కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 5/8 పేజీలు 23-24
  • జీవితార్థం ఏమిటి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జీవితార్థం ఏమిటి?
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “ప్రాథమిక ప్రేరణాశక్తి”
  • యేసుచే దృఢపరచబడిన సొలొమోను ఆవిష్కరణ
  • జీవితార్థాన్ని కనుగొనుట
  • “మానవకోటికి ఇదియే విధి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • మీ జీవితం—దాని సంకల్పమేమిటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • జీవితం ఎలా సార్థకమౌతుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • జీవితానికొక సంకల్పమున్నదా?
    జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 5/8 పేజీలు 23-24

బైబిలు ఉద్దేశము

జీవితార్థం ఏమిటి?

“ప్రకృతి వరణం అనేది సేంద్రియ జీవాన్ని గూర్చిన సముచితమైన వివరణ అని డార్విన్‌ సిద్ధాంతికులు వాదిస్తారు. ఒక జీవి గొప్ప క్లిష్టత, ఆత్మచేతన మరియు వివేకం గలదిగా వృద్ధి చెందితే, ఆ లక్షణాలు కోరదగినవంటే, దానికి లోకజ్ఞానం అవసరం కావచ్చు.”—డిలన్‌ థామస్‌ (1914-53, వేల్సుజాతీయుడైన కవి, రచయిత).

జీవితార్థం కొరకైన అన్వేషణ క్రొత్తదేమి కాదు. అది శతాబ్దాలుగా ఆసక్తిగల వారి మనస్సులను ఆక్రమించుకొని ఉంది. అది న్యూజీలాండ్‌ దేశస్థుల మనస్సులలో పది సంవత్సరాల క్రితం కంటే నేడు ఎక్కువగా ఉందని ఇటీవల జరిగిన అభిప్రాయ సేకరణ చూపిస్తుంది. పదిహేడేండ్ల వయస్సుగలవారు మరియు అంతకంటే ఎక్కువ సంవత్సరాల వయస్సుగల జనాబాలోని 49 శాతంమంది “తరచూ జీవితార్థాన్ని గూర్చి తలంచారని” లిసనర్‌నందు ప్రచురించబడిన నివేదిక చెబుతుంది, ఇది, అలాంటి సర్వే 1985లో నిర్వహించబడినప్పటి కంటే 32 శాతం పెరుగుదల.

న్యూజీలాండ్‌ దేశస్థులు ఇతర దేశాల ప్రజలతో పంచుకొన్న భావాలను వ్యక్తపరుస్తున్నట్లుంది. లిసనర్‌ ఇలా కొనసాగించింది: “మన ఉనికిని గూర్చిన ప్రాముఖ్యతను ప్రశ్నించే దృక్పథం పెరగడం, మనం 80వ పడిలోకంటే, ఇప్పుడు మరింత చింతకలిగి ఉన్నామని, గైకొనవలసిన సరైన చర్య గురించి ఎక్కువ కచ్చితంగా లేమని సూచిస్తుంది.”

సాక్ష్యాధారంగా, మనమిక్కడ ఎందుకు ఉన్నాము? అనే విశ్వవ్యాప్త ప్రశ్నకు పరిణామ సిద్ధాంతికులు అందజేసిన సమాధానాలు అత్యధికులైన ప్రజలకు సంతృప్తికరంగా లేవు. ఒకరు తమ జీవితంలోని అర్థాన్ని తెలుసుకోవడానికి అవసరమైన నైతిక మార్గనిర్దేశాన్ని బైబిలు అందించగలదా?

“ప్రాథమిక ప్రేరణాశక్తి”

భూమిపైనున్న జీవరాసంతటిలో, కేవలం మనిషి మాత్రమే జీవిత సంకల్పం గురించి ఆలోచిస్తాడు. ఎందుకో మీకు తెలుసా? ప్రసంగి 3:11 నందు బైబిలు ఒక కారణం తెలియజేస్తుంది. సృష్టికర్త గురించి అది ఇలా చెబుతుంది: “భూత భవిష్యత్‌ కాలాలను గూర్చిన జ్ఞానాన్ని ఆయన మానవులకిచ్చాడు.” (ద న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌) జీవరాసులన్ని జీవాన్ని అంటిపెట్టుకొని ఉండాలని కోరుకున్నప్పటికీ, భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాలను గూర్చిన భావన కలిగివుండడంలో మనిషి విశేషమైనవాడన్నట్లుగా ఉంది. మనిషి గతం గురించి ధ్యానించగలడు, భవిష్యత్తు కొరకు ఎదురు చూడగలడు, అవును, దానిలో భాగంవహించాలనే బలమైన కోరికతో దాని గురించి పథకం వేసుకోగలడు. అతని స్వల్ప జీవితాయుష్షు యొక్క అశాశ్వతత్వాన్ని బట్టి భవిష్యత్తును గూర్చిన తన కలలు వాస్తవం కానప్పుడు అతడు వ్యధచెందగలడు.

అందుకే మనిషి మాత్రమే, నేనిక్కడెందుకున్నాను? నేనెక్కడికి వెళ్తున్నాను? అనే ప్రశ్నలు అడుగుతాడు. మానసిక రోగ చికిత్సకుడైన విక్టార్‌ ఫ్రాంక్లౌ ఇలా వ్రాశాడు: “ఒకరి జీవితంలోని అర్థాన్ని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే మనిషిలోని ప్రాథమికమైన ప్రేరణాశక్తి. . . . జీవితానికి అర్థం ఉందనే జ్ఞానమే హీనమైన పరిస్థితులను కూడా ఎదుర్కోవడానికి ఒకరికి ఎంతో ప్రభావవంతంగా సహాయం చేస్తుంది అంతకు మించి మరొకటి ఏదీ ప్రపంచంలో లేదని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను.”

యేసుచే దృఢపరచబడిన సొలొమోను ఆవిష్కరణ

జీవితార్థాన్ని తెలుసుకోవాలనే అవసరత పూర్వికులకు ఆసక్తిని రేకెత్తించింది. మనం సొలొమోను పరిపాలన క్రిందనున్న ఇశ్రాయేలు రాజ్యానికి, అంటే చరిత్ర పుటలను మూడు వేల సంవత్సరాలు వెనక్కి త్రిప్పుదాము. ఆయన గురించి షేబారాణి ఇలా చెప్పింది: “నీ కార్యములనుగూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే; అయినను నేను వచ్చి కన్నులార చూడకమునుపు ఆ మాటలను నమ్మకయుంటిని; ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని యిప్పుడు నేను తెలిసికొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినినదానిని బహుగా మించియున్నవి.”—1 రాజులు 10:6, 7.

బైబిలు పుస్తకమైన ప్రసంగిని వ్రాయడంలో, జీవిత సంకల్పాన్ని తెలుసుకోవడానికి తాను చేసిన ప్రయోగం యొక్క ఫలితాలను రాజైన సొలొమోను తన చదువరులకు తెలియజేశాడు. అది, ప్రాచీన తూర్పు దేశాల విలక్షణమైన రాజుకు సరిపోయేలాంటి జీవితాన్ని అనుభవించే అవకాశాలలో జరిపిన ప్రయోగం. రెండవ అధ్యాయం 1-10 వచనాలలో, నేడు ఊహించడానికి కూడా కష్టమైన విలాసవంతమైన జీవితాన్ని ఆయన వర్ణించాడు. జీవితం అనుగ్రహించిన వస్తుదాయక సంపదలు, శారీరక ఆనందాలన్నిటినీ ఆయన అనుభవించాడు. అలాంటి అన్వేషణల అర్థాన్ని గూర్చిన అతని అంచనా ఏమిటి? ఆయన సమాధానం ఆత్మవిశ్వాసం అతిగా గలవారిని జడిపించాలి.

ఆయన ఈ విషయాలన్నిటిని సింహావలోకనం చేసుకున్నప్పుడు, ఆయన తీర్పు తరచూ ప్రతికూలమైనదిగా ఉండేది. అవి నిరర్థకం, సమయాన్ని వ్యర్థం చేసినట్లే. ఆయనిలా వ్రాశాడు: “అప్పుడు నేను చేసిన పనులన్నియు, వాటికొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నియు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను, సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను.”—ప్రసంగి 2:11.

అత్యంత అనుకూలమైన పరిస్థితులలో, భూసంబంధమైన ఆనందాలు కేవలం తాత్కాలికమైన ఆనందాన్నే తెస్తాయని ఆయన తేల్చిచెప్పాడు. మానవ జ్ఞానం కూడా జీవిత బాధ, చింత నుండి మనిషిని తప్పించలేదు.

వస్తుదాయక సంపదను గూర్చి అతిశ్రద్ధగల ఒక వ్యక్తికి జవాబు ఇస్తూ యేసుక్రీస్తు, వింటున్న సమూహానికి ఇలా చెప్పాడు: “మీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు.”—లూకా 12:15.

అనుదిన జీవితంలోని మానవ అశక్తతను యెహోవా దేవుడు మాత్రమే పూర్తిగా తీసివేసి, మానవుని చర్యలకు జ్ఞానయుక్తమైన సంకల్పాన్నివ్వగలడు. కాబట్టి దేవుడు లేకుండా జీవితం వ్యర్థము. ప్రసంగి 12:13లో వ్రాయబడివున్నట్లుగా సొలొమోను ఇలా వివరించాడు: “ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.”

జీవితార్థాన్ని కనుగొనుట

జీవితార్థాన్ని దేవునియందలి భయం నుండి వేరుచేయలేమనే సొలొమోను నిర్ణయాన్ని యేసుక్రీస్తు పదేపదే ధృవీకరించాడు. దేవుని వాక్యాన్ని ఉదాహరిస్తూ, యేసు ఇలా చెప్పాడు: “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్నది.” (మత్తయి 4:4; ద్వితీయోపదేశకాండము 8:3) నిజమే, ఒకరి జీవితం సంపూర్ణం కావాలంటే, ఆత్మీయాంశాలు నిర్లక్ష్యం చేయబడకూడదు. తన గురించి, యేసు ఇంకా ఇలా చెప్పాడు: “నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.” (యోహాను 4:34) తన పరలోక తండ్రిని విధేయతతో సేవించడం ఆయన ఆనందానికి, సంతృప్తికి మూలమై ఉంది. అది ఆయనను పోషించింది. అది ఆయన జీవితానికి సంకల్పాన్నిచ్చింది.

కాబట్టి దేవుడు లేకుండా జీవితం సంపూర్ణం కాగలదా? కాలేదు! ఆసక్తికరంగా, అర్‌నాల్డ్‌ టాయిన్‌బీ అనే చరిత్రకారుడు ఒకసారిలా వ్రాశాడు: “మానవుని అసలు సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఈ ఆత్మలన్నిటికీ సహాయం చేసేందుకు, అది చేరగలిగినన్ని ఆత్మలకు దాని సారాంశమైన ఆత్మీయ ఉపదేశాలను, సత్యాలను వ్యాప్తిచేయడమే ఒక ఉన్నతమైన మతం యొక్క నిజమైన సంకల్పం. దేవున్ని మహిమపర్చడం, ఆయనయందు నిరంతరం ఆనందించడం మానవుని నిజమైన సంకల్పం.” ప్రవక్తయైన మలాకీ దేవుని దృష్టిని ఇలా వ్యక్తపర్చాడు: “అప్పుడు నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించువారెవరో ఆయనను సేవించనివారెవరో మీరు తిరిగి కనుగొందురు.”—మలాకీ 3:18.

[23వ పేజీలోని చిత్రం]

రాడిన్‌ చేసిన “ద థింకర్‌”

[క్రెడిట్‌ లైను]

Scala/Art Resource, N.Y.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి