కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 6/8 పేజీలు 20-21
  • చెదపురుగు—మిత్రువా లేక శత్రువా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • చెదపురుగు—మిత్రువా లేక శత్రువా?
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • చెదపురుగుల పుట్ట
  • చెదపురుగుల సంఘం
  • మిత్రులా లేక శత్రువులా?
  • మహాతెలివిగల ఇంజనీర్లు
    తేజరిల్లు!—1994
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1997
తేజరిల్లు!—1995
g95 6/8 పేజీలు 20-21

చెదపురుగు—మిత్రువా లేక శత్రువా?

కెన్యాలోని తేజరిల్లు! విలేఖరి

మోసుకువెళ్ళగల కొయ్య తొట్టిని ఒక క్రైస్తవ పరిచారకుడు మరియు కొంతమంది పైకి లేపినపుడు, “కుంబె! మష్వా!” అని ఆయన అరిచాడు. కెన్యాలోని యెహోవాసాక్షుల ప్రాంతీయ సమావేశంలోని బాప్తిస్మపు తొట్టిగా దానిని ఉపయోగించవచ్చని వారనుకున్నారు. అయితే వారికి నిరుత్సాహం కలిగించేలా, ఆ కొయ్యను చాలామట్టుకు చెదలు తినివేసినట్లు కనుగొనబడింది. కాబట్టి ఆయనలా తన నిరాశను వ్యక్తపరచాడు. దాని భావం ఈ విధంగా తర్జుమా చేయబడింది: “ఓహా! చెదలు!”

చిన్న చెదపురుగు చేసినట్లు బహుశా మరే కీటకం ఇలా ఆస్తిని తరచూ నాశనం చేయదు. ఈ పురుగు మానవునికి నిజంగా శత్రువా? జవాబు కొరకు మనం చెదపురుగును నిశితంగా పరిశీలిద్దాము.

చెదపురుగుల పుట్ట

కెన్యాలో, తరచూ ఎత్తుగా ఉండే చెదపురుగుల పుట్టలు కనిపిస్తాయి. ఇవి పొగగొట్టాల ఆకృతిలో నేల మీద 15 నుండి 20 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. ఈ పుట్టలు కాంక్రీట్‌ కోటలవలె, కచ్చితమైన కొలతలతో నిర్మించబడతాయి, అందుకే చెదపురుగులు గొప్ప శిల్పకారులు అని పిలువబడుతాయి. చిన్న చెదపురుగులు నెమ్మదిగా నడిచిననూ, గ్రుడ్డివైననూ ఇలాంటి ఆకర్షణీయమైన కోటలను నిర్మిస్తాయని తలంచే ఊహను తిరస్కరించవచ్చా?

పుట్ట లోపల భాగమున ఎంతో శ్రమతో నిర్మించిన చిక్కైన గదులు మరియు సొరంగము ఉంటాయి. సందడిగా ఉండే ఈ ప్రధాన స్థావరంలో మురికి నీరు బయటికి వెళ్ళేందుకు మంచి సదుపాయము, గాలి వెళ్ళే ఏర్పాటు, ఎయిర్‌ కండీషనింగు కూడా ఉంటాయి. వేడిగాలి పుట్ట పైభాగాన ఉండే రంధ్రాల ద్వారా బయటకు వెళ్తుంది. క్రింది నుండి చల్లగాలి లోపలికి వస్తుంది. మామూలు ఆవిరి పద్ధతి ద్వారా మళ్ళీ శీతలీకరించబడుతుంది. చెదపురుగులు వాటి గోడల మీద ఉమ్మడంద్వారా నీళ్ళు చల్లుతాయి. నీరు ఆవిరైపోతుండగా, అది గాలిని చల్లబరచి అంతటా వ్యాపింపజేయడానికి సహాయపడుతుంది. అలా, చెదపురుగుల ఇల్లు 86 డిగ్రీల ఫారన్‌హీట్‌తో 24 గంటలూ హాయిగా ఉంటుంది!

చెదపురుగుల సంఘం

చెదపురుగుల సంఘం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. కొన్ని చెదపురుగుల దిబ్బల్లో దాదాపు 50 లక్షల నివాసులతో చక్కని ఇండ్ల సమూహాలు లేదా కాలనీలు ఉంటాయి. ఇక్కడ అరాజకత్వం లేదు, ఒక కాలనీ అంటే అది సమర్థతకు ఉదాహరణ. చెదపురుగుల కుటుంబంలో పనివారు, సైనికులు మరియు పునరుత్పత్తిదారులు అనే మూడు తెగలు ఉన్నాయి. పనివారి తెగ తమ లాలాజలాన్ని సిమెంటుగా ఉపయోగిస్తూ, పుట్టల నిజమైన నిర్మాణాన్ని సాగిస్తాయి.

సైనికుల తెగ దాడి చేయడానికి ముందుండే కుటుంబ సభ్యులు. బలమైన దవడలు మరియు పదునైన పళ్ళుగలవై, తమ కోటను సైనిక చీమల వంటి శత్రువుల నుండి కాపాడుతాయి. పనివారు దిబ్బ బయటకు వెళ్ళి సాహసంతో ఆహారాన్ని అన్వేషిస్తున్నప్పుడు వారిని రక్షించేందుకు అవి దేహసంరక్షకులుగా కూడా పనిచేస్తాయి. అవసరమైతే, అవి ప్రాణాంతకమైన ద్రవాన్ని విడుదల చేసి, పిచికారుగా పనిచేసే ఒక ప్రత్యేక గ్రంథిని ఉపయోగిస్తూ రసాయనిక యుద్ధం చేస్తాయి.

సైనికుల సేవకు ఎలా ప్రతిఫలమివ్వబడుతుంది? వాటి దవడలు మరీ పెద్దవి గనుక, తమంతట తామే భుజించాలంటే ఆహారాన్ని నమలలేవు. కాబట్టి సైనికునికి ఆకలి అయినప్పుడు, వాడు పనివాని తలను తన మీసాలతో రుద్దుతాడు. “భోజనం పెట్టు!” అని దానర్థం. పనివాడు ఆహారాన్ని చూర్ణం చేసి సైనికుని నోటికి అందిస్తాడు.

పూర్తి అంధకారంగా ఉండే రాజగృహంలో పునరుత్పత్తిదారుల తెగ, అంటే రాజు రాణి నివసిస్తారు. చిన్నగా ఉండే రాజును పోలి చూస్తే రాణి చాలా భీకరాకారంలో ఉంటుంది. గ్రుడ్లతో ఉబ్బి ఉండే ఆమె ఉదరం దాని అద్భుతమైన పునరుత్పాదన సామర్థ్యాలకు రుజువు. అది రోజుకు 4,000 నుండి 10,000 గ్రుడ్లు పెట్టగలదని అంచనావేయబడింది. కొందరు రాణిని “గ్రుడ్లుపెట్టే ఆటోమాటిక్‌ యంత్రం” అని అనడంలో ఆశ్చర్యం లేదు.

అయితే రాజు, రాణుల దగ్గరికి పనివారగు చెదపురుగుల జట్టు వస్తూ ఉంటుంది గనుక వారికి ఏకాంతత లభించదు. వారు రాణి తక్షణ అవసరాలను తీర్చుతూ, ఆమెకు ఆహారాన్ని అందిస్తూ, ఆమె చుట్టూ ఉంటారు. గ్రుడ్లు పెడుతూ ఉంటే, పనివారు వాటిని తమ దవడల మధ్య పెట్టుకుని శిశువులను చూసుకునే గదిలోకి తీసుకువెళ్తారు.

మిత్రులా లేక శత్రువులా?

ఈ కీటకాలు ఆసక్తికరమైనవనే విషయాన్ని కొందరు నిరాకరిస్తుండగా, మరి కొందరు వాటిని ఇంకా క్రిములుగా—శత్రువులుగా భావిస్తారు! ఇన్‌వెర్టబ్రేట్‌ జూవోలజీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ది నేషనల్‌ మ్యూజియమ్‌ ఆఫ్‌ కెన్యా అధ్యక్షుడైన డా. రిచార్డ్‌ బాగిన్‌ తేజరిల్లు! తో ఈ విధంగా చెప్పాడు: “ప్రజలు చెదపురుగులను అతి వినాశక కీటకాలుగా దృష్టిస్తారన్నది నిజం. అయితే శాస్త్రజ్ఞులు చెదపురుగులను భిన్నంగా దృష్టిస్తారు. అడవుల్లో చెదపురుగులు మొక్కల మరియు జంతువుల సమాజానికి ఎంతో ఉపయోగకరమైనవి.

“మొదట, అవి చనిపోయిన మొక్కను చిన్న చిన్న ముక్కలుగా చేస్తాయి. ఈ విధంగా, చెదపురుగులు మొక్కలకు అవసరమైన పోషకాలను తిరిగి ఇస్తాయి. రెండవది, అవే ముఖ్యమైన ఆహార వనరులు. దాదాపు అన్ని జాతుల పక్షులు, అన్ని సస్తన జీవులు, సరీసృపాలు ఉభయచరజీవులు మరియు ఇతర కీటకాలు వాటిని తింటాయి. పడమటి మరియు ఉత్తర కెన్యాలోని చాలామంది ప్రజలు కూడా వాటి తియ్యదనాన్ని, చక్కని రుచిని ఇష్టపడతారు; వాటిలో క్రొవ్వు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. మూడు, అవి సారవంతమైన మట్టి తయారుకావడంలో సహాయపడతాయి. చెదపురుగులు తమ పుట్టలను కట్టుకునేటప్పుడు, బాగు చేసుకునేటప్పుడు అడుగునున్న మట్టిని పైనున్న మట్టిని కలియబెడతాయి. అవి చనిపోయిన మొక్కల పెద్ద భాగాలను చిన్న చిన్న తునకలుగా చేసి, ఎరువును తయారు చేస్తాయి. మట్టిలో అటు ఇటూ వెళ్తూ మొక్కల వేర్లకు అవసరమైన నీరు గాలి ప్రవేశించడానికి మార్గాన్ని చేస్తాయి. ఆ విధంగా చెదపురుగులు సారవంతమైన మట్టి అమరికను, నిర్మాణాన్ని, భూసారాన్ని మెరుగుపరుస్తాయి.”

అయితే, చెదపురుగులు మానవ నివాసస్థలాలను ఎందుకు ఆక్రమిస్తున్నాయి? డా. బాగిన్‌ ఈ విధంగా చెబుతున్నారు: “నిజానికి, ప్రజలే చెదపురుగుల నివాసస్థలాలకు వెళ్ళి, చెదపురుగులు ఉపయోగించే అనేక మొక్కలను లేకుండా చేశారు. చెదపురుగులు జీవించడానికి తినాలి, అవి సాధారణంగా చనిపోయిన మొక్కలను తింటాయి. వాటి నుండి వీటిని తీసివేసినప్పుడు, అవి ఇండ్లు, ధాన్యపు గిడ్డంగుల వంటి మానవ నిర్మితాలను తినివేస్తాయి.”

చెదపురుగు అప్పుడప్పుడు కీటకంగా కనిపించినప్పటికీ, ఇది నిజంగా మన శత్రువు కాదు. నిజానికి అది యెహోవా సృష్టి తేజస్సు యొక్క గొప్ప ఉదాహరణ. (కీర్తన 148:10, 13; రోమీయులు 1:20) దేవుని రానున్న నూతన లోకంలో, మానవుడు జంతువుల లోకంతో కలిసి జీవించడానికి నేర్చుకుంటాడు గనుక, అతడు చెదపురుగును శత్రువుగా గాక, మిత్రునిగా చూస్తాడనడంలో సందేహం లేదు.—యెషయా 65:25.

[20వ పేజీలోని చిత్రాలు]

ఒక కోటవంటి చెదపురుగుల పుట్ట

తూము మార్గము: పనిచేసే చెదపురుగులు

[21వ పేజీలోని చిత్రం]

తన పెద్ద తల మరియు ప్రాణాంతకమైన రసాయనాలను ఉత్పత్తిచేసే గ్రంథులతో

చెదల కాలనీలను రక్షించడానికి సిద్ధంగానున్న సైనిక చెదపురుగులు

[21వ పేజీలోని చిత్రం]

గ్రుడ్లతో ఉబ్బిన ఉదరం గల రాణి చెదపురుగు

[21వ పేజీలోని చిత్రం]

రాణి తన పనివాండ్ర బృందంతో

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి