పరిణామం మరియు మీరు
మానవుడు దేవుని జోక్యం లేకుండానే బ్రతుకగలిగాడని, ఇంకా బ్రతకగలుగుతాడని ది ఒరిజిన్ ఆఫ్ స్పిసీస్ అనే పుస్తకం 19వ శతాబ్దంలో చాలా మంది ప్రజలను నమ్మించింది. అనేకులు విజ్ఞానశాస్త్రం సాధించిన అభివృద్ధి చేత వశీకరించబడి, దేవుని అవసరం ఇక ఏ మాత్రం లేదని, విజ్ఞానశాస్త్రం మానవ జాతిని రక్షించగలదని భావించారు. 19వ శతాబ్దం “బుద్ధినుపయోగించి చేసే మానవ ప్రయత్నం ప్రపంచాన్ని మార్చి వేయగలదనే నమ్మకంతో పురికొల్పబడింది” అని ఏజ్ ఆఫ్ ప్రోగ్రెస్ అనే పుస్తకం పేర్కొన్నది.
అయితే, ఆ శతాబ్దాంతంలో, చార్ల్స్ డార్విన్ ఆశావాదం కూడా సడలిపోయింది. ఒక చరిత్రకారుని అభిప్రాయం ప్రకారం, పరిణామ సిద్ధాంతం “దేవుని చంపివేసిందని, దానివల్ల మానవుని భవిష్యత్తులో కలిగే పర్యవసానాలు వెలకట్టలేనివని” డార్విన్ భయపడ్డాడు. “డార్విన్‌తో జరిగిన నా చివరి సంభాషణలో [డార్విన్ మరణానికి కొంచెం ముందు] మానవజాతి భవిష్యత్తును గూర్చి విచారకరమైన అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చాడు” అని డార్విన్ సమకాలీనుడును, యువకుడునైన ఆల్‌ఫ్రెడ్ రస్సెల్ వాలస్ గుర్తుచేసుకున్నాడు.
మానవ ప్రయత్నం ఏ ఫలితాన్నిచ్చింది?
మరింత విచారకరమైన సమయాలు ముందుంటాయని 20వ శతాబ్ద చరిత్ర బయల్పరచింది. డార్విన్ కాలం నుండి మరింత అంధకారమైన, హింసాత్మకమైన యుగమని నిరూపించబడినదానిని సాంకేతిక విజయాలు మరుగుచేశాయి. “నిజమైన అనైతికత” అని హెచ్.జి. వెల్స్ అనే చరిత్రకారుడు వర్ణించిన కాలంలో మనం జీవిస్తున్నాం.
వెల్స్ అలా ప్రస్తావించినప్పటి నుండి (దాదాపు 75 సంవత్సరాల క్రితం) లోకం మరింత అనైతికతను భరిస్తుంది. శాస్త్రజ్ఞులు గాని, ఆర్థిక శాస్త్రవేత్తలు గాని, సాంఘిక సంస్థలు గాని, లేదా ప్రపంచ మతాలు గాని, మానవ ప్రభుత్వాలు గాని ప్రయత్నించి పరిస్థితిని మార్చనూ లేదు, లేదా అనైతికతను రూపుమాపనూ లేదు. పరిస్థితులు మరింత విషమించి పోతూనే ఉన్నాయి.
కాబట్టి, నిజానికి ఈ విధంగా ప్రశ్నించబడాలి: మానవ ప్రయత్నాలు ఏ ఫలితాన్ని తెచ్చాయి? విజ్ఞానశాస్త్రము మరియు సాంకేతికశాస్త్రము శ్రేష్ఠమైన లోకానికి దారితీశాయా? “మనం దిన పత్రికను తెరిచి, ఏమి జరుగుతుందని చూసినప్పుడు కనిపించే సమస్యలు విజ్ఞానశాస్త్రపరమైనవి కావు, అవి సాంఘిక సంస్థీకరణకు సంబంధించిన సమస్యలు, అధిగమించలేనంత పెద్ద సమస్యలు, ప్రజలు లాభం కోసం ప్రయత్నిస్తూ మానవ అవసరాలను నిర్లక్ష్యం చేయడం వలన వచ్చే సమస్యలు” అని జీవశాస్త్రజ్ఞురాలైన రూత్ హబర్డ్ చెప్పింది. హబర్డ్ ఇంకా ఈ విధంగా చెబుతుంది: “వనరులను జ్ఞానపూర్వకంగా కేటాయించడంలో విజ్ఞానశాస్త్రం ప్రపంచంలో అనేక మందిని కష్టపెట్టే ఏదైన ఒక సమస్యను లేక అనేక సమస్యలను తీర్చగలదని నేననుకోవడం లేదు.”
నిజంగా, మానవుడు చంద్రుని మీదుగా ప్రయాణించగలడు, కాని మానవ కుటుంబం యొక్క ప్రాథమిక సమస్యలను పరిష్కరించుకోలేకపోతే ఏమి ప్రయోజనం? ఆటంబాంబు వంటి మరింత వినాశకరమైన ఆయుధాలను క్రొత్తగా కనిపెట్టడం యుద్ధాలకు వర్గీయ హింసాకాండకు అంతం తెచ్చిందా? విజ్ఞానశాస్త్ర విజయాలు నేరాలను కుటుంబం విచ్ఛిన్నం కావడాన్ని, లైంగికంగా సంక్రమించే వ్యాధులను, అనైతికతను, జారత్వము వలన కలిగే జననాలను, ఉన్నతోద్యోగుల అవినీతిని, పేదరికాన్ని, ఆకలిని, నిరాశ్రయాన్ని, మాదక ద్రవ్యాల ఉపయోగాన్ని, కాలుష్యాన్ని చెప్పుకోదగినంతగా తగ్గించాయా? లేదు, విజ్ఞానశాస్త్రం ఏమన్న సాధించిందంటే, అది ఈ పరిస్థితుల్లో కొన్నింటిని మరింత విషమం చేయడమే. దేవున్ని విడిచిపెట్టి, బదులుగా పరిణామాన్ని, విజ్ఞానశాస్త్రాన్ని స్వీకరించడం మానవ కుటుంబం తన పరిస్థితిని మెరుగుచేసుకునేందుకు సహాయపడలేదు గాని, దానిని మరింత వేదనాజనకంగా చేసింది.
మొదటి మానవులను సృష్టించిన దేవుడు ఉన్నాడనే దానికి వ్యతిరేకమైన తోకలేని కోతివంటి ప్రాణుల నుండి వారు పరిణామం చెందారన్న సిద్ధాంతాన్ని గూర్చి కొందరు మళ్ళీ ఆలోచించడంలో ఆశ్చర్యం లేదు. అమెరికాలోని సర్వే నిరూపించినదేమంటే అమెరికా దేశస్థుల్లో 9 శాతం మంది మాత్రమే దైవిక జోక్యం లేకుండా మానవుడు పరిణామం చెందాడని విశ్వసిస్తున్నారు; 47 శాతం మంది దేవుడు మానవున్ని ప్రస్తుత రూపంలో సృజించాడన్న అభిప్రాయాన్ని అంగీకరిస్తున్నారు.
బైబిలు ఏమని ముందుగా తెలిపింది
మానవుడు పరిపూర్ణతకు ఎదుగుతాడని ది ఒరిజిన్ ఆఫ్ స్పిసీస్ ముందుగా సూచించగా, లోకం నైతిక సందిగ్ధావస్థలో ఊగిసలాడుతుందని బైబిలు ముందుగా చెప్పింది. (మత్తయి 24:3-12; 2 తిమోతి 3:1-5) ఈ సందిగ్ధావస్థ తారాస్థాయికి చేరుకుంటుందని, దాని తరువాత నమ్మకస్థులైన మానవుల వారసత్వం పరదైసు అయి ఉంటుందని, వారు నేటి సమస్యలన్నింటి నుండి స్వతంత్రులౌతారని కూడా బైబిలు ముందుగా చెప్పింది.—కీర్తన 37:10, 11, 29; యెషయా 11:6-9; 35:1-7; ప్రకటన 21:4, 5.
అనేకులు బైబిలును ఎంతో శ్రద్ధగా పరిశీలించడానికి ఈ నిరీక్షణ కారణమైంది. నిజంగా జీవిత సంకల్పమనేది మనుగడ కొరకైన పోరాటంకన్నా మించినదై ఉండవచ్చా? మానవుని గతానికి మాత్రమే కాక, అతని భవిష్యత్తుకు అంటే మీ భవిష్యత్తుకు కూడా కీలకం బైబిలులో ఉందా? దేవుని గూర్చి, ఈ భూమి మరియు దాని ప్రజల ఎడల ఆయన సంకల్పమేమిటనే దాని గూర్చి నిజంగా బైబిలు ఏమి బోధిస్తుందో పరిశీలించడం మీకు చాలా ప్రయోజనకరం కాగలదు. మీకు మరింత సమాచారం కావాలంటే, మీకు సహాయం చేయడానికి యెహోవాసాక్షులు చాలా సంతోషిస్తారు.
[9వ పేజీలోని బాక్సు]
లక్షలాదిమంది జీవం—అది ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (ఆంగ్లం) అనే పుస్తకాన్ని ఉపయోగిస్తూ, సృష్టికర్తయైన దేవుడు ఉన్నాడా అని మరొక్కసారి పరిశీలించడానికి సహాయమందించబడింది.a ఇప్పటి వరకూ, దాదాపు 3 కోట్ల ప్రతులు 27 భాషల్లో ప్రచురించబడ్డాయి. అలాగే, తేజరిల్లు! పత్రిక పరిణామ సిద్ధాంత సయుక్తికత్వాన్ని గూర్చి నిజమైన విజ్ఞానశాస్త్ర వాస్తవాలు ఏమి చూపిస్తున్నాయన్న సమాచారాన్ని ప్రచురిస్తూనే ఉంది.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిలు అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్, ఇన్‌కార్పొరేటెడ్ ప్రచురించినది.
[8,9వ పేజీలోని చిత్రం]
పరిణామ సిద్ధాంతానికి భిన్నంగా, బైబిలు నేటి నైతిక సందిగ్ధావస్థను, దాని పరిష్కారాన్ని అంటే సమస్యలు లేని పరదైసును గూర్చి ముందుగా తెలిపింది
[Picture Credit Line on page 8]
U.S. Coast Guard photo
[Picture Credit Line on page 8]
Starving child: WHO photo by P. Almasy
[Picture Credit Line on page 8]
Right: U.S. National Archives photo