‘నా కుమారుని ప్రాణాన్ని రక్షించినది’
కావలికోట మరియు దాని సహపత్రికయైన తేజరిల్లు! పత్రికల్లో తాను చదివిన సమాచారమేనని అమెరికానందలి, కాలిఫోర్నియాలోని ఒక తల్లి వివరించింది. ఆమె యిలా వ్రాసింది:
“నన్ను, నా చిన్న (నాలుగేండ్ల) కొడుకును బలవంతంగా తీసుకువెళ్ళి, తుపాకితో చంపుతానని భయపెట్టి, బలవంతంగా నా బ్యాంకుకు డ్రైవ్ చేపించాడు. దుండగుడు నన్ను దోచుకున్నాడు, కాని నా కొడుకును లాక్కుని, నేను పారిపోగలిగాను. ఈ విలువైన పత్రికల్లో ముద్రించబడిన ఆచరణాత్మకమైన బైబిలు సలహాలే నిజానికి నా కొడుకు ప్రాణాన్ని, అలాగే నా ప్రాణాన్ని కాపాడాయని భావిస్తున్నాను.”
ఆ తల్లి యింకా యీ విధంగా వివరించింది: “ఇలాంటి అపాయకరమైన పరిస్థితులను మనం ఎదుర్కొన్నప్పుడు మనమెలా నెమ్మదిగా ఉండాలనే విషయాన్ని గూర్చి తేజరిల్లు! పత్రికలో నేను క్రితం చదివాను. నేను నెమ్మదిగా ఉండడానికి సహాయం చేయమని వెంటనే యెహోవా దేవునికి ప్రార్థించాను. నేను ఆ దుండగునికి బైబిలు లేఖనాలను ఉదాహరిస్తూ, అతడ్ని శాంతపరచగలిగాను కూడా.”
కావలికోట మరియు తేజరిల్లు!ల ఉద్దేశమేమంటే, మన ప్రయాస కాలాలు బైబిలులో ప్రవచించబడ్డాయని చూపించడమే. అవి నేటి ఒత్తిళ్ళుగల పరిస్థితులను ఎదుర్కోడానికి కూడా ప్రజలకు సహాయమందిస్తాయి. కాని పత్రికలు యింకా ఎక్కువ చేస్తున్నాయి. ప్రార్థించమని యేసు తన శిష్యులకు నేర్పించిన దేవుని రాజ్యాన్ని—ఒకే ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని అవి ఉన్నతపరుస్తున్నాయి. (మత్తయి 6:9, 10) మీరు కావలికోట, తేజరిల్లు! పత్రికలను క్రమంగా చదివి తప్పకుండా ప్రయోజనం పొందగలరు.
మీరు కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలను మీ యింటికి తెప్పించుకోవాలనుకుంటే, దయచేసి, Praharidurg Prakashan Society, Plot A/35, Nr Industrial Estate, Nangargaon, Lonavla 410 401, Mah., లేదా 5వ పుటలోని మీకనుకూలమైన చిరునామాకు వ్రాయండి.