శాస్త్రజ్ఞులు హెచ్చరికనిస్తున్నారు
“మానవ జాతి మరియు జీవ్యావరణ పరిస్థితి సంఘర్షణా దిశలో ఉన్నాయి. . . . [పర్యావరణానికి] కలుగనున్న అపాయాన్ని వారించేందుకు ఇంకా కొన్ని దశాబ్దాలు మాత్రమే ఉన్నాయి.”
యు.సి.ఎస్ (యూనియన్ ఆఫ్ కన్సెర్న్డ్ సైంటిస్ట్స్) ఇచ్చిన ఈ హెచ్చరిక కెనడా వైద్య పత్రికయైన అన్నాల్స్లో ప్రచురించబడింది. ఆ నివేదిక ఇంకా ఇలా కొనసాగుతుంది, జీవితాన్ని అపాయంలో పడవేసే మానవుని అలవాట్లు ఇలాగే కొనసాగినట్లయితే, అవి “ప్రపంచాన్ని ఎంతగా మార్చేస్తాయంటే మనకు తెలిసిన విధంగా అది జీవాన్ని నిలబెట్టలేకుండా పోతుంది.”
ఉదాహరించబడిన అగత్య సమస్యల్లో తప్పనిసరిగా పేర్కొనవలసినవి: ఓజోన్ నాశనం; నీరు కలుషితమవ్వడం; వననశీకరణ; నేల నిస్సారమవ్వడం; జాతులు అంతరించిపోవడం—అంటే అందులో 2100వ సంవత్సరంనాటికి ఇప్పుడు జీవిస్తున్న అన్ని ప్రాణుల్లో మూడవ వంతు ఇమిడి ఉండవచ్చు. “ఒకదానిపై ఒకటి ఆశ్రయించి ఉండే జీవన అల్లికలో మనం జోక్యం చేసుకోవడం మనం పూర్తిగా అర్థం చేసుకోలేని మార్పులు గల జీవ్యావరణ వ్యవస్థను నాశనం చేయడంతో సహా సర్వవ్యాప్తంగా ప్రభావితం కావడానికి కారణం కాగలదు” అని యు.సి.ఎస్ చెబుతుంది.
నోబుల్ బహుమతి పొందిన 104 మంది ప్రసిద్ధులతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,600 కన్నా ఎక్కువ మంది శాస్త్రజ్ఞులు యు.సి.ఎస్ వ్యక్తం చేసిన వ్యాకులతలను రూఢి చేశారు. యు.సి.ఎస్ ప్రకారం, “విస్తృతమైన మానవ విషాద సంఘటనలను నివారించాలంటే భూమిపై మన కార్యనిర్వహణలో మార్పు కావాలని ప్రపంచంలోని విజ్ఞానశాస్త్ర సమాజంలోని ఈ సీనియర్ సభ్యులు మానవులనందరినీ హెచ్చరిస్తున్నారు.”
మానవుడు నిజంగా ‘భూమిని నశింపజేయుచున్నాడు’ అని బైబిలు ఒప్పుకుంటుంది. (ప్రకటన 11:18) ప్రపంచ కార్యనిర్వాహకంలో మార్పు అవసరముంది అని కూడా అది తెలియజేస్తుంది. (యిర్మీయా 10:23; దానియేలు 2:44) నిజానికి, అలాంటి మార్పు మానవ ప్రయత్నాల ద్వారా కాదు గాని, దేవుని రాజ్యం ద్వారానే, యేసు ప్రార్థించమని అనుచరులకు నేర్పించిన పరలోక ప్రభుత్వం ద్వారానే సంభవిస్తుందని బైబిలు వాగ్దానం చేస్తుంది.—కీర్తన 145:16; యెషయా 11:1-9; మత్తయి 6:9, 10.
[Picture Credit Line on page 31]
Photo: Godo-Foto