కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 5/8 పేజీలు 12-14
  • సర్పి—దాని నొప్పిని తాళుకొనుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సర్పి—దాని నొప్పిని తాళుకొనుట
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కారణాలు, వ్యాప్తి, వ్యాధి గమనము
  • చికిత్స
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1996
  • ఇక ఎన్నడూ ఉండని నొప్పి
    తేజరిల్లు!—1994
  • నొప్పికి చికిత్సచేయడంలో పురోభివృద్ధి
    తేజరిల్లు!—1994
  • మీరు వెన్నునొప్పితో బాధపడుతున్నారా?
    తేజరిల్లు!—1994
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 5/8 పేజీలు 12-14

సర్పి—దాని నొప్పిని తాళుకొనుట

“నా కన్ను వెనకభాగంలో కలుగుతున్న తీవ్రమైన నొప్పి నన్ను భయపెట్టింది, మెదడు వాపు పెరుగుతుందేమోనని నేను బాధపడ్డాను” అని ఏన్‌ గుర్తుచేసుకుంటుంది.

“నా కడుపులో ఓ ప్రక్కన ఎన్నడూ అనుభవించని అలాంటి నొప్పితో నేను లేచినప్పుడు, అది అపెండిసైటిస్‌ అని నేననుకున్నాను” అని జేన్‌ జ్ఞాపకం చేసుకుంటుంది.

“నాకు ముందు ఎర్రని పొక్కులుండేవి, కాని ఇది మాత్రం చర్మం క్రింద ఎందుకింతగా బాధిస్తుందని నేను ఆశ్చర్యపోయాను” అని దిలీప్‌ చెబుతున్నాడు.

సర్పి అంటే కచ్చితంగా ఏమిటి? ఈ వ్యాధికి సామాన్యులు వాడే పదం సాక్ష్యాధారంగా, “నడికట్టు” అనే భావంగల కింగూలమ్‌ అనే లాటిన్‌ పదం నుండి తీసుకొనబడిన సేంగిల్స్‌ అనే పాతపదం (“నడుముకొలత” లేక “బెల్టు” అని భావం) నుండి వస్తుంది. కాబట్టి, ఇంటిపైకప్పు కొరకు వాడే కొయ్య పలకతో దీనికి సంబంధమేమి లేదు.

వైద్యపరంగా, హెర్పెస్‌ జొస్టర్‌ అని పిలువబడుతుంది. (హెరో అనే పదం నుండి వచ్చిన హెర్పెస్‌ అనే గ్రీకు పదానికి “ప్రాకుట” అని భావం, జొస్టర్‌ అనే గ్రీకుపదానికి “నడికట్టు” అని భావం) ఆ పేరుకు తగినట్లుగానే, సర్పిని కలిగించే హెర్పెస్‌ సూక్ష్మక్రిమి జ్ఞాన నాడుల వెంబడి రహస్యంగా ప్రాకుతూ, దాని సర్పాకార జాడతో వేదనకరమైన విస్ఫోటాలు కలుగజేస్తూ అది తరచూ శరీరానికి చుట్టుకుంటుంది. మంటపుట్టించే నాడి యొక్క బాధాకరమైన నొప్పి తరచూ వేదనకరంగా ఉంటుంది, అందుకే కొందరు వైద్యులు “తీవ్రమైన నొప్పి” అనే పదాన్ని ఉపయోగిస్తారు.

జ్వరం, చలి, ఆయాసం వంటి తొలి రోగలక్షణాలు తరచూ ఫ్లూ వలె అనిపించవచ్చు, కాని గుండెపోటు, మెదడు వాపు, లేక మరితర అపాయకరమైన పరిస్థితి అని కూడా పొరపాటుపడవచ్చు. సర్పితో బాధపడే వ్యక్తికి తిమ్మిరి, పైపైన కలిగే జిల, తీవ్రమైన మంట లేక దురద పెడుతున్నట్లుండడం, వేదనకరమైన నొప్పి అంతకంతకు పెరగడం అతి సాధారణ లక్షణాలు.

రోగలక్షణాలు కనిపించిన ఒక వారంలో, సాధారణంగా నడుంపైన మరియు శరీరం యొక్క ఒకవైపున మాత్రమే జ్ఞాన నాడీ మండలం పొడుగునా దురద కలుగజేసే ఎర్రని మొటిమలు ఒకే వెడల్పులో కనిపిస్తాయి. ఏ నాడీ గ్రంథులకు సోకిందో దాన్ని బట్టి ప్రక్కటెముకల గూడు, నడుము, ఛాతీ, మెడ, నొసలు, లేక కళ్లు వంటి ప్రత్యేకమైన స్థలాల్లో వస్తుంది. పొక్కులు త్వరలోనే బొబ్బలుగా, లేక నీటి పొక్కులుగా విస్తరించి, మోసకరంగా విషపూరితమైన ఒక తీగ మొక్కలా కనిపిస్తుంది. ఒక పది రోజులలోపు ఇవి పొక్కుకట్టి రాలిపోవడం మొదలుపెడతాయి, అనేక సందర్భాల్లో సర్పి వచ్చిందనేదానికి గుర్తుగా మచ్చలు, వదలని నొప్పి మిగిలిపోతాయి.

కారణాలు, వ్యాప్తి, వ్యాధి గమనము

సర్పి ఒకరికి ఎలా వస్తుంది? రోగి తనకు తానే ఈ రోగం వచ్చేలా చేసుకుంటాడు. సర్పి కలుగజేసే హెర్పెస్‌ సూక్ష్మక్రిమి (వేరిసెల్లా జొస్టర్‌) మరియు మశూచీని కలుగజేసే విపరీతమైన సోకేస్వభావం గల సూక్ష్మక్రిమి ఒకటేనని వైద్య పరిశోధకులు కచ్చితంగా నిర్ధారించారు. సర్పి ఉన్న వ్యక్తి ద్వారా మరొకరికి (సాధారణంగా పిల్లలకు) మశూచి ఎందుకు వస్తుందో ఇది వివరిస్తుంది. అయితే, ఎవరికైనా సర్పి వచ్చిందంటే మొదట వారికి మశూచి వచ్చివుండాలి.

సాధారణంగా బాల్యదశారంభంలో, మశూచి వచ్చి తగ్గిన తర్వాత వ్యాధినిరోధక వ్యవస్థ వేరిసెల్లా-జొస్టర్‌ సూక్ష్మక్రిమిని శరీరం నుండి పూర్తిగా వెళ్లిపోయేలా చేయదు. అది మూల నాడీ కేంద్రానికి (ఇది కశేరు లేక కపాల ప్రాంతమై ఉండవచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు) ప్రయాణించి, తరచూ అనేక సంవత్సరాల తర్వాత వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనమైనప్పుడు దాడి చేయడానికి అనుకూలమైన పరిస్థితులేర్పడే వరకు నిద్రాణగా ఉంటుంది.

దాదాపు సామాన్య ప్రజలలోని 10 నుండి 20 శాతం మందికి వారి జీవితంలో ఏదొక సమయంలో ఈ సర్పి వస్తుంది, అయితే 50 ఏళ్లు దాటిన వారికి అది వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు 85 ఏళ్లను చేరుతున్నవారిలో దాదాపు సగం మందికి ఈ వ్యాధి వచ్చిందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యాధికి స్త్రీలు పురుషులు సమానంగా గురవుతున్నారు. వ్యాధి మళ్లీ రాగలదు, కాని కేవలం 2 నుండి 4 శాతం మందికి మాత్రమే మళ్లీ వస్తుందని తెలుసుకోవడం కొంత ఓదార్పుకరంగా ఉంటుంది.

తీవ్రమైన అస్వస్థతకు, అసాధారణమైన ఒత్తిడికి, సుదీర్ఘమైన అలసట, లేక జీవితంలో ఇతర దేహరోగ స్థితిని ఎదుర్కొన్న సమయం తర్వాత తరచూ సర్పి వస్తుంది. కెమోథెరపీ, రేడియేషన్‌ చికిత్స, లేక రోగనిరోధక వ్యవస్థకు ప్రమాదం కలుగజేసే లేక బలహీనపర్చే ఇతర విధానాల తర్వాత అది రావచ్చు. మశూచిని కలుగజేసే సూక్ష్మక్రిమి చేసిన ఈ రెండవ దాడివల్ల, మళ్లీ మశూచి కాదుగాని, మశూచివంటి సాధారణ లక్షణాలు కొన్ని ఉన్న సర్పి వస్తుంది. ఈ లక్షణాలలో పొక్కులు, బొబ్బలు, పుండ్లు అనే దశలు చేరివుంటాయి, అయినప్పటికీ సర్పి వేరే ఒక వ్యాధి.

సర్పి ఎంత అపాయకరమైనది, అది ఎంతకాలం ఉంటుంది? సర్పి చాలా బాధకరమైనదైనప్పటికీ, ఎంతో అరుదుగా మాత్రమే అది ప్రాణాపాయకరమైనది. కాని ఒకసారి అది మీకు వచ్చిందంటే, సూక్ష్మక్రిమివల్ల వచ్చే అంటురోగాన్ని తట్టుకొనేలా శరీరం బలపడేవరకు కొన్నివారాలపాటు తీవ్రమైన నొప్పిని సహించేందుకు సిద్ధంగా ఉండండి. అనేక సందర్భాల్లో ఈ వ్యాధి తగ్గడానికి ఏడు నుండి పది రోజుల కాలపరిమితి పట్టినప్పటికీ, పొక్కులు మానడానికి దాదాపు నాలుగు వారాలు పట్టవచ్చు. సర్పి రోగులకు పొక్కులు తగ్గిపోయిన తర్వాత పోస్ట్‌హెర్పెటిక్‌ న్యూరాల్జియా అని పిలువబడే నరాల నొప్పి అనేక వారాల వరకు, కొన్నిసార్లు నెలల తరబడి ఉండడం అసాధారణమేమికాదు.

ఒకవేళ ఈ వ్యాధి కంటికి సోకితే, అది కనుదృష్టిపై తీవ్రమైన ప్రభావం కలుగజేసి, గ్రుడ్డితనం కలిగించగలదు. గనుక ముఖంపై వ్యాధి సోకితే, వెంటనే నేత్రవైద్య నిపుణున్ని కలవడం మంచిది. తొలిదశలోనే వైద్యం చేయించుకోవడం తరచూ తీవ్రమైన నేత్రసంబంధ సమస్యలేర్పడడాన్ని నివారిస్తుంది.

చికిత్స

సర్పిని సమర్థవంతంగా చికిత్స చేసేందుకు ఏమి చేయవచ్చు? ప్రాచీన కాలం నుండి నేటి వరకు అనేక మందులు ప్రయత్నించబడినప్పటికీ, వ్యాధి అది ఉండేంత కాలం ఉండి వెళ్లిపోయేవరకు నొప్పిని తగ్గించడం, కలిగే పర్యవసానాలను కొంతమేరకు నయంచేయడం కంటే మరెక్కువ చికిత్సా విధానాలను వైద్యశాస్త్రం ఇంకా కనుగొనవలసి ఉందన్నది నిష్కపటమైన సమాధానం.

అనేక హెర్పెస్‌ అంటురోగాలకు చికిత్స చేయడంలో రోగనిరోధక మందుల ఉపయోగాన్ని గూర్చి ఇటీవల చేసిన పరిశోధన, సర్పికి చికిత్స చేయడంలో కొన్ని అభయాన్నిచ్చే వాగ్దానపూర్వక ఫలితాలను ఉత్పన్నం చేసింది. ఉదాహరణకు, ఏసైక్లోవిర్‌ ఒక వైద్యం కాకపోయినప్పటికీ, సూక్ష్మజీవులు తిరిగి ఉత్పన్నం కావడాన్ని తగ్గిస్తుంది, కొంతమంది రోగులలో నొప్పిని, వ్యాధి ఉండే కాల వ్యవధిని తగ్గించగలుగుతుంది. మంచి ఫలితాల కొరకు వైద్యం త్వరగా ప్రారంభించాలని పరిశోధకులు చెబుతారు.

యూనివర్సిటి ఆఫ్‌ కోలోరాడో స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌నందలి ఒక అధ్యయనంలో, ఒక రోజుకు ఐదుసార్లు 800 మిల్లీ గ్రాముల వరకు ఏసైక్లోవిర్‌ను నోటి ద్వారా తీసుకున్న సర్పి వ్యాధిగ్రస్తులకు, ప్లాసిబోలు తీసుకున్న వారికంటే చాలాతక్కువ హాని కలుగుతుంది, పొక్కులు, నొప్పి తక్కువగా ఉంటాయి. పోస్ట్‌హెర్పెటిక్‌ న్యూరాల్జియా తీక్షణతను తగ్గించడానికి ఏసైక్లోవిర్‌ సహాయపడుతుందా అనే విషయంలో పరిశోధకులు ఏకాభిప్రాయానికి రావడం లేదు. సర్పికి చికిత్స చేయడంలో విడారాబీన్‌ అనే మరో రోగనిరోధక మందు కొంత విజయం సాధించింది. ఒక టీకా మందుపై పరిశోధన జరుగుతున్నది, కాని అది ఇంకా పరిశోధనా స్థాయిల్లోనే ఉంది.

నొప్పి మరీ అంత వదలకుండా ఉండకపోతే దాన్ని మరింత సహించుకోవచ్చునని సర్పి వచ్చిన అనేకులు చెబుతారు. రోగికి మానసికంగా అలాగే శారీరకంగా నిస్సత్తువ కలిగేలాచేస్తూ, ఆ నొప్పి రాత్రింబవళ్లు పీడిస్తుంది.

రోగికి నొప్పి ఎక్కువగా ఉన్న ఆ రోజుల్లో, వైద్యులు కొన్ని రోజుల వరకు శక్తివంతమైన నొప్పి నిరోధకాలను ఇవ్వాలని చూస్తారు, అయితే దీనికి కోరదగని ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. రోగి ఓర్చుకొనగలిగితే, తడి గుడ్డతో తేమను ప్రయోగించడం హాయిగొల్పేలా ఉంటుంది. ఒక శాతం సిల్వర్‌ సల్ఫడైజిన్‌గల క్రీమును రోజులో అనేకసార్లు పైన పూయడం కొందరికి సహాయకరంగా ఉంటుంది. పొక్కులను అలాగే ఉంచండి; వాటిని గోకకండి లేక వాటిపైన పట్టీ వేయకండి.

పొక్కులు క్రమేణా తగ్గిపోతాయి, కాని అనేకమంది రోగులకు సర్పి రెండవసారి వచ్చినప్పుడు నొప్పి ఏ మాత్రం తక్కువ ఉండదు. పోస్ట్‌హెర్పెటిక్‌ న్యూరాల్జియా ప్రభావం చూపడం ప్రారంభించగానే, ప్రాముఖ్యంగా వృద్ధులకు, సరైన రోగనిరోధక సామర్థ్యంలేని రోగులకు నిస్సత్తువ కలుగుతుంది. బాధాకరమైన, తీక్షణమైన ఈ నొప్పిని ఓర్చుకోవడం కష్టం. వినాళ గ్రంథులు ఉత్పత్తి చేసిన హార్మోనులను ప్రయత్నించి చూశారు, కాని ఈ శక్తివంతమైన మందుల ప్రభావం, భద్రతకు సంబంధించినంత మేరకు వైద్య వివరణ ఒక ముగింపుకు రాలేక పోతున్నది. నొప్పి ఎక్కువ సమయం ఉన్నట్లయితే వైద్యులు కొన్నిసార్లు ఒత్తిడిని నిరోధించే ఆమిట్రిప్టిలైన్‌ను సిఫారసు చేస్తారు, కాని ఇది కూడా, ప్రాముఖ్యంగా ఎక్కువకాలం ఉపయోగించినట్లయితే, సమస్యను అధికం చేయగలదు.

ఆశ్చర్యకరంగా, కారం పొడి తయారుచేసేందుకు ఉపయోగించే ఎండు మిరపకాయల నుండి వచ్చే క్యాప్‌సాసిన్‌ గల లేపనం ద్వారా నొప్పి నివారణలో చాలామంచి ఫలితాలు సాధించబడ్డాయి. కాని పగిలిన పొక్కులు మానిపోయే వరకు దీన్ని రాయకూడదు. ప్రారంభంలో చెప్పబడిన జేన్‌, తీవ్రమైన సర్పితో పోరాడుతుండగా, కొన్ని వారాలపాటు రాత్రి పగలు టెన్స్‌ (ట్రాన్స్‌క్యుటేన్యస్‌ ఎలక్ట్రికల్‌ నర్వ్‌ స్టిమ్యులేషన్‌) అనే ఒక పరికరాన్ని ఉపయోగించడం ద్వారా ఉపశమనాన్ని పొందింది. స్వల్ప విద్యుత్‌ ప్రేరణలు అంతర్గతంగా ఉన్న తీవ్రమైన నొప్పిని తగ్గించి, ఆమె స్వేచ్ఛగా కదిలేందుకు అవకాశమిచ్చాయి.

గృహ వైద్యచిట్కాల పట్టిక పెద్దదే, అందులో అనేకం విటమిన్‌ బి, సి, ఎల్‌ లైసిన్‌ వంటి ప్రత్యామ్నాయాలతో సహా మంచి ఆహార నియమానికి (ఆర్జనీన్‌ తక్కువగావున్న) సంబంధించినవి. ఆపిల్‌ సీడార్‌ వినెగర్‌ను పైనరాయడం వల్ల ప్రయోజనాలున్నాయని కొందరంటారు; చర్మ దద్దుర్లను మాన్పుకోవడానికి ఇతరులు విటమిన్‌ ఇ వాడతారు.

మీకు సర్పి వస్తే, త్వరలోనే మీ సమీప, దూర స్నేహితులు తమకు ఇష్టమైన గృహ వైద్యచిట్కాలను మీకు స్వచ్ఛందంగా పంపించే అవకాశం ఉంది. కొన్ని సలహాలు సహాయపడవచ్చు, అనేకం సహాయం చేయవు. మీరు బాధలో ఉండగా వారు మీకు చిరునవ్వు తెప్పించవచ్చు. కనీసం మీ స్నేహితులు శ్రద్ధను చూపించారని తెలుసుకోవడం వారి చికిత్సలకంటే ఎంతో బాగా పనిచేయగలదు.

కాబట్టి సర్పిని తాళుకోవడంలో, దాడిని తీవ్రతరం కాకుండా చేసేందుకు, నొప్పిని తగ్గించేందుకు రోగి, అతని వైద్యుడు కొన్ని పనులు చేయగలుగుతారు. కాని మీ వైద్యుడు, “మీకు సర్పి ఉన్నట్లు అనిపిస్తుంది” అని చెబితే, సృష్టికర్త మన శరీరంలోకి జొప్పించిన రోగనిరోధకాలు రోగాన్ని అదుపు చేసేవరకు ఓర్పు, సహనం కలిగి ఉండేందుకు ప్రయత్నించడం మంచిది గనుక ఆయన అలా చెప్పవచ్చు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి