యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .
సలింగసంయోగం—నిజంగా అదంత చెడ్డదా?
“నేను చిన్నవానిగా ఉన్నప్పటినుండి, నాలో సలింగసంయోగ కోరికలు ఉండేవి. నేను వాటిని అర్థం చేసుకోలేదు గనుక, నేను జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. ఒక స్నేహితునితో చాలా చెడ్డపని చేయడానికి ఇది నన్ను నడిపింది. నాలో అపరాధ భావన ఎంతో తీవ్రంగా ఉండేది, యెహోవా నన్నెప్పటికీ క్షమించడని నేను భావించాను.”
“టి. వి. మన పిల్లలను సలింగసంయోగం విషయంలో అధికంగా ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది.” గుర్తింపబడిన వార్తాపత్రిక కాలమిస్ట్ వ్రాసిన శీర్షిక యొక్క ముఖశీర్షిక ఇది. “దూరదర్శిని ప్రేక్షకులు, సలింగసంయోగ జీవితవిధానం సరైనదన్నట్లుగా చూపించే అనేక కార్యక్రమాలచేత ముంచెత్తబడుతున్నారని,” ఆ రచయిత పేర్కొన్నాడు. అయితే, యౌవనుల్లో సలింగసంయోగాన్ని పెంపొందించడానికి ఈనాడు ఉపయోగించబడుతున్న అనేక మూలాల్లో టి.వి. ఒకటి మాత్రమే. సలింగసంయోగానికి మద్దతునిచ్చే ప్రచారం ఉపాధ్యాయులు, తోటివారు, చలనచిత్రాలు, పుస్తకాలు మరియు పత్రికల ద్వారా కూడా పెంపొందించబడుతోంది.
ఈ ముమ్మర ప్రచారంలో వైద్యవృత్తి కూడా గొంతుకలిపింది. సాధారణంగా, వైద్యులు సలింగసంయోగాన్ని ఒక జబ్బులా దృష్టించారు. అయితే 1973లో, అమెరికన్ సైక్యాట్రిక్ అసోసియేషన్ సలింగసంయోగమనేది ఇక ఎంతమాత్రం ఒక మానసిక రుగ్మతగా పరిగణింపబడదని తీర్మానించారు. అప్పటినుండి, వైద్యవృత్తిలోని వారనేకులు సలింగసంయోగ జీవితవిధానం సరైనదని ముద్ర వేశారు. ఉదాహరణకు, మనస్తత్వశాస్త్రజ్ఞుడైన ఆల్బర్ట్ ఎలిస్, సలింగసంయోగ సంబంధాలు “ఎంతమాత్రం కాముకమైనవి కావుగానీ ఆరోగ్యకరమైన మానవలైంగిక ప్రవర్తనలో భాగమే. . . . మీరు ఇష్టపడితే వాటి మూలంగా ఆనందించండి, కానీ అవి ‘తప్పుడువని’ లేక ‘కలుషితమైనవని’ ఎవరైనా మిమ్మల్ని నమ్మించడానికి ప్రచారం చేసేలా అనుమతించకండని” తేల్చి చెబుతున్నాడు.
అలాంటి దృక్పథాలు ఎంత తీవ్రతరమైనవంటే, న్యూస్‌వీక్ పత్రిక ఇలా నివేదిస్తుంది: “దూరదర్శిని చిత్రాలు మరియు అంగీకరించే క్రొత్త వాతావరణం వలన ప్రోత్సహింపబడి, సలింగ మరియు ద్విలింగ ప్రవర్తనతో యౌవనులు చాలా బాహాటంగా ఆటలాడుకుంటున్నారు.” అయితే, గత కాలాల్లో చూస్తే యౌవనులు అదేలింగ సంబంధాలను చాలా తీవ్రంగా గర్షించారు, ఇప్పుడు అనేకమంది యౌవనులు దాన్ని “ఫ్యాషన్‌గా” భావిస్తున్నారనడం అతిశయోక్తి కాదు. సలింగసంయోగ క్రియల్లో పాల్గొనని యౌవనులు కూడా, అందులో పాల్గొనే వారిని తరచుగా సహిస్తున్నారు. “నా స్నేహితుడొకడు తాను సలింగసంయోగినని నాకు చెప్పినా, నేనింకా వాని స్నేహితునిగానే ఉంటానేమో అని” డారెన్ అనే యౌవనస్థుడు అంటున్నాడు. తాను “కేవలం అమ్మాయిలనే ఇష్టపడుతున్నాడు” గనుక తాను వాస్తవానికి మామూలుగా లేనేమోనని ఒక యౌవన కళాశాల విద్యార్థి ఆందోళన వ్యక్తం చేశాడు!
నేటి విచ్చలవిడి వాతావరణం క్రైస్తవ యౌవనులకు, ప్రాముఖ్యంగా ఏదో కారణం చేత సలింగ వ్యక్తులపట్ల ఆకర్షితులౌతున్న వారికి మరీ గందరగోళంగా ఉండవచ్చు.a సలింగసంయోగం దేవునికి అప్రీతికరమైనదని వారికి తెలుసు, మరియు వారు దాన్ని నిరాకరించాలని యథార్థంగా ఇష్టపడతారు. అయితే కొన్నిసార్లు, వారి భావాలను అదుపుచేసుకునే ఈ సంఘర్షణ ఎంత అలుపు కలిగించవచ్చంటే, ఈ విషయాన్ని గూర్చిన బైబిలు ఉద్దేశం సరైనదేనా లేక సహేతుకమైనదేనా అని వారు ఆలోచించడం ప్రారంభిస్తారు. ‘సలింగసంయోగం నిజంగా అంత చెడ్డదా?’ అని వారు ఆలోచించవచ్చు.
దేవుని వాక్యం ఏమి చెబుతుంది
దానికి జవాబుగా, 1 కొరింథీయులు 6:9, 10నందు అపొస్తలుడైన పౌలు ఏమి చెప్పాడో మీకై మీరే చదవండి: “అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను [“పురుషగాములు,” న్యూ ఇంటర్నేషనల్ వర్షన్; “స్త్రీలవంటి ప్రవర్తనగలవారు” కింగ్ జేమ్స్ వర్షన్], పురుషసంయోగులైనను [“సొదొమవారు,” జెరూసలేమ్ బైబిల్; “కామాతురతగల సలింగసంయోగులు,” టుడేస్ ఇంగ్లీష్ వర్షన్], దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.” సాక్ష్యాధారంగా, తమ అక్రమ సంబంధాలలో ఉదాసీనమైన లైంగిక పాత్ర నిర్వహించే వారిని, మరింత క్రియాత్మకమైన “పురుష” పాత్ర వహించే వారిని గూర్చి పౌలు నిర్దిష్టంగా ప్రస్తావించాడని గమనించండి. తద్వారా, దేవునికి అన్ని విధాలైన సలింగసంయోగ క్రియలు అప్రీతికరమైనవని ఆయన స్పష్టం చేశాడు.
రోమీయులు 1:18-27నందలి పౌలు మాటలలో కూడా ఇది స్పష్టమౌతుంది: “దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దుర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది. . . . ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. . . . అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి.” ఇక్కడ పౌలు స్పష్టంగా స్త్రీపురుషుల సలింగసంయోగాన్ని ఖండించాడు. సలింగసంయోగ అలవాట్లు అసహజమైనవని మరియు ‘కామాతురతగలవని’ ఆయన ఖండించాడు.
జబ్బైనదా లేక ఆరోగ్యకరమైనదా?
దీనికి బహుశా అనేకులు బైబిలు దృక్కోణం కేవలం పురాతనమైనదని, పనికిరానిదని ప్రతిస్పందించవచ్చు. కానీ మీరు దాని గురించి ఆలోచించినప్పుడు, మన భౌతిక, మానసిక, భావోద్రేక మరియు ఆత్మీయ నిర్మాణాన్ని గురించి మన సృష్టికర్తకంటే ఎవరికి ఎక్కువగా తెలుసు? దేవుడు స్త్రీని, పురుషున్ని చేసి, ఆయన ఒకరిపట్ల ఒకరికి ఉన్న గొప్ప ఆకర్షణను వారిమధ్య పెట్టాడు. (ఆదికాండము 1:27, 28) స్వలింగ వ్యక్తులపట్ల ఆకర్షణ కలిగేలా ఆయన వారిని నిర్మించలేదు. అంతేకాకుండా, స్త్రీపురుషుల మధ్య లైంగిక సంబంధాలు కేవలం వివాహ ఏర్పాటులో మాత్రమే ఉండాలని ఆయన నిర్ణయించాడు.—హెబ్రీయులు 13:4.
ఇది మనకు ఎంతమాత్రం కష్టాన్ని కలిగించదు. యెషయా 48:17నందు యెహోవా దేవుడు “నీకు ప్రయోజనము కలుగునట్లు . . . నేనే నీకు ఉపదేశము చేయుదును” అని చెబుతున్నాడు. అవును, మనకు ఏది సహాయకరమైనదో ఏది హానికరమైనదో ఆయనకు తెలుసు. కొందరికి బైబిలు బోధలను అనుసరించడం కష్టతరమైనదిగా అనిపించినప్పటికీ, అవి ఎప్పుడూ ‘హితబోధలే,’ అంటే, మనస్సుకు శరీరానికీ ప్రయోజనకరమైనవే. (తీతు 2:1) మరోవైపున, సలింగసంయోగం ఒకరి భౌతిక, భావోద్రేక మరియు ఆత్మీయ బాగోగులకు హానికరమైనవిగా ఉండగలవు.
సలింగసంయోగ జీవిత విధానం ఎంత అనారోగ్యకరమైనదో దానికి ఎయిడ్స్ సమస్య ఒక ఉదాహరణ. ఉత్తర అమెరికాలో, సలింగసంయోగ పురుషులే ముఖ్యంగా ఆ రోగాన్ని సంక్రమింపజేసేవారు. అయితే, సంక్రమించగల రోగాల వరుసలో ఎయిడ్స్ ఒకటి మాత్రమే, మిగతావి కాలేయపువాపు, కాలేయ ఇన్ఫెక్షన్లు, గనేరియా, సిఫిలిస్ మరియు గ్యాస్ట్రోఇన్టెస్టైనల్ పారసైట్స్, ఇవి సాధారణంగా సలింగసంయోగులను ముట్టడిస్తాయి. వ్యాధి సోకడాన్ని ఏది ఎక్కువ చేస్తుంది? డా. జోసఫ్ నికోలోసి ఇలా వివరిస్తున్నాడు: “సలింగ జీవన పద్ధతి యొక్క అత్యవసర, వ్యసనకరమైన మూలాలను గురించి అనేకమంది రచయితలు వ్రాతపూర్వక నివేదికలు ఇచ్చారు.” ఒక విస్తృత అధ్యయనం ఇలా తెలియజేసింది: “సలింగసంయోగ పురుషుల్లో 28 శాతం మంది ఒక వేయి లేక అంతకంటే ఎక్కువమందితో లైంగిక సంపర్కం జరిపారు [జరిపివుంటారు]. . . . శ్వేతజాతీయులైన సలింగసంయోగుల్లో సగంమంది దాదాపు 500 వేర్వేరు లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నామని చెప్పారు.”
అనేకమంది సలింగసంయోగుల్లో “ఇద్దరి మధ్య ఒప్పందం, సన్నిహితత్వం, లేక బాధ్యత ఇమిడి ఉండే ఒడంబడికను గురించిన భయాలు ఉంటాయి . . . బాంధవ్యాలు లేని లైంగికత కొరకైన తృష్ణ కొన్నిసార్లు ఒత్తిడికరమైన లక్షణాన్ని తీవ్రంగా కలిగించవచ్చు. ఈ వ్యక్తుల్లో కొంతమంది ఒక దినం లేక ఒక సాయంత్రంలోనే డజన్లసార్లు లేక అంతకంటే ఎక్కువ సార్లే సంపర్కం చేయవచ్చని,” హోమోసెక్స్య్ల్ బిహేవియర్ అనే పుస్తకం వివరిస్తుంది. అలాంటి అదుపుతప్పిన ప్రవర్తన ఆరోగ్యకరమైనదిగా ఉండగలదా? బదులుగా అది జబ్బైనది మరియు నీచమైనది కాదా? అలాంటి విపరీతమైన కాముకత్వంలో మునిగివుండే వారు స్పష్టంగా ‘భ్రష్టత్వమునకు దాసులు.’—2 పేతురు 2:19.
అంతేకాక, సలింగసంయోగ లైంగికత చాలావరకు క్రూరమైనది, దౌర్జన్యపూరితమైనది, మరియు కచ్చితంగా ఉన్మాదమైనది. అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమైయున్నది.” (ఎఫెసీయులు 5:12) “ఆనందభరితమైనదని” చెప్పబడే జీవిత విధానం వెనుకనున్న కోపాన్ని మరియు బాధను అటువంటి దౌర్జన్యం సూచిస్తుంది. నిజమే, కొందరు సలింగసంయోగులు తాము కామతప్తులంకామని చెప్పుకుంటారు. కానీ “ఒకే జత ఉన్న” సలింగసంయోగులు చాలా అరుదుగా ఉంటారు—మరి వాళ్ల సంబంధాలు కొద్ది కాలమే నిలుస్తాయి. ఒకే లింగ కలయికలు చిరకాలం నిలిచినా, అవి బైబిలులో వివరించబడిన ప్రేమ ఫలితంగా ఏర్పడినవి మాత్రం కాదు. అలాంటి ప్రేమ “అమర్యాదగా నడువదు.”—1 కొరింథీయులు 13:4, 5.
ఫలితాలు
రోమీయులు 1:27నందు పౌలు ఇలా చెబుతున్నాడు: “పురుషులతో పురుషులు ఈ అవమానకరమైన ఘోరమైన పనులు చేశారు, అయితే కాముకత ఫలితాలను తమ స్వంత వ్యక్తిత్వానికి తగినట్లు వారు పొందారు.” (జె. బి. ఫిలిప్స్ వ్రాసిన ది న్యూ టెస్టమెంట్ ఇన్ మోడ్రన్ ఇంగ్లీష్) ఏ విధాల్లో? ఈ ఫలితాల్లో ఒక దాన్ని గురించి హోమోసెక్స్య్ల్ బిహేవియర్ అనే పుస్తకం ఇలా నివేదిస్తుంది: “వ్యతిరేకలింగసంయోగ స్త్రీలకంటే, సలింగసంయోగ స్త్రీలు మద్యపాన ఉపయోగం మరియు దురుపయోగం వలన ఎక్కువ బాధపడతారు.” సలింగసంయోగ యౌవనపురుషుల్లో ఆత్మహత్యా ప్రయత్నాలు చాలా సాధారణమని కూడా కొందరు పరిశోధకులు పేర్కొంటున్నారు.
అన్నిటికంటే నాశనకరమైనది, ఒకరి ఆత్మీయతకు కలిగే పరిణామాలు. సలింగసంయోగులు ‘అంధకారమైన మనస్సుగలవారై, దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినట్లు’ తమను తాము కనుగొంటారు. (ఎఫెసీయులు 4:18) అయితే, బైబిలు నియమాలను గురించి తెలిసినప్పటికీ, స్వంత లింగం వారిపట్ల ఆకర్షితులౌతున్నామని కనుగొనే, దేవునికి భయపడే యౌవనుల మాటేమిటి? స్పష్టంగా, వారు కష్టతరమైన పోరాటాన్ని పోరాడవలసి ఉంది. వాస్తవమేమంటే, దేవుడు సలింగసంయోగాన్ని ఎలా దృష్టిస్తాడన్నది తెలుసుకోవడం, ‘చెడ్డదానినసహ్యించుకోడానికి’ అలాంటి వారికి సహాయం చేస్తుంది. (రోమీయులు 12:9) తప్పుడు కోరికలకు లోబడటాన్ని నివారించడానికి వారు తీసుకొనగల అనేక ప్రయోజనకరమైన చర్యలు కూడా ఉన్నాయి. ఇది రాబోయే ఒక శీర్షిక యొక్క అంశమై ఉంటుంది.
[అధస్సూచీలు]
a మా గత సంచికలోని, “యౌవనస్థులు ఇట్లడుగుదురు . . . నేనెందుకు ఈ భావాలను కలిగివున్నాను?” అనే దానిని చూడండి.
[32వ పేజీలోని చిత్రం]
సలింగసంయోగ జీవిత విధానం కామాతురతను, భావోద్రేక కృంగుదలను మరియు వ్యాధులను కలిగిస్తుంది