కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 4/8 పేజీలు 23-25
  • ఈ భావాలు పోయేలా నేనెలా చేయగలను?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఈ భావాలు పోయేలా నేనెలా చేయగలను?
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • తప్పుడు ఆలోచనా విధానాలను గుర్తించడం
  • గతంనుండి నేర్చుకునే దుఃఖకరమైన “పాఠాలు”
  • మనస్సు మార్చుకోవడం
  • నేనెందుకు ఈ భావాలను కలిగివున్నాను?
    తేజరిల్లు!—1995
  • సలింగసంయోగం—నిజంగా అదంత చెడ్డదా?
    తేజరిల్లు!—1995
  • హోమోసెక్సువాలిటీ తప్పా?
    యువత అడిగే ప్రశ్నలు
  • అబ్బాయిలు అబ్బాయిలతో, అమ్మాయిలు అమ్మాయిలతో సెక్స్‌ చేయడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 4/8 పేజీలు 23-25

యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .

ఈ భావాలు పోయేలా నేనెలా చేయగలను?

“సలింగసంయోగం ఇప్పుడెంత చెడ్డదని నాకు అనిపిస్తుందో, కొన్నిసార్లు నేను దానికి అంత ఆకర్షితున్నవుతున్నాను. ఈ భావాలు కొన్నిసార్లు రాత్రింబవళ్లు నన్ను కలతపరుస్తున్నాయి. “ఈ భయంకర భావాలను తీసివేయి!” అని నేను యెహోవాకు ఎడతెగక ప్రార్థించాను. అవి ఎప్పటికైనా చెదిరిపోతాయా?”—డెనిస్‌.a

అనేకమంది యౌవన క్రైస్తవులు—ఆడా, మగా—సహాయం కొరకు ఇటువంటి తీవ్రమైన విన్నపాలు చేశారు. వారు సలింగసంయోగం పట్ల మొగ్గు కలిగినట్లు భావిస్తారు, అయితే ఆ జీవిత విధానం సూచించే కాముకత, వ్యాధి మరియు నైతిక పతనంలో భాగం లేకుండా ఉండాలని కోరుకుంటారు. అతి ప్రాముఖ్యంగా, వారు దేవున్ని ప్రీతిపర్చాలని ఇష్టపడతారు, మరి తన వాక్యంలో ఆయన సలింగసంయోగాన్ని సూటిగా ఖండిస్తున్నాడు.—రోమీయులు 1:26, 27; కొలొస్సయులు 1:10.

సలింగసంయోగులు మారలేరని తరచూ అంటుంటారు. అయితే, అది సత్యం కాదు. కొందరు తొలి క్రైస్తవులు పూర్వం సలింగసంయోగాన్ని అభ్యసించారు, కాని వారు మారారు. (1 కొరింథీయులు 6:9-11) అవును, జనసామాన్య కల్పితాలకు భిన్నంగా, ప్రజలు మారగలరు, మారతారు. అయితే, ఒక యౌవనుడు లేక యౌవనురాలు సలింగసంయోగ క్రియలను విజయవంతంగా విసర్జించవచ్చు, కానీ అతను లేక ఆమె సలింగసంయోగ కోరికలను పూర్తిగా తీసివేయడం కష్టతరంగా ఉందని కనుగొనవచ్చు. ఒక యౌవన పురుషుడు ఇలా ఒప్పుకున్నాడు: “నా భావాలను మార్చుకోవాలని నేను ప్రయత్నించాను. సహాయం కొరకు నేను యెహోవాకు ప్రార్థించాను. నేను బైబిలు చదివాను. ఆ అంశంపై నేను ప్రసంగాలను విన్నాను. కాని తదుపరి సహాయం కొరకు ఎక్కడికి వెళ్లాలో నాకు తెలియదు.”

ఏదైనా మంత్రం లేక తక్షణ విరుగుడు లేదు. డెనిస్‌ ఇలా గుర్తు చేసుకుంటున్నాడు: “‘పురుషున్ని’ కావాలన్న ప్రయత్నంలో నేను కాముకమైన వ్యతిరేకలింగ కార్యకలాపాల్లో నన్ను నేను నిమగ్నం చేసుకున్నాను. ఇదంతా కూడా వ్యర్ధమైనది మరియు నాకు కేవలం బాధనే కలిగించింది.” అయినప్పటికీ, బైబిలు సూత్రాలను అన్వయించడం ద్వారా, ఒకరు అలాంటి భావాలను తీసివేసికోగలరు.

తప్పుడు ఆలోచనా విధానాలను గుర్తించడం

మొదటిగా, ఏదైనా క్రియ జరుగక ముందు దాన్ని గురించి ఆలోచించడం జరుగుతుందని గ్రహించండి. (యెషయా 55:6, 7; యాకోబు 1:14, 15) వాస్తవానికి డా. వేన్‌ డబ్ల్యు. డయర్‌ ఇలా పేర్కొంటున్నాడు: “మీరు ఒక విషయాన్ని గురించి ఆలోచించి ఉండకపోతే, మీకు ఒక భావన (భావోద్రేకం) కలుగదు.” కాబట్టి సలింగసంయోగ కోరికల వెనుక, తమను గురించి, వ్యతిరేక లింగ వ్యక్తిని గురించి ప్రేమ మరియు ఇతర వాటిని గురించిన వక్రీకరింపబడిన ఆలోచనలు ఉండి ఉండవచ్చు. ఒకరు తన ‘మనస్సు మార్చుకుని’ అలాంటి తలంపులను మార్చుకోక ముందు వాటిని మొదట గుర్తించాలి. (రోమీయులు 12:2) అలా చేయడం, ఎవరైనా స్వలింగ సభ్యులపట్ల ఎందుకు ఆకర్షితులౌతున్నారు అనే విషయంలో విలువైన అంతర్దృష్టిని ఇవ్వగలదు.

ఒక వ్యక్తి దాన్నెలా చేయగలడు? కీర్తనలగ్రంథకర్త చేసినట్లు ప్రార్థించడం ఒక మార్గం: “దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము. నీకాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము.” (కీర్తన 139:23, 24) ఒకరి భావాలను, ఒక యుక్తమైన మరియు పరిపక్వమైన క్రైస్తవునితో చర్చించడం కూడా సహాయకరంగా ఉండగలదు. సామెతలు 27:17 ఇలా చెబుతున్నట్లు, “ఇనుముచేత ఇనుము పదునగును.” కాబట్టి ఒక యౌవన పురుషుడు, అర్థం చేసుకోగలవాడని, కనికరంగలవాడని పేరొందిన ఒక క్రైస్తవ పెద్దకు తన విషయాలను చెప్పుకున్నాడు. తన రహస్యాన్ని ఎవరికైనా చెప్పేందుకు వారిని నమ్మడం అతనికి ఎంత మాత్రం సులభంగా ఉండేదికాదు, గాని ఒక అమూల్యమైన సంబంధం వృద్ధి చెందింది. “నేను ఆయనతో దేని గురించైనా మాట్లాడగలను,” అని అతను చెబుతున్నాడు. ఆ పెద్ద వినడమే కాకుండా, నిపుణతతో ప్రశ్నించడం ద్వారా, ఆ యౌవనస్థుని భావాలను మరియు తలంపులను వెలిబుచ్చడానికి సహాయం చేస్తాడు.—సామెతలు 20:5 పోల్చండి.

ఒకవేళ ఒక పురుషునికి తృణీకరించే లేక బలాత్కరించే తండ్రి ఉండినట్లయితే, స్వలింగ వ్యక్తిపట్ల తనకున్న ఆకర్షణ, తండ్రి ప్రేమ కొరకున్న అవసరతను తీర్చుకోడానికి విఫల ప్రయత్నం చేయడమేనని అతను కనుగొంటాడు. ఒక పురుష మాదిరిని కలిగి లేకుండినందుకు అతను, “మగవారి గుర్తింపు లక్షణాలుగా పరిగణింపబడే శక్తి, స్థిరత్వం మరియు బలం వంటి లక్షణాలు తనకు లేవని, తాను అసమర్థుడనే ఒక భావన,” అని డా. జోసఫ్‌ నికోలోసి పిలిచే అభిప్రాయాన్ని అతడు కల్గివుండవచ్చు. ఒక వ్యక్తి తనలో లోపిస్తున్నాయని తాను భావించే ఆ ప్రత్యేక లక్షణాలను ఒక్కొక్కటీ పరిశీలిస్తే, ఇతర పురుషుల్లో ఆకర్షణీయంగా ఉండే లక్షణాలు ఇవేననే విషయాన్ని, తనకే ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా అతను కనుగొనవచ్చు.

గతంనుండి నేర్చుకునే దుఃఖకరమైన “పాఠాలు”

తమ సమస్యకు గత గాథలతో సంబంధం ఉందని ఇతర యౌవనులు తెలుసుకుంటారు. ఒక బాలిక ఇలా గుర్తు చేసుకుంటుంది: “సలింగసంయోగ ముఖ్యాంశాలున్న అశ్లీల పుస్తకాలకు నేను అలవాటుపడ్డాను. నేను అసహజమైన కోరికలను వృద్ధిపర్చుకోవడం ప్రారంభించాను.” ఒక యౌవన పురుషుడు ఇలా పేర్కొంటున్నాడు: “నేను నా తండ్రిచే చెరపబడిన బాధితున్ని. దాని ఫలితంగా, పురుషునితో లైంగికత నాకు మామూలుగా అనిపించింది.” అలాంటి బాధాకరమైన అనుభవాలు, వ్యతిరేక లింగ వ్యక్తులను అయిష్టపడటం లేక చివరకు భయపడటం లేక ప్రేమ అనేది భౌతిక సాన్నిహిత్యంతో సమానమేనని భావించటం వంటి వాటిని బాధితులకు నేర్పవచ్చు. అందుకే ఒక బాధితురాలు తన లైంగిక కోరికలను “భౌతికమైనవి కాదుగాని భావోద్రేకమైనవని—మృదుత్వం మరియు అర్థం చేసుకోవడం యొక్క అవసరత” అని వర్ణించింది.

సలింగసంయోగానికి గల కారణాలు చాలా సంక్లిష్టమైనవన్నది వాస్తవం, అందుకే అనేక సందర్భాల్లో అవి సరళ వివరణను నిరాకరిస్తాయి.b అయితే, తప్పుడు ఆలోచనను కలిగించినది ఏదైనప్పటికీ, దాన్ని సరిచేసుకోడానికి ఒకరు చేయగల్గిందెంతో ఉన్నది.

మనస్సు మార్చుకోవడం

మంచి మార్గమేదంటే దేవుని వాక్యాన్ని ఉపయోగించడమే. ఉదాహరణకు, తనకు లేవని తాను భావించే పురుష లక్షణాలను ప్రదర్శించే మగవారి పట్ల తాను ఆకర్షితుడౌతున్న ఒక యౌవన పురుషున్ని గమనించండి. లేక పురుషులంటే భయపడే ఒక యౌవన స్త్రీని గమనించండి. మగసిరిపట్ల వారిరువురు ఆరోగ్యకరమైన అభిప్రాయాన్ని వృద్ధి చేసుకోడానికి ఒక మార్గమేమంటే యేసు ఉదాహరణను చదవటమే. (1 పేతురు 2:21) మృదుత్వంతో పురుష శక్తిని సమతూకం చేయడంలో ఆయన పరిపూర్ణ మాదిరియై ఉన్నాడు. (మత్తయి 19:14; యోహాను 19:5) అలా ఒక యౌవనుడు జీవించిన వారిలోకెల్లా మహా గొప్ప మనిషి పుస్తకాన్ని అధ్యయనం చేయటం సహాయకరంగా ఉంటుందని కనుగొన్నాడు.c “యేసును తెలుసుకోడం ఒక పురుషుడు ఎలా ఉండాలన్న నా ఊహను పునఃనిర్వచిస్తుందని,” అతను చెబుతున్నాడు.

లైంగికత, ప్రేమ మరియు స్వలింగ స్నేహ బంధాలను గురించిన వాటిపై దేవుని దృష్టిని తెల్పే అంశాలుగల బైబిలు లేఖనాలను ధ్యానించడం వల్ల కూడ ఒకని తలంపును సరిదిద్దుకోవడానికి అవి సహాయపడతాయి.—ఆదికాండము 1:27, 28; రూతు 1:16, 17; 1 సమూయేలు 18:1; సామెతలు 5:18, 19; 1 కొరింథీయులు 13:4-8.

చెడు తలంపులను గురించి ఆలోచించకుండా ఉండడం కూడా ప్రాముఖ్యమే. ఒకరు ఒంటరిగా ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, లేక కలత చెందినప్పుడు తరచూ ఈ కోరికలు చాలా శక్తివంతంగా ఉంటాయి. (సామెతలు 24:10) “మనలను మనం మార్చుకొనే ఒకే మార్గం, చెడు తలంపులను మంచి తలంపులుగా మార్చుకోవడమేనని,” ఒక క్రైస్తవ స్త్రీ చెబుతుంది. ఒక చెడు కోరిక తనకు కలిగినప్పుడల్లా, ఆమె సలింగసంయోగాన్ని గురించిన దేవుని అభిప్రాయాన్ని జ్ఞాపకంజేసుకుంటుంది. ఒక యౌవనస్థుడు ఇలా చెబుతున్నాడు: “సలింగసంయోగ కోరికలు నాకు కలిగినప్పుడల్లా, నేను నాకు ఇష్టమైన బైబిలు లేఖనాన్ని ధ్యానిస్తాను.” (2 కొరింథీయులు 10:4; ఫిలిప్పీయులు 4:8 పోల్చండి.) వాచ్‌టవర్‌ సొసైటి యొక్క బైబిలు ఆధారిత ఆడియోక్యాసెట్లను వింటూ పడుకోవడం సహాయకరంగా ఉండగలదని ఇతరులు కనుగొన్నారు.

మనమెలా ఆలోచిస్తామన్నది మనం ప్రవర్తించే పద్ధతిని ఎలా ప్రభావితం చేయగలదో, అలాగే మనం ప్రవర్తించే పద్ధతి మనమెలా ఆలోచిస్తాం మరియు భావిస్తామన్న దాన్ని ప్రభావితం చేయగలదు. చెడు అభీష్టాన్ని కలిగించే లేక బలపర్చే ప్రవర్తనను మరియు సహవాసాన్ని కూడా ఒకరు విసర్జించాలి. (1 కొరింథీయులు 15:33) ప్రజా విశ్రాంతి గదులు, బీచ్‌లు, లాకర్‌ గదులు మరియు ఇతర స్థలాలు, అంటే ఒకరిని శోధనకు గురిచేసే స్థలాల విషయంలో కూడా ఒకరు ‘జాగ్రత్తగా’ ఉండవలసిన అవసరముంది.—కీర్తన 119:9.

మానుకోవలసిన మరొక అనారోగ్యకరమైన అలవాటు హస్తప్రయోగం. అనేకమంది సలింగసంయోగ స్త్రీపురుషులకు, అదొక ఆపుకోలేని ఒత్తిడి. “నాకు ఆరేళ్ల వయస్సు ఉన్నప్పటినుండి హస్తప్రయోగం సమస్యగానే ఉందని” ఒక యౌవనస్థుడు చెప్పుకున్నాడు. “లైంగిక ఊహాగానాలు నాలోని సలింగసంయోగ భావాలను దృఢపర్చాయి. ఈ దురలవాటుతో పోరాడండి!d—కొలొస్సయులు 3:5.

మరో వైపు చూస్తే, ఆరోగ్యకరమైన ప్రవర్తనా విధానాలను నెలకొల్పుకోవడం కూడా ఒక యౌవన వ్యక్తికి చాలా ప్రాముఖ్యం. ఒక యౌవనస్థుడు పురుష లక్షణాలను అభివృద్ధి చేసుకుంటే అప్పుడతడు ఇతర పురుషుల వైపుకు ఎక్కువ ఆకర్షింపబడడని కొందరు సలహా ఇచ్చారు. నిజమే, ఒక యౌవన వ్యక్తి తన చిన్నతనంలో ఒక పటిష్టమైన పురుష వ్యక్తిత్వ ఉదాహరణను కలిగి ఉండక పోయివుంటే అదెలా చేయాలో అతనికి తెలిసి ఉండక పోవచ్చు. అతను తన స్వంత శరీరాన్ని ఇష్టపడకపోవచ్చు మరియు ఎబ్బెట్టుగా లేక మగవారు కానట్లు భావించవచ్చు. శారీరక పని, తగుమాత్రం వ్యాయామం, లేక విశ్రాంతినిచ్చే క్రీడాకార్యకలాపాలు ఈ విషయంలో తరచూ సహాయకరంగా ఉండగలవు. (1 తిమోతి 4:8 పోల్పండి.) అయితే యౌవన పురుషుడైన తిమోతి అపొస్తలుడైన పౌలుకు కుమారునివలె ఉన్నట్లు, సమతూకంగల, పెద్దవయస్కుడైన క్రైస్తవ పురుషునితో ఆరోగ్యకరమైన అవగాహనను వృద్ధిపర్చుకోవడం ప్రాముఖ్యంగా సహాయకరంగా ఉంటుందని ఒకరు కనుగొనవచ్చు. (ఫిలిప్పీయులు 2:19-22; 2 తిమోతి 3:10) స్పష్టమైన ప్రవర్తనా హద్దులను నియమించుకోవడం మరియు స్వేచ్ఛగా సంభాషణను వృద్ధిపరచుకోవడం ద్వారా ఆ సంబంధం ఉత్సాహపూరితంగాను, నమ్మదగినది గాను ఉంటుందే గానీ, అందులో మోహపు శృతులు ఉండవు.

అన్నిటికంటే ముఖ్యంగా, ఒక వ్యక్తి దృఢమైన ఆత్మీయ కవచాన్ని ధరించాలి. బైబిలును క్రమంగా పఠించడం, ప్రార్థన, మరియు తమ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవడం, ఒక వ్యక్తి మనస్సును ఆత్మీయ విషయాలపై ఉంచుకోడానికి సహాయపడగలవు. (కీర్తన 55:22; 119:11; రోమీయులు 10:10) అయోగ్యులమని కలిగే భావాలు తోటి క్రైస్తవుల మధ్య ఉండటానికి కొన్నిసార్లు కష్టతరం చేయవచ్చు, కానీ బైబిలు ఏకాంతంగా ఉండకూడదని హెచ్చరిస్తుంది. (సామెతలు 18:1) క్రైస్తవ స్త్రీపురుషులతో సహేతుకంగా సహవసించడం, ఒక వ్యక్తి సమతూకంగా ఉండటానికి సహాయపడగలదు.—హెబ్రీయులు 10:24, 25.

ఒకవేళ మీరు సలింగసంయోగ కోరికలచేత పీడించబడుతుంటే, ఈ సలహాలు సహాయకరంగా ఉంచవచ్చు. అయితే ఈ చెడు భావాలు విడువకపోతే అతిగా నిరుత్సాహపడవద్దు. దేవుడు మీ భావాలను అర్థం చేసుకుంటాడు మరియు తనను సేవించడానికి ప్రయాసపడే వారంటే ఆయనకు కనికరం ఉంది. (1 యోహాను 3:19, 20) నూతన లోకంలో, మనల్ని ముట్టడించే రుగ్మతలన్నింటి నుండి మానవజాతి స్వస్థతను అనుభవిస్తుంది. (ప్రకటన 21:3, 4) ఈ మధ్యలో, దేవునిపై ఆధారపడి చెడు కోరికలకు విరుద్ధంగా పోరాడండి. (గలతీయులు 6:9) కాలానుగుణంగాను నిశ్చయమైన ప్రయత్నంతోను బహుశా చెడు తలంపులు వాటికవే తొలగిపోవచ్చు.

(Beginning with our next issue, “Young People Ask . . .” will appear once a month.) This is not in vernacular.

[అధస్సూచీలు]

a కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

b ఫిబ్రవరి 8, 1995లోని “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .” అనే మా శీర్షికను చూడండి.

c న్యూయార్క్‌లోని వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి ఇన్‌కార్పోరేటెడ్‌ ప్రచురించినది.

d (వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి ఆఫ్‌ న్యూయార్క్‌, ఇన్‌కార్పోరేటెడ్‌ ప్రచురించిన) యౌవనస్థులు అడుగు ప్రశ్నలు—ఆచరణయోగ్యమైన సమాధానాలు (ఆంగ్లం) అనే పుస్తకంలోని 25, 26 అధ్యాయాల్లో ఒక యౌవన వ్యక్తి ఈ దురలవాటును అధిగమించడానికి సహాయపడే ఆచరణాత్మక సలహాలున్నాయి.

[24వ పేజీలోని చిత్రం]

యేసు ఉదాహరణను చదవడం ద్వారా మగసిరిపట్ల ఆరోగ్యకరమైన దృష్టిని వృద్ధిపరచుకోండి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి