కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 11/8 పేజీలు 26-27
  • దేవుని ప్రమాణాలు చేరుకోలేనంత కష్టమైనవా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని ప్రమాణాలు చేరుకోలేనంత కష్టమైనవా?
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుడు మినహాయింపునిస్తాడు
  • వదిలిపెట్టకండి
  • యెహోవా ఉన్నత ప్రమాణాలకు తగ్గట్లు ఆయనను సేవించండి
    యెహోవా మహాదినాన్ని మనసులో ఉంచుకొని జీవించండి
  • ఏది తప్పు? ఏది ఒప్పు? నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2024
  • యెహోవా ప్రజలు నీతిని ప్రేమిస్తారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • దేవుని నియమాలు మన ప్రయోజనార్థమే
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 11/8 పేజీలు 26-27

బైబిలు ఉద్దేశము

దేవుని ప్రమాణాలు చేరుకోలేనంత కష్టమైనవా?

“దేవుడు మానవులను అంగుళాలతో సహా ఎంచడు.”—స్కోటిష్‌ ప్రాచీన సామెత.

పాఠశాల పరీక్షలు, ఉద్యోగాల కొరకైన ఇంటర్వ్యూలు మరియు వైద్య పరీక్షలు అనేవి జీవితంలోని కొన్ని మలుపులు మాత్రమే, వాటితో మానవుడు మదించబడతాడు. కాని దేవుని ప్రమాణాల ప్రకారం ప్రతిదినం జీవించే విషయానికొచ్చేసరికి, తాము ఏదో ఒక రకంగా వాటిని చేరుకోలేకపోతున్నట్లు అనేకమంది వ్యక్తులు భావిస్తున్నారు. మీ విశ్వాసం కూడా అదేనా? మీరు దేవుని ప్రమాణాలను చేరుకోగలరా?

దీనికి జవాబిచ్చేందుకు, మొదట మనం దేవుడు తన ఆరాధికుల కొరకు పెట్టిన ప్రమాణాలను చూద్దాం. జీవితంలో మనం నడవవలసిన మార్గంపై బైబిలు వెలుగును ప్రసరింపజేస్తుంది. (కీర్తన 119: 105) బైబిలు రచయితయును జ్ఞానియునైన సొలొమోను రాజు ‘సత్య దేవునికి భయపడి ఆయన కట్టడలననుసరించి నడుచుచుండుటయే’ మానవుని ‘విధియై ఉంది’ అనే నిర్థారణకు వచ్చాడు. (ప్రసంగి 12:13) ప్రవక్తయైన మీకా ఈ విధంగా అభిప్రాయపడ్డాడు: “న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.”—మీకా 6:8.

“నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ప్రాణంతోను [NW], నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును [“యెహోవా,” NW] ప్రేమింపవలెను” మరియు “నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను” అను వాటికన్నా గొప్ప ఆజ్ఞలు మరేవి లేవని దేవుని స్వంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రకటించాడు. (మార్కు 12:30, 31) అంతేకాక, దేవుని ఆజ్ఞలన్నింటినీ అనుసరించడం ద్వారా మనం ఆయనను ప్రేమిస్తున్నామని కనబరుస్తాము.—1 యెహాను 5:3.

సరళంగా చెబితే, మానవులు దేవున్ని ప్రేమించి, గౌరవించి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, నిష్పక్షపాతంగా ప్రవర్తించాలి, అందరితో దయగా ఉండాలి, గర్వాన్ని విడిచిపెట్టాలి. అలాంటి ప్రమాణాలు మనం చేరుకోగలిగేవేనా?

దేవుడు మినహాయింపునిస్తాడు

మానవులు తన ప్రమాణాలను చేరుకోవాలని దేవుడు సముచితంగానే ఆశిస్తున్నాడు. అయితే, నిజాయితీగా చెప్పాలంటే, ఏ మానవుడైనా పూర్ణంగా అన్ని సమయాల్లోను ఈ ప్రమాణాలకు అనుగుణంగా ప్రవర్తిస్తాడా? లేనే లేదు, ఎందుకంటే మనం మన పితరుడైన ఆదాము నుండి అపరిపూర్ణతను సంతరించుకున్నాము. (రోమీయులు 5:12) అలా, మనం తప్పు చేసేందుకు మొగ్గు చూపిస్తాము. అయినప్పటికీ, మనం దేవున్ని అంగీకారయోగ్యమైన విధంగా సేవించకుండా ఇది మనలను అయోగ్యులను చేయడం లేదు.

ఉదాహరణకు, కారు నడపడం నేర్చుకోవడంలోని సమస్యలను గూర్చి ఆలోచించండి. డ్రైవింగ్‌ టెస్ట్‌ పాసయ్యేలా చక్కగా నడిపేందుకు ఎంతో శ్రద్ధ మరియు సమయం అవసరం. నిజమే, లైసెన్స్‌ లభించిన తరువాత కూడా చక్కగా డ్రైవ్‌ చేసేందుకు మనమింకా కృషి చేయవలసి ఉంటుంది. మనం అనుభవాన్ని పొందుతున్న కొలది మన సామర్థ్యాలకు పదును పెట్టుకుంటాము. కాని సంపూర్ణులైన డ్రైవర్‌లు ఎవరూ లేరు!

సంతోషకరంగా, మన వైఫల్యాలకు దేవుడు మినహాయింపునిస్తాడు. ఆయన మనం చేరుకోలేనిదానిని కోరే సహేతుకత లేనివాడు కాదు లేదా తప్పులనే పడుతూ ఉండే వ్యక్తి కాదు. ఆయన మన దౌర్బల్యాలను, బలహీనతలను అర్థం చేసుకుంటాడు. గంభీరమైన పాపమును చేసిన దావీదు రాజు ఆయన “మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు” అని ఒప్పుకుంటూ “మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు” అని కూడా అన్నాడు. ఎందుకు చేయలేదు? “భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన[దేవుని]యందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది.” మనం పాపం చేస్తామని యెహోవాకు తెలిసినప్పటికీ, ఆయన మన అతిక్రమములను “పడమటికి తూర్పు ఎంత దూరమో” అంత దూరమున ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు.—కీర్తన 103:10-14.

వదిలిపెట్టకండి

“నేను నిరాశ చెందినప్పుడెల్లా దేవుని ప్రమాణాల ప్రకారం జీవించడంలో నేనెన్నడూ సఫలత పొందలేనని కొన్నిసార్లు నిర్థారణకు వచ్చేవాడ్ని. నేను మరింత అనుకూలమైన దృక్పథాన్ని పెంచుకున్నప్పుడు, నేను ఏ విధంగా జీవించాలని దేవుడు కోరుకుంటాడో ఆ విధంగా నేను జీవించగలను అని భావిస్తాను. కాని అదంత సులభమైనది కాదు మరి!” అని దేవుని ఒక యథార్థ ఆరాధికుడు వివరిస్తున్నాడు. మీరీ విధంగా భావిస్తున్నట్లయితే నిరుత్సాహపడకండి. ఇలాంటి భావాలు గలవారిలో మీరు మొదటి వ్యక్తి కాదు, చివరి వ్యక్తి కాదు.

“కాబట్టి మేలు చేయ గోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగపురుషునిబట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. . . . అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను?” అని క్రైస్తవ అపొస్తలుడైన పౌలు నిర్మొహమాటంగా ఒప్పుకున్నాడు. అయినప్పటికీ, దేవుడు కోరుకుంటున్నది చాలా కష్టమైనదనే నిర్థారణకు ఆయన రాలేదు, ఎందుకంటే ఆయనిలా అన్నాడు. “ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవనియమమునకును, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనై యున్నాను.” (రోమీయులు 7:21-25) అలా తాను పాపియైయున్నప్పటికీ, దేవున్ని తాను ప్రీతిపర్చగలుగుతాడని ఆయన భావించాడు.

ప్రేమగల సృష్టికర్తయైన యెహోవా మన తప్పిదాలను, వైఫల్యాలను తన ప్రియ కుమారుడైన యేసు క్రయధన బలి విలువ ద్వారా క్షమిస్తాడు. “ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై [కప్పివేయువాడై] యున్నాడు” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (1 యోహాను 2:1, 2) స్నేహబంధం కొరకు దేవుని ప్రమాణాలను చేరకుండా అడ్డగించే, నివారించే ఆ గోడ క్రీస్తు బలి ద్వారా తీసివేయబడింది, లేదా పడగొట్టబడింది. కనుక దేవునితో సహవాసం పునఃస్థాపించబడింది.

దేవుడు ‘వినయముగలవారితోను నలిగినవారితోను’ నివాసం చేస్తాడు గనుక ఈ ప్రేమపూర్వకమైన ఏర్పాటును వినయంగా అంగీకరించడం క్షమాపణను తెస్తుంది. (యెషయా 57:15) మన ఆత్మలను ఉజ్జీవింపజేయడానికి మనం ఆయనను ఆశ్రయించగలము. ఆయన ‘నేలనుండి అల్పులను లేవనెత్తుతాను’ అని వాగ్దానం చేస్తున్నాడు. మనం దేవున్ని సంపూర్ణంగా అనుసరించడంలో విఫలులమైనప్పుడు మనమిక ఏ మాత్రం నిరాశచెందనక్కర్లేదు. బదులుగా, మనం దేవుని ప్రమాణాల ప్రకారం జీవించడానికి చేసే ప్రయత్నాలను ఆయన ఎన్నడూ నిర్లక్ష్యం చేయడని మనం నమ్మకం కలిగి ఉండగలం.—కీర్తన 113:7; హెబ్రీయులు 6:10-12.

అదొక పోరాటమైనప్పటికీ, దేవునికి ప్రీతికలిగే దానిని చేయడంలో మీరు సంతోషించగలరని మీరు గ్రహిస్తారు. దేవునియెడల భక్తి మీకు మీ చుట్టూ ఉన్నవారికి జీవితం మరింత సులభమైనదిగా చేస్తుంది. అలాగే భవిష్యత్తును గూర్చి ఆలోచించండి. ఇప్పుడు దేవుని ప్రమాణాలకు అనుగుణంగా జీవించడానికి ప్రయత్నించడం పరదైసు పరిస్థితుల్లో నిత్యజీవమనే నిరీక్షణను తెస్తుంది.—యెషయా 48:17; రోమీయులు 6:23; 1 తిమోతి 4:8.

అనుభవజ్ఞులైన పర్వతారోహకులు శిఖరాగ్రమునకు చేరుకున్న తరువాత వాళ్ళింకా మధ్యదూరంలోనే ఉన్నారని తెలుసుకుంటారు. వాళ్ళు ఇంకా సగం దూరం క్షేమంగా దిగవలసి ఉంది. అలాగే, దేవునికి భయపడేవారు దేవుని ప్రమాణాలను చేరుకోవలసిన మరియు వాటి ప్రకారం జీవితాన్ని కొనసాగించవలసిన అవసరం కూడా ఉంది.—లూకా 21:19; యాకోబు 1:4.

దేవుని ప్రమాణాలు చేరుకోలేనంత కష్టమైనవి కావన్న విషయాన్ని తెలుసుకుని ఓదార్పును పొందండి. సంపూర్ణంగా వాటికి అనుగుణంగా ఉండేందుకు అప్పుడప్పుడు మీరు విఫలులైనప్పుడు ఆయన క్షమాపణ కొరకు అడగండి. ప్రేమపూర్వకమైన ఆయన మద్దతును ఆశ్రయించండి. (కీర్తన 86:5) కనుక, యెహోవా మరియు ఆయన కుమారుడు మీకు సహాయకులుగా ఉండగా, మీరు దేవుని ప్రమాణాలను చేరుకోగలరు మరియు ఆయన అంగీకారాన్ని పొందగలరు.—సామెతలు 12:2.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి