అది ఆమెకు కొంత ఉపశమనాన్నిచ్చింది
తారా పటేల్ ఇండియాలోని బొంబాయిలో ప్రచురించబడే ది డెయిలీ అనే వార్తాపత్రికలో “నా స్వంతంగా” అనే శీర్షికతో ఒక కాలమ్ వ్రాస్తారు. జనవరి 22, 1995 తేజరిల్లు!లో (ఆంగ్లం) వచ్చిన “మీ జీవితం విసుగ్గా ఉందా? మీరు దాన్ని మార్చుకోగలరు!” అనే శీర్షికను గూర్చి ఆమె జనవరిలో వ్రాశారు. “లోకంలో అతి నీతివంతమైన పత్రికల్లో అదీ ఒకటన్నట్లుగా దానిని నిర్లక్ష్యం చేసేదానిని, అయినప్పటికీ, నేను దానికి చందా కట్టాను” అని తేజరిల్లు! గురించి ఆమె వ్రాశారు.
అయితే, ఆమె ఇంకా ఇలా వ్రాశారు: “నేను ఈ శీర్షికను చదివిన కొలది, నా జీవితం విసుగెత్తించేదిగా ఉందని, మహా విపరీతంగా విసుగెత్తించేదిగా ఉందని నాలో నేను గొణుక్కున్నాను. నా జీవితం ఎంత విసుగ్గా ఉందో మీరు ఊహించలేరు! మరి దాని పరిష్కారమేమిటి?” ముగింపులో ఆమె తేజరిల్లు!లో వ్రాయబడిన దానిని వివరంగా ఇలా ఉదాహరించారు: “నేర్చుకుంటూ ఉండండి. వ్యక్తిగత లక్ష్యాలను కలిగి ఉండండి. సృజనాత్మకత గలవారై ఉండండి. మీ చేతులతో ఏదైనా పని చేయండి. జీవితంలో సంకల్పం కలిగి ఉండండి. దేవుని గూర్చి ధ్యానించండి.
“అది సలహా. అది అతి నీతివంతమైనా కాకపోయినా దాని గూర్చి ఆలోచిస్తే అది యుక్తమైన సలహానే. ఏదో ఒక విధంగా ఈ తేజరిల్లు పత్రిక నాకు ఉపశమనాన్నిచ్చింది. మీకిష్టమైతే మీరు దానికి చందా కట్టండి.” తర్వాత తారా పటేల్ మరింత సమాచారాన్ని పొందేందుకుగాను ఇండియాలోని అడ్రస్‌ను కూడా ఇచ్చారు.
మీరు తేజరిల్లు! ప్రతిని, అలాగే దాని సహ పత్రికయైన కావలికోటను కావాలనుకుంటే, దయచేసి, Praharidurg Prakashan Society, Plot A/35, Nr Industrial Estate, Nangargaon, Lonavla, 410 401, Mah., లేదా 5వ పేజీలోని మీకనుకూలమైన చిరునామాకు వ్రాయండి.