కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 2/8 పేజీలు 22-25
  • స్వయంశ్లాఘన—వెఱ్ఱితనపు సవాళ్లను ఎదుర్కొనుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • స్వయంశ్లాఘన—వెఱ్ఱితనపు సవాళ్లను ఎదుర్కొనుట
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • స్వయంశ్లాఘన అంటే ఏమిటి?
  • సరైన చికిత్సను పొందడం
  • అనుదిన జీవితం
  • ప్రజలను ఎదుర్కొనుట
  • కుటుంబాన్ని ఐక్యంగా ఉంచుకోవడం
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1995
  • ఒక కుమారుడు తన తండ్రికి సహాయం చేసిన విధానం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • పిల్లలకు బాల్యంనుండే శిక్షణనిచ్చుట
    నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము
  • ప్రత్యేక అవసరాలున్న పిల్లలను పెంచడం
    తేజరిల్లు!—2006
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 2/8 పేజీలు 22-25

స్వయంశ్లాఘన—వెఱ్ఱితనపు సవాళ్లను ఎదుర్కొనుట

క్రిస్టోఫర్‌ అందమైనవాడు, మంచి ప్రవర్తన కలిగిన చిన్న పిల్లవాడు, 18 నెలల వయస్సు వచ్చేసరికి వాని పేరుతో పిలిచే పిలుపుకు బదులివ్వడం మానేసాడు. మొదట్లో, అతడు చెవిటివానిగా అన్పించినప్పటికీ, చాక్లేట్‌ కాగితం మర్మరశబ్దాన్ని అతడు గమనించేవాడు.

కాలం గడుస్తుండగా, కలవరపర్చే ఇతర ప్రవర్తనలుకూడా కనిపించాయి. యధాతధంగా అతడు తన ఆటబొమ్మలతో ఆడుకోవటం మానేసి, వాటికున్న చక్రాలను గిరగిర త్రిప్పుతూ పదేపదే అలా చేస్తూండేవాడు. అతడు ద్రవపదార్థాలపై అసాధారణమైన ఆసక్తిని పెంచుకొని, దొరికిన ప్రతి అవకాశంలో వాటిని క్రింద పారబోస్తుండేవాడు. అది, అలాగే పైకి ఎకాలన్న అతని ఇష్టం, అనేకమైన ఆస్థిరమైన పరిస్థితులకు మరియు అతని తల్లికి విపరీతమైన చింతను కలిగించడానికి దారితీసింది.

అతడు ప్రజలు ఉన్నారని మరిచిపోతుంటాడు, అప్పుడపుడు అక్కడ మనుష్యులు ఉన్నా వారిలోనుండి ఎక్కడికో తీక్షణంగా చూస్తూనే ఉండేవాడు. అతనికి రెండు సంవత్సరాలు వచ్చేసరికి, పూర్తిగా మాట్లాడటమే మానేసాడు. అతడు ఊయలలో ఊగటానికి ఎక్కువ సమయాన్ని గడిపేవాడు, అప్పుడపుడు అతని తల్లిదండ్రులకు తెలిసికొనటానికి శక్యంకాని విధంగా కారణాలు లేకుండానే అతడు వడిగా ముక్కోపి అవుతున్నట్లుగా ప్రవర్తించటం మొదలుపెట్టాడు. దిగ్భ్రాంతి చెంది, వాళ్లు సమాధానాలకొరకు ఆన్వేషించటం ప్రారంభించారు.

క్రిస్టోఫర్‌కున్న సమస్య ఏమిటి? అతడు చెడిపోయాడా, అలక్ష్యం చేయబడ్డాడా, మానసికంగా క్షీణించటం జరిగిందా లేదా మతి భ్రమించిందా? కాదు, అమెరికాలో స్వయంశ్లాఘనను కలిగివున్న 3,60,000 ప్రజల్లో క్రిస్టోఫర్‌ ఒకడు. ఈ విచిత్ర ప్రవృత్తి ప్రపంచమంతటి ప్రతి 10,000 మంది పిల్లల్లో 4 లేక 5 మందిలో కనబడుతూ, యావజ్జీవిత సవాళ్లను ముందుంచుతుంది.

స్వయంశ్లాఘన అంటే ఏమిటి?

స్వయంశ్లాఘన అంటే మెదడులో అవ్యవస్థ ఉండటం, సాంఘిక ప్రవర్తన, సంభాషణా నైపుణ్యాలు మరియు ఆలోచనా సామర్థ్యం సహజంగా వృద్ధిపొందడంలో విఫలమవ్వటమే. బాహ్య ప్రపంచంయొక్క సమాచారాన్ని జ్ఞానేంద్రియాల ద్వారా ప్రసారం చేసే ప్రక్రియను అది ప్రభావితం చేస్తుంది, అలా స్వయంశ్లాఘన ఉన్న ప్రజలు కొన్ని ఇంద్రియ గ్రహణలు (దృశ్యాలు, ధ్వనులు, వాసనలు మరి అటువంటివి) వాటికి అతిగా ప్రతిస్పందించడానికి మరికొన్నింటికి అసలు ప్రతిస్పందించకుండా ఉండేలా చేస్తుంది. ఈ స్వయంశ్లాఘన యొక్క బలహీనతలు అసాధారణమైన ప్రవర్తనా లక్షణాలను ఉత్పన్నం చేస్తుంది. సాధారణంగా, మూడేళ్ల వయస్సులోపుననే కనబడే ఈ లక్షణాలు ఒక బిడ్డలో మరొక బిడ్డలో తేడాను ఉంటుంది. ఈ తదుపరి ఉదాహరణలను గమనించండి.

మీ అందమైన బిడ్డ దగ్గరికి మీరు ప్రేమతో వెళ్లినపుడు, అటునుంచి ఎటువంటి ప్రతిస్పందన లేకపోవడాన్ని ఊహించండి. ఒక బిడ్డ స్వయంశ్లాఘనను కలిగివుంటే ఇది తరచుగా జరుగుతుంటుంది. ప్రజలతో పరస్పరం పనిచేయటానికి బదులుగా, స్వయంశ్లాఘనతోవున్న చాలామంది పిల్లలు ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా యిష్టపడుతుంటారు. వాళ్లను ఆలింగనము చేసుకోటానికి అయిష్టతను చూపుతారు, కళ్లతో సంభాషించటానికి తిరస్కరిస్తారు, మరియు యితరుల వస్తువులను ఉపయోగిస్తారు—యితరుల భావాలను అసలు పట్టించుకోరు. కొన్ని విపరీతమైన కేసుల్లోనైతే వాళ్లు కుటుంబ సభ్యులకు, బయటవాళ్లకు మధ్య తేడాను తెలియనట్లు ఉంటారు. వాళ్లు తమదైన ఒక లోకంలో జీవిస్తూన్నట్లుగా కనబడతారు, చుట్టూవున్న ప్రజలను లేదా వాళ్ల చుట్టూవున్న పరిస్థితులను పూర్తిగా మరచిపోతారు. “ఆటిజమ్‌” అనే పదం, గ్రీకు భాషలో ఆ-టోస్‌ అనే మాటకు అర్థం “స్వయం” అంటే తమలో తామే మునిగిపోయి ఉండే లక్షణాన్ని వివరించబడుతుంది.

ప్రజల పట్టించుకోకుండా ఉండే స్వభావానికి వ్యత్యాసంగా, స్వయంశ్లాఘనతోవున్న పిల్లలు ఒక ప్రత్యేకమైన వస్తువుతోనో లేక పనిలోనో, కొన్ని గంటలసేపు విపరీతమైన ధోరణిలో చేసినదానినే మరల చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. ఉదాహరణకు, బొమ్మ రూపంలోవున్న కార్లను నిజమైన కార్లుగా ఊహించుకొంటూ, వాటినన్నింటినికూడా ఒకే వరుసక్రమం లేక తిన్నగా పెడుతూ, కార్ల చక్రాలను విరామంలేకుండా గిరగిర త్రిప్పుతూవుంటారు. ఇలాగే ఇతర పనులనుకూడా మరల మరల పెడుతూ చేస్తుంటారు. చాలామంది వారి దినచర్యలో పరిపాటిగా సాగేవాటిలో మార్పును ఓర్చుకోలేకపోతుంటారు, ప్రతిరోజు చేసే పనిలో అదే సమయానికి సరిగ్గా అవే పనులు చేయాలని పట్టుపడుతుంటారు.

స్వయంశ్లాఘనతోవున్న పిల్లలు జరిగే విషయాలకు లేదా తారసిల్లిన పరిస్థితులకు అసాధారణమైన రీతుల్లో ప్రతిస్పందిస్తుంటారు. వాళ్లు ఏమి అనుభవిస్తూన్నారో వివరించటానికి వాళ్లకు సాధ్యంకావటంలేదు గనుక వాళ్ల సమాధానాలు గందరగోళంగా ఉంటాయి. అందులో సగంమంది మూగవారు; మాట్లాడగలిగేవాళ్లు పదాలను తరచూ అసాధారణ పద్ధతిలో వాడుతుంటారు. అడిగిన ప్రశ్నకు అవునని సమాధానం చెప్పటానికి బదులుగా అదే ప్రశ్నను మళ్లీ మళ్లీ వల్లిస్తుంటా (ఈ ప్రక్రియను ఫెయెకోలాలియా అని పిలుస్తారు). కొంతమంది అసాధారణమైన రీతిలో వాడుకలేని సంజ్ఞలను చేస్తుంటారు వాటిని ఆ పిల్లవాని “కోడ్‌”భాషను తెలిసిన వాళ్లు మాత్రమే అర్థంచేసుకుంటారు. ఉదాహరణకు, ఒక బిడ్డ ఉపయోగించే పదము, “బయటంతా చీకటిగావుంది” అంటే వాని భావం “కిటికీ” అని. చాలామంది సంజ్ఞలనుపయోగించటానికి కష్టపడతారు లేదా ఏదైనా అవసరాన్ని తెలియజేయడానికి అరుస్తారు లేక ఎక్కువ కోపం తెచ్చుకుంటారు.

సరైన చికిత్సను పొందడం

గత 1940, 50 మరియు 60 పడులలో స్వయంశ్లాఘనమనేది, అన్ని ఇతరత్రా విషయాల్లో బాగున్న పిల్లవాడు భావోద్రేకంగా కృంగిపోవటమేనని అనేకమంది నిపుణులు పరిగణించేవారు. తల్లిదండ్రులు, వాళ్ల పిల్లల సమస్యలకు నింద ప్రాముఖ్యముగా తల్లులపైన మోపబడేది. గత 60వ పడిలో, స్వయంశ్లాఘన అనేది మెదడులో కొన్ని గుర్తించలేని లోపాల ఫలితంగా (అవి ఏమిటన్నది ఇప్పటికీ కచ్చితంగా తెలియకపోయినప్పటికీ) వస్తుందని దృఢంగా సూచించే రుజువులు సేకరించబడ్డాయి. ఇది నెమ్మదిగా స్వయంశ్లాఘనకు చికిత్స పైనుండి అంటే మనోతత్త్వశాస్త్రంనుండి విద్యను ముఖ్యమైన దానిగా చెప్పడం జరిగింది. ప్రత్యేకమైన బోధనా నైపుణ్యాలు వృద్ధిపర్చబడ్డాయి, సమస్యలుగల ప్రవర్తనా విధానాన్ని తగ్గించడం మరియు అవసరమైన పనులను బోధించడంలో అవి ప్రభావవంతమైనవని నిరూపించబడ్డాయి. వీటి ఫలితంగానైన లేక యితర అభివృద్ధివల్ల, చాలామంది స్వయంశ్లాఘనను కలిగివున్న వాళ్లు మంచి అభివృద్ధి పొందుతూ, తగిన సహాయంగాను, మరియు మద్దతుగాను ఉంటూ, కొంతమంది ఉద్యోగాలనుకూడా చేస్తూ, కొంతమేరకు స్వాతంత్ర్యంగా జీవనముగా సాగిస్తూన్నారు.

ఏమైనప్పటికీ, స్వయంశ్లాఘనతోవున్న బిడ్డ సరైన చికిత్సను పొందటమనేది ఒక పోరాటంగా ఉండగలదు. ఇవి మరియు ఇతర వికాసాల కారణంగా, స్వయంశ్లాఘన ఉన్న వారు అనేకులు మంచి అభివృద్ధి సాధించారు, మరియు తగినంత మద్దతు, సహకారంతో కొంతమంది ఉద్యోగాలు చేయగల్గుతున్నారు మరియు కొంతమేరకు స్వతంత్ర జీవితాన్ని సాగించగల్గుతున్నారు. ఇతర వికలాంగులకొరకు తయారు చేయబడిన విద్యాపర కార్యక్రమాలు స్వయంశ్లాఘనను కలిగివున్న పిల్లల ప్రత్యేకమైన అవసరతలను తీర్చ లేకపోవచ్చు. అలా, తమ పిల్లవానికి కావలసిన సేవలను పొందడానికి ప్రయత్నించేటప్పుడు, అనేకమంది తల్లిదండ్రులు శస్త్రచికిత్సకులు, బోధకులు మరియు సాంఘికసంస్థలు తమకు పరిచయంలేని లోకంలో చాలమంది మరల మరల ప్రవేశించవలసి వస్తుందని కనుగొంటారు.

అనుదిన జీవితం

చాలామంది యౌవనుల్లా కాకుండా, స్వయంశ్లాఘనతోవున్న పిల్లలు చుట్టుప్రక్కల పరిసరాలనుండి సమాచారాన్ని త్వరగా ఆకళింపు చేసుకోలేరు. ఇంట్లో లేక సంఘంలో వ్యవహరించేటప్పుడు కలిగుండ వలసిన కొన్ని సాధారణ లక్షణాలను నేర్పించడం సవాలువంటి మరియు నెమ్మదిగా అంచెలంచెలుగా జరగవలసిన ప్రక్రియ. ప్రతిదిన చర్యలో తల్లి లేక తండ్రి ఒక పని తర్వాత మరొక పని చేయటంలో రద్దీని కలిగివుంటారు; వాళ్లకు దుస్తులను ధరించటానికి, ఆహారాన్ని అందించటానికి, మరుగుదొడ్డికి వెళ్లడానికి సహాయంచేస్తూ, విఘాతం కలిగించిన లేక సరిగ్గాలేని ప్రవర్తనను సరిదిద్దుతూ, ఏదైనా ప్రమాదాలు ఏర్పడితే వాటినుండి సంరక్షిస్తుండాలి. “అతడికి [నా కుమారుడికి] పది సంవత్సరాలు వచ్చేవరకు, నాకు ప్రతిరోజు గడవటమే ఒక గండంగా ఉండేది,” అని ఒక తల్లి గుర్తు చేసుకొంటుంది.

పిల్లలకు ఎడతెగక పర్యవేక్షణ కూడా అవసరం గనుక దాని వలన వారిని చూసుకునే వారిపై ఒత్తిడి అధికమౌతుంది. “టామీకి ప్రమాదం అంటే ఏమిటోనే తెలియదు గనుక ఎల్లప్పుడూ ఎడతెగక కావలి కాయబడుతుండాలి,” అని అతని తల్లి రీటా చెబుతుంది. చాలామంది స్వయంశ్లాఘన కలిగిన పిల్లలు నిద్ర పోయే విషయంలో క్రమరహితంగా ఉండటంవలన, తరచుగా రాత్రులందుకూడా అప్రమత్తంగా ఉండవలసివస్తుంది. “నేను ఒక కంట గమనిస్తూనే నిద్రపోతాను” అంటూ ఈ శీర్షికలో ముందు మాట్లాడిన క్రిస్టోఫర్‌యొక్క తల్లియైన ఫ్లోరేన్స్‌ చెబుతుంది.

పిల్లలు పెరిగే కొలది, అయితే ఈ ఆపేక్షాలనేవి తగ్గచ్చు ఇతరమైనవి తీవ్రతరంగా కావచ్చు. అభివృద్ధి జరిగినప్పటికీ, స్వయంశ్లాఘనను కలిగి ఉన్నవారికి వాళ్ల జీవితకాలమంతా కొంత మేరకు పర్యవేక్షణ అవసరమవుతూనే ఉంటుంది. స్వయంశ్లాఘన గల పెద్దవాళ్లకు ప్రత్యేక నివాస వసతి ఉండటం చాలా తక్కువ గనుక, స్వయంశ్లాఘనగల పిల్లవాని తల్లిదండ్రులు, వాన్ని జీవితాంతం ఇంట్లోనే ఉంచుకుని శ్రద్ధ వహించవలసిన, లేదా అది అసాధ్యమైనప్పుడు, తమ యౌవన బాలున్ని ఇన్స్‌టిట్యూషన్‌లో ఉంచవలసిన ఎంపికలను ఎదుర్కొంటారు.

ప్రజలను ఎదుర్కొనుట

“జోయోకి యిప్పుడు 18 సంవత్సరాలు, అతనిని ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలంటే శ్రమతోకూడిన పని. స్వయంశ్లాఘనను కలిగిన చాలామంది పిల్లల్లులాగే పైకి చూడటానికి అతడు సహజంగానే కనబడతాడు, కాని అతని ప్రవర్తననుబట్టి, ప్రజలు తదేక దృష్టితో చూస్తూ నవ్వుతారు, పైగా విమర్శ చేస్తారు. కొన్నిసార్లు అతడు సరిగ్గా వీధి మధ్యలో నిలబడిపోయి, తన చేతి వ్రేళ్లతో గాలిలో వ్రాయటం మొదలుపెడతాడు. అతడు పెద్ద శబ్దాలు ఏమైన వింటే, అనగా కారు హారన్లు లేక మనుష్యులెవ్వరైనా దగ్గినా, తాను ఉద్రేకపడి పోవటమేకాక, వద్దు! వద్దు! వద్దు! అని గావుకేకలు పెడతాడు. ఎందుకంటే యిది ఏ సమయంలోనైనా సంభవించవచ్చు గనుక వాస్తవానికి అది మమ్మల్ని కంగారు పెడుతుంది” అని రోసీమారీ చెబుతుంది. మరొక తల్లి ఇలా చెబుతుంది, “అది ప్రజలకు వివరించి చెప్పాలంటే కష్టతరమైనది. ‘అతడు స్వయంశ్లాఘన ఉన్న వ్యక్తి,’ అని మీరు చెప్పినపుడు ఆ మాట వాళ్లకు ఏమి అర్థంకాదు.”

ఈ కష్టాలమూలంగా, ప్రాథమిక-శ్రద్ధ వహించేవారు (సాధారణంగా తల్లి) సులభంగానే ఒంటరి ఆమె అవ్వగలదు. “నేను స్వతహాగానే బిడియంగల వ్యక్తిని, కాబట్టి ప్రజల అవధానమంతా నా పైకి రావడాన్ని నేను కోరుకోను,” అని మేరీ ఆన్‌ చెబుతుంది. “అందుకని నేను జిమ్మీని ఆడుకొనే మైదానానికి సర్వసాధారణంగా ప్రజలు ఎప్పుడూ అక్కడ లేనప్పుడూ, అంటే ప్రాతఃకాల సమయాన లేక భోజనసమయంలోనైనా తీసుకొని వెళ్లుతుండేదాన్ని.” (సామెతలు 22:6, 7 పోల్చండి.) మరి యితర తల్లిదండ్రులకైతే ఇంటిలోనుండి బయటకు వెళ్లడమే కష్టం ఒక సవాలుగా ఉంటుంది. “కొన్నిసార్లు నా యింటిలో నేను ఖైదీగా ఉన్నట్లు భావిస్తుంటాను,” అని షీలా వ్యాఖ్యానిస్తుంది.

కుటుంబాన్ని ఐక్యంగా ఉంచుకోవడం

చిల్డ్రన్‌ విత్‌ ఆటీసమ్‌ అనే పుస్తకంలో మైఖల్‌ డి ఫావర్స్‌ వ్రాస్తూ: “స్వయంశ్లాఘనను కలిగివున్న బిడ్డకు ముఖ్యమైన ఒక విషయమేమిటంటే . . . కుటుంబమంతా కలిసివుండటమే.” ఇది ఒక అసాధారణమైన సవాలే. స్వయంశ్లాఘనతోవున్న బిడ్డను పెంచటంలో వచ్చే కష్టాలు, ఊహించలేని భావోద్రేక వ్యధను మిక్కుటంగా కలిగిస్తాయి. కఠినమైన, వేదనతోకూడిన, భయాన్ని కలిగించే భావాలు పెరగటంవల్ల, వివాహజతల మధ్య సంభాషణ అనేది ఆగిపోవచ్చు. కొన్ని సమయాల్లో ఇద్దరికీ ప్రత్యేకమైన ప్రేమ, మద్దతు అవసరం కావచ్చు, అది ఇవ్వడానికి ఇద్దరి వద్ద ఎక్కువ ఉండకపోవచ్చు. ఇటువంటి తీవ్రమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, వేలాది జంటలు ఈ సవాలును విజయవంతంగానే ఎదుర్కొంటున్నారు.

రోబిన్‌ సైమన్స్‌ రాసిన ఆఫ్‌టర్‌ ది టీయర్స్‌ అనే పుస్తకం, అటువంటి విజయవంతమైన జంటల అనుభవాలనుండి ఈ క్రింది ఇవ్వబడిన మూడు సలహాలను సూచిస్తుంది. మొదటిగా ఏమంటే, “వాళ్లను ఎంతో బాధాకరమైన భావాలనుకూడా పరీక్షించి, వాటిని పంచుకోడానికి మార్గాన్ని కనుగొనండి.” రెండవది, కుటుంబంలోని పాత్రలను, ఏర్పాటులను తిరిగి విచారణచేస్తూ, పనిభారాన్ని సహేతుకంగా అందరూ కలిగివుండేలా సర్దుబాటు చేయవచ్చు. మూడోవది, కేవలం మీ యిద్దరూ మాత్రమే కలిసి పని చేసే విధంగా ఒక క్రమ పట్టికను కలిగివుండండి. డా. ఫవర్స్‌ యింకా దానిపై ఇలా వివరిస్తుంది: “మీ కుటుంబ జీవితంలో మీ ముఖ్య విషయాలను, మీ సమయాన్ని విభాగిస్తూ, ప్రతివక్కరి అవసరాలను తీర్చటానికి సమతుల్యంచేస్తూ, మీరు ఎంత సమయాన్ని తీసుకోగలరో నిర్ణయిస్తూ, మీ పిల్లల అవసరాలు, లేదా వారిపట్ల మీ వాత్సల్యం మీ కుటుంబ జీవితాన్ని ప్రమాదంలో పడవేయకుండా చూడండి.”—ఫిలిప్పీయులు 1:10; 4:5 పోల్చండి.

స్వయంశ్లాఘన యొక్క ప్రభావాలు తీవ్రమైనవైనప్పటికీ దాన్ని కలిగున్న వ్యక్తులు సహాయం పొందగలరు. ఒక ప్రాముఖ్యమైన విషయమేమనగా త్వరగా దానిని గుర్తించి, అలా సరియైన చికిత్సను పొందగలగటమే. ఈ ప్రయత్నాలను తిన్నగా ఫలవంతమైన మార్గాలకు నడిపించగలదు. మంచి సంభాషణ మరియు ఉన్న వనరులను సమతుల్యంగా ఉపయోగిస్తే కుటుంబం అనవసరంగా కష్టపడవలసి ఉండదు. (సామెతలు 15:22 పోల్చండి.) అర్థంచేసుకునే బంధువులు, స్నేహితులు కలిసి తల్లిదండ్రులకు చురుకైన సహాయాన్ని అందిస్తూ అవసరమైన మద్దతునివ్వవచ్చు. ప్రజలు స్వయంశ్లాఘనను ఎరుగటం, అదేమాదిరిగా స్వయంశ్లాఘనతో ఉన్న వ్యక్తులను సమాజంలోకి అంగీకరించటం వారు కుటుంబాలు కలిగున్న భారాన్ని అనవసరంగా అధికం చేయకుండా ఆపుతుంది. అలా స్వయంశ్లాఘనను ఎదుర్కొనే సవాళ్లలో మనమందరమూ సరైన పాత్రను నిర్వహించగలము.—1 థెస్సలొనీకయులు 5:14 పోల్చండి.

[34వ పేజీలోని చిత్రం]

అతనికి [నా కుమారుడికి] పది సంవత్సరాలు వచ్చేవరకు కూడ, ప్రతిరోజు అన్ని పనులు నేనే చూసుకోనేదాన్ని” అని ఒక తల్లి చెబుతుంది

[Box on page 24]

ప్రత్యేకమైన సామర్ధ్యాలు

స్వయంశ్లాఘనతోవున్న పిల్లలు కొన్నిసార్లు ప్రత్యేకమైన సామర్ధ్యాలను చూపుతారు, ప్రతి చిన్న అంశాన్నీ మరియు ముఖ్యంకాని విషయాలనుకూడా క్షుణంగా ఆశ్చర్యకరమైనరీతిలో జ్ఞాపకముంచుకొంటారు. కొంతమంది అసాధారణ రీతిలో సంగీత సామర్ధ్యాన్ని కలిగి, సంక్లిష్టమైన సంగీత సృతులను వాళ్లు చదవలేకపోయినా పాడగల సామర్ధ్యాన్నీ కలిగి ఉండగలరు. కొంతమంది ఆ వారంలోవున్న ఒకరోజును యింతకు ముందువున్న లేదా భవిష్యత్తులో రాబోయే తారీఖులాగే ఉన్నవాటిని లెక్కగట్టి అనుకోకుండానే చెప్పగలరు. కొంతమంది గణితశాస్త్రంలో మంచిదిట్టగా ఉండగలరు.

[25వ పేజీలోని బాక్సు]

ఇతరులు ఎలా సహాయం చేయగలరు

సంబంధాన్ని కలిగి ఉండండి: మొదట్లో ఆ కుటుంబం ఎంతగా కలత చెంది ఉండవచ్చంటే వారు ఇతరులతో తమ భావాలను పంచుకునే స్థితిలో ఉండకపోవచ్చు. ఓర్పుతోను, వివేచనతోను, పట్టువిడువకుండా, వారిని సహాయాన్ని అందించండి. వాళ్లు మీతో మాట్లాడడానికి వస్తే, ఒత్తిడి కలిగించకుండా వాళ్లు చెప్పేది వినటానికి ప్రయత్నించండి.

సలహా ఇవ్వడానికి నిదానించండి: స్వయంశ్లాఘనతోవున్న పిల్లలు చెడిపోయినట్లుగా మరియు కొంత కట్టుదిట్టమైన క్రమశిక్షణ అవసరమైన వారిగా కనబడవచ్చు గనుక, ఇతరులు తమకు సహృదయంతోనే కాని తెలిసీ తెలియని సలహాలను ఇస్తున్నారని తల్లిదండ్రులు తరచు కనుగొంటారు. ఇటువంటి ‘తేలికైన పరిష్కారాలు’ పోరాడుతున్న తల్లిదండ్రులకు అణగద్రొక్కునట్లుగావుండి, వాళ్లను ఎవ్వరుకూడ అర్ధంచేసుకోలేరు అనే భావాన్ని మిగుల్చుతాయి.

కార్యకలాపాల్లో ఆ కుటుంబాన్నికూడా కలుపుకోండి: స్వయంశ్లాఘనతోవున్న పిల్లలను కలిగి ఉన్న కుటుంబాలు సాంఘికాచారాల్లోను, వినోదకార్యకలాపాల్లోను యితర కుటుంబాలు అనుభవిస్తున్న వాటినుండి మినహాయించబడినట్లుగా అప్పుడపుడు భావిస్తుంటారు. వాళ్లనుకూడా మీ కుటుంబంతో కలిసి సాంగత్యం చేయటానికి ఆహ్వానించండి. వాళ్లకు ప్రత్యేకమైన అవసరతలు కావాలని కోరినట్లయితే, దయచేసి వాటిని ఏర్పాటుచేయటానికి ప్రయత్నించండి. ఆ ప్రత్యేక ఆహ్వానాన్ని ఆ కుటుంబం అంగీకరించక పోయినప్పటికీ, వాళ్లు మీరు ఇచ్చిన ఆహ్వానాన్ని మెచ్చుకుంటారు.

ఆ పిల్లవాన్ని చూసుకోడానికి ఆఫర్‌ చేయండి: కుటుంబాలకు ఉన్న గొప్ప అవసరతల్లో ఒకటి స్వయంశ్లాఘనయొక్క ఎడతెగని సవాళ్లనుండి ఎదుర్కొనే కొంత విరామమే. కొన్నిసార్లు ఆ పిల్లవాడ్ని కొన్ని నిమిషాలపాటు శ్రద్ధ వహిస్తామని కోరవచ్చు. తర్వాత రానురాను సాయంత్రాలు ఆ కుటుంబం బయటకు వెళ్లెటప్పుడు, లేదా వారాంతంలో వెళ్లెటప్పుడైనా వాడ్ని చూడడానికి కోరవచ్చు. అటువంటి సర్దుబాట్లు కుటుంబాలు తమ శక్తిని పునరుజ్జీవింపచేయగలవు.

మీరు అందించే సేవలన్నింటిలోకన్నా మించినది తాము ఇతరులచే ప్రేమింపబడుతున్నామని, విలువైన వారిగా ఎంచబడుతున్నామనే భావమే ప్రాముఖ్యమైనది. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే, స్వయంశ్లాఘనతోవున్న బిడ్డను కలిగివున్న కుటుంబానికి మీరు మంచి స్నేహితులుగా ఉండటంలో కొనసాగటమే.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి