కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 9/8 పేజీ 7
  • సృష్టికర్తకు ఘనతనివ్వడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సృష్టికర్తకు ఘనతనివ్వడం
  • తేజరిల్లు!—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • విజ్ఞానశాస్త్రం మతం మరియు సత్యాన్వేషణ
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • మానవజాతి సృష్టికర్తయందు విశ్వాసాన్ని నిర్మించుట
    మన రాజ్య పరిచర్య—1994
  • తల్లిదండ్రులారా—విశ్వాసం పెంచుకునేలా మీ పిల్లలకు సహాయం చేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • మహాగొప్ప మనిషిని గూర్చి యితరులు తెలుసుకోవడానికి సహాయపడండి
    మన రాజ్య పరిచర్య—1993
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 9/8 పేజీ 7

సృష్టికర్తకు ఘనతనివ్వడం

“పుష్పములు అందం కోసం, ఫలాలు ఉపయోగం కోసం. అయితే అనేక ఫలాలు అందంగా ఉంటాయి. వస్తువులు అందంగాను, అలాగే ఉపయోగకరంగాను ఉండాలని మన పరలోక తండ్రి ఇష్టపడతాడు.” ఇది మత సంబంధమైన పుస్తకం నుండి ఉదాహరించబడలేదు. ఇది ది చైల్డ్స్‌ బుక్‌ ఆఫ్‌ నేచర్‌ అనే విజ్ఞానశాస్త్ర పుస్తకం నుండి తీయబడింది. దాని రచయితయైన వర్తింగ్‌టన్‌ హూకర్‌ ఎమ్‌. డి., 1887లో దీనిని వ్రాసినప్పుడు పిల్లలకు బోధించడానికి ఇది కుటుంబాల్లోను మరియు పాఠశాలల్లోను ఉపయోగించబడాలని ఉద్దేశించాడు.

ఈ రచయితకు సృష్టికర్తయందు విశ్వాసము మరియు ఆయన యెడల భక్తితో కూడిన భయము ఉన్నాయని ఈ పుస్తకంలోని రచనాశైలి రుజువునిస్తుంది. డా. హూకర్‌ ఇంకా ఇలా వ్రాస్తున్నారు: “మీరు తలంచగలిగినన్ని ఫలాన్నిగూర్చి తలంచినట్లయితే, భూమిపైనున్న ఫలాల ఆనందదాయకమైన రుచుల వైవిధ్యం ఎంత గొప్పదో గ్రహించగలరు. దేవుని అత్యధిక మంచితనానికి ఇది ఎంతటి రుజువునిస్తుందో! ఆయన మనల్ని కొన్ని వస్తువులతో కాదు గాని, అనేక వస్తువులతో సంతోషపెడుతున్నాడు. ఈ లోకంలోని మనోహరమైన వస్తువుల వైవిధ్యానికి అంతమే లేదు. వీటన్నిటిని గూర్చి తెలుసుకోగల్గేవారెవరైనా కూడా తన సృష్టికర్తకు కృతజ్ఞతలు చెల్లించకుండా రోజులు గడపడమంటే ఎంత ఆశ్చర్యకరమో!”

ది చైల్డ్స్‌ బుక్‌ ఆఫ్‌ నేచర్‌ అనే పుస్తకం మొదట ప్రచురించబడినప్పటికే డార్విన్‌ సిద్ధాంతాలు అంతటా ప్రచారమై దాదాపు మూడు దశాబ్దాలయ్యాయి. అయితే, 19వ శతాబ్దాంతంలో కూడా, ఒక పాఠ్య పుస్తకం ప్రకృతిలోని ఆశ్చర్యకరమైన విషయాలను బట్టి గ్రుడ్డిదైన ఆకస్మిక సంభవానికి కాక, దేవునికే బహిరంగంగా ఘనతనివ్వగలిగిందని డా. హూకర్‌ వ్రాసిన పుస్తకం చూపిస్తుంది.—యెషయా 40:26 పోల్చండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి