కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 6/1 పేజీలు 3-4
  • “పేరాశగల యుగము”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “పేరాశగల యుగము”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎంత విస్తారముగాయున్నది?
  • పేరాశ నిర్మూలించబడును
  • పేరాశ లేని లోకమును ఊహించుము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • పేరాశ ఉరిని తప్పించుకొనడంలో విజయం పొందండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • మీరు సాతాను ఉచ్చుల నుండి తప్పించుకోవచ్చు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • మీరు ఎక్కడున్నా యెహోవా స్వరం వినండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 6/1 పేజీలు 3-4

“పేరాశగల యుగము”

సాధారణ జలుబును నిర్మూలించుట మనిషికి కష్టముగా యున్నట్లయిన, దీనికంటే ఎంతో చిక్కైన వ్యాధిగా పరిణమించిన పేరాశను నిర్మూలించుటకు ఆయనకు అవకాశమెక్కడిది?

పేరాశ మరియు స్వార్థపరత్వము నేర్చుకొననవసరములేదు—స్పష్టముగా చిన్నతనమునుండియే అవియున్నట్లుగా గోచరించుచున్నది. తమ ఆటవస్తువులతో ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకొనుటను గమనించినట్లయిన దానిని మీరుచూడగలరు.

వ్యక్తిగత పేరాశ సామాన్యమును, చెడ్డదియునైయున్నది, అయితే జాతీయ, లేక అంతర్జాతీయ స్థాయిలో పేరాశ పేరుకుపోయినట్లయిన, దాని అపాయమునకు లక్షలాదిమంది గురియగుచున్నారు. ఉదాహరణకు, అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యాపారమునే తీసుకొనండి. ఇది ప్రపంచములోకెల్ల అతిపెద్ద—సంవత్సరమునకు 300 వేల మిలియన్ల డాలర్ల, వ్యాపారమని ఒక స్పానిష్‌ భాషా పత్రిక తెలియజేసినది. మాదక ద్రవ్యముల దుర్వినియోగము వలన లక్షలాది జీవితములు నాశనమైనవి, అసంఖ్యాకముగా ఆకస్మిక మరణములు సంభవించుచున్నవి. ఈ మాదకద్రవ్య వ్యాపారము ఇంతత్వరగా వృద్ధియగుటకు మూలకారణము ఏమైయున్నది? నిస్సందేహముగా అది పేరాశ.

పేరాశయొక్క ఈ ఉద్దేశ్యమును వరల్డ్‌ ప్రెస్‌ రివ్యూ ఉన్నతపరచుచున్నది. “మాదక ద్రవ్యముల అమ్మకములో వచ్చిన లాభమంతటిలో కేవలము 10 నుండి 20 శాతము మాత్రమే దానిని ఉత్పత్తిచేసే దేశములకు పోవుచున్నదని, మరొక 10 శాతము ప్రయోగశాలలు, వాహనములు, ఆయుధములు వగైరాలకు మరలా పెట్టుబడిపెట్టుటకు పోవుచున్నదని, . . . మిగిలినది వాటిని వినియోగించు దేశములలోని ఖర్చులకు మరియు ప్రపంచబ్యాంకు వ్యవస్థ పన్నులకు సరిపోవుచున్నదనుటను” వ్యతిరేకించిన మాడ్రిడ్‌ వార్తాపత్రికయగు కాంబియో 16 లోని విషయమును అది ఎత్తిచూపినది.

పేరాశకు అవసరము ఒక కారణమని, పేరాశ కేవలము బీదవారి లేక అణగారిన ప్రజల లక్షణమను తలంపును ఇది అబద్ధము చేయుచున్నది. నిర్దంద్వముగా, పేరాశ అనేది నిజముగా అవసరతలోలేని వారితోసహా, సమాజమంతటిలో అందరిలో విస్తారముగా పేరుకుపోయిన మానవ బలహీనతయైయున్నది. పేరాశకుగల వింతైన లక్షణములలో ఒకటేమనగా, సామాన్యముగా తమ జీవితములో సమస్తమును కలిగియున్న ప్రజలు సహితము అనుకోకుండా అవకాశము లభించినట్లయిన ఈ పేరాశను ప్రదర్శింతురు.

పత్రికా రచయితయైన మెగ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఇలా విచారమును వ్యక్తపరచుచున్నాడు: “మీరు ఏ రోజు పేపరు తీసుకొని, గొప్పగొప్ప న్యాయనిర్ణేతలు, ప్రత్యేక అభియోజకులు మరియు సందేహాస్పద సందర్భములు, గడబిడలు మరియు మోసము, అధిగమించుట వగైరాలనుగూర్చి చదివినను అవి బహుగా కృంగజేయునవైయుండును. కొన్ని ఆరోపణలు నిరాధారములని, మరికొన్ని పాతబడిపోయినవని అంగీకరించినను, ఎన్నడు అనుమతించకూడని పనులు ప్రజలు మరలా మరలా చేసారని, అలా చేసి తప్పించుకున్నారని నాకు స్పష్టమగుచున్నది. . . . మనమెంతవరకు వచ్చామంటే, మనలోని నిస్వార్థత్వము సహితము ఇంద్రియలోలత్వము, పేరాశగలదైయున్నది.”

ఎంత విస్తారముగాయున్నది?

20వ శతాబ్ద జీవనముపై పెరిగిన వత్తిడులకు అది నిస్సందేహముగా కారణమైనను, పేరాశ అనేది మానవజాతి మధ్య కొత్తసంగతేమి కాదు. పేరాశ ఎంత విస్తారముగా ఉన్నదంటే, ది క్రిస్టియన్‌ సెంచురి లోని సంపాదకీయము, 1950వ దశాబ్దము “వ్యాకులత యుగము,” లేక 1970వ దశాబ్దము “నేనుముందు అను దశాబ్దము” వంటి పేర్లకు సరిపడు పేరు 1980వ దశాబ్దమునకు పెట్టవలెనని తలంచినది. అది 1980వ దశాబ్దమునకు “పేరాశగల యుగమని” పేరుపెట్టినది.

ప్రజలుండు ప్రతిచోట—పనిచేయు ప్రదేశములలో, పాఠశాలలలో, ఇటు సమాజములో ప్రజలెక్కడ కూడినను అక్కడ ఈనాడు పేరాశ కనబడగలదు. వాణిజ్యమందు, రాజకీయములందు, లోకములోని ముఖ్యమైన మత ప్రజానీకమందును అది తన అవినీతికర ప్రభావమును ప్రభలింపజేసినది.

లేనిదానికంటే ఎక్కువ తరచుగా, పేరాశ చట్టరహిత అవినీతి లేక మోసగించుటలోనికి అభివృద్ధిచెందును. ఉదాహరణకు ది కాన్‌బెర్రా టైమ్స్‌, కారు-భీమా మోసమందు ఆస్ట్రేలియా లోకమును సంశయాత్మక సౌశీల్యమందు నడిపించుచున్నదని ఆరోపించినది. “భీమాచేసిన వ్యక్తులు తయారుచేసిన మోసపూరితమైన చెల్లింపు పత్రములు/బోగాట్టలు భీమా కంపెనీలకు, పరోక్షముగా భీమాచేసిన వ్యక్తులకు ప్రతి సంవత్సరము లక్షలాది డాలర్ల నష్టము కలిగించుచున్నారని, అది ప్రత్యేకముగా దహనకాండ, రేవు దోపిడి, మోటారు వాహనములు మరియు ఇంటివస్తువుల భీమా సంబంధముగా అంతకంతకు పెరుగుచున్న గంభీరమైన సమస్యగాయున్నదని” చెప్పుచు ఆస్ట్రేలియా లా సొసైటి జర్నల్‌ కూడ దీనిని బలపరచుచున్నట్లు కన్పించుచున్నది.

కాబట్టి పేరాశ ఎప్పుడైనా నిర్మూలించబడుతుందాయను తలంపును అనేకమంది ప్రజలు ఎందుకు హేళనచేయుదురో అర్థము చేసికొనుట సులభమైయున్నది. ఎందుకు, పేరాశ ఎల్లప్పుడు మనతోయున్నదని, పేరాశలేని లోకము కేవలము ఒక అసాధ్యమైన స్వప్నమని వారు తలంచుదురు.

పేరాశ నిర్మూలించబడును

దేనిమీద ఆధారపడి అసాధ్యమనినది సాధ్యమని చెప్పబడగలదు? అది ఇప్పటికే సాధింపబడుచున్న పేరాశలేని జీవన వాస్తవము మీద ఆధారపడియున్నది. సాధించినది పరిపూర్ణము కానప్పటికిని, అది సరియైన విద్య మరియు ప్రేరణతో ఏమిచేయవచ్చునో చూపించుచున్నది. యావత్‌ లోకము పేరాశలేని లోకముగా ఎలా ఉండగలదో తర్వాతి శీర్షిక చూపించును. (w90 2/15)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి