వారు మొదటి బహుమతిని పొందారు
భారతదేశంలోని మద్రాసులో ఇద్దరు విద్యార్థులు స్పేస్ వాహనం మరియు లాంచ్ పాడ్ గల స్పేస్ స్టేషన్ నమూనాను చేసి మొదటి బహుమతిని పంచుకున్నారు. ఈ ఫోటోగ్రాఫ్‌లలో కనబడుతున్న ఈ అమ్మాయి, అబ్బాయి తమ ప్రాజెక్ట్‌కు ఈ తలంపును ఎక్కడ నుండి పొందారు?
ఈ యౌవనస్థులు తేజరిల్లు! ప్రకాశకులకు వ్రాసిన ఒక లేఖలో ఈ విధంగా వివరించారు: “మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పేందుకు మేమీ అవకాశాన్ని తీసుకుంటున్నాము, ఎందుకంటే సెప్టెంబరు 8, 1992, తేజరిల్లు! లో (ఆంగ్లం) ప్రచురించబడిన అంతరిక్ష పరిశోధనలను గూర్చిన పరంపర వల్లనే మేమీ బహుమతులను పొందాము.”
తేజరిల్లు! కుటుంబమంతటికీ జ్ఞానోదయం కల్గించేందుకు ప్రచురించబడుతుంది. అనేక దేశాల్లోని ఆచారాలు, ప్రజలు, సృష్టిలోని అద్భుతాలను గురించి, ఆచరణాత్మక విజ్ఞాన శాస్త్రాలను గురించి, మానవులకు ఆసక్తికరమైన విషయాలను గురించి ఇందులో చర్చించబడుతున్నాయి. తేజరిల్లు! ను మీ ఇంటికి క్రమంగా తెప్పించుకోవడం ద్వారా, పాఠశాలలోను, తర్వాతి జీవితంలోను ప్రయోజనకరంగా ఉండే లౌకిక జ్ఞానాన్ని పెంచుకునేందుకు మీరు మీ పిల్లలకు సహాయపడవచ్చు.
మీరు తేజరిల్లు! యొక్క అదనపు ప్రతిని పొందాలని ఇష్టపడుతున్నట్లయితే లేక బైబిలు విద్యాభ్యాసం యొక్క విలువను మీతో చర్చించేందుకు ఎవరైనా మీ ఇంటికి రావాలని ఇష్టపడుతున్నట్లయితే, దయచేసి, Praharidurg Prakashan Society, Plot A/35, Nr Industrial Estate, Nangargaon, Lonavla, 410 401, Mah., లేదా 5 వ పేజీలో ఇవ్వబడిన చిరునామాల్లో మీకు సమీపంగా ఉన్నదానికి వ్రాయండి.