కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 8/8 పేజీలు 16-17
  • జూదం క్రైస్తవులకు తగునా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూదం క్రైస్తవులకు తగునా?
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రజలు ఎందుకు జూదమాడతారు?
  • దేవుని దృక్కోణం
  • జూదానికి క్రొత్తగా అలవాటుపడినవారు—యౌవనులు!
    తేజరిల్లు!—1995
  • జూదమాడడాన్ని బైబిలు ఖండిస్తోందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • జూదం నిజంగా అంత చెడ్డదా?
    తేజరిల్లు!—1992
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 8/8 పేజీలు 16-17

బైబిలు ఉద్దేశం

జూదం క్రైస్తవులకు తగునా?

జూదం ఒక ఖరీదైన అలవాటు. అది తరచూ ఒకరి రాబడిలో సగానికి సగం హరించి వేస్తుంది, చాలా అప్పులకు కూడా దారితీయగలదు. ఈ అలవాటు వివాహ జీవితాలను, భవిష్యత్తును నాశనం చేయగలదు, కొందరు ప్రజలు నేరాలకు పాల్పడేలా చేయగలదు. దీని బాధితులు దానికి బానిసలౌతారు, ఇతర వ్యసనాలకు బానిసలైన వాళ్లలాగే వీళ్లకు కూడా దాన్ని మానడానికి ప్రయత్నిస్తే చాలా కష్టం కలగవచ్చు.

జూదం ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఎక్కువైందంటే కొన్ని దేశాలు దానిని “జాతీయ కాలక్షేపంగా” పరిగణిస్తున్నారు. అయితే, జూదం అంటే కచ్చితంగా ఏమిటి? జూదం అంటే “ఒక భవిష్యత్తు సంఘటన యొక్క ఫలితాన్ని గురించి పందెం కాయడం,” అని ది వరల్డ్‌ బుక్క్‌ ఎన్‌సైక్లోపేడియా పేర్కొంటుంది. “జూదగాళ్లు తాము ఊహించిన ఫలితం వస్తుందని దేనిపైనైనా డబ్బును లేక విలువైన దాన్ని దేన్నైనా పణంగాపెట్టి పందెంకాస్తారు. ఆ ఫలితం వచ్చినప్పుడు, గెలిచినవాడు ఓడిపోయిన వాడు పందెంగా పెట్టినదాన్ని తీసుకుంటాడు.”

జూదం క్రొత్త సంగతేమి కాదు. మధ్య అమెరికాకు చెందిన ప్రాచీన మాయా జాతికి చెందిన ప్రజలు పొక్‌టాటొక్‌ అని పిలువబడే ప్రసిద్ధి చెందిన బంతి ఆటను ఒకప్పుడు ఆడారు—అది ఆజ్‌టెక్‌ వారికి ట్లాష్‌ట్లీగా తెలుసు—అందులో కొందరు, [ఆటపై పందెం కాయడం ద్వారా] తమ ఆస్తిని పోగొట్టుకుని, తమ జీవితాలను కూడా పణంగా పెట్టారు,” అని అమెరికాస్‌ పత్రిక చెబుతోంది. ప్రాచీన కాలాల్లోని వీరికి జూదంపిచ్చి పట్టింది, వారు కొన్నిసార్లు “ఆ రబ్బరు బంతి యొక్క అల్పమైన కదలికపై ఆధారపడి తమ జీవితాలను బానిసత్వానికి అమ్ముకునేందుకు సిద్ధపడ్డారు.”

చాలామందికి ఈ జూదం పిచ్చి ఎందుకు పట్టింది? అమెరికాలోని పబ్లిక్‌ గేమింగ్‌ రీసర్చ్‌ ఇన్స్‌టిట్యూట్‌ అధ్యక్షుడైన డ్వేన్‌ బుర్క్‌ ప్రకారం, “అనేకమంది ప్రజలు జూదాన్ని ఒక అంగీకరించదగిన కాలక్షేపంగా వ్యవహరిస్తున్నారు.” కొన్ని మతపర సంస్థలు డబ్బు సేకరించడానికి జూదం ఆడవచ్చని అంటున్నాయి.

జూదం ప్రఖ్యాతిగాంచినదైనా, పెద్ద చరిత్రగలదైనా, అది క్రైస్తవులకు ఒక నిష్కపటమైన కాలక్షేపంగా ఉండగలదా? లేక దానిలో అంతకంటే ఇంకేమైనా యిమిడి ఉందా?

ప్రజలు ఎందుకు జూదమాడతారు?

క్లుప్తంగా చెప్పాలంటే, అది గెలవడానికే ఆడతారు. జూదగాళ్లు, జూదం అంటే లౌకిక ఉద్యోగం వద్ద పని చేయడంలో యిమిడి ఉండే ప్రయాస, క్రమశిక్షణ లేకుండా డబ్బును పొందడానికి త్వరగావచ్చే, ఉల్లాసకరమైన మార్గమని భావిస్తారు. “పెద్ద గెలుపు,” అది తీసుకురాగల ఘనతను, వస్తువులను గురించి, కలలు కనడంలోనే ఎక్కువ సమయం పోతుంది.

కానీ జూదంలో ఎదురయ్యే నిరాశలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు, స్టాటిస్టీషియన్‌ అయిన రాల్ఫ్‌ లిష్చ్‌ చెప్పేదేమంటే, “[జర్మనీ లాటరీ] పూల్‌లో జర్మనీలో మీరు [గెలవడానికంటే], సంవత్సరంలో మీపై మెరుపు నాలుగుసార్లు మెరవగల అవకాశం ఉంది.” అది ఒప్పింపజేసేదిగా అనిపించకపోతే, ఆయన ఈ క్రింది విధంగా పోల్చి చెబుతున్నాడు: “మీరు ఒక పురుషుడైతే, [లాటరీ గెలవడానికంటే] మీరు 100 సంవత్సరాల [వయస్సు వరకు] జీవించగల అవకాశం 7,000 సార్లు ఎక్కువగా ఉంది.” హాస్యాస్పదంగా, జూదగానికి ఈ సంగతి తెలిసే ఉండవచ్చు. కాబట్టి, అతను జూదం ఆడడంలో కొనసాగడానికి ఏది కారకం?

డా. రాబర్ట్‌ కస్టర్‌ ప్రకారం, వెన్‌ లక్క్‌ రన్స్‌ అవుట్‌ అనే తన పుస్తకంలో వ్రాసినది ఏమంటే, జూదమాడే వాళ్లలో కొందరికి, “ఆర్థిక లాభం గెలవడానికి కొంత స్ఫూర్తిని మాత్రమే యిస్తుంది. . . . వాళ్లకు ముఖ్యమైందేమంటే డబ్బును గెల్చుకోవడం ద్వారా వచ్చే ఈర్ష్య, గౌరవం, పొగడ్తలు ముఖస్తుతి.” ఆయనింకా చెప్పేదేమంటే అలాంటి వాళ్లకు, “డబ్బు కట్టలను విదిలించి చూపగలగడం లేక కేవలం ‘నేను ఐదుసార్లు గెలిచానని’ చెప్పగలగడం, కీర్తిని పొందడం చాలా సరదాగా ఉంటుంది.”

ఇంకో వైపు, గెలవడం, దానితో వచ్చే ఆనందాన్ని పొందడం మాత్రమే చాలామంది జూదగాళ్లకు సరిపోదు. జూదమాడాలన్న తపన ఎంత ఎక్కువ పెరగగలదంటే వాళ్లిక తప్పనిసరి జూదగాళ్లు అవుతారు. డా. కస్టర్‌ (జూదగాళ్లు తమ వ్యసనాన్ని అధిగమించడానికి సహాయపడే) గ్యాంబ్లర్స్‌ అనానిమస్స్‌ అనే సంస్థ సభ్యులతో కలిసి నిర్వహించిన అధ్యయనంలో, సర్వే చేయబడిన వారిలో 75 శాతం మంది తాము ఓడిపోతున్నప్పుడు కూడ గెలవడాన్ని గూర్చి డాబుగా మాట్లాడే వాళ్లమని చెప్పారు! అవును, జూదమాడటం ఒక వ్యసనంగా మారగలదు, మద్యం లేక ఇతర మాదక ద్రవ్యాలకు బానిసలయినంత తీవ్రంగా, నాశనకరంగా ఉండవచ్చు. ఎంతమంది జూదగాళ్లు దాన్ని కాలక్షేపం కొరకు ఆడటం నుండి దాన్ని ఆడకపోతే బ్రతుకలేమన్నంత పరిస్థితికి వచ్చారు? అలా తయారై కూడా, తామలా మారామని తెలుసుకోలేని వాళ్లు ఎంతమంది ఉన్నారు?

దేవుని దృక్కోణం

బైబిలు జూదాన్ని గురించి వివరంగా చర్చించడం లేదు. అయిననూ, దేవుడు జూదమాడటాన్ని ఎలా దృష్టిస్తున్నాడు అనేదాన్ని నిర్ణయించడంలో సహాయం చేసే సూత్రాలను మాత్రం అది అందిస్తుంది.

అనుభవం చూపేదేమంటే జూదమాడటం లోభత్వాన్ని ప్రతిబింబిస్తుంది. బైబిలు లోభత్వాన్ని తీవ్రంగా ఖండిస్తుంది, ‘లోభులు దేవుని రాజ్యములో ప్రవేశించరు’ అని కూడా హెచ్చరిస్తుంది. (ఎఫెసీయులు 5:5) జూదగాళ్లు ఓడిపోయినప్పుడు కూడా లోభత్వం స్పష్టమౌతుంది. జూదగాడు “తాను ఓడిపోయిన దాన్ని మళ్లీ గెలవడానికి ప్రయత్నిస్తాడు—ఆ ‘పెద్ద గెలుపు’ పొందడానికి చూస్తుంటాడు. ఒకవేళ అతను ఎక్కువ గెలుచుకున్నా, అతను ఎక్కువ పందెం కాస్తాడు, మరి చివరకు తన ‘పెద్ద గెలుపును’ పోగొట్టుకుంటాడని” ఒక అధికారి చెబుతున్నాడు. అవును, లోభత్వం జూదమాడటంలో తప్పకుండా ఒక భాగము.

తమ అహంకారాన్ని పోషించుకునే ఒక ఉపకరణంగా కొంతమంది జూదాన్ని ఉపయోగిస్తారు. జూదమాడకుంటే ఉండలేని జూదగాళ్లపై నిర్వహించిన సర్వే చూపినదేమంటే 94 శాతం మంది జూదమాడడాన్ని “అహంకారాన్ని పెంపొందింపజేసే కార్యకలాపంగా,” పరిగణిస్తారని, మరి 92 శాతం మంది తాము జూదమాడినప్పుడు “గొప్ప వ్యక్తిగా” భావించామని చెప్పారు. అయినా, దేవుడిలా చెబుతున్నాడు: “గర్వము అహంకారము . . . నాకు అసహ్యములు.” కావున, క్రైస్తవులు దీనత్వాన్నీ, సాత్వికాన్ని పెంపొందించుకోవాలని ప్రేరేపించబడుతున్నారు.—సామెతలు 8:13; 22:4; మీకా 6:8.

జూదమాడటం సోమరితనాన్ని కూడా కల్గించవచ్చు, ఎందుకంటే అది పని చేయడానికి అవసరమయ్యే ఏ శ్రమ లేకుండానే డబ్బు సంపాదించేదిగా కన్పించవచ్చు. కానీ దేవుని వాక్యం శ్రద్ధగా, కష్టించి పని చేయమని క్రైస్తవులను స్పష్టంగా ప్రోత్సహిస్తుంది.—ఎఫెసీయులు 4:28.

అంతేకాకుండా, అదృష్టమని పిలువబడేది కొందరు జూదగాళ్లకు ఎంత ప్రాముఖ్యం అవుతుందంటే వాళ్లు దాన్ని అతిగా ప్రేమించి, దాన్నే తమ దేవునిగా చేసుకుంటారు. ఇది ‘అదృష్టదేవికి . . . బల్ల సిద్ధపరచిన’ ప్రజలను గురించిన బైబిలు వృత్తాంతానికి పోలికగా ఉంది. వారి విగ్రహారాధనా సంబంధ ప్రవర్తనను బట్టి, వారు ‘ఖడ్గానికి’ అప్పగింపబడ్డారు.—యెషయా 65:11, 12.

ఒకవేళ జూదమాడేందుకు ఉపయోగించడానికి ఒక వ్యక్తికి ఉచిత లాటరీ టికెట్టు లేక ఉచితంగా డబ్బు ఇవ్వబడితే అప్పుడేమి చేయాలి? ఏ పరిస్థితిలో కూడా, అటువంటి దాన్ని అంగీకరించడం జూదానికి సంబంధించిన కార్యకలాపాలకు మద్దతునిచ్చినట్లే అవుతుంది—అది దేవుని సూత్రాలకు విరుద్ధంగా ఉన్న కార్యకలాపము.

జూదమాడటం క్రైస్తవులకు తగదు. ఒక పత్రికా సంపాదకుడు చెప్పినట్లుగా, ‘జూదమాడటం తప్పే కాదు అదొక పనికిరాని పని.’

[Picture Credit Line on page 16]

Valentin/The Cheaters, Giraudon/Art Resource

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి