కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 11/8 పేజీలు 8-9
  • మనమెందుకు వృద్ధులమై మరణిస్తున్నాము?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనమెందుకు వృద్ధులమై మరణిస్తున్నాము?
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • లోపంగల సంవిధానం
  • సమాధానమేమిటి?
  • నిరంతరం జీవించడానికి రూపొందించబడింది
    తేజరిల్లు!—1995
  • నిత్యజీవం నిజంగా సాధ్యమేనా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • దీర్ఘాయుష్షు కోసమైన మన అన్వేషణ ఎలా విజయవంతం కాగలదు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఎక్కువ కాలం జీవించడానికి చేసిన ప్రయత్నాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2019
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 11/8 పేజీలు 8-9

మనమెందుకు వృద్ధులమై మరణిస్తున్నాము?

“వయస్సులో మార్పులు ఒక్కోకణంలో జరుగుతాయని కనుగొనడం తప్ప, వృద్ధాప్యానికి ప్రాథమికంగా కారణమేమిటనేది ఒక శతాబ్దం క్రితం మనకు తెలిసిన దానికంటే ఇప్పుడు మనకు ఎక్కువేమి తెలియదు” అని డా. లియొనార్డ్‌ హేఫ్లిక్‌ అంగీకరిస్తున్నాడు. వాస్తవానికి, ఆయనిలా చెబుతున్నాడు: “వృద్ధాప్యం ఎందుకు సంభవించాలనే దానికి సరైన కారణం మనకు తెలియదు.”

ఒక పిండము నుండి తీసుకొనబడిన సామాన్యమైన మానవ కణాలు ప్రయోగశాలలో అత్యంత అనువైన పరిస్థితుల్లో కృత్రిమంగా పెంచబడినప్పుడు, దాదాపు 50 సార్లు కణ విభజన జరిగిన తర్వాత అవి మరణించాయని దాదాపు 30 సంవత్సరాల క్రితం ప్రయోగశాలలో నిర్వహించబడిన ప్రయోగాలు వెల్లడించాయి. మరో వైపున, చాలా వృద్ధుడైన వ్యక్తి నుండి తీసుకొనబడిన కణాలు అతడు మరణించడానికి ముందు రెండు నుండి పదిసార్లు మాత్రమే విభజింపబడతాయి. కాబట్టి, నేషనల్‌ జియోగ్రాఫిక్‌ సొసైటీకి చెందిన ది ఇన్‌క్రెడిబుల్‌ మెషీన్‌ అనే పుస్తకం ఇలా తెలియజేసింది: “మనలో ప్రతి ఒక్కరి మరణం మన జనన సమయంలోనే కార్యరూపం దాల్చుతుందనే ఆలోచనను ప్రయోగాత్మక రుజువు బలపరుస్తుంది.”

అయితే, కణ విభజనను ఆపడం అనివార్యమా? లేదు, అనివార్యం కాదు. అన్ని విషయాలు పరిశీలించాక, వృద్ధాప్యం విషయంలో నిపుణులైన రాబర్ట్‌ ఎమ్‌. సాపొల్‌స్కై మరియు కేలబ్‌ ఇ. ఫించ్‌ అనే పండితులు ఇలా చెప్పారు: “నిర్‌వార్దక్యం [వృద్ధులవ్వకపోవడం] భూమిపైనున్న జీవుల అసలు స్థితియై ఉండిందేమో అనిపిస్తుంది.” వింతేమిటంటే, నేడు కొన్ని అసహజ మానవ కణాలు కూడా వృద్ధాప్యానికెదగవు.

మొట్టమొదటిసారి మనిషి నుండి మనిషికి గుండె మార్పిడి చేసిన డా. క్రిస్టియాన్‌ బర్నార్డ్‌ కూర్పు చేసిన ద బాడీ మెషీన్‌ అనే పుస్తకం ఇలా వివరించింది: “‘అమర్త్యమైన కణాలు’ కనుగొనబడడం, అలాంటి కణాలు అసహజమైనవని స్పష్టమయ్యే వరకు, వార్దక్యమందు ఆసక్తిగల జీవశాస్త్రజ్ఞులకు చాలా తలనొప్పిని కలుగజేసింది.” అవును, అంతులేని విభజనల్లా కనిపించే వాటి ద్వారా ప్రయోగశాలలో ఎప్పుడూ కృత్రిమంగా పెంచడంలో కొన్ని క్యాన్సరు కణ సముదాయాలు పోషించబడగలవు. ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా తెలియజేసింది: “అలాంటి అసహజమైన కణాలు ఎలా బ్రతుక గలుగుతాయో శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగితే, కణాలు వృద్ధాప్యానికెదిగే ప్రక్రియ యొక్క అంతర్దృష్టిని వాళ్లు పొందవచ్చు.” కాబట్టి, నేడు, కొన్ని క్యాన్సర్‌ కణాలు ప్రయోగశాలలో అంతంలేకుండా స్పష్టంగా విభజన చెందగలవు, కాని ప్రయోగశాలలో కృత్రిమంగా చేయబడే సహజమైన కణ విభజనలు వృద్ధాప్యానికెదిగి మరణిస్తాయి.

లోపంగల సంవిధానం

ద బాడీ మెషీన్‌ అనే పుస్తకం చెబుతున్నట్లుగా, మానవ వృద్ధాప్యం మరియు మరణం “[సాధారణ] కణ సముదాయంలో విభజన చెందే సామర్థ్యం తగ్గిపోవడం” యొక్క ఫలితమేనా? అలాగైతే, ఆ పుస్తకం ఇలా తెలియజేసింది, “మానవ జీవన పరిమాణాన్ని పెంచే ప్రయత్నంలో దాన్ని నేర్పుగా త్రిప్పేందుకు, ఈ పరిమితమైన పునరావృత్తమయ్యే సామర్థ్యాన్ని అదుపు చేసే సంవిధానాన్ని గుర్తించి, అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం.”

మీరు గత శీర్షిక నుండి జ్ఞాపకం చేసుకోగలిగేలా, డా. హేఫ్లిక్‌ “మనల్ని గర్భధారణ నుండి జననం వరకు, ఆ తర్వాత లైంగిక పరిపక్వత, వయోజనులయ్యే వరకు తీసుకువెళ్లే అద్భుతాల గురించి” మాట్లాడాడు. ఆ తర్వాత ఆయన, “కేవలం ఆ అద్భుతాలను నిరంతరం కొనసాగించే అత్యంత సుళువైన సంవిధానం” గురించి సూచించాడు.

సంవత్సరాల తరబడి సంఘటిత ప్రయత్నాలు చేసినప్పటికీ, జీవాన్ని నిరంతరం కొనసాగించగల సంవిధానాన్ని శాస్త్రవేత్తలు కనుగొనలేకపోయారు. “వృద్ధాప్యానికి కారణాలు మర్మంగానే ఉండిపోయాయి” అని ది ఇన్‌క్రెడిబుల్‌ మెషీన్‌ అనే పుస్తకం అంగీకరిస్తుంది.

అయితే, వాస్తవానికి వృద్ధాప్యం మరియు మరణానికి కారణం రహస్యమేమీ కాదు. సమాధానం అందుబాటులో ఉంది.

సమాధానమేమిటి?

దానికి సమాధానం ఎవరి దగ్గర ఉందో ఆయనే “మనల్ని గర్భదారణ నుండి జననం వరకు తీసుకువెళ్లే అద్భుతాల”కు కారకుడు, జ్ఞానవంతుడైన మన సృష్టికర్త, యెహోవా దేవుడు. “నీయొద్ద జీవపు ఊట కలదు” అని బైబిలు ఆయన గురించి చెబుతుంది. “యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను. మనలను మనమే సృజించుకొనలేదు.”—కీర్తన 36:9; 100:3, అధఃస్సూచి.

సూచనార్థకంగా చెప్పాలంటే, మిమ్మల్ని ఒక విశేషమైన వ్యక్తిగా తయారు చేయడానికి ఉపదేశాల పుస్తకాన్ని వ్రాయడం ద్వారా, గర్భంలో మీ పెరుగుదలను యెహోవా దేవుడు ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశాడో ఆలోచించండి! బైబిలు కీర్తన రచయిత ఇలా వ్రాశాడు: ‘నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. నేను రహస్యమందు పుట్టిననాడు నాకు కలిగిన యెముకలును నీకు మరుగై యుండలేదు నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను. . . . నా అవయవములన్నియు నీ గ్రంథములో లిఖితములాయెను.’ (కీర్తన 139:13, 15, 16) అద్భుతంగా రూపొందించబడిన మన మానవ శరీర నిర్మాణం కేవలం అనుకోకుండా వచ్చింది కాదన్నది స్పష్టం!

అయితే, మనం నిరంతరం జీవించగలిగేలా యెహోవా దేవుడు మనల్ని పరిపూర్ణంగా సృష్టించి ఉంటే, మనమెందుకు వృద్ధులమై మరణిస్తున్నాము? దేవుడు భూమ్మీద అందమైన గృహంలో ఉంచిన మొదటి మానవుడైన ఆదాముపై విధించిన నిషేధంలో సమాధానాన్ని కనుగొనవచ్చు. “ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని” దేవుడు ఆయనకు ఆజ్ఞాపించాడు.—(ఇటాలిక్కులు మావి.) ఆదికాండము 2:16, 17.

ఏమి జరిగింది? తన పరలోక తండ్రికి విధేయత చూపించే బదులు, ఆ వృక్ష ఫలమును తినడంలో తన భార్యయైన హవ్వతో కలిసి ఆదాము అవిధేయుడయ్యాడు. తిరుగుబాటుదారుడైన ఒక దేవదూత అబద్ధ వాగ్దానాన్ని వాళ్లు స్వార్థంతో వెంబడించారు. (ఆదికాండము 3:1-6; ప్రకటన 12:9) కాబట్టి, దేవుడు హెచ్చరించినట్లుగానే, వాళ్లు మరణించారు. ఆదాము హవ్వలు నిరంతరం జీవించే సామర్థ్యంతో రూపొందించబడినప్పటికీ, దేవునికి చూపే విధేయతపై ఇది ఆధారపడి ఉండింది. అవిధేయులవ్వడం ద్వారా వాళ్లు పాపం చేశారు. ఆ తర్వాత, పాపులుగా, తమ శరీరాల్లో ఉన్న మరణకరమైన లోపాన్ని వాళ్లు తమ సంతానానికి సంక్రమింపజేశారు. “ఆలాగుననే . . . మరణము అందరికిని సంప్రాప్తమాయెను.”—రోమీయులు 5:12; యోబు 14:4.

అయితే వృద్ధాప్యాన్ని, మరణాన్ని జయించే నిరీక్షణే లేదని దీని భావం కాదు. ఎంతో జ్ఞానవంతుడైన మన సృష్టికర్త జన్యు సంబంధమైన ఏ లోపాలనైనా స్వస్థపర్చి, మన జీవం నిరంతరం కొనసాగడానికి కావలసిన శక్తినివ్వగలడని విశ్వసించడం కష్టం కాకూడదు. కాని ఆయన దీన్నెలా చేస్తాడు? నిత్యజీవాన్ని గూర్చిన ఆయన వాగ్దానాలను పొందడానికి మనం ఏమి చేయాలి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి