నక్షత్రాలకు, మానవునికి—ఏమైన సంబంధం ఉన్నదా?
నక్షత్రాలను పరిశీలించడం అనేది క్రొత్త విషయమేమి కాదు. ది వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా చెబుతున్నట్లుగా, వ్యవసాయదార్లు కొన్నివేల సంవత్సరాల పూర్వమే, “ఎప్పుడు తమ నాట్లను వేయాలోయని నక్షత్రాలను పరిశీలించేవారు. నావికులుకూడా నక్షత్రాలనుబట్టి దిక్కులను చెప్పడం నేర్చుకున్నారు.” నేడు అంతరిక్ష యాత్రలో మార్గదర్శకాలుగా నక్షత్రాలు యింకనూ ఉపయోగించబడుతున్నాయి. పూర్వీకులు నక్షత్ర సమూహాలలో గ్రహమండలంలో వ్యక్తులు, జంతువులు చిత్రీకరించబడ్డారని తాము భావించే కల్పిత కథల్ని కనిపెట్టారు. అటు తరువాత నక్షత్రాలు తమ జీవితాలపై ప్రభావాన్ని చూపగలవని ప్రజలు తలంచుటకారంభించారు.
ఎంచుకొనదగు విస్తారమైన నక్షత్రాలు
నక్షత్రాల అపరిమిత సంఖ్య వాటి పరిమాణము సంభ్రమాన్ని కల్గిస్తాయి. వాటిలో కొన్ని పది వేల కోట్ల సమూహాలు లేదా విస్తారమైన సమూహాలతోకూడిన నక్షత్రాలు ఈ విశ్వంలో ఉన్నట్టుగా అంచనా. “ఒక సాధారణమైన చర్చిలో బియ్యం నింపినంతటి సంఖ్యలో అవి అమర్చబడ్డాయి” అని ది ఇంటర్నేషనల్ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఎస్ట్రానమీ చెబుతుంది. మన సౌరకుటుంబం కూడా ఒక భాగమైయున్న పాలపుంతలోనే అన్ని నక్షత్రాలున్నాయని అంచనా వేయబడింది. మన భూమికి సూర్యుడు తప్ప అతి దగ్గరగా ఆల్ఫా సెంచురీ గుంపులో ఉన్న ఒక నక్షత్రం. దాదాపు 4.3 కాంతి సంవత్సరాల దూరంలో వుంది. కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అని అంటారు. అంటే మనం నక్షత్రాలవైపు చూసినపుడు, మన కంటికి కన్పించే కాంతి నక్షత్రంనుండి బయలువెళ్లి అప్పటికే 4.3 సంవత్సరాలయ్యిందని, అప్పటినుండి ఒక సెకనుకు 2,99,792 కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలో ప్రయాణిస్తూ వచ్చిందని దాని భావము. దీనిలో ఎంతదూరం యిమిడి ఉందో ఊహించడం మన మానసిక సామర్థ్యానికి మించింది. అయినప్పటికి, అది ఒక్కటే దగ్గరగా ఉన్న నక్షత్రం. కొన్ని నక్షత్రాలు మన నక్షత్రవీధిలోనుండి వందకోట్ల కాంతిసంవత్సరాల దూరంలో ఉన్నాయి. “జనములు చేదనుండి జారు బిందువులవంటివి. జనులు త్రాసుమీది ధూళివంటివారు. ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువులవలె నున్నవి” అని దేవుని ప్రవక్త చెప్పినపుడు ఆశ్చర్యపడనక్కరలేదు. (యెషయా 40:15) ఈ చిన్న ధూళిరేణువులను ఎవరు పట్టించుకుంటారు?
భూమికి దగ్గరలో ఉన్న గ్రహం చంద్రుడే, అది మన భూమిపై ఒక కచ్చితమైన ప్రభావాన్ని కల్గివుంది. దాని గురుత్వాకర్షణశక్తి కొన్ని పాంత్రాలల్లో 15 మీటర్లు పోటుపాటుల వ్యత్యాసాన్నికూడ కల్గిస్తుంది. ముగ్గురు ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు తెల్పిన ప్రకారంగా, చంద్రునియొక్క గురుత్వాకర్షణశక్తి, భూమి అక్షం 23 డిగ్రీలు వంగి తిరుగుటకును, తద్వారా క్రమమైన ఋతువులు కల్గడానికి దోహదపడుతుందని ఇప్పుడు విశ్వసించబడుతున్నది. చంద్రుడు మన గ్రహముపై భౌతికమైన ప్రభావాన్ని కల్గియున్నందువలన, వందకోట్లకొలది నక్షత్రాల విషయమేమిటి? అని ప్రశ్నించుట సహేతుకమే. అయితే మొదటిగా, బైబిలువంటి ప్రాచీనాధారములు నక్షత్రాలనుగూర్చి మనకు ఏమి తెలుపుతున్నాయి?
లేఖనాలలో పేర్కొనబడిన నక్షత్రాలు
అక్షరార్థమైన మరియు సూచనార్థకమైన భావంలో బైబిలు అనేకసార్లు నక్షత్రాలనుగూర్చి పేర్కొన్నది. దృష్టాంతానికి, కీర్తనల గ్రంథకర్త పేర్కొన్న విధంగా, “రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను,” కాబట్టి సృష్టికర్త ఆ నక్షత్రాలను భూమికి వెలుగునిచ్చుటకు సహాయకములుగా అమర్చాడు. (కీర్తన 136:9, టానాక్) ఆ తరువాత, నమ్మకస్థుడైన అబ్రాహాముతో నిబంధన చేస్తున్నప్పుడు, దేవుడు: “‘నీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము ఆలాగవునని చెప్పెను.’” (ఆదికాండము 15:5) అపొస్తలుడైన పౌలు నక్షత్రాలు వ్యతాస్యాన్ని కల్గివున్నాయని నొక్కిచెబుతూ, ఇలా అన్నాడు: “సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమనుబట్టి యొక నక్షత్రమునకును మరియొక నక్షత్రమునకును భేదముకలదు గదా.”a (1 కొరింథీయులు 15:41) అదే సమయంలో, విస్తారమైన సంఖ్యలోనున్న ఈ నక్షత్రాలు వాటి మహిమ తమ సృష్టికర్తయొక్క పరిధి లేక ఆధీనములోనే ఉన్నాయి. “నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు. వాటికన్నిటికి పేర్లు పెట్టుచున్నాడు.”—కీర్తన 147:4.
మరొక ప్రక్కన, లేఖనాలల్లో నక్షత్రాలు అప్పుడప్పుడు వ్యక్తులను, అధికారులను మరియు దూతలను సంబోధించుటకు వాడబడుటను మనం కనుగొంటాం. యాకోబు కుమారుడైన యోసేపు తల్లిదండ్రులు, “సూర్యచంద్రులు”గాను తన సహోదర్లు “నక్షత్రములు”గాను చిత్రీకరించబడిన కలను కన్నాడు. దేవదూతలు “ఉదయనక్షత్రములుగా” పేర్కొనబడ్డారు. బబులోను రాజు ఇశ్రాయేలు జనాంగానికి దావీదు వంశపాలకులైన “దేవుని నక్షత్రముల”కంటె తనను తాను ఉన్నత పర్చుకున్నాడని చెప్పబడింది. క్రైస్తవ సంఘంలో అస్థిరులైన పురుషులను “మార్గము తప్పితిరుగు చుక్కలుగాను,” సంఘపెద్దలలో నమ్మకంగా పనిచేసే వ్యక్తులు, క్రీస్తు కుడిచేతిలోని నక్షత్రములుగాను పేర్కొనబడ్డారు.
‘నక్షత్రములు ఆకాశమునుండి సీసెరాతో యుద్ధము చేసెను,’ అని బైబిలునందలి ఒక వృత్తాంతము చెప్పుచున్నది, అతడు కనాను రాజైన యాబీనుకు సైన్యాధిపతిగావుండి, 20 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని అణచివేసాడు. ఇశ్రాయేలీయులను బంధకములనుండి విడిపించుటకు యెహోవా ఇశ్రాయేలీయుల న్యాయాధిపతియైన బారాకును నియమించి, సీసెరాకు తొమ్మిదివందల ఇనుప రథములున్నప్పటికి, ఆసాధారణమైన విజయాన్ని ఆయనకు ప్రసాదించాడు. విజయోత్సాహగీతములో ఇశ్రాయేలీయులు: “నక్షత్రములు ఆకాశమునుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గములలోనుండి సీసెరాతో యుద్ధము చేసెను,” అని పాడారు. నక్షత్రములు ఏవిధంగా యుద్ధం చేసాయన్న వివరణ ఏ మాత్రం ఇవ్వబడలేదు. యుద్ధంలో నక్షత్రములు నేరుగా ప్రభావాన్ని చూపినట్లుగా ఊహించడానికి బదులుగా, ఇశ్రాయేలీయుల తరపున దైవిక జోక్యం ఉందని ఆ మాటలు సూచిస్తున్నాయని నమ్మడం సహేతుకంగా వుంది.—న్యాయాధిపతులు 5:20.
బేత్లెహేములో “నక్షత్రము”
బైబిలునందు వివరించి చెప్పబడిన నక్షత్రాలన్నింటిలోను బాగా ఖ్యాతిగాంచినది, “తూర్పు దేశపు” జ్యోతిష్కులను నడిపించిన బేత్లెహేములోని “ఆ నక్షత్రము” యేసు పశువుల పాకలో జన్మించిన తరువాత, ఆయన తల్లిదండ్రులు ఆయన్ని తీసుకొని వెళ్లిన గృహానికి అది వారిని నడిపింది. ఆ నక్షత్రము ఏమిటి? దాదాపుగా 1,600 కిలోమీటర్లు దూరమునుండి జ్యోతిష్కులు దానిని అనుసరిస్తూ వచ్చారు, కాబట్టి, అది నిశ్చయంగా సామాన్యమైన నక్షత్రంకాదు. “ఆ నక్షత్రము” వారిని మొదటిగా యెరూషలేమునకు నడిపించింది. హేరోదు రాజు ఇది విన్నప్పుడు, వారిని ప్రశ్నించి బాలుడైన యేసును చంపడానికి నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత “ఆ నక్షత్రము” యేసు ఎక్కడ నివసిస్తున్నాడో ఆ ఇంటికి జ్యోతిష్కులను నడిపింది. నిశ్చయంగా ఏ సాధారణ నక్షత్రం అలా చేయజాలదు. నక్షత్రమును పొలిన ఆ రూపం దేవునినుండి కలిగిందా? జ్యోతిష్కులను పరోక్షముగా ‘బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లల నందరిని’ వధించమన్న విషయానికి నడిపింది. కావున దేవుని కుమారుని చంపించవలెనని దేవుని విరోధియైన సాతాను, “ఆ నక్షత్రమును” ఉపయోగించెననే ముగింపుకు రావడం సమంజసం కాదా?—మత్తయి 2:1-11, 16.
ఈ జ్యోతిష్కులు తూర్పునుండి, బహుశా ప్రాచీన కాలంలో మంత్రవిద్య, ఇంద్రజాలం, మరియు జ్యోతిష్యానికి నిలయమైన బబులోను నుండి వచ్చారన్న విషయాన్ని కూడ మనస్సునందుంచుకోవాలి. బబులోను దేవతలనుగూర్చి చెప్పిన తరువాత, సూర్యచంద్రాదులను చెప్పటం జరిగింది. నెబుకద్నెజరు రాజు కాలంలో, ఆయన యుద్ధం ప్రారంభించడానికి ఏ మార్గము సరియైనదో నిర్ణయించుకొనడానికి శకునమును ఉపయోగించెడివాడు.—యెహెజ్కేలు 21:20-22.
ప్రవక్తయైన యెషయా బబులోను సలహాదార్లను సవాలుచేస్తూ, ఇలా అన్నాడు: “నీవు [బబులోను] ఉపదేశించ బడినప్పటికికూడ శక్తిలేని దానివైతివి. నీ జ్యోతిష్కులు దూరప్రాంతమునుండి నిన్ను రక్షించుటకు వచ్చినప్పటికి—వారు నక్షత్రములగూర్చి అధ్యయనం చేసినవారు, ఆకాశముల ప్రదేశముల పటములు గీయువారును, మాసము తరువాత మాసము ఏమి జరుగునో వివరించి చెప్పువారునైయున్నారు. వారు గడ్డిపోచను పోలినవారు, కావున ఒక అగ్ని వచ్చి వారిని కాల్చివేయును. వారిని వారు రక్షించుకొనలేరు . . . మిమ్ములనుకూడ రక్షించలేరు.” యెషయా ప్రవచనాన్ని నిజంచేస్తూ, సా.శ.పూ. 539లో శక్తివంతమైన బబులోను, కోరెషు చేతిలో ఓడిపోయింది. బబులోను జ్యోతిష్కులు నక్షత్రాలద్వారా తాము అందిస్తామని పలికిన నడిపింపు, దానికి సంబంధించిన వారందరిని నాశనానికి దారితీసింది.—యెషయా 47:13-15.
అలాగంటే మనము నక్షత్రాలనుగూర్చి ఏమి నేర్చుకొనలేమని భావమా?
[అధస్సూచీలు]
a నక్షత్రాలు రంగులోను, పరిమాణములోను, కాంతిని ఉత్పత్తిచేసే పరిమాణంలోను, ఉష్ణోగ్రతలోను మరియు సాపేక్షసాంద్రతలోను వ్యత్యాసాన్ని కలిగివున్నాయి గనుక ఆధునిక ఖగోళశాస్త్రం పౌలు మాటలను రూఢిపరుస్తున్నవి.
[16వ పేజీలోని బాక్సు]
కొందరు ఏమన్నారంటే
జ్యోతిశ్శాస్త్రం: “ఖగోళ శాస్త్రానికి సమీపమైనది, సంయుక్తమైనది.”—జర్మనీ ఖగోళశాస్త్రజ్ఞుడైన జొహన్నాస్ కెప్లర్ (1571-1630).
“జ్యోతిష్కం అనేది విజ్ఞానశాస్త్రముకాదు, అది ఒక రోగం, . . . అన్నిరకాల మూఢనమ్మకాలు వృద్ధిపొందుచున్న నీడలో పెరుగుతున్న వృక్షమది.”—మోజెస్ మైమోనిడైస్ (1135-1204), మధ్య యుగమందలి యూదా పండితుడు.
పురాతన విజ్ఞానశాస్త్రము, వ్యక్తుల స్వభావాన్ని, వారి ప్రవర్తనను అంచనా వేయగలమని, భవిష్యత్తులో జరుగు ప్రవృత్తులు, సంఘటనలు ఆకాశమందలి కదలికలనుబట్టి చెప్పగల్గుతున్నామని చెప్పుకొంటున్నది. . . . నక్షత్రాలను, గ్రహాలను చూస్తున్నామని చెప్పుకొంటున్నాయి. బహుశా క్రీ.పూ. 6వ శతాబ్దములో ఇరాక్ ఉత్తర భాగంలోని జ్యోతిష్కులు వ్యక్తిగత జాతక పత్రికను ప్రవేశపెట్టారని అనుకొంటున్నారు. ఒక వ్యక్తి జన్మించినప్పుడు కదలింపబడని నక్షత్రాలు అలాగే సూర్యుడు, చంద్రుడు మరి ఐదు గ్రహాలు విడిచిపెట్టు ప్రభావముతో దీనికి సంబంధమున్నది. . . . జ్యోతిశ్శాస్త్రం జాతక వ్యాఖ్యాన పద్ధతులు అనంగీకారమైన మరియు వాస్తవాలపై ఆధారపడని వ్యక్తిగత భావాలపై ఆధారపడి ఉన్నాయని ఖగోళశాస్త్రజ్ఞులు, యితర వైజ్ఞానికులు కనుగొన్నారు.”—కె. ఎ. రోనన్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్, ఈస్ట్ ఏషియన్ హిస్టరీ ఆఫ్ సైన్స్ ట్రస్ట్, కేంబ్రిడ్జ్, ఇంగ్లాండ్, మరియు ది ఇంటర్నేషనల్ ఏన్‌సైక్లోపీడియా ఆఫ్ ఎస్ట్రానమీనకు ఆయన రచయిత దానినుండే ఈ వ్యాఖ్యానం తీసుకొనబడింది.
ఈ వాస్తవేతర విషయాలను వివరిస్తూ, రోనన్ పశ్చిమదేశాల దృష్టిలో, ఎఱ్ఱని గ్రహమైన అంగారకుడు, యుద్ధానికి మరియు క్రూరమైన స్వభావముతో సంబంధాన్ని కలిగియుండగా, చైనీయులు, ఎరుపు ఒక అందమైన రంగని, మరియు అంగారకుడు అనుకూల ప్రభావాన్ని చూపుతాడని ఉద్దేశిస్తున్నారు. దానికి భిన్నంగా, పశ్చిమ దేశాల కల్పితకథలలో శుక్రుడు తెలుపురంగుతో అందంగా ఉన్నాడని చెప్పబడింది. చైనీయులు “తెలుపు . . . మరణానికి, క్షీణతకు మరియు నాశనానికి సూచనయని పరిగణిస్తున్నారు. శుక్రుడు మాత్రం ‘అంధకారమయమైన యుద్ధగ్రహం’ అని చెప్పబడుతున్నది.
రోనన్ ఇంకా వివరిస్తూ: “పురాతన వైజ్ఞానిక శాస్త్ర తత్త్వమున్నప్పటికి, జ్యోతిశ్శాస్త్రము పూర్వపు రోజుల్లో ఖగోళశాస్త్ర పరిశీలనను పురికొల్పడానికి, దానికి కావలసిన నిధులను సేకరించడానికి ఎంతో ఉపయోగకారిగా ఉంది.”
“నూట తొంభై రెండు మంది ప్రముఖ శాస్త్రవేతలు చేసిన వాగ్మూలం—జ్యోతిశ్శాస్త్రముపై ఆక్షేపణలు” అనే విషయముపై 1975లో 19 మంది నోబెల్ బహుమతి విజేతలు, వారితోపాటుగా ఇతర శాస్త్రవేతలు ఒక ప్రకటనను విడుదల చేశారు. అది యిలా అంటున్నది:
“ప్రాచీనకాలంలో ప్రజలకు . . . భూమికి, గ్రహాలకు మరియు నక్షత్రాలకు మధ్యగల విస్తారమైన దూరం విషయంలో సరియైన అవగాహన లేదు. మనమిప్పుడు వాటి మధ్యగల దూరాలను లెక్కించగలం గనుక, ఎంతో దూరంలోనున్న గ్రహాలు, మరింత దూరంగా వున్న నక్షత్రాలు ఉత్పత్తి చేసే గురుత్వాకర్షణ శక్తి, వాటి ప్రభావం ఎంత అత్యల్పమో మనం చూడగలం. జన్మించే సమయంలో గ్రహాలు, నక్షత్రాలు ఉత్పత్తి చేసే శక్తులు మన భవిష్యత్తును ఏ విధంగానైనా రూపుదిద్దగలవని భ్రమించడం పొరపాటు.”b
[అధస్సూచీలు]
b జ్యోతిశ్శాస్త్రమునుగూర్చిన మరింత వివరణకోసం మే 8, 1986, అవేక్! నందలి 3-9 పేజీలు చూడండి.