కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g96 1/8 పేజీ 30
  • మా పాఠకుల నుండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మా పాఠకుల నుండి
  • తేజరిల్లు!—1996
  • ఇలాంటి మరితర సమాచారం
  • సర్పి—దాని నొప్పిని తాళుకొనుట
    తేజరిల్లు!—1995
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1996
  • వాయిదా వేసే అలవాటును ఎలా మానుకోవచ్చు?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1996
మరిన్ని
తేజరిల్లు!—1996
g96 1/8 పేజీ 30

మా పాఠకుల నుండి

కాలవిలంబం “కాలవిలంబం—సమయాన్ని దొంగిలిస్తుంది” (ఏప్రిల్‌ 8, 1995) అనే శీర్షిక ఆచరణాత్మకమైన మరియు హాస్య ధోరణిలో వ్రాయబడింది. కాలవిలంబం చేసే మహాచెడ్డ అలవాటు నాకున్నందువల్ల నేను దాన్ని చదివినప్పుడు నన్నుచూసి నేనే నవ్వుకున్నాను.

ఎఫ్‌. బి. హెచ్‌., బ్రెజిల్‌

నేను నా జీవితంలో చాలా కాలంగా కాలవిలంబం చేస్తూ వచ్చాను, కనుక ఇది నాకు సమయోచితమైన సమాచారం. ఇది చక్కగా వ్రాయబడింది, నా సమయాన్ని చక్కగా పట్టిక వేసుకునేందుకు నేను ఈ సమాచారాన్ని ఉపయోగించాలని పథకం వేసుకుంటున్నాను. నేను వివిధ శీర్షికల కొరకు కృతజ్ఞతను తెలుపుతూ ఉత్తరం వ్రాయాలని తరచూ అనుకునేదాన్ని, కాని ఎన్నడూ వ్రాయనేలేదు. తుదకు నేనిప్పుడు ఆ పని పూర్తి చేశాను!

ఎమ్‌. హెచ్‌., అమెరికా

నేను ఆ శీర్షికను చూసినప్పుడు పత్రికలోని పేజీలను తిరగవేస్తున్నాను. మిగిలినది తరువాత చదువుదాంలే అని అనుకుంటూ నేను ఉపోద్ఘాతాన్ని చదివాను. కాని ప్రారంభ మాటలు “ఆగండి! ఈ శీర్షికను చదవడం ఆపకండి!” అని చెప్పాయి. కాలవిలంబం వల్ల నా సమయం దొంగిలించబడడానికి నాయంతట నేనే అనుమతించానని ఇప్పుడు గ్రహించాను.

ఎ. ఇ., ఇటలీ

నేను దర్జీని, కాలవిలంబం చేయడం నా జీవిత విధానంగా ఉండేది. చేయవలసిన పనుల లిస్టులను తయారు చేయడం, సరైన సమయంలో ఇతరులకు పనులను అప్పగించడం మరియు ఆటంకాలను ఎదుర్కోవడానికి సిద్ధపడడం చేయలేకపోయేవాన్ని. కాని ఇప్పుడు, మీ సలహాలను ఆచరణలో పెట్టడం నేర్చుకున్నాను, దాని మంచి ఫలితాలను అనుభవిస్తున్నాను.

ఎస్‌. ఎన్‌., నైజీరియా

అంత్యదినాలు పూర్తికాల ప్రచారకురాలిగా, నేను మన పత్రికలకు కృతజ్ఞత చెప్పాలనుకున్నాను. మే 8, 1995 సంచికలో ప్రచురించబడిన “ఇవి అంత్య దినాలా?” అనే శీర్షికల పరంపరను నేను చదువుతుండగా, ‘ఈ శీర్షికలు ఎంత స్పష్టంగాను సూటిగాను సోదాహరణలతోను ఉన్నాయో!’ అని నాలో నేనే అనుకున్నాను. దాని డిజైన్‌, చక్కని ఫోటోగ్రఫీ, క్యాప్షన్‌లూ వాస్తవాలను సులభంగా అర్థం చేసుకునేందుకు సహాయపడేవిగాను, శీర్షికలు చదవడానికి అర్థం చేసుకోవడానికి సులభంగా ఉండేటట్లుగాను చేశాయి. ఇలాంటి పత్రికలను నా పొరుగువారికి ప్రతిపాదించడంలో నేనెంత సంతోషపడేదాన్నో!

జె. బి., అమెరికా

సర్పి “సర్పి—దాని నొప్పిని తాళుకొనుట” (మే 8, 1995) అనే మీ శీర్షికను నేను చదివాను. మూడు రోజుల తరువాత నా చర్మంపై ఎర్రని పొక్కులు వచ్చాయి, అవి మీ శీర్షికలో సర్పికివ్వబడిన ఆ వివరణలతో చాలా పొందికగా ఉన్నాయి. నేను వైద్యుని దగ్గరకు వెళ్ళి, నాకు సర్పి ఉందని నేననుకుంటున్నాను అని ఆయనకు చెప్పాను. అవును, “మీకు బాగా తెలుసు,” అని ఆయన నాతో అన్నాడు—నా రోగ నిర్ధారణ సరైనది! రోగం దాని ఆరంభ దశలోనే కనుగొనబడినందువల్ల, చాలా మంది సర్పి రోగులు అనుభవించే ఎంతో నొప్పిని నేను తప్పించుకోవచ్చని ఆయన చెప్పాడు. ఈ శీర్షికను బట్టి మీకు కృతజ్ఞతలు!

కె. బి., అమెరికా

మాట్రయాషకా “మాట్రయాషకా—ఎంత చక్కటి బొమ్మ!” (మే 8, 1995) శీర్షికను బట్టి మీకు కృతజ్ఞతలు. నేను దానిని చదివినప్పుడు, అది వ్రాయబడిన శైలిని బట్టి ముగ్ధురాలినయ్యాను. ఫోటోలు ఎంతో చక్కగా ఉన్నాయి! నా చిన్నప్పటి నుండి నేను ఈ బొమ్మచేత ఆకర్షితురాలినయ్యాను, కాని దాని ఉద్భవాన్ని గూర్చి నాకేమీ తెలియదు. నాకు ఒకటి కొనివ్వమని ఇప్పుడు నేనెవరినైనా అడగాలి!

ఎమ్‌. టి., ఇటలీ

సలింగసంయోగం నేను పరిచారకునిగా, పయినీరుగా అంటే పూర్తికాల సువార్తికునిగా సేవ చేస్తున్నాను. సలింగసంయోగాన్ని గూర్చిన “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . ” శీర్షికలు నా కోసమే వ్రాయబడ్డాయా అన్నట్లుగా అనిపించింది! (మార్చి 8, మరియు ఏప్రిల్‌ 8, 1995) యుక్త వయస్సులో నేను సలింగసంయోగం చేసేవాడ్ని, నేను దానిని మానుకున్నాను, కాని అప్పటి నుండి కూడా ఈ భావాలతో పోరాడడం నాకు కష్టంగా ఉండేది. అయినప్పటికీ, ఈ శీర్షికల వల్ల నా భావాలను తుదకు అర్థంచేసుకున్నాను, నేను పోరాడుతూ ఉండడానికి సహాయాన్ని అందుకున్నాను!

పేరు తెలుపలేదు, డెన్మార్క్‌

చిన్నప్పటి నుండి నేను లైంగిక అత్యాచారానికి గురయ్యాను. నాకెన్నడూ ప్రేమానురాగాలు చూపించబడలేదు. నేను సలింగసంయోగంలో పాల్గొన్నాను; సలింగసంయోగ దృక్పథం తెచ్చిపెట్టే సిగ్గును, వేదనను, విచారాన్ని, ఆశాభంగాలను యౌవనస్థులు కేవలం తెలుసుకుని ఉంటే, వారు వాటి నుండి పారిపోయేవారే. అనేకులు ఈ విషయాన్ని గూర్చి మాట్లాడడాన్ని నిరాకరిస్తారు, కాని మీరు సులభంగా అర్థమయ్యేలా దానిని చర్చించారు. ఇలాంటి విషయాలను ప్రచురిస్తున్నందుకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను.

పేరు చెప్పబడలేదు, బ్రెజిల్‌

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి