చాలా మంది కడు బీదరికంలో జీవించి, చనిపోతున్నారు!
యాటీ ఒక కర్మాగారంలో బూట్లకు అవసరమయ్యే చర్మపు ముక్కలను, దాని లేసులను కుట్టేందుకు ఆసియాలోని ఆగ్నేయ ప్రాంతంలోని తన గుడిసెను విడిచివెళుతుంది. ఆమె నెలకు—ప్రతి వారం 40 గంటలు మరియు 90 గంటల ఓవర్టైమ్తో కలిపి—ఆ పనికి 80 డాలర్లకన్నా తక్కువే సంపాదిస్తుంది. ఆమె పనిచేసే కర్మాగారం తక్కువ అభివృద్ధి ఉన్న దేశాల్లో మానవ హక్కుల ప్రవర్థకురాలన్నట్లుగా తనను తాను గర్వంగా వర్ణించుకుంటుంది. ఈ కర్మాగారం పాశ్చాత్య దేశంలో ఒక బూట్ల జతను 60 డాలర్లకన్నా ఎక్కువ ధరకు అమ్ముతుంది. అందులో కూలి బహుశ 1.40 డాలర్లే.
యాటీ “విద్యుచ్ఛక్తిగల శుభ్రమైన కర్మాగారాన్ని విడిచిపెట్టి”నప్పుడు, “3 బై 3.6 మీటర్లు గల, బల్లులతో నిండిన మురికి గోడలు గల గుడిసె అద్దె కట్టేందుకు కావలసినంత డబ్బే ఉంది. ఆ గుడిసెలో సామాను ఏమీ లేదు, కనుక యాటీ మరిద్దరు రూమ్మేట్లు మట్టి, రాళ్ళతో చేసిన నేలమీదే ముడుచుకుని పడుకుంటారు” అని బోస్టన్ గ్లోబ్ నివేదిక చెబుతుంది. ఆమె పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది.
“ఈ ప్రజలు మంచి పరిస్థితిలో ఉండేది నేను ఉన్నప్పుడా లేక లేనప్పుడా?” అని ఒక ట్రేడ్ అసోసియేషన్ ప్రముఖుడు చెబుతున్నాడు. “స్వల్ప కూలి గౌరవప్రదమైన జీవితవిధానాన్ని ఆనందంగా సాగించే సామర్థ్యాన్నిస్తుంది. వారు ఐశ్వర్యంలో జీవించకపోవచ్చు, కాని వారు పస్తులుండడం లేదు.” అయితే వారు తరచూ కుపోషణకు గురౌతున్నారు, వారి పిల్లలు తరచూ ఆకలితోనే నిద్రకుపక్రమిస్తున్నారు. అపాయకరమైన పని స్థలాల్లో వారు ప్రతిదినమూ ప్రమాదాన్ని ఎదుర్కుంటున్నారు. మరనేకులు విషపదార్థాలతోను హానికరమైన వ్యర్థపదార్థాలతోను వ్యవహరించడం వల్ల నెమ్మదిగా చనిపోతున్నారు. ఇది “గౌరవప్రదమైన జీవిత విధానమా?”
హరి అనే దక్షిణ ఆసియాలోని పొలం పనివాడు విషయాలను మరో విధంగా చూశాడు. ఆయన తన చుట్టూ ఉన్న కఠోరమైన జీవన్మరణ చక్రాన్ని పద్య గద్య శైలిలోని వాగ్ఘాటితో చిత్రీకరించాడు. “రోలుకు రోకలికి మధ్యనున్న మిరపకాయలు నలుగకుండా ఉండవు. మేము మిరపకాయల వంటి వారము—ప్రతి సంవత్సరం చితికిపోతూనే ఉంటాము, త్వరలోనే ఇక ఏమీ మిగులకుండా పోతుంది.” ఆ “గౌరవప్రదమైన జీవిత విధానాన్ని” హరి ఎన్నడూ చూడనూ లేదు, తన యజమానులు సాధారణంగా జీవించే విలాసవంత జీవితమంటే కించితైనా అతనికి తెలియనూ లేదు. కొన్ని రోజుల తరువాత, హరి మరణించాడు—కడు బీదరికానికి గురైన మరో బాధితుడు.
అనేకులు హరిలాగే జీవించి మరణిస్తున్నారు. వారు పిప్పి పిండి చేయబడుతున్నారు గనుక ఎంతో దయనీయంగా క్షీణించిపోతున్నారు. ఎవరి చేత? ఎలాంటి ప్రజలు ఇలా చేస్తారు? వారు దయగలవారిగా కనిపిస్తారు. మీ పిల్లలకు భోజనం పెట్టాలని, మీ ధాన్యాలను పండించడానికి సహాయపడాలని, మీ జీవితాన్ని మెరుగుపరచాలని, మిమ్మల్ని ధనవంతులుగా చేయాలని వారు కోరుకుంటున్నారని వారు చెప్పవచ్చు. నిజానికి, వారు తమకు తాము ధనవంతులవ్వాలని లక్ష్యం పెట్టుకుంటారు. వారు ఉత్పాదకాలను అమ్మి, లాభాలను పొందాలని చూస్తారు. వారి పేరాశ యొక్క ఉపోత్పత్తుకాలు కుపోషణకు గురవుతున్న పిల్లలు, విషప్రయోగానికి గురైన పనివారు, మలినం చేయబడిన పర్యావరణమే అయినప్పటికినీ, అది వారినంతగా కలతపరచదు. తమ పేరాశకు కంపెనీలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్న వెల అది. కనుక లాభం పెరుగుతున్న కొలది సహజంగానే హృదయ విదారకమైన హత్యల సంఖ్య పెరుగుతుంది.
[Picture Credit Line on page 3]
U.N. Photo 156200/John Isaac