కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 9/8 పేజీలు 3-4
  • పాఠశాలకు తిరిగి వెళ్ళడం—ఎందుకు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠశాలకు తిరిగి వెళ్ళడం—ఎందుకు?
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎందుకీ సమస్య?
  • అదనపు విద్యనభ్యసించాలా, వద్దా?
    తేజరిల్లు!—1994
  • సంకల్పముతో కూడిన విద్య
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • తల్లిదండ్రులారా—మీరు మీ పిల్లలకు ఎలాంటి భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • బైబిలు విద్యాభ్యాసాన్ని నిరుత్సాహపరుస్తుందా?
    తేజరిల్లు!—1998
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 9/8 పేజీలు 3-4

పాఠశాలకు తిరిగి వెళ్ళడం—ఎందుకు?

ఉద్యోగం కొరకు రాబర్ట్‌ మూడు సంవత్సరాలు చేసిన ప్రయత్నం నిరాశతోకూడిన అనుభవము. చివరకు, అతనికి 21 ఏండ్లు వచ్చినప్పుడు, వేసవి క్యాంపులో సలహాదారునిగా పనిచేశాడు. ఇప్పుడు కొంత విముక్తి లభించినా, రాబర్ట్‌ ఉద్యోగం కొరకు, వెతికి వెతికి అలసిపోయాడు. “మన తల్లిదండ్రులకు యిదేమీ అర్థం కాదు. ఈ రోజుల్లో ఉద్యోగం దొరకడం చాలా కష్టము,” అని అతడు అంటున్నాడు.

రాబర్ట్‌లాగే, లెక్కలేనంత మంది యౌవనస్థులు ప్రతి సంవత్సరం పాఠశాల విద్యను ముగించి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకు ఆశలు ఉన్నాయి. వాళ్ళకు పథకాలున్నాయి. అయితే, ఎక్కువ మందికి వాళ్ళు ఎదురు చూసినటువంటి ఉద్యోగాలు లభించడం లేదని గ్రహిస్తున్నారు.

అందుచేత, చాలామంది పైచదువులకు వెళ్తున్నారు.a “డెబ్బయిలలో అయితే విద్యాభ్యాసం వలన లభించే ప్రయోజనాలను గూర్చి ప్రతికూల దృక్పథం ఉండేది. ఎనభైలలో, ప్రజలకు డిగ్రీలు సంపాదించండి లేదా శిక్ష అనుభవించండి అనే మరొక విధమైన దృక్పథమేర్పడింది.” అని ఫోర్చ్యూన్‌ అనే పత్రిక అంటుంది.

ఎందుకీ సమస్య?

తరచూ అదనపు విద్యాభ్యాసం ఎందుకంత అవసరమౌతుంది? మొదటిగా ఎక్కువ ఉద్యోగాలకు ప్రావీణ్యత అవసరముంది. “బ్యాంకులో టెల్లర్‌ స్థానంలో నగదు యంత్రాలు తయారయ్యాయి,” అని యు. ఎస్‌. లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి అంటున్నారు. “ఇప్పుడు [ఆయన] పని, ద్రవ్య లావాదేవీలలో మూడు రకాల డిపాజిట్లను గూర్చి సలహా యిచ్చి, ఒకదానికన్నా నేను మరొకదాన్ని ఎందుకు ఎంచుకోవాలో నాకు వివరించడమే.” హౌస్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ లేబర్‌ కమిటీ అధ్యక్షుడు, విలియమ్‌ డా. ఫోర్డ్‌ యీ విధంగా చెబుతున్నాడు: “మామూలు ఉద్యోగాలు యిప్పుడు లేవు.”

రెండవది, పాఠశాలలు విద్యార్థులకు అవసరమైన విద్యను నేర్పించడం లేదని కొందరు భావిస్తున్నారు. చదవడం, రాయడం, గణిత శాస్త్రాన్ని నేర్పించడంకన్నా ఎక్కువగా మాదక ద్రవ్యాల దుర్వినియోగం, ఎయిడ్స్‌, గర్భనిరోధం అనే అంశాలను నొక్కి చెబుతున్నారని వారంటున్నారు. ఇరవైయేడు సంవత్సరాలుగా ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న డా. రాబర్ట్‌ ఆప్లేటన్‌ యిలా విలపిస్తున్నారు, పాఠశాల విద్యావిధానం “సాంఘిక సేవా సంస్థల్లాగ తనకు సంబంధించని సమస్యలను చేపడుతూ” భారాన్ని మోస్తున్నట్లు కనిపిస్తుంది.

కొన్ని పాఠశాలలు విద్యార్థులకు నేర్పవలసిన నైపుణ్యాలను నేర్పడంలో వైఫల్యం చెందడంవల్ల, ఉన్నత పాఠశాలలో చదువు ముగించినవారు ఆర్థికంగా తమ కాళ్ళపై తాము నిలబడలేకపోతున్నారు. “వారికి పని చేయడం నేర్పలేదు, యౌవనస్థుల వలన వచ్చే సమస్యలను గూర్చి యజమానులు తరచూ నాతో, వారికి చదవడం, రాయడం సరిగ్గా రాదని చెబుతుంటారు. వాళ్ళు ఉద్యోగ దరఖాస్తును స్వయంగా పూరించలేరని చెబుతుంటారు,” అని ఫ్లోరిడా జాబ్‌ సర్వీస్‌ ఆఫీస్‌ మ్యానేజర్‌గా పనిచేస్తున్న జోసెఫ్‌ డబ్ల్యు. ష్రూడర్‌ అంటున్నారు.

అదనపు విద్య అవసరం కావడానికి మూడవ కారణమేమంటే, ఎన్నో దేశాలలో ఎంతోమంది పట్టభద్రులు ఉద్యోగాల కోసం వెదుకుతున్నారు. “వాళ్ళ నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలకన్నా మించిన కాలేజీ పట్టభద్రులున్నారు,” అని ది న్యూయార్క్‌ టైమ్స్‌ చెబుతుంది. ఈ నివేదిక యింకనూ యిలా అంటుంది, “ఇలా ఎక్కువ మంది ఉండడం వలన యజమానులు పాఠశాల చదువు ముగించినవారిని తీసుకోడానికి విముఖత చూపిస్తున్నారు.”

తమను పోషించుకోడానికి తగిన ఉద్యోగానికి యోగ్యత పొందేందుకు చాలామంది పాఠశాలకు తిరిగి వెళ్తున్నారు. అమెరికాలో, 59 శాతం మంది ఉన్నత పాఠశాల తర్వాత కూడా తమ చదువు కొనసాగిస్తున్నారు. కొన్ని దశాబ్దాల వరకు స్థిరంగా ఉన్న సంఖ్యయైన 50 శాతం కన్నా గణనీయమైన పెరుగుదలను అది చూపిస్తుంది.

ఇతర దేశాల్లో కూడా అదే ధోరణి కనిపిస్తుంది. ఉదాహరణకు, బ్రిటన్‌లో కనీస విద్యాభ్యాసం కన్నా ఎక్కువగా చదువుకున్న విద్యార్థుల అనుపాతం 1960వ పడి నుండి ఎక్కువవుతుంది. ఇటీవల సంవత్సరంలో ఆస్ట్రేలియానందు ఉన్నత పాఠశాల చదువును ముగిస్తున్న వారిలో 85 శాతం మంది యూనివర్సిటీలకు, కాలేజీలకు దరఖాస్తు చేస్తున్నట్లు గమనించబడింది. దాదాపు 95 శాతం మంది జపాన్‌ విద్యార్థులు, ఎక్కడ ఉద్యోగం కోసం లేదా కాలేజీలో చేరడానికి సిద్ధమౌతున్నారో అక్కడ అదనంగా మూడు సంవత్సరాల విద్యనభ్యసించడానికి పరీక్షలు రాస్తున్నారు.

అయినప్పటికీ, అదనపు విద్యాభ్యాసం ఆశించిన లాభాలను ఎల్లవేళలా అందించదు. దాని లాభనష్టాలు ఏమిటి? (g94 8/22)

[అధస్సూచీలు]

a పాఠశాల చదువుల పేర్లు ఒక దేశానికి మరొక దేశానికి తేడాగా ఉంటాయి. ఈ శీర్షికల్లో, “ఉన్నత పాఠశాల” అనే పదం తప్పనిసరిగా ఉండవలసిన చదువును, “కాలేజీ,” “యూనివర్సిటీ,” “టెక్నికల్‌ స్కూల్‌,” “వొకేషనల్‌ స్కూల్‌” అనే పదాలు చట్టం కోరినది కాకుండా స్వయంగా చేపడుతున్న విద్యాభ్యాసాలను సూచిస్తున్నాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి