కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 5/8 పేజీలు 25-27
  • మాట్రయాషకా—ఎంత చక్కటి బొమ్మ!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మాట్రయాషకా—ఎంత చక్కటి బొమ్మ!
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • తయారు చేయడం సుళువుకాదు
  • కాలం మార్పులు తెచ్చింది
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1996
  • రష్యాను పునఃదర్శించుట
    తేజరిల్లు!—1995
  • సుదీర్ఘ న్యాయ పోరాటంలో చివరికి గెలిచాం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—2001
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 5/8 పేజీలు 25-27

మాట్రయాషకా—ఎంత చక్కటి బొమ్మ!

రష్యానందలి తేజరిల్లు! విలేఖరి చెప్పినది

సందర్శిస్తున్న యాత్రికులు నన్ను చూసినవెంటనే, ఎంత ధర చెల్లించైనా సరే, నన్ను ఇంటికి తీసుకువెళ్లాలని చాలామంది నిశ్చయించుకున్నట్లు అనిపిస్తుంది. వాళ్లను నావైపుకు అంతగా ఆకర్షించినదేమిటో నాకు నిజంగా తెలియదు. అసలు, నా గురించి వాళ్లకు ఎక్కువగా తెలియదు. బహుశ విలాసంతో చేస్తారేమో. కాని నన్ను నేను పరిచయం చేసుకోనివ్వండి. నా పేరు మాట్రయాషకా, నేను ఎక్కడినుండి వచ్చానంటే—కాని మనం మొదటి నుండి ప్రారంభిద్దాము.

వాస్తవానికి, నేను ఎక్కడినుండి వచ్చానో లేక నా అసలు తల్లిదండ్రులెవరో నిజంగా ఎవరికీ తెలియదు. ఈ వృత్తాంతానికి రెండు కథనాలున్నాయి. పరస్పర సంబంధంగల అనేక భాగాలతో ఒక విశేషమైన బొమ్మగా జపానీయుల ద్వీపమైన హోన్‌షూపై నేను ఆవిర్భవించానని కొందరంటారు. హోన్‌షూ నుండి 19వ శతాబ్దాంతంలో, రష్యాదేశపు కళాపోషకుడైన సావా ఐ. మామోన్‌టోవ్‌ (1841-1918) అనే అతని భార్య రష్యాకు నన్ను తీసుకొని వచ్చిందని వారంటారు. మరోవైపు, కొంతమంది జపానీయులు చెప్పేదాని ప్రకారం, నన్ను విశేషమైన బొమ్మగా చేసే ఆలోచనను ఒక రష్యాదేశపు సన్యాసి జపానుకు తీసుకువచ్చాడు. కాని ఆ ఆలోచన ఎక్కడి నుండి వచ్చినప్పటికీ, రష్యాదేశపు శిల్పులకు అది నచ్చింది, దానితో మాట్రయాషకా జన్మించింది.

రష్యా 1880వ పడి ముగింపులో, తన ఆర్థిక వ్యవస్థను, సాంప్రదాయాన్ని అభివృద్ధి చేసుకుంటుండినది. అదే సమయంలో, రష్యాదేశస్థులు తమ జానపద సాంప్రదాయాన్ని కాపాడుకోవడంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. రష్యా సాంప్రదాయాన్ని పునరుద్ధరించే ఉద్దేశంతో మేధావివర్గం మామెన్‌టోవ్‌ పరిసరాల్లో, ఇల్యా ర్యేప్యిన్‌, విక్టర్‌ వస్‌న్యెట్‌సాఫ్‌, మిఖాయెల్‌ మ్రూబ్యేల్‌ వంటి ప్రఖ్యాతిగాంచిన రష్యాదేశ చిత్రకారుల పనులను సేకరించడం ప్రారంభించింది. రష్యాదేశ రైతాంగాన్ని కాపాడేందుకు, మాస్కో వద్ద కళా చిత్రశాలలు నిర్మించబడ్డాయి. అక్కడ, దేశం నలుమూలల నుండి జానపద వస్తువులు, ఆటవస్తువులు, బొమ్మలు సేకరించబడ్డాయి.

వృత్తిరీత్యా కళాకారుడైన సిరిగ్యే మాల్యుటిన్‌ నా మొదటి రూపురేఖలను గీశాడు, కాని అప్పుడు నేను కొంచెం భిన్నంగా కనిపించేదాన్ని. మెరిసే కళ్లతో గుండ్రని ముఖంగల పల్లెటూరి పిల్లను పోలి ఉండాలని నేను ఉద్దేశించబడ్డాను. నేను సారాఫాన్‌ (రెండు పట్టీలతో వ్రేలాడదీయబడిన చేతులులేని వస్త్రం) ధరించేదాన్ని, నాకు రంగురంగుల చుక్కల పట్టు ముసుగు క్రింద కనిపించకుండా జాగ్రత్తతో అమర్చిన మెత్తని మెరిసే వెండ్రుకలుండేవి. ఇతర బొమ్మలు అంటే నాకన్నా చిన్నగా ఉండే బొమ్మలు ఒకదానిలో ఒకటి పెట్టి నా లోపల ఉంచబడేవి. అవి కసవారాట్క (ఒకవైపు కట్టబడిన రష్యాదేశ జాకెట్లు), చొక్కాలు, పాడ్యాఫ్‌కలు (పురుషుల పొడవైన కోట్లు), ఏప్రన్‌ల వంటివి ధరించి ఉండేవి. మాల్యుటిన్‌ రూపురేఖలు బయల్పర్చేలా, మాస్కో నందు దాదాపు 1891లో నేను చేయబడినప్పుడు అలా ఉండేదాన్ని.

నేను తరచూ నా పేరు గురించి ఆశ్చర్యపోయేదాన్ని. రష్యాలో 19వ శతాబ్దాంతాన మట్ర్యాన్‌ (దాని చిన్న పేరు మాట్రయాషకా) అనేది ఆడవాళ్ల పేర్లలో చాలా ప్రజాదరణ పొందినదని నేను తెలుసుకున్నాను. మాట్రానా అనే లాటిన్‌ పదం నుండి తీసుకొనబడిన దీని భావం “తల్లి,” “గౌరవనీయమైన స్త్రీ,” లేక “కుటుంబం యొక్క తల్లి.” ఒక బొమ్మలో మరొకటి పెట్టడం కూడా ఫలదీకరణకు, శాశ్వతత్వానికి తగిన గుర్తు.

తయారు చేయడం సుళువుకాదు

నన్ను తయారుచేయాలనే ప్రయత్నాలలో, ప్రజలు ఎంతో సామాగ్రిని పాడుచేసుకుని చివరికి ఏమీ చేయలేక విడిచిపెట్టినట్లు తెలిసింది. ఇటీవలి కాలం వరకు, నన్ను ఎలా తయారు చేయాలో తెలుసుకోవడం రహస్యంగానే ఉందంటే అందులో ఆశ్చర్యంలేదు. కాబట్టి కేవలం కొంతమందే నన్ను సొంతం చేసుకోగల్గేవారు. కాని ఇప్పుడు నేను ఆ రహస్యాన్ని మీతో పంచుకుంటాను.

నన్ను తయారుచేయడంలో ఇమిడివున్న పనికి నిజమైన నైపుణ్యం అవసరం. మొదట, సరైన రకానికి చెందిన కొయ్యను ఎన్నుకోవడం ప్రాముఖ్యం. దాని మెత్తదనాన్ని బట్టి సాధారణంగా నిమ్మకొయ్య ఎంపిక చేసుకోబడుతుంది, అరుదుగా కొండరావిచెట్టు ఎంపిక చేసుకోబడుతుంది. సాధారణంగా శరత్‌ ఋతువు తొలిభాగంలో చెట్లు నరకబడిన తర్వాత, వాటి బెరడు చాలావరకు తీసివేయబడి, కొయ్య ఎండుతున్నప్పుడు పగుళ్లు రాకుండావుండేందుకు తగినంత బెరడు మాత్రం విడిచిపెట్టబడుతుంది. అవి ఎండుతుండగా సరైన గాలి ప్రసరణ ఉండేందుకు ఆ మొద్దులు చాలా సంవత్సరాల వరకు అలాగే కుప్పవేయబడి ఉంటాయి.

కొయ్యను కోయడం తగిన సమయంలో చేయవలసి ఉంటుంది, అంటే అది పూర్తిగా ఎండకముందు, మరీ పచ్చిగా లేనప్పుడు కోయాలి. సరిగ్గా తగిన సమయం ఏదో నిపుణుడు మాత్రమే నిర్ణయించగలడు. ప్రతి కొయ్యముక్క దాదాపు 15 వేరువేరు ప్రక్రియలకు లోనవుతుంది. ఈ పరంపరలలో అతి చిన్న బొమ్మ—వేరువేరు ముక్కలుగా వేరు చేయలేనిది—మొదట తయారుచేయబడుతుంది. కొన్నిసార్లు అది ఎంత చిన్నగా ఉంటుందంటే, దాన్ని చూడాలంటే మీ కళ్లు నొప్పి పుడతాయి లేదా స్పష్టంగా చూడడానికి భూతద్దం కూడా ఉపయోగించవలసి ఉంటుంది.

అతిచిన్న బొమ్మ తయారు చేయబడిన తర్వాత శిల్పి ఈ మొదటి బొమ్మ పట్టగలిగేంతటి మరో బొమ్మను చేయడం ప్రారంభిస్తాడు. ఒక కొయ్య ముక్కను అవసరమైనంత ఎత్తులో తీసుకొని, పైభాగం, క్రిందిబాగంగా కోయబడుతుంది. బొమ్మ క్రింది భాగం మొదట తయారుచేయబడుతుంది. చిన్న బొమ్మ చక్కగా అమిరేలా రెండవ బొమ్మ యొక్క రెండు భాగాలలో నుండి లోపలి కొయ్య తొలగించబడుతుంది. అయితే విషయమేమిటంటే, నైపుణ్యంగల శిల్పి కొలతలు తీసుకోవడం గురించి ఆసక్తి చూపడు కాని, పూర్తిగా అనుభవం మీద ఆధారపడతాడు. ఆ తర్వాత, అతడు ఆ మొదటి రెండు బొమ్మలు అమరేలా కొంచెం పెద్ద బొమ్మను చేయడానికి మళ్లీ అదే ప్రక్రియను కొనసాగిస్తాడు.

ఒకదానిలో ఒకటి అమరివుండే ఆ బొమ్మల సంఖ్య 2 నుండి 60 వరకు ఉంటుంది. అతిపెద్ద బొమ్మ, దాన్ని చేసే వ్యక్తి అంత పెద్దగా ఉండవచ్చు. ప్రతి బొమ్మ తయారైన తర్వాత, దానికి ఏవైనా గుంటలు ఉంటే పూడ్చేందుకు పల్చని జిగురుతో పూయబడుతుంది. చివరికి ఆరబెట్టడం ప్రారంభమౌతుంది, రంగులు వేసేవ్యక్తి రంగును సమంగా వేయగలిగేలా బొమ్మ పైభాగం పాలిష్‌ చేయబడుతుంది. ఆ తర్వాత బొమ్మకు దాని అసమానమైన ఆకృతి ఇవ్వబడుతుంది.

కాలం మార్పులు తెచ్చింది

ప్రజలు వయస్సు పెరుగుతుంటే మారుతుంటారు, నా విషయం కూడా అంతే అని చెప్పవచ్చు. మాట్రయాషకాను తయారుచేసే కళ క్రమంగా మాస్కో నుండి సమ్యానఫ్‌, పాల్కాఫ్‌స్కీ మైడన్‌, వీట్కా మరియు టవీర్‌ వంటివాటితోసహా ఇతర పట్టణాలకు, నగరాలకు వ్యాపించింది.a ప్రతి సమాజం తన స్వంత శైలిని, అలంకరణా విధానాన్ని వృద్ధి చేసుకుంది. నా నిజమైన ఉనికిని కోల్పోవడం కలత కల్గించేదిగానే ఉన్నప్పటికీ నేను ఫిర్యాదు చేయలేదు. మిఖాయేల్‌ కుటుజాఫ్‌ మరియు ఫ్రెంచ్‌ జనరల్‌ నెపోలియన్‌ బోనాపార్టేలను పోలిన బొమ్మల సెట్‌ చేయమని, 1812 యుద్ధ శతజయంతి ఉత్సవం సందర్భంలో ఒకరు ఆర్డరు చేశారు. ఈ ఇద్దరు జనరల్‌లవి పెద్ద బొమ్మలు, వారి వారి స్వంత కమాండర్ల బొమ్మలలో సరిపోయేలా యుద్ధంలో పాల్గొన్న వారివి వాటికంటే చిన్నబొమ్మలు చేయబడ్డాయి.

ఈ రకమైన బొమ్మలను తయారు చేయడం, అమ్మడం చాలాకాలం వరకు కచ్చితంగా అదుపుచేయబడింది. కాని 1980వ పడి ముగింపునందు రాజకీయ మార్పులు కళాకారులకు క్రొత్త సాధ్యతలను, స్వాతంత్ర్యాలను ఇచ్చాయి. వాళ్లు ఇప్పుడు తమ వస్తువులను భయంలేకుండా తయారుచేయవచ్చు, అమ్మవచ్చు.

స్యికార్స్‌కీ అనే పేరుగల చిత్రకారుని బొమ్మలు మొదటిగా ప్రజలలో పేరుపొందాయి. ఆయన బొమ్మలకు అత్యంత ఎక్కువ వెల ఉండేది, ఒక్కొక్క సెట్‌ ఖరీదు దాదాపు 3,000 డాలర్ల వరకు ఉండేది. అతని విజయం ఇతర కళాకారులను పురికొల్పింది, గత ఆరు సంవత్సరాల్లో, మాట్రయాషకాను తయారు చేయడానికి శక్తివంతమైన ప్రేరణ ఇవ్వబడింది.

ఒకదానిలో ఒకటి సరిపోయేలా తయారు చేయబడే అన్ని బొమ్మలకు ఇప్పుడు మాట్రయాషకా అనే నా పేరే వర్తించసాగింది. విభిన్న అంశాలు అంటే పువ్వులు, చర్చీలు, విగ్రహాలు, జానపద గాథలు, కుటుంబ ఇతివృత్తాలు, మతసంబంధ మరియు రాజకీయ నాయకులవి సహితం చిత్రించబడేవి. ఇప్పుడు లభ్యమౌతున్న విస్తృత శ్రేణుల సహాయం వల్ల నేను సరసమైన ధరకు లభిస్తున్నాను.

మాస్కోలో 1993 వసంతకాలంలో ఎప్పటిలానే నేను ఒక దుకాణం షోకేస్‌లో నిలబడివుండగా, నేను హఠాత్తుగా, సమీపిస్తున్న విదేశీ యాత్రికుల గుంపు యొక్క స్వరాలు విన్నాను. వాళ్లు, తాము హాజరౌతున్న యెహోవాసాక్షుల సమావేశం గురించి ఏదో చెప్పడం నేను విన్నాను, వాళ్లలో ప్రతి ఒక్కరు ఈ అద్భుతమైన సంఘటనకు జ్ఞాపకార్థంగా నన్ను వాళ్లతోపాటు తమ ఇంటికి తీసుకు వెళ్లాలని ఇష్టపడుతున్నారు. ఎందుకా అని ఆశ్చర్యపోతూ నేను వారివైపు రెప్పవాల్చకుండా చూశాను. నాకు సమాధానం చెప్పడానికేమో అన్నట్లుగా, వారిలో ఒకామె ఇలా చెప్పింది: “ఈ బొమ్మ కేవలం స్మృతిచిహ్నం మాత్రమే కాదు. నా స్నేహితులు దీని కళ్లను చూడాలని నేనిష్టపడుతున్నాను. బైబిలులో కనుగొనబడినట్లుగా రాజ్యం గురించి, దేవుని నామం గురించి నేను రష్యాదేశ ప్రజలతో మాట్లాడినప్పుడు వారి కళ్లలో కనిపించిన భావననే నేను వీటిలో చూస్తున్నాను.”

యెహోవాసాక్షులా? రాజ్యమా? దేవుని నామమా? బైబిలా? నేను వింటుంటే నా కళ్లు పెద్దవయ్యాయి, ప్రసన్నవదనులైన ఈ ప్రజలలో కొంతమంది వెంట దూర ప్రాంతాలకు వెళ్లాలనే ఆశనుబట్టి నా గుండె వేగంగా కొట్టుకుంది. బహుశ వాళ్లు రష్యాను సందర్శించడంలో అసలు ఉద్దేశం గురించి నేను మరింత తెలుసుకోగలుగుతాను. అది, మాట్రయాషకా అనే పేరుగల బొమ్మనైన నన్ను కలవడం కంటే ఎక్కువే అయివుంటుందని నాకు కచ్చితంగా తెలుసు.

[అధస్సూచీలు]

a పందొమ్మిదివందల ముప్పయవ పడిలో, వీట్కా కిరోవ్‌ అని, టవీర్‌ కాలినిన్‌ అని పిలువబడసాగాయి. సోవియట్‌ యూనియన్‌ విభాగింపబడినప్పటి నుండి, అసలు పేర్లు పునరుద్ధరించబడ్డాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి