కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 11/8 పేజీలు 10-11
  • మీరు నిరంతరం ఎలా జీవించగలరు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు నిరంతరం ఎలా జీవించగలరు
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని సంకల్పం
  • నిరంతరం జీవించడమెలా
  • నిత్యజీవం నిజంగా సాధ్యమేనా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • భూమి ఎడల దేవుని సంకల్పమేమిటి?
    దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?
  • జీవితానికొక గొప్ప సంకల్పముంది
    జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?
  • నిత్యజీవానికి ఏకైక మార్గం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 11/8 పేజీలు 10-11

మీరు నిరంతరం ఎలా జీవించగలరు

నేడు మానవులు జీవిస్తున్న దానికంటే ఎంతో ఎక్కువ కాలం జీవించగల సామర్థ్యం మానవ శరీరానికి స్పష్టంగా ఉంది గనుక, మనం నిరంతరం ఎలా జీవించగలమో కనుక్కోడానికి కొందరు విజ్ఞానశాస్త్రాన్ని నమ్ముతారు. “శరీర రసాయనాల గురించి, అవి ఎలా పరస్పరం ప్రతిస్పందిస్తాయనేదాని గురించి మనం పూర్తి జ్ఞానాన్ని పొందినప్పుడు, మనం జీవన సారాన్ని తెలుసుకోగలుగుతాము. ఒక వ్యక్తి వృద్ధాప్యానికెలా ఎదుగుతాడో . . . మనం గ్రహిస్తామని” డా. అల్విన్‌ సిల్వర్‌స్టెయిన్‌ వ్రాశాడు.

ఏ ఫలితంతో? అది “మానవ చరిత్రలో ఒక క్రొత్త యుగానికి” నాంది పలుకుతుందని సిల్వర్‌స్టెయిన్‌ చెప్పాడు. “అప్పుడిక ‘వృద్ధ’ ప్రజలు ఉండరు, ఎందుకంటే మరణంపై విజయం సాధించడానికి అనుమతించే జ్ఞానం నిత్య యౌవనాన్ని కూడా తెస్తుంది.”

మానవులు దీన్ని సాధించగలుగుతారా? బైబిలు ఇలా నొక్కివక్కాణిస్తుంది: “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి; వారి ఆత్మ వెడలిపోవును వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును.” (కీర్తన 146:3, 4 NW) కచ్చితంగా మనం చూసినట్లుగానే, వృద్ధాప్యానికీ మరణానికి కారణమయ్యే వారసత్వ లోపాన్ని మానవులు గుర్తించలేకపోయారు, సరిదిద్దలేకపోయారు కూడా. కేవలం మన సృష్టికర్త మాత్రమే దాన్ని సరిచేయగలడు.

అయితే, మానవులు భూమిపై నిరంతరం జీవించాలన్నది నిజంగా దేవుని సంకల్పమేనా?

దేవుని సంకల్పం

దేవుడు మొదటి మానవ జతను ఎక్కడ జీవించడానికి ఉంచాడు? ఒక భూ పరదైసులో ఉంచాడు. “ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి” అని వారికి ఆదేశింపబడింది. (ఆదికాండము 1:28) అవును తుదకు మానవ కుటుంబం ఒక నీతియుక్తమైన సమాధాన సంతోషాలతో కలిసి జీవిస్తూ భూమి అంతటా నివసించాలన్నదే దేవుని సంకల్పం.—యెషయా 45:18.

ఆదాము చూపిన అవిధేయతను బట్టి ఆయనపై మరణ శాసనం విధించబడినప్పటికీ, మానవులు పరదైసు భూమిపై నిరంతరం జీవించాలన్న దేవుని ఆది సంకల్పం మారలేదు. (ఆదికాండము 3:17-19) దేవుడిలా చెబుతున్నాడు: “నేను చెప్పియున్నాను దాని . . . సఫలపరచెదను.” (యెషయా 46:11; 55:11) “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు” అని దేవుడు చెప్పినప్పుడు, భూమి గురించి తాను కలిగివున్న తన సంకల్పం మారలేదని ఆయన చూపించాడు.—కీర్తన 37:29.

మన సృష్టికర్తగా, మానవులు వృద్ధులై మరణించడానికి కారణమైన లోపాలను సరిదిద్దగల స్థితిలో దేవుడున్నాడు. ఆయన దేని ఆధారంగా దీనిని చేస్తాడు? ఆ లోపం మొదటి మానవుడైన ఆదామునుండి సంతరించుకొనబడింది గనుక, “ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు” దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు పరిపూర్ణ మానవ జీవితాన్ని విమోచన బలిగా అందజేశాడు.—యోహాను 3:16; మత్తయి 20:28.

వాస్తవానికి, మన ఆది తండ్రిగా లేక జీవదాతగా ఆదాముకున్న స్థానాన్ని యేసుక్రీస్తు తీసుకుంటాడు. అందుకే బైబిలులో యేసు “కడపటి ఆదాము” అని పిలువబడ్డాడు. (1 కొరింథీయులు 15:45) పాపియైన ఆదాము పిల్లలుగా శపించబడినవారిగా ఉండే బదులు, తమ “నిత్యుడగు తండ్రి” అయిన యేసుక్రీస్తు పిల్లలుగా విధేయులైన మానవులు నిత్యజీవాన్ని పొందడానికి అర్హులుగా లెక్కించబడవచ్చు.—యెషయా 9:6.

నిజమే, ‘సకల యుగములలో రాజు’ మరియు “మన ప్రభువగు యేసుక్రీస్తుయొక్క తండ్రి” యెహోవా దేవుడే. (1 తిమోతి 1:17; ప్రకటన 15:3; కొలొస్సయులు 1:3) అయిననూ యేసుక్రీస్తు మన “నిత్యుడగు తండ్రి” మరియు “రక్షకుడు” మాత్రమే గాక “సమాధానకర్త” కూడా. (లూకా 2:11) తన తండ్రి ప్రతినిధిగా, భూమికి సమాధానం తీసుకురావడానికి క్రీస్తు రాజరిక అధికారాన్ని అమలుపరుస్తాడు.—కీర్తన 72:1-8; 110:1, 2; హెబ్రీయులు 1:3, 4.

పోగొట్టుకొనబడిన భూ పరదైసు యేసుక్రీస్తు పరిపాలన క్రింద పునః ప్రాప్తమౌతుంది. “పునఃస్థితిస్థాపనమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడైయుండునపుడు” ఇది జరుగుతుందని యేసు చెప్పాడు. (మత్తయి 19:28) క్రీస్తు నమ్మకమైన అనుచరులు—మొత్తం 1,44,000 మంది—ఆయనతో కలిసి పరదైసు భూమిని పరిపాలిస్తారు. (2 తిమోతి 2:11, 12; ప్రకటన 5:10; 14:1, 3) పరదైసులో భూమిపై జీవాన్ని అనుభవించడం ద్వారా కోటానుకోట్లమంది ఆ నీతియుక్తమైన పరిపాలన నుండి ప్రయోజనం పొందుతారు. వారిలో, “నీవు నాతో కూడా పరదైసులో ఉందువని” యేసు ఎవరికి వాగ్దానం చేశాడో, ఎవరైతే యేసు ప్రక్కన మరణించాడో ఆ దొంగ కూడా ఉంటాడు.—లూకా 23:43.

అలా, మరణించిన అనీతిమంతులు కూడా పునరుత్థానం చేయబడి, భూమిపై నిత్యజీవం పొందడానికి అర్హులు కాగల అవకాశాన్ని పొందుతారు. (అపొస్తలుల కార్యములు 24:15) “దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెనని” చెబుతూ అనారోగ్యం, వృద్ధాప్యం, మరియు మరణం నిర్మూలింపబడడాన్ని గూర్చి బైబిలు చక్కగా వర్ణిస్తుంది.—ప్రకటన 21:3, 4.

నిరంతరం జీవించడమెలా

భూమిని స్వతంత్రించుకొని దానిపై నిరంతరం జీవించే వారిలో చేరి ఉండాలని మీరు తప్పకుండా కోరుకుంటారు. అలాగైతే, పరదైసులో నిరంతరం జీవించడానికి కావలసిన అర్హతలను మీరు పొందాలి. తన పరలోక తండ్రికి ప్రార్థన చేసేటప్పుడు, ఇలా చెబుతూ యేసుక్రీస్తు ఈ ప్రాథమిక అవసరతను స్పష్టపర్చాడు: “అద్వితీయ సత్య దేవుడవైన నిన్నునూ నీవు పంపిన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమును పొందుటయే నిత్యజీవము.”—యోహాను 17:3, NW.

జీవాన్నిచ్చే ఈ జ్ఞానాన్ని పొందడానికి మీకు సహాయం చేసేందుకు యెహోవాసాక్షులు సంతోషిస్తారు. మీరు వారిని అడగండి చాలు, వారు ఉచితంగా, అనుకూలమైన సమయంలో వచ్చి, మానవజాతిని ఆత్మీయంగా మరియు శారీరకంగా పరిపూర్ణతకు తేవడాన్ని దేవుడు ఎలా సంకల్పిస్తున్నాడో చర్చిస్తారు. వృద్ధాప్యానికి, మరణానికి కారణమైన వారసత్వ లోపాన్ని సరిదిద్దడానికి సర్వశక్తివంతుడైన మన సృష్టికర్త పూర్తిగా సమర్ధుడని నమ్మకం కలిగివుండండి. జీవితం ఇక చిన్నదిగా ఉండని సమయం వచ్చేస్తోంది, అది సమీపంలో ఉంది. యెహోవా తన ప్రజలను “శాశ్వత జీవము”తో ఆశీర్వదిస్తాడు.—కీర్తన 133:3.

[10వ పేజీలోని చిత్రం]

క్రీస్తు రాజరిక పరిపాలన క్రింద, వృద్ధాప్యం మరియు మరణం జయింపబడతాయి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి