నొప్పికి చికిత్సచేయడంలో పురోభివృద్ధి
ఇటీవల కాలం వరకు కొంతమంది వైద్యులు నొప్పిని గూర్చి ఎంత ఎక్కువ తెలుసుకున్నా, ఇంకా చాలామందికి ఇప్పటికీ తెలియదు. ఇంటర్నేషనల్ పెయిన్ ఫౌండేషన్ మాజీ అధ్యక్షుడైన డా. జాన్ లెబెస్కిన్డ్ కొన్ని సంవత్సరాల క్రిందట ఇలా గమనించాడు: “నొప్పికి సంబంధించిన సమస్యలను నిర్థారించడానికి, చికిత్సచేయడానికి విద్యార్థులకు బోధించడంలో నాలుగు సంవత్సరాలలో నాలుగు గంటలకు మించి బోధించిన ఒక్క వైద్య పాఠశాలైనా ప్రపంచమందున్నదని నేననుకోవడంలేదు.”
అయితే, నొప్పిని అర్థంచేసుకొనుట యందు సాధించబడిన పురోభివృద్థులు, దానికి చికిత్సచేయుటకు చేస్తున్న గొప్ప ప్రయత్నాలతో ఏకీభవిస్తున్నాయి. ఆవిధంగా, నొప్పిని అనుభవించే వారి కొరకున్న ఉత్తరాపేక్ష మెరుగయ్యింది. “తీవ్రమైన నొప్పి కేవలం రోగ లక్షణమే కాదు గానీ అది చికిత్స చేయగల్గే రోగమని వైద్యశాస్త్రమిప్పుడు గుర్తిస్తున్నందుకు, మనందరము కృతజ్ఞులమై ఉండాలని” అమెరికన్ హెల్త్ మాగజైన్ నివేదిస్తూ తెల్పింది. నొప్పికి చికిత్సచేయడానికి అంకితమైన క్లినిక్‌లు అసంఖ్యాకంగా పెరగడానికి ఈ దృక్పథం సహాయపడింది.
నొప్పి చికిత్సచేయబడే స్థలం
మొట్టమొదటి మల్టీడిసిప్లినరీ పెయిన్ క్లినిక్‌ని డా. జాన్ జె. బొనికా అమెరికాలో తెరిచారు. “పందొమ్మిదివందల అరవైతొమ్మిది నాటికి ప్రపంచమందు అటువంటి క్లినిక్‌లు 10 మాత్రమే ఉన్నాయని,” ఆయన నివేదించాడు. గత 25 సంవత్సరాలలో నొప్పికి చికిత్సచేయడానికి అంకితం చేయబడిన అనేకమైన క్లినిక్‌లు నాటకీయంగా పెరిగాయి. ఇప్పుడు ఒక వెయ్యికి పైగా క్లినిక్‌లు ఉన్నాయి, మరియు “దాదాపు ప్రతిదినము క్రొత్తవి వెలుస్తున్నాయని,” నేషనల్ క్రానిక్ పెయిన్ అవుట్ రీచ్ సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు.a
దాని భావమేమైయున్నదో ఆలోచించండి! “గంభీరమైన నొప్పి నుండి ఉపశమనాన్ని పొందాలని వేలాదిమైళ్ల దూరం ప్రయాణించే రోగులు ఇప్పుడు తమ గృహానికి సమీపంలోనే దానిని కనుగొనవచ్చునని,” న్యూయార్కు నందు ఒక ఎనస్థియాలజిస్ట్ అయిన డా. గారి పెల్డ్‌స్టీన్ గుర్తించారు. మీరు బాధపడేవారిలో ఒకరైతే, నొప్పికి చికిత్సచేయడానికి ప్రత్యేకమైన తర్ఫీదును పొందిన ఒక బృందం నుండి సహాయం పొందడమనేది ఎంత ఆశీర్వాదకరమైందో కదా!
యెహోవాసాక్షులలో ఒక ప్రయాణకాపరి భార్య అయిన, లిండా పార్సన్స్, అనేక సంవత్సరాల నుండి వెన్ను నొప్పితో బాధపడుతూ వచ్చింది. ఒకని తరువాత మరొక వైద్యుని సహాయాన్ని ఆమె తీసుకున్నా, ఆమె నొప్పి తగ్గలేదు. గత సంవత్సరపు మే నెలలో ఒకనాడు, దాదాపు నిరుత్సాహమందుండగా, ఆమె భర్త టెలిపోన్ డైరెక్టరీని తీసుకొని నొప్పి అనే పదం క్రింద చూశాడు. వారు సేవచేసే దక్షిణ కాలిఫోర్నియాకు అంత దూరంగాలేని ఒక నొప్పినివారణ క్లినిక్ నెంబరు, పట్టిక నందు ఉంది. అప్పాయింట్‌మెంట్ తీసుకొన్నారు, కొద్ది రోజుల తరువాత మొదటి విచారణ మరియు రోగనిర్థారణ చేయించుకోడానికి ఆమె ఒక వైద్యుని కలిసింది.
ఒక బయటి రోగిగా లిండాకు చికిత్స చేయడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. చికిత్స కోసం వారానికి మూడు పర్యాయములు క్లినిక్‌కి ఆమె వెళ్లనారంభించింది అలాగే గృహమందు ఒక చికిత్సా కార్యక్రమాన్ని చేపట్టింది. కొద్దివారాల్లోనే, గుర్తింపదగిన అభివృద్ధినొందినట్లు ఆమె భావించనారంభించింది. ఆమె భర్త ఇలా వివరిస్తున్నాడు: “ఒక సాయంత్రం దాదాపు ఆశ్చర్యంతో, ‘నాకు ఏమాత్రం నొప్పిలేదనే విషయాన్ని నేను నమ్మలేకపోతున్నానని’ ఆమె చెప్పడం నాకు గుర్తుంది.” నెలల్లోనే, క్లినిక్‌కి వెళ్లడాన్ని నిలిపివేయవచ్చు.
తన నొప్పిని నివారించుకోవడానికి లిండా పొందిన సహాయం అనేకమైన మల్టీడిసిప్లీనరీ నొప్పినివారణ క్లినిక్‌ల ద్వారా లభ్యమయ్యే దానిని పోలినదే. ఆరోగ్య నిపుణుల బృంద నైపుణ్యాన్ని అటువంటి క్లినిక్ ప్రదర్శిస్తోంది. డా. బొనికా చెప్పిన ప్రకారంగా అది “దీర్ఘకాల నొప్పి నివారించడానికి శ్రేష్ఠమైన పద్ధతి.” ఉదాహరణకు, లిండా తన నొప్పికి ఎలాంటి చికిత్సను పొందింది?
నొప్పికి ఎలా చికిత్స చేయవచ్చును
అక్కడకు చేరుకోగానే చికిత్సా పద్ధతిని ఒక క్లినిక్ బ్రోషూర్ ఇలా వివరిస్తోంది: “నొప్పికి గల కారణాన్ని అంచనా వేయడానికి ప్రతి వ్యక్తి ఒక వైద్యుని ద్వారా పరీక్షింపబడతాడు అప్పుడు వాస్తవమైన చర్యలు మరియు చికిత్సా కార్యక్రమాలు సూచించబడతాయి. . . . నొప్పిని, చింతను తగ్గించడానికి, నొప్పి నివారణ మందులపై ఆధారపడడాన్ని తొలగించడానికి ‘ఎన్‌డార్‌ఫిన్స్‌ని’ (శరీరమందు సహజంగా ఉత్పన్నమయ్యే రసాయనికాలు) విడుదలచేయడంలో దేహానికి సహాయపడే ప్రత్యేకమైన సాంకేతిక పద్ధతులు మరియు చికిత్సా విధానాలు ఉపయోగింపబడతాయి.”
లిండా పొందిన చికిత్సలలో అక్యుపంచర్ మరియు ట్రాన్స్‌కుటేనియస్ (శరీరంలోనికి చొచ్చుకుపోయే) విద్యుత్‌నాడీ ప్రేరకమునకు ప్రామాణికంగా ఉన్న టెన్స్‌లు ఉన్నాయి. క్లినిక్ నందు ఆమె విద్యుత్ ప్రేరక చికిత్సలను పొందింది ఇంటివద్ద ఉపయోగించడానికి ఒక చిన్న టెన్స్ యూనిట్ యివ్వబడింది. బయోఫీడ్‌బేక్—రోగి తన శరీర ప్రతిచర్యలను పరీక్షించుకొని, నొప్పి ప్రభావాన్ని తగ్గించడానికి వాటిని సవరించుకొనుటకు నేర్పబడే ఒక పద్ధతి—కూడా అన్వయింపబడింది.
అంతర్గత కణ మర్ధనాతోపాటు, భౌతిక సంబంధమైన చికిత్సా విధానం ఒక నియమబద్ధమైన ఆహార చికిత్స యొక్క ఒక భాగమై ఉంది. అనతికాలంలోనే, లిండా దానికి సంసిద్ధంగావున్నప్పుడు మాత్రమే, క్లినిక్ జిమ్నాజియమ్‌లో ఒక వ్యాయామ కార్యక్రమం పరిచయం చేయబడింది, మరి అది చికిత్సా విధానంలో ఒక తప్పనిసరి భాగమైంది. దీర్ఘకాల నొప్పి వల్ల తొలగించబడిన ఎన్‌డార్‌ఫిన్స్‌ను పునరుద్ధరించాల్సివుంది గనుక, వ్యాయామం అవసరం. అయినప్పటికిని, ఒక లాభదాయకమైన వ్యాయామ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నొప్పితోవున్న ప్రజలకు సహాయం చేయడం ఒక సవాలే.
దీర్ఘకాల నొప్పి అనుభవిస్తున్న అనేకులు క్లినిక్‌లకు వచ్చి పెద్ద మోతాదులో నొప్పి నివారణ ఔషధాలను తీసుకుంటున్నారు, మరి లిండా మినహాయింపబడ లేదు. అయితే ఆమె త్వరలోనే మందులను వాడడం మానివేసింది. అదే ఈ నొప్పినివారణ క్లినిక్‌ల ప్రధాన లక్ష్యం. తిరగబెట్టే సూచనలేమి లిండాకు కలుగలేదు, అయినా అది అసాధారణమైనదేమీ కాదు. నొప్పినివారణ నిపుణుడైన డా. రొనాల్డ్ మెల్‌జ్యాక్ “పదివేల కన్నా ఎక్కువ మంది కాలిన బాధితులను గూర్చిన ఒక సర్వేనందు . . . ఆసుపత్రిలో వారు ఉన్న సమయమున నొప్పినివారణ కోసం ఇవ్వబడిన నార్‌కోటిక్స్‌కి అటు తరువాత బానిసయ్యారన్న కేసు ఒక్కటి కూడా లేనట్లు చెప్పబడిందని,” గుర్తించారు.
దీర్ఘకాలనొప్పి తరుచుగా ఒక ప్రధానమైన మానసిక అవస్థయైవున్నందున, రోగులకు సహాయపడడానికి క్లినిక్‌లు ప్రయత్నించాయి, తత్ఫలితంగా, వారు తమ నొప్పిని మర్చిపోయారు, “దానిని గూర్చి మీరేమనుకుంటారు,” అని అంటూ హార్‌వార్డ్ మెడికల్ స్కూల్ నందు ప్రొఫెసరైన డా. ఆర్థర్ బార్‌స్కీ ఇలా వివరించారు: “ఏమి ఎదురుచూస్తారు, భావాలకు మీరెంత మేరకు అవధానమిస్తారు—ఇవన్నీ నిజానికి మీరు భావించే దానిపైనే మరింత ఎక్కువ ప్రభావాన్ని కల్గివుంటాయి.” కావున తమ నొప్పికన్నా ఇతర విషయాలపైనే దృష్టిని కేంద్రీకరించడానికి రోగులకు సహాయం చేశారు.
నివారణ కొరకైన నిరీక్షణలు
మానవజాతికున్న నొప్పి సమస్యలకు, క్రొత్తవైన ఈ నొప్పినివారణ క్లినిక్‌లే సమాధానమా? ఇక్కడ వర్ణింపబడిన నొప్పికి చికిత్సచేసే పద్ధతులు సహాయకరమైనవైనప్పటికిని, తగిన క్లినిక్‌ని లేక నొప్పి నిపుణుని ఎన్నుకొనుట యందు ఒకడు జాగ్రత్త వహించాలి. అప్పుడే అంచనాలు వాస్తవమైనవిగా ఉండవచ్చును.
ఒక మోస్తరు విజయవంతమైన కథనాన్ని వివరించుటకు మునుపటి ఒలింపిక్ వెయిట్ లిప్టర్ అయిన, స్టీవెన్ కఫ్‌మాన్ మెడ మీద దోపిడీదొంగ కొట్టినప్పుడు ఆయన దీర్ఘకాల నొప్పిని అనుభవించినందున దాదాపు దుర్భలుడుగా విడువబడ్డాడు. నొప్పి-చికిత్సా కార్యక్రమమందు ఎనిమిది నెలలు గడిపిన తరువాత, ఆయన పూర్తికాల పనిని చేసుకొనేలా తేరుకోవడమే కాదు, చివరకు వెయిట్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొనడానికి అర్హుడయ్యాడు. అయినా ఆయనిలా అన్నాడు: “నా కాలి వ్రేళ్లు మరుగుతున్న నీటిలో కాలుతున్న అనుభూతి నాకు తరుచుగా కలుగుతుంది.”
ప్రేరేపించే పురోభివృద్థులెన్నున్నా మరీ భిన్నంగా, ‘వేదన (నొప్పి) ఇక ఉండదనే’ బైబిలు వాగ్దాన నెరవేర్పు మానవ సామర్థ్యానికి మించిందనుట స్పష్టమే. (ప్రకటన 21:4) అట్లయితే, ఆ గమ్యాన్ని ఎలా సాధించవచ్చు? (g94 6/22)
[అధస్సూచీలు]
a తేజరిల్లు! ఏ ప్రత్యేకమైన నొప్పి నివారణ క్లినిక్‌ని లేక చికిత్సావిధానాన్ని ప్రతిపాదించడం లేదు.
[9వ పేజీలోని చిత్రాలు]
విద్యుత్ నాడీ ప్రేరకము కూడా ఇమిడియున్న, నొప్పినివారణ చికిత్సా పద్ధతులు
[క్రెడిట్ లైను]
Courtesy of Pain Treatment Centers of San Diego