“వైద్యుని కర్తవ్యాన్ని గూర్చిన నా అభిప్రాయం మారింది”
జపాన్నందలి ఓసాకాలోని ఆకాన్ అనే నాలుగేండ్ల బాలికకు సంకీర్ణమైన గుండె కుహర అస్వాభావికతలు—గుండె త్రిపత్రిక కవాటం మూసుకు పోవడం మరియు గుండెలోని అరలను వేరు చేసే పొరలో లోపాలు—ఉన్నాయి, వాటికి తాను గుండెకు పెద్ద శస్త్రచికిత్స చేయించుకోవలసి ఉంది. ఆమె తల్లిదండ్రులు రక్తం లేకుండా శస్త్రచికిత్స చేయమని వైద్యులను ప్రాథేయపడ్డారు.a
పిల్లలకు రక్తం తక్కువ మోతాదులో ఉండడం వలన వారికి రక్తరహిత గుండె శస్త్రచికిత్స చేయడం కష్టం. ఆకాన్ విషయంలో, రక్తం లేకుండా శస్త్రచికిత్స చేయడానికి వైద్యులు సమ్మతించారు. వారి శ్రేష్ఠమైన వైద్య నిపుణతలను కనబరుస్తూ, ఆకాన్ శస్త్రచికిత్స విజయవంతమయ్యింది. ఆమె త్వరగానే కోలుకుంది మరియు ఇప్పుడు మంచి ఆరోగ్యాన్ని అనుభవిస్తుంది.
ఆకాన్ తల్లి ఆ శస్త్రచికిత్సలో పాల్గొన్న వైద్యులకు ఉత్తరం వ్రాసింది, దానితోపాటు, ఇటీవల తీసిన ఆకాన్ ఫోటోను కూడా పంపింది. ఒక అనెస్తేసియాలజిస్ట్ ఆమెకు జవాబు వ్రాసింది. దానిలో కొంత భాగం ఈ విధంగా చదవబడుతుంది:
“ఆకాన్ అద్భుతంగా కోలుకోవడం మమ్మల్ని పులకరింపజేస్తుంది. మీరు ఉత్తరంలో పంపిన చక్కని చిత్రాన్ని చూసినప్పుడు నా కన్నీటిని ఆపుకోలేక పోయాను. శస్త్రచికిత్స చేయడం కష్టం కాదు గాని మీ విశ్వాసాలకు మరియు నా విశ్వాసాలకు మధ్య ఉన్న తేడా నన్ను మరి ఎక్కువగా కలవరపెట్టింది. ఈ అనుభవం వలన, వైద్యుని కర్తవ్యాన్ని గూర్చిన నా అభిప్రాయం ఇప్పుడు మారింది. వైద్యులు ప్రాణాన్ని కాపాడడానికి తమ వైద్యశాస్త్ర పరిజ్ఞానంలోని తమ సరైన అవగాహనను ఉపయోగించాలి, అయితే, వారు రోగి యొక్క ఆత్మ గౌరవాన్ని మరియు అభిలాషలను కూడా గౌరవించాలి.”
[అధస్సూచీలు]
a అపొస్తలుల కార్యములు 15:29కి అనుగుణ్యంగా, యెహోవాసాక్షులు రక్తాన్ని ఎక్కించుకోడంతో సహా రక్తాన్ని విసర్జిస్తారు. అయినప్పటికీ వారు రక్తరహిత వైద్య చికిత్సను అంగీకరిస్తారు.