కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 2/8 పేజీలు 17-19
  • నేనెందుకు ఈ భావాలను కలిగివున్నాను?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నేనెందుకు ఈ భావాలను కలిగివున్నాను?
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సహజమైనదా లేక సాధకం చేయబడినదా?
  • పరిసర కారకాలు
  • తండ్రి మరియు కుమారుడు
  • నైతిక అంశము
  • సలింగసంయోగం—నిజంగా అదంత చెడ్డదా?
    తేజరిల్లు!—1995
  • ఈ భావాలు పోయేలా నేనెలా చేయగలను?
    తేజరిల్లు!—1995
  • హోమోసెక్సువాలిటీ తప్పా?
    యువత అడిగే ప్రశ్నలు
  • హోమోసెక్సువల్స్‌ గురించి బైబిలు ఏమి చెప్తుంది?
    తేజరిల్లు!—2016
తేజరిల్లు!—1995
g95 2/8 పేజీలు 17-19

యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .

నేనెందుకు ఈ భావాలను కలిగివున్నాను?

“నాలో నేనే ఒక అంతర్యుద్ధం జరుగుతున్నట్లుగా భావిస్తున్నాను. సహాయంకొరకు ఎక్కడికి వెళ్లాలో నాకు తెలియడం లేదు.”—బాబ్‌.

చాలామంది యౌవనులు అదేమాదిరి మానసికమైన బాధను అనుభవిస్తున్నారు. వ్యతిరేకలింగ వ్యక్తులపట్ల ఆసక్తి కలిగి ఉండటంలో ఎక్కువగా మునిగి ఉన్నట్లు కనిపించే తమ తోటివారివలె కాకుండా, తాము స్వలింగ వ్యక్తులపట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నామని వీరు కనుగొంటారు. చాలామంది, ఈ విషయాన్ని తెలిసికొని విభ్రాంతి చెందుతారు.

ఒక స్త్రీ తన కుమార్తెను గురించి ఇలా చెప్పింది: “ఆమె ఆరోగ్యం క్షీణించటం మొదలుపెట్టింది, ఏమి తినలేక పోతుంది, లేదా నిద్రకూడ పోలేక పోతుంది, రానురాను మనస్సు క్రుంగిన దానిలాగా మరియు అస్థిర చిత్తంగల దానిలాగ ఉంటుంది. ఆమె ఆత్మహత్యా ప్రయత్నంకూడ చేసింది.” ఈ దురవస్థకుగల ముఖ్య కారణమేమిటి? “ఆమె సలింగ భావాలను కలిగివుంది.” కొంతమందికి ఇటువంటి భావాలనుండి బయటకు రావటం సులభతరమేమి కాదు. “నేను కౌమారదశలో ఉన్నపుడు, నా స్నేహితులలో కొంతమందితో సలింగసంయోగ అనుభవాలను కల్గివుండటం మొదలుపెట్టాను. దీనిని యెహోవాసాక్షులతో బైబిలు పఠనం చేసేవరకు, అంటే యౌవనదశవరకు కొనసాగించాను. అయితే అటువంటి చెడు భావాలు నాలో కొన్నిసార్లు కలుగుతుండేవి,” ఒక యౌవనస్థుడు ఒప్పుకుంటున్నాడు. అతన్ని మనం మార్క్‌ అని పిలుద్దాము.

ఒక యౌవనుడు లేక యౌవనురాలు స్వలింగ వ్యక్తులయెడల ఆకర్షితులు అవ్వటానికిగల కారణమేమిటి? ఇటువంటి భావాలతో మానసిక వ్యధననుభవిస్తున్న యౌవనులు ఏమి చేయాలి?

సహజమైనదా లేక సాధకం చేయబడినదా?

ఈనాడు సలింగసంయోగులు అలాగే పుడతారని మరియు ఆ లైంగిక ప్రవృత్తి మార్చబడలేనిదని ఒక నానుడి ఉంది. ఉదాహరణకు, టైమ్‌ పత్రిక, విచిత్రంగా ఇలా ప్రకటించింది: “సలింగసంయోగుల మెదడు ఆకృతికి భిన్నలింగసంపర్క సంబంధమైన వారి మెదడు ఆకృతికి వ్యతాసమున్నదని క్రొత్త అధ్యయనం తెలియజేస్తుంది.” అయితే, ఎయిడ్స్‌ మూలంగా చనిపోయిన పురుషుల మెదడుపై ఈ అధ్యయనం చేయబడింది. కచ్చితంగా ఇది అసలు అంశాన్ని ఎంత మాత్రం నిరూపించదు!

మరొక సిద్ధాంతంలో హార్మోన్లు ఇమిడివున్నాయి. ప్రయోగశాల ఫలితాల ప్రకారం పురుష హార్మోన్లు లేకుండా చేయబడిన ఎలుకలు “స్త్రీ” సంపర్క ప్రవర్తనను చూపినట్లు శాస్త్రజ్ఞులు గమనించారు. జన్మించడానికి ముందు మరీ ఎక్కువ లేక మరీ తక్కువ పురుష లింగ హార్మోన్ల ప్రభావానికి లోనవ్వడం వలన—అంటే ఎలుకలవలె సలింగసంయోగులు కూడా జన్యు సంబంధ విపత్తుకు గురైన వారని వారు భావించారు. ఎలుకల్లోని బేసి ప్రవర్తన ఒక ప్రతిక్రియకంటే ఎక్కువగా ఉంటుందని—వాస్తవానికి అది ‘సలింగసంయోగం’ కాదని చాలామంది శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. అంతేకాకుండ, మానవులు ఎలుకలు కారు. ది హార్వార్డ్‌ మెడికల్‌ స్కూల్‌ మెంటల్‌ హెల్త్‌ లెటర్‌ ఇలా వాదిస్తుంది: “ఎలుకలు సంభోగ ప్రవర్తనలో ఇమిడివుండే ప్రతిప్రవర్తనలను క్రమబద్ధంచేసిన విధంగానే, జననానికి పూర్వ హార్మోన్లు మానవ లైంగికతనుకూడా ప్రభావితం చేయడం సాధ్యమౌతుందనడం సమంజసంకాదు.”

జన్యుశాస్త్ర సంబంధ అధ్యయనాలకు ఎక్కువ అవధానాన్ని ఇవ్వటం జరిగింది. తమలాగే ఉన్న కవలలుగల సలింగసంయోగ పురుషులు మరియు స్త్రీలల్లో దాదాపు సగంమంది కవలలు వారిలాగే సలింగసంయోగులు. సమరూప [ఒకేలా ఉండే] కవలలు జన్యు రూప్యా నకలులు గనుక ఈ భేదాన్ని ఏదో నిగూఢమైన జన్యువే కలిగించిందని నిర్థారించడం సహేతుకంగా ఉంటుందని అనిపించింది. అయితే, కవలలుగావున్న పిల్లల్లో సగం మంది సలింగసంయోగులు కాదు అనే విషయాన్ని గమనించండి. ఈ ప్రవర్తన వాస్తవంగా జన్యు సంబంధమైన ఏర్పాటే అయి ఉన్నట్లయితే, కవలలందరిలోను ఇది ఉండాలి కదా? నిజమే, జన్యుకణాలు మరియు హార్మోన్లు కొంత పాత్రను వహిస్తాయి. అయినప్పటికీ, “లైంగిక ప్రవృత్తికి పరిసర ప్రాంతము ప్రాముఖ్యంగా గమనీయంగా దోహదపడుతుందని” రుజువులు చూపుతున్నాయని కొందరు కనుగొన్న దానిని సైంటిఫిక్‌ అమెరికన్‌ నివేదిస్తుంది.

పరిసర కారకాలు

ప్రాచీన గ్రీసులోవున్న పరిస్థితిని గమనించండి. వాళ్ల పౌరాణిక దేవుళ్లల్లో కొంతమందిని గూర్చివున్న శృంగార కథలు, ప్లాటోవంటి తత్త్వశాస్త్రజ్ఞులు వ్రాసిన వ్రాతలు, యౌవనస్థులు దాదాపు దిగంబరులుగా ప్రదర్శించే వ్యాయామశాలల సాంప్రదాయం వలన ప్రోద్భలం పొందినవారై, గ్రీకు మాట్లాడే విద్యావంతులు సలింగసంయోగక్రియల్లో అమితాసక్తితో పాల్గోనేవారు. లవ్‌ ఇన్‌ ఎన్‌షేన్ట్‌ గ్రీస్‌ పుస్తకం ప్రకారంగా “క్రీట్‌లోని ఉన్నత కుటుంబంనుంచి వచ్చిన అబ్బాయి [పురుష] ప్రేమికుడు లేకుండా ఉండటమనేది అవమానకరంగా చూడబడేది.” మర్మమైన జన్యుకణాలు లేదా హార్మోన్లు ఇట్టి అవినీతిస్థితికి కారణంకాదు. గ్రీకు సంస్కృతి దానిని అనుమతించినందుకు, అవును, ప్రోత్సహించినందుకు అది విస్తరించింది. పరిసరాల ప్రభావం ఎంత శక్తివంతమైన పాత్రను నిర్వహిస్తుందో ఇది చక్కగా వివరిస్తుంది.

సలింగసంయోగాన్ని ప్రోత్సహించే ప్రచారం వెల్లువగా వ్యాపించటం నేడు ఆ దృక్పథం వ్యాపించటానికి కారణమైంది. టి.వి., సినిమాలు, సంగీతం మరియు పత్రికల్లో సలింగసంయోగాన్ని గూర్చిన ప్రస్తావన చాలా ఎక్కువగా ఉంది. కేబుల్‌ టెలివిజన్‌ కొంతమంది యౌవనస్థులకు విపరీతమైన ఫార్నాగ్రఫీని చూడటానికి వీలు కలిగిస్తుంది. (అటు ఆడమగ తేడా తెలియకుండా) ఉభయలింగ శైలిలో దుస్తులను ధరించటం మరియు తలదువ్వుకొనటం అనేవి ప్రస్తుత ఫాషన్‌గా మారిపోయాయి. కొంతమంది స్త్రీలు పురుష వ్యతిరేక ఉద్యమం చేయటంద్వారాకూడా సలింగ వ్యభిచారం పెరగటానికి దోహదపడిందని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. సలింగసంయోగ జీవితవిధానాన్ని బహిరంగంగా సమర్థించే తోటి విద్యార్థులుగల యౌవనస్థులు చెడు ప్రభావానికి లోనౌతున్నారు.—1 కొరింథీయులు 15:33.

తండ్రి మరియు కుమారుడు

కొన్నిసార్లు, లోపంగల కుటుంబ పరిస్థితి కూడా ప్రాముఖ్యంగా పురుషుల్లో ప్రాముఖ్య పాత్ర నిర్వహిస్తుందనిపిస్తుంది.a ఒక తండ్రి బిడ్డ భావోద్రేకంగా పెరగటానికి ఒక ముఖ్యమైన తోడ్పాటును అందించగలడు. (ఎఫెసీయులు 6:4) నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము అనే పుస్తకం చెప్పునది ఏమనగా: “తండ్రి లక్షణాలు, వారి వ్యక్తిత్వాన్ని సమతుల్యతతో పెంపొందించు కోవడానికెంతో బాగుగా తోడ్పడుతాయి.”b ఒక పిల్లవాడికి తండ్రినుండి గుర్తింపు, ప్రేమ మరియు మెప్పుదల అవసరమైవున్నాయి. (లూకా 3:22 పోల్చండి.) ఎపుడైనా ఒక తండ్రి తన బిడ్డకు అవసరమైన ఈ శ్రద్ధను ఇవ్వటంలో విఫలుడైనట్లైతే దాని పరిణామమేమై ఉంటుంది? భావోద్రేక క్రుంగుదలే. మానసిక-ఆరోగ్య రచయితైన జోసఫ్‌ నికోలోసీ పురుష సలింగసంయోగం, “కుటుంబ సంబంధాల్లోని సమస్యల ఫలితంగా, ప్రాముఖ్యంగా తండ్రి మరియు కుమారుని మధ్య ఉండే వాటి ఫలితంగా జరుగుతుందని,” చెబుతున్నాడు.

ఒక తల్లి తన భర్తను అగౌరవపర్చటం లేదా తన కుమారునిపై ఎక్కువ అధికారాన్ని చూపడం అనుకోకుండానే పరిస్థితిని తీవ్రతరం చేయవచ్చు. స్త్రీలక్షణాలను కలిగివున్న బాలురపై జరిపిన ఒక అధ్యయనంలో కనుగొన్నది: “కొంతమంది తల్లిదండ్రులు బాబుకాకుండా పాప పుట్టాలని ఇష్టపడి ఉంటారు, మరి వాళ్లు మోసపూరితంగా పిన్నవయస్సుగల కుమారునికి బాలికలాగా దుస్తులను వేయటం లేదా ఆ విధానంలో తయారవ్వమని ప్రోత్సహించడం చేస్తుంటారు.” అట్లాంటి వాళ్లలో మూడవ శాతం మంది సలింగసంయోగులు అయ్యారు.

దాని అర్థం తప్పుడు లైంగిక భావాలు కలగటానికి ఒకని తల్లిదండ్రులే తప్పనిసరిగా కారణమని నిందను మోపటంలేదు. ఎక్కువ అధికారాన్ని చూపే తల్లులను కలిగివుండినవారు, అజాగ్రత్తగల తండ్రి ఉన్నవారు, లేక తండ్రి లేనివారు, లేదా తండ్రిచే చిన్నతనంలో భంగపర్చబడిన పురుషులు చాలామంది పురుషసంబంధమైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకున్నారు. అంతేకాకుండా, సలింగసంయోగ అభీష్టాలు తప్పనిసరిగా భ్రష్టమైన కుటుంబాలనుండి రావాలనే ఏమీలేదు. కొంతమంది బాలురు వేరే ప్రత్యేక రీతిలో గాయపర్చబడ్డారని కనిపిస్తుంది. “తండ్రిచేత ఉపేక్షింపబడ్డానని తొలిదశల్లోనే గ్రహించడం మూలంగా . . . ,” “మగవారి గుర్తింపు లక్షణాలుగా పరిగణింపబడే శక్తి, స్థిరత్వం మరియు బలం వంటి లక్షణాలను తాను కలిగిలేను మరియు అసమర్థున్ని అన్న ఒక భావాన్ని సలింగసంయోగి కలిగి ఉంటాడు. తన స్వంత మగసిరికొరకైన అన్వేషణలో అతను మగవారు కలిగుండే బలంపట్ల ఆకర్షితుడౌతాడు” అని డా. నికోలోసి చెప్పాడు.

పీటర్‌ అనే పేరుగల ఒక యౌవన క్రైస్తవుడు ఇలా వ్రాశాడు: “మా నాన్న ఒక త్రాగుబోతు మరియు క్రమంగా మా అమ్మను కొడుతూండేవాడు, కొన్నిసార్లైతే, పిల్లలమైన మమ్మల్నికూడా కొట్టేవాడు. నాకు 12 సంవత్సరాలున్నపుడు, ఆయన ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. తండ్రి లేకపోవటమనే తీవ్రమైన బాధను నేను అనుభవించాను. ఆ శూన్యాన్ని ఎవరైన భర్తీ చేస్తారేమోనని నేనెప్పుడూ ఆలోచించేవాడ్ని. నాకున్న అవసరాన్ని భర్తీ చేస్తాడని నేనకున్న ఒక మంచి క్రైస్తవ వ్యక్తితో నేను చివరికి స్నేహాన్ని అభివృద్ధి చేసుకొన్నపుడు, అతనిపట్ల లైంగిక భావాలను నేను కలిగి ఉండటం ప్రారంభించాను.”

ఆసక్తికరంగా, సలింగసంయోగుల్లో చాలా ఎక్కువమంది బాల్యప్రాయంలో అత్యాచారానికి గురైన వాళ్లే.c ఆ అత్యాచారమే భౌతికంగాను, భావోద్రేకంగాను చెరిగిపోని లోపాలను ఉత్పన్నం చేయగలదు. అది కొంతమందిలో “వక్రీకరించబడిన లైంగిక గుర్తింపు” అని ఒక రచయిత్రి వర్ణించిన దాన్ని సృజించగలదు. ప్రాచీనకాల సొదొమనందు ఈ పరిస్థితి ఉందని స్పష్టంగా కన్పిస్తుంది, అక్కడ యౌవనస్థులు అక్రమ సంబంధాలయెడల అధికమైన కోరికను కలిగివుండిరి. (ఆదికాండము 19:4, 5) స్పష్టంగా, వాళ్లు వయోజనుల వాంఛకు బలైనవారే.

నైతిక అంశము

స్వలింగంవారిపట్ల ఆకర్షణ విషయంలో సహజమైనదా లేక సాధకం చేసుకోబడిన ఆకర్షణే ఎంత భాగం వహిస్తున్నది శాస్త్రజ్ఞులు ఎప్పటికీ తేల్చి చెప్పలేరు. అయితే ఒకటి మాత్రం స్పష్టం: మానవులందురునూ చెడు ఆలోచనలకు మరియు కోరికలకు లోబడే ప్రవృత్తి కలిగివున్నారు.—రోమీయులు 3:23.

ఒక యౌవనస్థుడు దేవుడ్ని ప్రీతిపర్చాలనే కోరికను కలిగివుంటే నైతిక కట్టడలకు సరితూగాలి మరియు అట్లా చేయటం మిక్కిలి కష్టమైనప్పటికీ అనైతిక ప్రవర్తనను విడిచిపెట్టాలి. నిజమే, కొంతమంది బైబిలు చెబుతున్నట్లు ‘కోపిష్టి స్వభావాన్ని’ కలిగి ఉన్న విధంగా కొంతమంది వ్యక్తులు సలింగసంయోగం యెడల అపేక్ష కలిగి ఉంటారు. (తీతు 1:7) అయినప్పటికీ బైబిలు కారణరహితంగా కోపాన్ని ప్రదర్శించడాన్ని ఖండిస్తూనే ఉంది. (ఎఫెసీయులు 4:31) అదేమాదిరిగా, ఒక క్రైస్తవుడు అనైతిక ప్రవర్తనను క్షమించకూడదు, అతడు ‘పుట్టుకతోనే’ అలా ఉన్నాడు అన్న సాకు చెప్పకూడదు. పిల్లలను లైంగికంగా భంగపర్చేవారు పిల్లలపట్ల తమకు కలిగే వాంఛ స్వభావసిద్ధమైనదని వారు చెప్పేటప్పుడు అదే జాలి కలిగించే సాకు చెబుతారు. అయితే వారి లైంగిక అభీష్టం రోగగ్రస్తమైనదన్న, అక్రమమైనదన్న విషయాన్ని ఎవరైనా నిరాకరించగలరా? ఒకే లింగ వ్యక్తులపట్ల ఉండే కోరిక విషయంలో కూడా అంతే.

స్వలింగవ్యక్తులపట్ల ఆకర్షించబడుతున్నామని కనుగొనే యౌవనస్థులు అటువంటి భావాలను త్రోసివేయాలి. అయితే, బైబిలు సలింగసంయోగాన్ని ఎందుకు కచ్చితంగా ఖండిస్తుంది? అటువంటి జీవన విధానం నిజంగా అక్రమమైనదా? అయినట్లయితే, ఒక యౌవనస్థుడు ఆ మార్గాన్ని విడనాడడానికి ఏమి చేయగలడు? ఈ ప్రశ్నలు రాబోయే తేజరిల్లు! సంచికలో చర్చించబడతాయి.

[అధస్సూచీలు]

a స్త్రీ సలింగసంయోగం అభివృద్ధి చెందే దానిగురించి చాలా తక్కువే పరిశోధించబడిందని చెప్పవచ్చు. కుటుంబ ప్రభావాలు ఇక్కడకూడా ఒక పాత్రను నిర్వహిస్తాయనడంలో సందేహంలేదు.

b వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీచే ప్రచురించబడింది.

c ప్రాచీన గ్రీసులో పిల్లలను భంగపర్చటమే సలింగసంయోగులు ఎక్కువ అయ్యేందుకు ఒక కారణము. యౌవన బాలురను వంభించే పురుషులను “ఆశపోతుతనానికి మరియు తీవ్రమైన క్రూరత్వానికి చిహ్నమైన”—“తోడేళ్లు” అని సూచించేవాళ్లు. వాళ్లకు బలి అయ్యే యౌవనులను “గొర్రెపిల్లలు” అని పిలిచేవాళ్లు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి