కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 2/8 పేజీ 15
  • మహాతెలివిగల ఇంజనీర్లు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మహాతెలివిగల ఇంజనీర్లు
  • తేజరిల్లు!—1994
  • ఇలాంటి మరితర సమాచారం
  • చెదపురుగు—మిత్రువా లేక శత్రువా?
    తేజరిల్లు!—1995
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1997
  • విశిష్టమైన మాటర్‌హార్న్‌
    తేజరిల్లు!—1996
తేజరిల్లు!—1994
g94 2/8 పేజీ 15

మహాతెలివిగల ఇంజనీర్లు

దక్షిణాఫ్రికాలోని తేజరిల్లు! ప్రతినిధి

ఈ పేజీలో చూపబడినటువంటి ప్రకృతి రూపాలను మీరెప్పుడైనా చూశారా? ఆఫ్రికా మైదానాల్లో చెదల పుట్టలు విరివిగా కనిపిస్తుంటాయి. కొన్ని సన్నని పొగగొట్టం ఆకారంలో ఉండి, కొన్నిసార్లు దాదాపు 6 మీటర్లకంటే ఎక్కువ ఎత్తుంటాయి. సింహాలవంటి సంహారక జంతువులు పొంచివుండటానికి స్థావరాలుగా పనికివచ్చే మట్టి గోపురాల్లా కొన్ని ఉంటాయి.

ప్రతి పుట్టలోను కొన్ని లక్షల చిన్న చెదలు నివసించే అనేక దారులు, గదులు ఉంటాయి. కొన్ని చెదలు తమ స్వంత బూజు తోటలను కలిగివుండి, అనావృష్టి సంవత్సరాల్లో కూడా వాటికి తగిన నీరు అందేలా చూసుకుంటాయి. అదెలా సాధ్యం? దక్షిణాఫ్రికాలోని కొన్ని ప్రాంతాలను 1930వ దశాబ్దంలో తీవ్ర అనావృష్టి నాశనం చేసినప్పుడు, ఒక సొరంగంలో ఒక వరుస పైకి, ఒక వరుస క్రిందికి వెళుతున్న రెండు చెదల బారులను భౌతికవాదియైన డా. యూజిన్‌ మోరా కనుగొన్నారు. ఆ చిన్న జీవులు దాదాపు 30 మీటర్ల లోతు వరకు రంధ్రం చేశాయి! అవి ఒక సహజమైన బావిని చేరాయి. ఆవిధంగా, అనావృష్టి కాలంలో కూడా అవి తమ బూజు తోటలను ఎలా తేమగా ఉంచుకున్నాయో మోరా కనుగొన్నారు.

కాలాహారి అనే తన పుస్తకంలో మైకెల్‌ మాన్‌ అలాంటి ఒక చెదల పుట్టను గురించి వివరిస్తూ, “ప్రపంచంలోని ఏ జంతువైనా ఇంతవరకు నిర్మించిన ఏ గూటి కంటే కూడా అది శ్రేష్ఠమైనదని భావించబడుతుంది. . . . అన్ని కూడా 100 శాతం తేమను కలిగి వుండటానికి, బూజుకు, చెదలకు రెంటికీ సరిపోయేలా తమ చుట్టూ 29 నుండి 31 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోటానికి ప్రయత్నిస్తాయి. . . . ప్రతి గూడు సానుకూలంగా, సంపూర్ణంగా చేయబడిన ఒక ఎయిర్‌ కండిషన్‌ విభాగంలా ఉంటుంది” అని అన్నాడు.

ఈ గూళ్లు ఎలా నిర్మింపబడతాయో ఇప్పుడు పరిశీలించండి. చెదలు ఒక్కో ఇసుక రేణువును మెరుగుపెట్టి, ఒకదానికొకటి అతుకు పెడతాయి. ఒక పుట్టను నిర్మించటానికి ఎన్ని లక్షల ఇసుక రేణువులు ఉపయోగించబడతాయో ఊహించండి! “మానవుడు ఈ భూమిపై నిర్మించిన అత్యున్నతమైన కట్టడాలు; ఐగుప్తు పిరమిడ్లు, లండను నందలి భూగర్భ రైలు మార్గం, న్యూయార్కులోని ఆకాశహర్మ్యాలు  . . . , వీటన్నిటినీ చెదల పనితనంతో పోలిస్తే, . . . పర్వతాలతో చీమల పుట్టలను పోల్చినట్లుంటుంది,” అని ది సోల్‌ ఆఫ్‌ ది వైట్‌ ఆన్ట్‌ అనే తన పుస్తకంలో మోరా వ్రాశాడు. ఆయనిలా కొనసాగించాడు: “పరిమాణాన్ని దృష్టిలోకి తీసుకుంటే, నలభై అడుగుల ఎత్తుండే చెదల గోపురంతో సమానమైన కట్టడాన్ని మానవుడు నిర్మించాలంటే మాట్టెర్‌హార్న్‌ [స్విట్జర్‌ల్యాండులోని 14,692 అడుగుల ఎత్తుగల ఒక పర్వతం] అంత ఎత్తైనదాన్ని నిర్మించవలసి వుంటుంది.”

కాని మనుష్యులకు చెదలవల్ల ఏం లాభం? ఒకటేమిటంటే, చెదలు కుళ్లిపోయిన ఆకులను తింటాయి గనుక చాలా చెత్తను నిర్మూలిస్తాయి. “అవి ఎండిన పదార్థాన్ని భూమిలోనికి లాక్కెళ్లడం ద్వారా అగ్ని ప్రమాదాన్ని అరికట్టడమేగాక, క్రిందవుండే నేలను సారవంతం కూడా చేస్తాయి,” అని కృగెర్‌ నేషనల్‌ పార్కులోనున్న ఒక సైన్‌బోర్డుపై వ్రాస్తుంది.

అల్పమైన చెదలు మహాతెలివిగల ఇంజినీర్లు అని పిలవబడటానికి యోగ్యమైనవేనని బహుశ మీరు కూడా అంగీకరిస్తారు! (g93 11/8)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి