాన్ని. నేను దొంగతనం మానివేయాలని కోరుకున్నాను, కాని నేను జూన్‌ 22, 1995 తేజరిల్లు! (ఆంగ్లం) అందుకుని, “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . దొంగతనం—ఎందుకు చేయకూడదు?” అనే శీర్షికను చూసేంతవరకు నాకేదీ సహాయపడలేదు. అది నిజంగా నన్ను స్పర్శించింది. యెహోవాకు ప్రార్థించడానికి, ఆయన మనల్ని మరెక్కువగా క్షమిస్తాడని తెలుసుకునేందుకు అది నాకు సహాయపడింది. నేను దేవుని రాజ్యంలో ఉండాలని ఆశిస్తున్నాను, దొంగిలించేవారు అక్కడ ఉండరని నాకు తెలుసు. ఈ శీర్షికను ప్రచురించినందుకు కృతజ్ఞతలు.

జె. ఎ., కెనడా

నాకు 23 సంవత్సరాల వయస్సు, నేను దొంగిలించినందుకు జైలులో వేయబడ్డాను. ఇదంతా తోటివారి ఒత్తిడి వల్లనే మొదలైంది. ఒకరిని వేళాకోళం పట్టియ్యమని వాళ్ళు నన్ను కోరారు, అక్కడ నుండి పరిస్థితులు మరింత విషమించిపోయాయి. శీర్షిక చెప్పింది ఎంతో నిజం. మరీ ఆలస్యం కాక ముందే యౌవనస్థులు ఆ ఉపదేశాన్ని అనుసరించాలని నేను ఆశిస్తున్నాను. ఆ విధంగా, వారు నేను చేరుకున్న స్థలానికి అంటే జైలుకి చేరుకోకుండా ఉండగలుగుతారు.

ఎమ్‌. ఎస్‌., అమెరికా

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి