కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 12/8 పేజీలు 8-11
  • భూమి—మనకు దేవుడిచ్చిన బహుమానం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • భూమి—మనకు దేవుడిచ్చిన బహుమానం
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • భూమి—అద్భుతమైనది, అందమైనది
  • దేవుని బహుమానాన్ని పొందనర్హతలేని కృతఘ్న సమాజం
  • దేవుని బహుమతి మెచ్చుకొనబడేటప్పుడు
  • దేవుడిచ్చిన బహుమతుల పట్ల కృతజ్ఞత చూపించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • మీరు వినాలని వారు కోరుకుంటున్న సువార్త
    యెహోవాసాక్షులు—వారు ఎవరు? వారి నమ్మకాలు ఏమిటి?
  • మీరు వినాలని వారు కోరే రాజ్యసువార్త
    ఇరవయ్యో శతాబ్దమందలి యెహోవాసాక్షులు
  • భూమి అగ్నిలో అంతమౌతుందా?
    తేజరిల్లు!—1997
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 12/8 పేజీలు 8-11

భూమి—మనకు దేవుడిచ్చిన బహుమానం

“ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.” ఆయన ఆ భూమి “చాలా మంచిది” అని కూడా ప్రకటించాడు. (ఆదికాండము 1:1, 31) చెత్త కుప్పలు దాని రూపాన్ని చెడగొట్టవు; వ్యర్థపదార్థాల రాశులు దానిని మలినపర్చవు. మానవజాతి కోసం ఓ అందమైన బహుమతి అధికారపూర్వకంగా ఇవ్వబడింది: “ఆకాశములు యెహోవా వశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.”—కీర్తన 115:16.

యెషయా 45:18 నందు భూమియెడల తన సంకల్పమేమిటో ఆయన చెబుతున్నాడు: “ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా— యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.”

భూమి ఎడల మానవుని బాధ్యత ఏమిటి అనే దానిని గూర్చి ఆయన ప్రత్యేకంగా చూపిస్తున్నాడు—‘సేద్యపరచుటకు కాచుటకు.’—ఆదికాండము 2:15.

యెహోవా ఇందుకు మాదిరినుంచుతున్నాడు. ఆయన భూమిమీద శ్రద్ధ చూపిస్తున్నాడు. ఒక విధమేంటంటే, భూమిలోని సకలప్రాణులు ఆధారపడి ఉండే ఈ భూమిమీది ముఖ్యమైన ఏర్పాట్లను ఆయన పునరావృత్తం చేస్తూనే ఉంటాడు. సైంటిఫిక్‌ అమెరికన్‌ అనే ప్రత్యేక సంచికలో ఈ పునరావృత చక్రాలను గూర్చిన అనేక శీర్షికలు ఉన్నాయి, వాటిలో భూమిపై శక్తి చక్రం, జీవావరణంలోని శక్తి చక్రం, ఆక్సిజన్‌ చక్రం, బొగ్గు చక్రం, నైట్రోజన్‌ చక్రం, ఖనిజ చక్రాలు చేరి ఉన్నాయి.

భూమి—అద్భుతమైనది, అందమైనది

డిస్కవర్‌ అనే విజ్ఞానశాస్త్ర పత్రికలో ఎంతో ప్రసిద్ధికెక్కిన లూయిస్‌ థామస్‌ అనే జీవశాస్త్రజ్ఞుడు భూమిని గూర్చి ఎంతో గొప్పగా వ్రాశాడు:

“అమిత విస్మయం చెందించేది, విశ్వమంతటిలో మనకు తెలిసినంత వరకు వింతయైన నిర్మాణం గలది, విశ్వ సంబంధమైన విజ్ఞానశాస్త్ర వింతల్లో పెద్దది, దానిని పూర్తిగా అర్థంచేసుకోవాలన్న ప్రయత్నాన్ని నిష్ఫలం చేసేది భూమియే. అది ఎంత చిత్రమైనది మరియు దివ్యమైనది, అది సంభ్రమాశ్చర్యాన్ని కలిగిస్తుంది, అది సూర్యుని చూట్టు తేలే అద్భుతమైన వస్తువు, తన స్వంత నీలి బుడగ వంటి వాతావరణంలో ఉన్నది, తన స్వంత ప్రాణవాయువును తయారు చేసుకోవడం దాన్ని వినియోగించుకోవడం, స్వయంగా గాలిలోని నత్రజనిని తన మట్టిలోకి చేర్చడాన్ని, తన వర్షపాత అడవులపై తనదైన వాతావరణాన్ని సృష్టిస్తూ, సున్నపు బండలు, పగడాల నిక్షేపం, భూగోళవ్యాప్తంగా నూతన జీవాలపొరలతో కప్పబడిన పురాతన జీవాల శిలాజాలు వంటి జీవ విభాగాలనుండి స్వంత రక్షణ కవచాన్ని తయారుచేసుకోవడాన్నిబట్టి మెచ్చుకోవడం మనం ఇప్పుడే ప్రారంభించాము.”

మానవజాతికి చక్కని బహుమతిగా పనిచేసే భూమిని, ప్రజలు మరియు జీవిస్తున్న ఇతర కోట్లకొలది ప్రాణులు నిరంతరం జీవించే గృహం కొరకు యెహోవా చేసిన ఏర్పాట్లలో ఇవి కొన్ని మాత్రమే. కీర్తన 104:5 ఇలా చెబుతుంది: “భూమి యెన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదులమీద స్థిరపరచెను.” మరొక ప్రేరేపిత సాక్షి ఈ భూమి యొక్క శాశ్వతత్వాన్ని గూర్చి ఈ విధంగా సాక్ష్యమిచ్చాడు: “తరము వెంబడి తరము గతించి పోవుచున్నది; భూమియొకటే యెల్లప్పుడును నిలుచునది.”—ప్రసంగి 1:4.

సూర్యుని చుట్టూ తన స్వంత కక్ష్యలో ప్రయాణం చేసే ఈ అందమైన సున్నితమైన భూగోళాన్ని, దాని అందాన్ని మానవుడు మెచ్చుకొని, దాని కొరకు జాగ్రత్త తీసుకోవలసిన అవసరతను భూమిని చుట్టే వ్యోమగాములు ధారాళంగా మాట్లాడారు: “అది తళుక్కుమనే నీలి ధవళ వర్ణంలోని ఆభరణంలా . . . నెమ్మదిగా కదలాడే తెల్లని ముసుగుతో . . . మర్మమైన ముదురు నలుపు సముద్రంలో ఒక చిన్న ముత్యంలా కనిపిస్తుంది” అని ఫ్రాంక్‌ బార్మన్‌ అనే వ్యోమగామి మొదటిసారిగా అంతరిక్షం నుండి భూమిని చూసి, దాన్ని గూర్చి హౌస్టన్‌కు రేడియో ద్వారా తెలిపాడు. “మనం ఇంత అందమైన గ్రహంలో జీవిస్తున్నాము. . . . ఈ లోకంలో మనకున్నదానిని మనమెందుకు మెచ్చుకోలేక పోతున్నాం అనేదే అత్యంత ఆశ్చర్యకరమైనది” అని ఫ్రాంక్‌ బార్మన్‌ అనే వ్యోమగామి వ్యాఖ్యానించాడు. చంద్రునివైపుకు వెళ్ళే అపొలో 8లోని వ్యోమగాముల్లో ఒకరు ఈ విధంగా వ్యాఖ్యానించారు: “విశ్వమంతటిలో మనమెక్కడ చూసినా, కొంతైన రంగు కనిపించేది భూమ్మీద మాత్రమే. మనమక్కడ సముద్రాల ముదురు నీలి వర్ణాన్ని, మట్టి యొక్క ఎరుపు గోధుమ వర్ణాన్ని, మేఘముల ధవళ వర్ణాన్ని చూడగలుగుతాం. . . . ఆకాశమంతటిలో అత్యంత చూడచక్కని దృశ్యమిదే. తాము ఏమి కలిగి ఉన్నారో భూమ్మీది ప్రజలకు తెలియదు.”

వాస్తవాలు ఆ మాటలు నిజమని చూపిస్తున్నాయి—ప్రజలు తమకున్న నిక్షేపాలను గ్రహించడం లేదు. మానవజాతి, తమకు దేవుడిచ్చిన ఈ బహుమతి ఎడల శ్రద్ధ చూపించే బదులు, దానిని కలుషితం చేసి, నాశనం చేస్తుంది. వ్యోమగాములు దీనిని కూడా చూశారు. అంతరిక్షం నుండి చూసినట్లయితే భూమి యొక్క వాతావరణానికి మానవుడు చేసిన హాని “స్పష్టం”గా కనిపిస్తుందని స్పేస్‌ షటిల్‌ ఛాలెంజర్‌ మొదటి ఫ్లయిట్‌ కమాండర్‌ పౌల్‌ విట్స్‌ చెప్పారు. “దురదృష్టవశాత్తు, త్వరలోనే ఈ లోకం బూడిద వర్ణ గ్రహంగా మారుతుంది.” ఆయన ఇంకా ఇలా మాట్లాడాడు: “మనకే సందేశముంది? మన స్వంత గూడును మనమే కలుషితం చేసుకుంటున్నాం.” ముఖ్యంగా ఈ “అంత్య దినాల”లో ఈ వినాశనం ప్రమాదకరంగా పెరిగిపోతోంది. తాను “భూమిని నశింపజేయువారిని నశింపజేయు”దునని చెబుతూ భూమిని పాడుచేసే వారికి వ్యతిరేకంగా యెహోవా తన తీర్పును ప్రకటించాడు.—ప్రకటన 11:18.

దేవుని బహుమానాన్ని పొందనర్హతలేని కృతఘ్న సమాజం

శరీరానికి స్వేచ్ఛనిచ్చేందుకు భౌతికవాద సమాజం ఆత్మీయ విలువలను కాలరాచింది. సంతోషకరమైన తృప్తికరమైన జీవితం కొరకు యెహోవా ఇచ్చిన ఆచరణాత్మక మార్గనిర్దేశకాలు, మన కాల విశేషతయైన నేను ముందు అనే స్వార్థవాదం పెరగడంతో త్రోసిపుచ్చబడ్డాయి.

2 తిమోతి 3:1-5 మనం నివసిస్తున్న పూర్తిగా కష్టతరమైన సమయాన్ని గూర్చి వర్ణిస్తుంది: “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తలిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగల వారివలె యుండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము.”

వాణిజ్య పద్ధతులు కొనుగోలుదారుల ఆసక్తులను పోషిస్తున్నాయి, ప్రకటన అనేది దాని పరిచారకురాలు. ప్రకటనలు కొన్ని సముచితమైనవి; కొన్ని సముచితం కానివి. ద వాంట్‌ మేకర్స్‌ అనే పుస్తకంలో ఎరిక్‌ క్లార్క్‌ యొక్క అభిప్రాయానికి రెండవది సరిపోతుంది: “ప్రకటనలు వాటిని కొనలేని ప్రజలకు అత్యవసరం కాని వస్తువులను అమ్మడానికి సహాయపడడమే కాకుండా, వారు వాటిని సముచితంగా కాకుండా ఎక్కువ ధరలకు కూడా అమ్ముతాయి.” వరల్డ్‌ వాచ్‌లో అలెన్‌ డర్నింగ్‌ ఈ విధంగా చెబుతున్నాడు: “ప్రకటన చేసేవారు ఉత్పాదకాలను కాదు గాని ప్రాణం యొక్క మితిలేని కోరికలకు తమ వస్తువులను ముడిపెడుతూ జీవిత విధానాలను దృక్పథాలను స్వైరకల్పనలను అమ్ముతున్నారు.” మనకున్నదానితో మనం తృప్తిపడక లేని దాని కొరకు మనం వాంఛించేలా మనకవసరం లేని వాటిని కోరుకునేలా చేయడమే ప్రకటన లక్ష్యం. అది తీర్చుకోలేని కోరికలను మనకు కలిగిస్తుంది; బలహీనపరచే అమిత వినియోగానికి అది దారితీస్తుంది; భూమిని కలుషితం చేసే అధికమౌతున్న చెత్తకుప్పలను సృష్టిస్తుంది. తీవ్రమైన పేదరికంలో జీవిస్తున్నవారి కృంగిపోయిన హృదయాల్లోకి కూడా అది చొచ్చుకుని వెళ్తుంది. ప్రజలను చంపుతుందని, రోగగ్రస్తులను చేస్తుందని పిలువబడిన వస్తువులను చాలా మంది ప్రకటనదారులు బలవంతంగా అమ్ముతున్నారు.

ప్రసంగి 12:13 చెబుతున్నట్లు, మనం దేవుని ముందు ఎటువంటి స్థానాన్ని కలిగి ఉన్నామన్నది ప్రాముఖ్యం: “తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.” ఆ విధంగా చేసేవారు యెహోవా యొక్క శుభ్రపర్చబడ్డ పరదైసులో జీవించే యోగ్యతను పొందుతారు! యేసు ఇలా వాగ్దానం చేశాడు: “దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని మేలుచేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.”—యోహాను 5:28, 29.

దేవుని బహుమతి మెచ్చుకొనబడేటప్పుడు

నమ్మలేనంతటి ఎంత అద్భుతమైన భూమై ఉంటుందది! దీని గురించి యెహోవా పులకింపజేసే విధంగా వర్ణించాడు: “నేను [యోహాను] క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు . . . దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.”—ప్రకటన 21:1,4.

చెత్త కుప్పలు, విషపూరిత వ్యర్థ పదార్థాలు, ఇతరులవాటిపై చెత్తను పారవేసే వారు వంటి మొదటి సంగతులు కూడా గతించిపోవును. అప్పుడు భూమ్మీద బ్రతికి ఉండే ప్రజలు తమను వలె తమ పొరుగువారిని ప్రేమించే వారు మాత్రమే అయివుంటారు, యెహోవా ఇచ్చిన భూమియనే బహుమతిని బట్టి వారు ఆయనను స్తుతిస్తారు, వారు దానిని సేద్యపరచుకోవడంలో, పరదైసు స్థితిలో దానిని కాచుకోవడంలో సంతోషిస్తారు.—మత్తయి 22:37, 38; 2 పేతురు 3:13.

[11వ పేజీలోని బాక్సు]

భౌతికవాదం యొక్క నిరర్థకత

‘మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు’ అని హెచ్చరించినప్పుడు యేసు స్పష్టమైన సత్యాన్ని మాట్లాడాడు. (లుకా 12:15) మనకేమి ఉంది అన్నది ప్రాముఖ్యం కాదు; కాని మనమేంటి అన్నదే ముఖ్యం. విలాస జీవితాల్లో దిగిపోవడం—డబ్బు సంపాదించడం, వస్తువులను పోగుచేసుకోవడం, శరీర కోరికలను తీర్చే సంతోషాలన్నింటిని పొందాలనే పిచ్చి పరుగు తీయడం—శ్రేష్ఠమైన జీవితం ఇచ్చేదానిని కోల్పోయినప్పుడు మనం పూర్తి జీవితాన్ని జీవిస్తున్నామని, ఏమి కోల్పోవడం లేదని అనుకోవడం చాలా సులభం.

మనం జీవితాన్ని కోల్పోతున్నప్పుడు మాత్రమే మనమేమి నష్టపోతున్నామో గ్రహిస్తాము. బైబిలు చెబుతున్న సత్యాన్ని మనం గ్రహిస్తాం: జీవితం అల్పమైనది—అది మరుగైపోయే పొగమంచు, ఊదబడే పొగ, నిశ్వాస, కదిలిపోయే నీడ, ఎండిపోయే పచ్చ గడ్డి, వాడిపోయే పువ్వు. అదెక్కడికి వెళ్ళింది? మనమేమి చేశాం? మనమిక్కడ ఎందుకున్నాం? యావత్తు ఇదేనా? నిరర్థకతల నిరర్థకత, గాలి వెనకాల పరుగెట్టడమేనా?—యోబు 14:2; కీర్తన 102:3, 11; 103:15, 16; 144:4; యెషయా 40:7; యాకోబు 4:14.

ఆసుపత్రిలో చనిపోబోతున్న ఒక మనిషి కిటికీ గుండా బయటికీ చూసినప్పుడు వెచ్చని ఎండలో ఎర్రబారినట్లుండే కొండచరియ, గడ్డి మరియు విత్తనాల కలయిక, పోటీపడుతున్నట్లుండే కొన్ని పువ్వులు, ఒక పిచ్చుక కొన్ని విత్తనాల కొరకు చెత్తలో కాళ్ళతో గీకడం కనిపించడం అంత అనుభూతిని కలిగించేది కాదు. కాని చనిపోబోతున్న ఆ మనిషికి అది మనోహరమైనది. ఎంతో ఇవ్వగల చిన్న విషయాలను ఎంత చిన్న ఆనందదాయకమైన విషయాలను తాను కోల్పోయాడో తలంచడానికి ఒక విచారకరమైన కోరిక పురికొల్పింది. అన్నీ త్వరగా గతించిపోయాయి!

దీనిని బైబిలులోని గ్రీకు లేఖనాలు ఈ విధంగా సరళంగా చెబుతున్నాయి: “మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.” (1 తిమోతి 6:7, 8) హెబ్రీ లేఖనాలు దీనిని ఇంకా సూటిగా ఈ విధంగా చెబుతున్నాయి: “వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భమునుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరల పోవును, తాను ప్రయాసపడి చేసికొనినదానిలో ఏదైనను చేతపట్టుకొనిపోడు.”—ప్రసంగి 5:15.

[Picture Credit Line on page 8]

NASA photo

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి