కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 11/8 పేజీ 30
  • మా పాఠకుల నుండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మా పాఠకుల నుండి
  • తేజరిల్లు!—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • నేను పచ్చబొట్టు పొడిపించుకోవాలా?
    తేజరిల్లు!—2003
  • పచ్చబొట్లు లేదా టాటూలు వేయించుకోవడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1994
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1995
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 11/8 పేజీ 30

మా పాఠకుల నుండి

సంభాషణ “సంభాషణ ఒక కళ” (ఏప్రిల్‌ 8, 1995) అనే శీర్షికను బట్టి మీకు కృతజ్ఞతలు. చాలా కాలంగా నేను సిగ్గును అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ సమస్య ఉన్నది నాకు మాత్రమే కాదని నేనిప్పుడు గ్రహించాను. మీ సలహాలను నేను సద్వినియోగం చేసుకుంటాను.

ఎ. ఎల్‌., అమెరికా

కావలికోట మరియు తేజరిల్లు! పత్రికల్లోని శీర్షికలను చదవాలనే మీ సలహా నిజంగా పని చేస్తుంది. అలా చేసినప్పుడు మాట్లాడడానికి ఎంతో ఉంటుందనే విషయం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది!

వి. ఎమ్‌. జె., అమెరికా

అవివాహిత జీవితం “బైబిలు ఉద్దేశం: అవివాహిత జీవితం ఒక బహుమానమైనప్పుడు” (ఫిబ్రవరి 8, 1995) అనే శీర్షికను బట్టి మీకు కృతజ్ఞతలు. నేను నివసిస్తున్న చోట వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం; క్రైస్తవ సహోదర సహోదరీలు వివాహం చేసుకోమని మిమ్మల్ని బలవంతపెడతారు. నాకు 30 ఏండ్లయ్యేదాక నేను వివాహాన్ని గూర్చి ఎక్కువగా ఆలోచించనేలేదు. తర్వాత ఒక తోడు అవసరం ఉందని నేను భావించనారంభించాను. నేనిక ఏ మాత్రం సహించలేను అని అనుకుంటున్న సమయంలో ఈ శీర్షికను అందించినందుకు నేను యెహోవాకు కృతజ్ఞురాలిని.

ఇ. ఎమ్‌. ఎ., అమెరికా

స్వయంశ్లాఘన “స్వయంశ్లాఘన—వెఱ్ఱితనపు సవాళ్లను ఎదుర్కొనుట” (ఫిబ్రవరి 8, 1995) అనే శీర్షికను బట్టి మీకు కృతజ్ఞతలు. నా కూతురును బాధిస్తున్న వ్యాధిని తుదకు నేను అర్థం చేసుకోగలిగాను, అది ఆమెను నేను పెంచడంలో చేసిన ఏదో లోపం వలన కలిగిన ఫలితం కాదని నాకు తెలుసు. యెహోవాకు నేను సేవచేయడం ఆమె పరిస్థితితో వ్యవహరించేందుకు నాకు బలాన్నిస్తుంది.

ఎమ్‌. హెచ్‌., స్విట్జర్‌లాండ్‌

స్వయంశ్లాఘనకు పూర్వికుల శాపం లేదా గత కర్మ ఫలం వంటి ఎన్నో మూఢ విశ్వాస సంబంధమైన కారణాలు ఆపాదించబడ్డాయి. మీరు వ్రాసిన విషయం ఈ వ్యాధిని గూర్చిన మంచి అవగాహనను కలుగజేసుకునేందుకు సహాయపడుతుంది. విద్యావంతులను చేసే ఇలాంటి శీర్షికలను బట్టి మీకు కృతజ్ఞతలు.

ఎమ్‌. ఎ., నైజీరియా

ఆర్కిడ్‌లు ఆర్కిడ్‌లు అంటే నాకెంత ఇష్టమో! నిజానికి మా తోటలో ఆర్కిడ్‌లు ఉన్నాయి, వాటి ఫోటోగ్రాఫ్‌ల సేకరణ కూడా ఉంది. “ఐరోపాలోని ఆర్కిడ్‌ల కొరకైన అన్వేషణలో” (ఫిబ్రవరి 8, 1995) అనే శీర్షికను ప్రచురించినందుకు మీకు కృతజ్ఞతలు. ఇది ఈ విషయం పై మీరు ప్రచురించే చివరి శీర్షిక కాకూడదని నేను ఆశిస్తున్నాను.

ఆర్‌. ఎమ్‌., ఫిలిప్పీన్స్‌

సురక్షిత డ్రైవింగ్‌ నేనిప్పుడు నలభైల మధ్యలో ఉన్నాను, నాకు మూర్ఛరోగం ఉన్నందువల్ల నేనెన్నడూ డ్రైవింగ్‌ చేయడానికి అనుమతించబడలేదు. మెదడు శస్త్రచికిత్స తరువాత డ్రైవర్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మా న్యూరాలజిస్ట్‌ నాకు అనుమతినిచ్చాడు! “మీరు సురక్షితంగా డ్రైవ్‌ చేస్తారా?” (ఫిబ్రవరి 8, 1995) అనే శీర్షిక డ్రైవింగ్‌ చేసేటప్పుడు సరైన దృక్పథాన్ని కలిగి ఉండవలసిన ప్రాముఖ్యతను గుణగ్రహించడానికి నాకు సహాయపడింది. నేను లైసెన్స్‌ పొందినంతలోనే అదీ వచ్చింది!

జి. ఎస్‌., అమెరికా

క్షమించరాని పాపం “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . నేను క్షమించరాని పాపం చేశానా?” (నవంబరు 8, 1994) అనే శీర్షికను బట్టి మీకు కృతజ్ఞతలు. హస్తప్రయోగం అనే ఈ చెడు అలవాటుతో నేను కూడా పోరాడుతున్నాను కనుక దీనిని చదువుతుండగా నాకంట నీళ్ళు వచ్చాయి. పెద్దతో మాట్లాడడానికి ధైర్యం కలిగిన, శీర్షికలో పేర్కొనబడిన మార్కో మరియు ఆల్బర్టోల మాదిరులను నేను అనుకరించాను. ఇది నాకెంతగానో సహాయపడింది.

ఎ. ఎమ్‌. సి., బ్రెజిల్‌

హస్తప్రయోగం అనేది ఒక క్రైస్తవునికి ఉండే అతి క్లిష్టమైన పోరాటాల్లో ఒకటి. నేను దుఃఖితునిగాను, ఉత్సాహం లేనివానిగాను అనేక సార్లు భావించాను. ఈ యుద్ధంలో విజయం సాధించడానికి పోరాడుతూనే ఉండేందుకు ఈ శీర్షిక నాకు ప్రోత్సాహాన్నిచ్చింది.

ఎఫ్‌. జి. ఎమ్‌., మెక్సికో

నేను వివాహం చేసుకోవాలని ఆశిస్తూ ఉండిన యువకునితో నేను చెడు ప్రవర్తనకు పాల్పడ్డాను; అది మా బంధాన్ని నాశనం చేసింది. నేను తీవ్రంగా కృంగిపోయాను, ఎన్నో రేయింబవళ్ళు కన్నీటితో గడిపాను. నాకు క్షమాపణ దొరకదని నేను నిజంగా అనుకున్నాను. ఈ శీర్షికలను చదవడం యెహోవాయందు, క్షమించి మరిచిపోయే ఆయన శక్తియందు నా విశ్వాసాన్ని పునఃస్థాపించింది.

ఎల్‌. సి., ఆస్ట్రేలియా

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి