కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 2/8 పేజీలు 26-27
  • తేనెటీగకు కంప్యూటర్‌కు పోటీ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తేనెటీగకు కంప్యూటర్‌కు పోటీ
  • తేజరిల్లు!—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • తేనెటీగల పెంపకం ఓ “తియ్యని” కథ
    తేజరిల్లు!—1997
  • తేనెటీగ ఎప్పుడు తేనెటీగ కాదు?
    తేజరిల్లు!—1998
  • ఆస్ట్రేలియాకు చెందిన ముల్లులేని తేనెటీగను కలవండి
    తేజరిల్లు!—2001
  • తేనె మానవునికి తేనెటీగ ఇచ్చిన బహుమానం
    తేజరిల్లు!—2005
తేజరిల్లు!—1995
g95 2/8 పేజీలు 26-27

తేనెటీగకు కంప్యూటర్‌కు పోటీ

సాధారణమైన తేనెటీగ ఎంత తెలివిగలది? స్పష్టంగా, ఈనాడున్న చాలా శక్తివంతమైన సూపర్‌కంప్యూటర్‌కన్నాకూడా ఎంతో తెలివైనది. మరియు అవి అద్భుతమైన అతి చిన్నప్రాణులు.

ప్రపంచంలోని అతిశక్తివంతమైన కంప్యూటర్‌ ఆశ్చర్యకరంగా ఒక సెకనుకు 16 జైగాఫాప్‌ల ప్రక్రియా వేగాన్ని సాధించగలదు. ఒక సామాన్యుడి మాటల్లో చెప్పాలంటే, అటువంటి కంప్యూటర్‌ ప్రతి సెకనుకు, రెండు అంకెల కూడికలవంటి అతి సాధారణ లెక్కలు 1,600 కోట్లు చేయగలదు. దానికి వ్యత్యాసంగా, ఒక తేనెటీగ మెదడునందు చోటుచేసుకునే అన్ని విద్యుత్‌ మరియు రసాయన ప్రక్రియల లెక్కల అంచనా, ఒక చిన్న తేనెటీగ ఒక సెకనుకు శతకోటి కోట్లకు సమానమైన ప్రక్రియల్ని జరుపుతుందని చూపింది. ఎంత ఆశ్చర్యం!

తేనెటీగ ఇవన్నీ చేస్తున్నప్పటికీ కంప్యూటర్‌కన్నా ఎంతో తక్కువ విద్యుత్‌నే వ్యయపరుస్తుంది. బైట్‌ పత్రిక ప్రకారంగా, “ఒక తేనెటీగ మెదడు 10 మైక్రోవాట్లకన్నా తక్కువగానే విడుదల చేస్తుంది. . . . నేడు తయారుచేయబడిన అత్యంత సమర్థవంతమైన ఏ కంప్యూటర్‌కన్నా గొప్పతనంలో ఇది ఏడు రెట్లు ఉన్నతమైనది.” కాబట్టి ఒక కోటి తేనెటీగల మెదడుల్లో ప్రక్రియ చేసే విద్యుత్‌ అంతా ఒక చిన్న 100-వాట్స్‌ వెలుగునిచ్చే బల్బుకు సరిపోతుంది. అదే సమతుల్యమైనన్ని మొత్తం ప్రక్రియలను చేయటానికి ఈనాడున్న అనేక కంప్యూటర్లలో అత్యంత సమర్థవంతమైన కంప్యూటర్ల్‌కన్నాకూడా కొన్ని కోట్ల రెట్ల శక్తిని ఉపయోగిస్తున్నాయి.

అయినప్పటికీ, కంప్యూటర్లకన్నా తేనెటీగలు ఎంతో మెరుగైనవి. అవి రంగును, వాసనను చూడగలవు, ఎగరగలవు, నడవగలవు మరియు తమ సమతుల్యతను కాపాడుకొనగలవు. అవి దూర ప్రాంతాలకు వెళ్లి మకరందంగల మూల ప్రాంతాలను కనుగొని, తేనెపట్టుకు తిరిగివస్తాయి మరియు ఇతర తేనెటీగలకు దిశలను చూపగలవు. అవి తప్పకుండా నైపుణ్యంగల కెమిస్టులుకూడా. అవి తేనెను తయారుచేయడానికి మకరందానికి కొన్ని ప్రత్యేకమైన సేంద్రియపదార్ధాలనుకూడా కలుపుతాయి. తేనెపట్టును కట్టటానికి లేదా మరమ్మత్తులు చేయటానికి అవి మైనంకూడా తయారుచేసుకుంటాయి. వాటి పిల్లలకు శ్రేష్ఠమైన జల్లిక మరియు పుప్పొడివంటి ప్రత్యేకమైన తిండి పదార్ధాలను తయారు చేస్తాయి. చోరులను గుర్తించి నివారించడం ద్వారా వాటి గృహాన్ని కాపాడుకోగలవు.

మంచి గృహనిర్వాహకులుగా, క్రమంగా చెత్తను ఇతర పనికిరాని వాటినికూడా తేనెపట్టునుండి తీసివేస్తుంటాయి. తేనెపట్టుకు కావలసిన వాతావరణాన్ని అదుపులో ఉంచుకోటానికి శీతాకాలంలో ఆ తేనెపట్టులోని అన్నీ ఒక దగ్గరికి మూగడం లేదా వేసవికాలంలో నీళ్లను వెదజల్లుతూ మంచి గాలిని విసరునట్లుగా అక్కడే ఎగురుతూ ఉంటాయి. వాటి గృహం రద్దీగా ఉన్నట్లయితే, కొన్ని తేనెటీగలు ఆ తేనెపట్టును విడిచి వెళ్లిపోవాలని గ్రహించేంత తెలివైనవి. అయితే తేనెపట్టుకొరకు పాతరాణి స్థాయిలో క్రొత్తరాణిని ఎంపిక చేసి, పాతరాణి మరియు కొంతమంది పనిచేసే సమూహాలను తీసికొని మరో క్రొత్త చోటికి వెళ్లతాయి. మొదటిగా, ఏమైన, క్రొత్త ప్రదేశాలను పరిశీలన చేయటానికి తేనెటీగల్లో సైనికులను పంపించటం జరుగుతుంది. సూచనార్థకంగా చెప్పాలంటే అవి తిరిగి వచ్చిన తరువాత సమాచారాన్ని విశ్లేషిస్తాయి, తర్వాత “మార్గం తెలిసిన” తేనెటీగలు క్రొత్త గృహానికి తరలి వెళ్లిపోతుండగా మిగిలినవి వాటిని అనుసరిస్తాయి.

ప్రాముఖ్యతలేని ఈ తేనెటీగలు బయటనుండి ఎటువంటి సహాయాన్ని లేదా ఆధ్వర్యంను లేకుండానే ఇవన్నీ చేసుకోగలవు. అవి స్వతంత్రంగా పని చేసుకోగలవు. అయితే, సూపర్‌కంప్యూటర్ల్‌కు వాటిలో విషయాల్ని నింపేవారు అనేకమంది కావాలి, ఇంజనీర్లు మరియు పారిభాషిక నైపుణ్యదార్లు కావాలి. ఎంత అసమాన్యం! తేనెటీగలు నిజంగా ఒక అద్భుతమైన అతిచిన్నప్రాణులు.

[Picture Credit Line on page 27]

L. Fritz/H. Armstrong Roberts

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి