కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 2/8 పేజీలు 28-29
  • ప్రపంచ పరిశీలన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచ పరిశీలన
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • గర్భస్రావాలెన్ని జరుగుతున్నాయి?
  • జీవించుటకు శ్రేష్ఠమైన ప్రదేశమా?
  • ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి
  • విజయవంతమైన శస్త్రచికిత్స
  • విద్యావంతులైన పైడ్‌ పైపర్లు
  • ఫిలిపైన్స్‌లో అసురక్షిత రక్తం
  • వ్రణాలకు తేనె
  • తెలివిగల రైతులు, చురుకైన కాకులు
  • దూరదర్శిని ప్రభావంలేని ద్వీపంలోని పిల్లలు
  • హానికరంకాని మాటల తత్తరపాటు
  • “మానవ చరిత్రలోనే అత్యంత వినాశనకరమైన మహమ్మారి”
    తేజరిల్లు!—2003
  • ఎయిడ్స్‌—పిల్లల విషాదాంత మరణాలు
    తేజరిల్లు!—1992
  • ఎయిడ్స్‌—నేను అపాయంలో ఉన్నానా?
    తేజరిల్లు!—1993
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1994
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 2/8 పేజీలు 28-29

ప్రపంచ పరిశీలన

గర్భస్రావాలెన్ని జరుగుతున్నాయి?

“ప్రపంచమంతటా దాదాపుగా 33 మిలియన్ల చట్టబద్ధమైన గర్భస్రావాలు ఒక సంవత్సరంలో జరుగుతున్నాయి, ఇందులో చట్టబద్ధంకానివికూడా కలిపితే వాటి సంఖ్య ఇంకా పెరుగుతుంది, మొత్తం సంఖ్య 40 నుండి 60 మిలియన్లకు మధ్య ఉంటుందని,” బ్యూనస్‌ ఎయిర్స్‌ ఉదయకాల వార్తాపత్రిక క్లారీన్‌ చెబుతుంది. “సమ్మతించబడిన గర్భస్రావం చట్టబద్ధమైన దేశాల్లో ప్రపంచ జనాబాలోని డెబ్భై ఆరు శాతంమంది జీవిస్తున్నారు.” ప్రతి సంవత్సరం గర్భస్రావాలద్వారా తుదముట్టించబడే వాళ్లు అర్జంటీనాలోని మొత్తం జనాభాకన్నాకూడా ఎక్కువ, ఇంకా పోల్చి చూస్తే, ఇటలీ, ఈజిప్టు, దక్షిణ ఆఫ్రికా, టర్కీ, ఫ్రాన్సు, లేదా బ్రిటన్‌ వంటి దేశాల్లోని మొత్తం జనాబా ఎంత ఉంటుందో అంతమంది నాశనము చేయబడుతున్నారు. ఆరు సంవత్సరాల రెండవ ప్రపంచయుద్ధంవల్ల చనిపోయిన సుమారు 5 కోట్లతో దీన్ని పోల్చవచ్చు. (g95 2/8)

జీవించుటకు శ్రేష్ఠమైన ప్రదేశమా?

ప్రపంచమంతటిలో కెనడా జీవించటానికి శ్రేష్ఠమైన ప్రదేశంగా ఐక్యరాజ్య సమితిచేత తీర్మానించబడింది. “గత అయిదు సంవత్సరాల్లోని జాబితా ప్రకారంగా 173 దేశాల్లో కెనడా అగ్ర స్థానంలో ఉన్నట్టుగా రెండవసారిగా నిరూపించబడిందని,” ది టోరోన్‌టో స్టార్‌ చెబుతుంది. “అయితే, అలాగని ప్రపంచంలో కెనడా దేశస్థులు సంపన్నమైన జీవన వసతులుగల జీవితాన్ని అనుభవిస్తున్నారని మాత్రము దాని భావంకాదని,” చెబుతుంది. ఎందుకు కెనడా శ్రేష్ఠమైన ప్రదేశంగా నిరూపించబడింది? ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమంచే సిద్ధపర్చబడిన నివేదిక, దేశాలను మూడు విషయాలనుబట్టి వర్గీకరిస్తుంది: సరాసరి ఆదాయం, విద్య లభ్యమవ్వడం, జీవిత ఆయుస్సు. కెనడాలోని ప్రజల ఆయుస్సులో ఆరవ శ్రేణిగా ఉన్నది, సరాసరి వారి జీవితకాలం 77.2 సంవత్సరాలు. విద్యాపరమైన విషయాలకు, ఆరోగ్య సంరక్షణకొరకు, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారో అంతే ద్రవ్యమును టెలివిజన్‌ సెట్సును, వాహనాలను సొంతంగా కలిగివుండటంలోను ద్రవ్యాన్ని ఖర్చు పెడుతున్నారని, ఇలా చేయడంలో కెనడా అగ్ర స్థానానికి దగ్గరలోవున్నదని చెప్పబడుతుంది. (g95 2/8)

ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి

ప్రయాణించేటప్పుడు, మీ చుట్టూ ఏమి జరుగుతుందో శ్రద్ధగా గమనించండి. “సంచులను దొంగతనం చేసేవాళ్లు, జేబులు కొట్టేవాళ్లు, పరధ్యానంగా ఉండే ప్రయాణికులను తిరుగులేని గురిగా పెట్టుకుంటారని,” బ్రెజిల్‌ పత్రికయైన క్లోడియా చెబుతుంది. అదేమాదిరిగా, “ఎవరైనా మిమ్మల్ని గట్టిగా తగిలినా లేక ఏదైనా మీ దుస్తులపై చల్లినా, మెలుకువను కలిగివుండండి. ఇవి అన్నీ అవధానాన్ని మళ్లించటానికి మోసకరమైన యుక్తులే.” అంతేకాకుండా, ఎవరైనా మిమ్మల్ని సహాయంకాని, సమాచారాన్నికాని అడిగినపుడు జాగ్రత్తగా ఉండండి. చిన్న పరధ్యానమే మీ లగేజీని పొగుట్టుకునేలా చేయగలదు. సావో పౌలో అంతర్జాతీయ విమానాశ్రయాన్నిగూర్చి ఆర్డ్‌నో కాలరీయో అనే వ్యక్తి ప్రకారంగా, విమానాశ్రయంలో సూట్‌కేసులను పరీక్షించటానికి అందించేటపుడు, కార్లను అద్దెకు ఇచ్చే కౌంటరువద్ద సంతకాలు పెట్టే దగ్గర, హోటళ్లకు వెళ్లుతున్నపుడు, విడిచి వస్తున్నపుడు, టాక్సీలో పిల్లలను ఎక్కించేటపుడు, షాపుల అద్దాలగుండా చూస్తున్నప్పుడు, కాఫీ త్రాగేటపుడుగాని ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఒకవేళ మీ తాళపుచెవులు పోగొట్టుకున్నట్లయితే, వెంటనే వాటిని మార్చుకోమని ఆ పత్రిక హెచ్చరిస్తుంది. దొంగతనం చేసినవాడు మీ లగేజీని కనుగొన్నట్లుగా, మీరు పోగొట్టుకున్నది యావత్తు తిరిగి ఇస్తాడు, కాని అతడు అప్పటికే మారు తాళపుచెవులను తయారుచేసికొని ఉంటాడు, ఎపుడైనా తరువాత మీ ఇంటిలో జొరబడగలడు. (g95 2/8)

విజయవంతమైన శస్త్రచికిత్స

పోప్‌ జాన్‌ పాల్‌ 11కు ఏప్రిల్‌లో తుంటి శస్త్రచికిత్స చేసిన వైద్య బృందం “పూర్తి కారణంతో సగర్వంగా” అది “సర్వశ్రేష్ఠమైన చికిత్స” అని చెప్పిందని లా స్టామ్‌ఫా అని ఇటలీ వార్తాపత్రిక చెబుతుంది. కాని ఇప్పుడున్న పోప్‌పై జరిపిన శస్త్రచికిత్సలన్నీ కూడా మంచి ఫలితాలను ఇవ్వలేదు. ఆయనపై 1981లో జరిగిన హత్యా ప్రయత్నం తరువాత, ఆయనకు జరిగిన రక్తమార్పిడివల్ల ప్రాణాంతకము కాగల సైటామెగలో వైరస్‌ అంటువ్యాధి చికిత్సకొరకు జాన్‌ పాల్‌ II వైద్యశాలలో రెండు నెలలు ఉండవలసివచ్చింది. అయినప్పటికీ, ఇటువంటివి ఏవికూడా ఈసారి జరగకపోయినప్పటికీ, లా స్టామ్‌ఫా ప్రకారంగా, “రక్తం తీవ్రంగా పోయింది,” కాని రక్తమార్పిడి మాత్రం జరగలేదు. దానికిబదులుగా, “శస్త్రచికిత్స జరుగుతున్నపుడు పోప్‌యొక్క రక్తాన్ని తిరిగి ఆరోగ్యకరమైన దానిగా చేసి శుద్ధీకరించి మళ్లీ ఎక్కించారు,” అని ఆ వార్తాపత్రిక పేర్కొన్నది. (g95 2/8)

విద్యావంతులైన పైడ్‌ పైపర్లు

బొంబాయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మూషికాలను చంపే ఉద్యోగాలు 76 ఖాళీలున్నాయని ఒక ప్రకటన చేసి, ఓ పెద్ద సమస్యనెదుర్కొన్నారు. “మూషికాలను చంపటానికి కేవలం ప్రాథమిక విద్య చాలు గనుక వచ్చిన 40,000 దరఖాస్తు ఫారాల్లో చాలామంది గ్రాడ్యుయేట్సు, మెట్రిక్యులేషన్‌ చదివినవాళ్లు, కళాశాలను సగంలోనే ఆపేసినవాళ్లు, ఇంకా చదువుచున్నవాళ్లు ఉన్నారని,” ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ నివేదించినది. “ఒక డిగ్రీ పొందిన వ్యక్తిని మూషిక సంహారిగా ఎలా నియమించగలము?” అని ఒక అధికారి ప్రశ్నిస్తున్నాడు. రాత్రంతా వెదుకుతూ, దుడ్డుకర్రతో వాటిని చంపుతూ, చంపిన ప్రతి క్రొత్త 25 మూషికాలకు పారితోషికం 100 రూ. కార్పొరేషన్‌ “మంచి భర్తీ పథకం,” కొరకు ఎదురుచూస్తోంది. పౌర సంబంధాల అధికారులు ఎదుర్కొంటున్నది ఈ ఒక్క సమస్య కాదు. వాళ్లకు మతపరమైన సమస్యకూడావుంది. జైను మత సభ్యులు, అదేమాదిరిగా ఎవరయితే జీవహింసను అంగీకరించరో వాళ్లంతా మానవతా భావాల దృష్ట్యా మూషికాలను వదలిపెట్టమని పనివాళ్లకు లంచమిచ్చారు. (g95 2/8)

ఫిలిపైన్స్‌లో అసురక్షిత రక్తం

ఫిలిపినో వైద్య బృందం ఒక క్రొత్త అధ్యయనంలో ఫిలిపైన్స్‌లో, రక్తమార్పిడి సేవలు “అసురక్షితమైనవి, నిష్ప్రయోజనమైనవి మరియు వ్యర్థమైనవి,” అన్న ముగింపుకొచ్చింది. దేశ ఆరోగ్యశాఖా మంత్రి క్యువాన్‌ ప్లెవర్‌ “మహా భయంకరమైనవి,” అని అన్నాడు. కొన్నింటిలో దేశంలోని బ్లడ్‌ బ్యాంకుల్లోని సగం వాటిలో ఉన్న ఉద్యోగ సిబ్బందికి మాత్రమే ఎయిడ్స్‌, సిఫిలిస్‌, కాలేయరోగం మరియు మలేరియా వంటి వ్యాధులను పరీక్షించటం వచ్చని తెలుసుకున్నాడు. మరింకా, బ్లడ్‌ బ్యాంకులనుండి తీసుకొన్న 136 బ్లడ్‌ నమూనాల్లో 4 శాతం రక్తం కలుషితమైనదని కనుగొనబడింది. (g95 1/22)

వ్రణాలకు తేనె

కెనడాలోని మెడికల్‌ పోస్ట్‌ నందు డాక్టర్లు గడిచిన దశాబ్దాలుగా పలుమార్లు భయంకరమైన శస్త్రచికిత్సలద్వారా ప్రయత్నిస్తున్న వాటికంటెకూడా, జీర్ణాశయ వ్రణాలతో బాధపడుతున్న వాళ్లకు తేనె బాగా పనిచేస్తుందని, డా బేసిల్‌ జె. ఎస్‌. గ్రోగోనో వ్రాస్తున్నాడు. జీర్ణాశయ వ్రణాల్లో హెలీకొబాక్టర్‌ పైలోరీ, అనే చిన్న సూక్ష్మజీవి యొక్క పాత్రను అనేక పరిశోధకులు గుర్తిస్తున్నారని ఆయన చెబుతున్నాడు. ఈ సూక్ష్మాతిసూక్ష్మజీవులను అణచటానికి కొంతమంది మందులను వాడమని సిఫారసు చేస్తుండగా, ఈ మందులు ఇతర అసంతోషకరమైన ప్రత్యామ్నాయ చర్యలను (ఎఫెట్క్‌లను) ఇస్తున్నట్లుగా మరియు ఆ సూక్ష్మాతిసూక్ష్మజీవులు శక్తిని నిశ్చయం చేయగలవని గ్రోగోనో గమనించాడు. మరొక ప్రక్క, ఇటివల జర్నల్‌ ఆఫ్‌ ది రాయల్‌ సోసైటి ఆఫ్‌ మెడిసిన్‌ నందు ముద్రించబడిన అధ్యయనమందు తేనెలో అంటీబాక్టీరీయల్‌ లక్షణాలున్నట్లుగా ప్రచురించిన విషయాన్ని ఆయన సూచించాడు. మనూకా అనే పేరున్న చెట్టును ఆహారముగా తీసుకునే న్యూజిలాండ్‌ తేనెటీగలనుండి వచ్చిన తేనె, వ్రణాల్ని కల్గించే సూక్ష్మజీవితో పోరాడటంలో ప్రభావవంతంగా ఉండింది. (g95 1/22)

తెలివిగల రైతులు, చురుకైన కాకులు

జపానులో, పంట పొలాలనుండి ఎవరు కోత కోసుకుంటారనే దానికి ఎడతెగక పోరాటం జరుగుతుంది. రైతులు వేసే యుక్తులను కపటమైన కాకులు పనికి రాకుండా చేస్తున్నందువలన, రైతులకు, కాకులకు మధ్య ఎడతెగక పోరాటము జరుగుతూనే ఉంది. ఇపుడు, నగానో ప్రాంతంలోని బుద్ధిగల వ్యవసాయదారులు పక్షుల అతినీచ సహజ స్వభావాన్ని ఉపయోగించుకొని వాటిపై పన్నుగడ వేస్తారని, షాహీ ఇవినీంగ్‌ న్యూస్‌ చెబుతుంది. తొమ్మిది మీటర్ల చతురస్రంతోను, మూడు మీటర్ల ఎత్తుతోనువున్న ఒక పంజరాన్ని తయారుచేసి వాటిలో మరొక ప్రాంతంనుండి తెచ్చిన కాకులను పెట్టి వాళ్ల పొలాలచుట్టూ పెట్టారు. అత్యాసగల ప్రాంతీయ కాకులు, కోపంతో తమ ప్రాంతానికి వచ్చిన దోపిడిదారులైన “విదేశీయ” కాకులపై దాడిచేయటానికి ఆ పంజరంపై ఎగురుతూ వ్రాలి, తమకు తామే చిక్కుకొని పోతుండేవి. చివరికి విజయం లభించిందా? వ్యవసాయదారుల్లో ఒకరు: “నిజానికి, తిరుగులాడే అనేక కాకులు ఈ పంజరాన్ని చూసి అవే అవివేకులైనాయి. ఈ ప్రాంతాల్లోని కాకులు మాత్రం చాలా తెలివైనవి, అవి మమ్ములను అవివేకులుగా చేస్తూ ఇక్కడనుండి ఎగిరిపోతున్నాయి,” అని చెబుతున్నారు. ఆ విధంగా పోరాటం సాగుతూనేవుంది. (g95 1/22)

దూరదర్శిని ప్రభావంలేని ద్వీపంలోని పిల్లలు

పశ్చిమాఫ్రికానుండి దక్షిణమెరికాకు ఉన్న దూరంలో మూడవవంతు దూరాన ఉన్న ఒక చిన్న ద్వీపమైన సెయింట్‌. హెలీనా, దానిలోని పిల్లలనుగూర్చి “ప్రపంచంలో ఎక్కువ సమతుల్యతగల వాళ్లు,” అని సగర్వంగా చెప్పుకుంటుందని విదాపరమైన పత్రిక సపోర్టు ఫర్‌ లేర్నింగ్‌, అనే నివేదికలోని విషయాన్ని సూచిస్తూ లండన్‌లోని ది టైమ్స్‌ పేరెన్నికగల పత్రిక చెబుతుంది. ఆ నివేదిక వ్రాతగాడైన, డా. టోని చార్ల్‌టన్‌, ద్వీపంలోని 9 నుండి 12 సంవత్సరాలవరకున్న పిల్లల్లో 3.4 శాతంమంది మాత్రమే తీవ్రమైన ప్రవర్తనా సమస్యలున్నట్లుగా కనుగొన్నాడు. “ప్రపంచంలో ఎక్కడైనా ఏ వయస్సు వారిలోనైనా నమోదు చేయబడిన వాటన్నింటిలో అతి తక్కువ” శాతం అని ది టైమ్స్‌ పత్రిక పేర్కొంది. మంచి సమతుల్యత వున్న పిల్లలు ఉండటానికిగల కారణమేమిటి? ఒక అవకాశమేమనగా పిల్లలకు ఉన్నతమైన నైపుణ్యంతో, అందుబాటులోనున్న విద్యావిధానమే. కాని చార్ల్‌టన్‌ మరొక సాధ్యతను కనుగొనటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల, సాటిలైట్‌ ప్రసారవిధానం ప్రవేశపెట్టడం జరిగేంతవరకు, ఆ ద్వీపం టి.వి.ని ప్రసారము చేయనేలేదు. మూడు సంవత్సరాల లోపున, ద్వీపంలోని 1,500 కుటుంబాల్లో 1,300 కుటుంబాలవారు టి.వి.ని కలిగివుంటారని అంచనా వేయబడింది. ద్వీపంలోని పిల్లల్లో ఆ తర్వాత వచ్చే ఏ మార్పునైనా అధ్యయనం చేసేందుకు చార్ల్‌టన్‌ త్వరగా పూనుకుంటాడు. (g95 1/22)

హానికరంకాని మాటల తత్తరపాటు

జర్మనీలోని, డార్మస్టేడ్‌నందు జరిగిన సదస్సులో, తల్లిదండ్రులు తమ పిల్లలకున్న హానికరంకాని మాటల తత్తరపాటుపై వ్యాకులపడుతున్నవారిపై నత్తి థెరిఫీనందు ఇంటర్‌డిసిప్లినరీ ఆసోసీషియేషన్‌లోని సభ్యులు హెచ్చరిక చేశారు. “నాలుగునుండి ఆరు సంవత్సరాల మధ్యవరకున్న ప్రతి అయిదుగురు పిల్లల్లో అదేమాదిరి మాటలాడుటలో తత్తరపాటు ఉండి అది నత్తిగా కనబడుతుందని అయితే రానురాను వాటంతట అవే మారిపోతాయని,” సూడీటిసిచ్‌ జిటుంన్‌ వార్తాపత్రిక నివేదిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలు మాట్లాడినపుడు తొట్రుపడుతుంటే వాళ్లెలా ప్రతిస్పందించాలి? “పిల్లలు సహజంగా తత్తరపడకుండా మాట్లాడే దానినుండి దూరంచేయకండి,” అని వ్యాఖ్యానిస్తూ “తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడిని ఎక్కువగా పెట్టకుండా ఉండాలని, అతనికే ఎక్కువ సమయాన్ని వదిలిపెడుతూ, తనకు తానే ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోటానికి అవకాశమివ్వాలని,” ఆ వార్తాపత్రిక చెబుతుంది. (g95 1/22)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి