యుద్ధ స్మృతుల మధ్యలో శాంతి కొరకైన ప్రార్థనలు
నవంబరు 1994లో పోప్ జాన్ పాల్ II వివిధ మతాల సమావేశాన్ని వాటికన్లో ఆయత్తపరచాడు. ప్రపంచ శాంతి కొరకైన ప్రార్థనలు ఆ సందర్భాన్ని ముఖ్యమైనదిగా చేశాయి. “గతంలోను, ప్రస్తుతమైనను ఎలాంటి సంఘర్షణలున్నప్పటికీ, మతానికి శాంతికి గల సంబంధాన్ని ప్రచురం చేయడం మన సాధారణ పని మరియు కర్తవ్యము” అని పోప్ తన ప్రారంభ ప్రసంగంలో చెప్పాడు.
దానికి విరుద్ధంగా, ఈ ప్రపంచ మతాలకు ఈ విషయంలో మంచి పేరులేదు. “ప్రపంచంలోని పలు ప్రాంతాల్లోని సంఘర్షణల్లో మతం ఇమిడి ఉంది” అని విలియమ్ వాండ్లీ సమావేశ సెక్రటరీ జనరల్ తెలియజేశారు. రోమన్ కాథోలిక్ మతం ప్రబలివున్న దేశమైన రువాండాలోని నరమేధాలను గూర్చి తలంచండి.
మే 1994లో పోప్ జాన్ పాల్ II రువాండా దుర్ఘటన “నిజంగా, వాస్తవంగా జాతి నిర్మూలనమే, దానికి కాథోలిక్‌లు కూడా బాధ్యులే” అని ఒప్పుకుంటున్నాడు. కాథోలిక్‌లు పాల్గొనడం, చర్చిలో ప్రజల విశ్వాసాన్ని ప్రభావితం చేసిందా? “నరమేధాలు అనేక మంది ప్రజల విశ్వాసాలు సన్నగిల్లేలా చేశాయి” అని ఆండ్రా బాయో అనే ఒక బెల్జియమ్ జెస్యూట్ చెబుతున్నాడు. అది సహేతుకమే.
మియామీ హెరాల్డ్‌లో నిర్వచించబడిన ర్యూటర్స్ నివేదిక ప్రకారం, “40,000 మంది హుటూ ఖైదీల్లో ప్రీస్ట్లు, పాస్టర్లు మరియు సన్యాసినులు జాతినిర్మూలన చర్యల శిక్ష కొరకు ఎదురు చూస్తున్నారు.” “తమ బిషప్పులు, ఆర్చ్బిషప్పులు నరమేధాన్ని వెంటనే ఖండించలేదు లేదా కావలసినంత గట్టిగా ఖండించలేదు, మరి హబియారిమానా ప్రభుత్వానికి వారు ఎంతో సన్నిహితులుగా ఉండేవారు. అది మరణ దళాలకు తర్ఫీదునిచ్చేందుకు సహాయపడింది. క్రొత్త టూట్సీ ఆధిపత్యంగల ప్రభుత్వం, నరమేధాల్లో సహకారం చూపారనే నేరారోపణపై కనీసం ఒక ప్రీస్టును అరెస్టు చేసిందని” ద న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. “కాథోలిక్ చర్చి ముందున్నంత శక్తివంతంగా ఉండడాన్ని తాను ఇష్టపడడం లేదని, మరియు మోహమాటపడని, స్వతంత్ర ప్రీస్టులను సైనికులు వేధించారని, అరెస్టు చేస్తామని కూడా బెదిరించారని క్రొత్త ప్రభుత్వం చెబుతుంది” అని టైమ్స్ మళ్ళీ చెప్పడంలో ఆశ్చర్యం లేదు.
రక్తాపరాధులైన మత విశ్వాసులు చేసే శాంతి కొరకైన ప్రార్థనలను యెహోవా దేవుడు ఎలా దృష్టిస్తాడు? యెషయా 1:15 ఇలా జవాబు చెబుతుంది: “మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థనచేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి.”
అదే సమయంలో యెహోవా యొక్క నిజ సేవకులు ‘లోకం’ మరియు దాని సంఘర్షణల ‘భాగం కారు.’ రువాండాలోని నరమేధ సమయంలో, ప్రతి తెగలోని యెహోవాసాక్షులు అపాయంలో ఉన్న మరో తెగలోని యెహోవాసాక్షుల కొరకు తమ గృహాల్లో ఆశ్రయాన్ని కల్పించారు, అలా వారు తమ జీవితాలను అపాయంలో పడవేసుకుంటూ వారిని కాపాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని తెగల పుట్టుపూర్వోత్తరాల నుండి వచ్చిన యెహోవాసాక్షుల “గొప్ప సమూహం” దేవుని రాజ్యం కొరకు ప్రార్థిస్తుంది, మరి భవిష్యత్ శాంతి భద్రతల కొరకు ఏకైక నిరీక్షణగా దానిని సమర్థిస్తుంది.—యోహాను 17:14; ప్రకటన 7:9; మత్తయి 6:9, 10; 24:14.
[Picture Credit Line on page 31]
Luc Delahaye/Sipa Press