కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 7/8 పేజీలు 18-19
  • నక్షత్రాలు మీకొక సందేశాన్ని కలిగివున్నాయి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నక్షత్రాలు మీకొక సందేశాన్ని కలిగివున్నాయి!
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనం నక్షత్రాల నుండి ఏమి నేర్చుకొనగలము
  • నక్షత్రాలకు, మానవునికి—ఏమైన సంబంధం ఉన్నదా?
    తేజరిల్లు!—1994
  • సృష్టి దేవుని మహిమను వివరిస్తోంది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • మీ నక్షత్రరాశిలో ఉన్నదేమిటి?
    తేజరిల్లు!—1994
  • మీ జీవితం నక్షత్రాల గుప్పిట్లో ఉందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 7/8 పేజీలు 18-19

నక్షత్రాలు మీకొక సందేశాన్ని కలిగివున్నాయి!

ముందున్న శీర్షికలలో చూపబడిన మాదిరిగా, నక్షత్రాలు మహిమను కనుపరస్తున్నప్పటికిని, కేవలం అవి ఎందుకొరకు ఉంచబడినవో అంటూ: సృష్టికర్త తన సంకల్పముకొరకు ఈ నిర్జీవ వస్తువులను ఆకాశములో ఉంచాడని, తెలిసికొనడమే వాని విధి, మానవుడు వాటిని ఆరాధించకూడదు. నక్షత్రాలు యెహోవాయొక్క అద్భుత సృష్టిలో ఒక భాగమైయుండి, ఆయన నియమాలకు లోబడుతూ, నక్షత్రాలు ‘దేవుని మహిమను ప్రచురపరచుచు’ అదే సమయంలో మానవునికి వెలుగిచ్చుటకు మూలమై వుంటూ సృష్టికర్తయొక్క సంకల్పాన్ని నెరవేర్చుటలో ఆయనకు తోడ్పడుచున్నవి.—కీర్తన 19:1; ద్వితీయోపదేశకాండము 4:19.

మనం బైబిలునందు ఇట్లు చదువగలము: “తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునముచెప్పు సోదెగానినైనను, మేఘశకునములనుగాని సర్పశకునములనుగాని చెప్పువానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచినడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వానినైనను మీ మధ్య ఉండనియ్యకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు.” (ద్వితీయోపదేశకాండము 18:10-12) యెషయా యిలా అన్నాడు: “జ్యోతిష్కులు నక్షత్రసూచకులు [మాసచర్య చెప్పువారు] నిలువబడి, నీ మీదికి వచ్చునవి రాకుండ నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. వారు కొయ్యకాలువలెనైరి.”—యెషయా 47:13, 14.

మనం నక్షత్రాల నుండి ఏమి నేర్చుకొనగలము

ఏమైనప్పటికి, మనం వినడానికి ఇష్టపడినట్లయితే నిర్జీవమైన నక్షత్రాలు కొంత ఉపదేశించగలవు. ఎడ్విన్‌ వే టేల్‌ యిలా వ్రాశాడు: “నక్షత్రాలు కాలగమనంలో చిరకాలం నిలిచి యుండుటనుబట్టి మానవుని గుర్తింపులేని జీవితాన్ని గూర్చి మాట్లాడుతున్నాయి.” ఔను, కొన్ని శతాబ్దాల పూర్వం మన పూర్వీకులు చూసిన విస్తారమైన నక్షత్రాలను నిర్మలమైన రాత్రిలో మన సహజ నేత్రాలతో చూస్తున్నామని గుర్తించినపుడు, అది మనలను వినయస్థులనుగా చేయుటలేదా? “ఆదియందు” వాటిని సృజించి, మరలా వాటిని మానవజాతికొరకు ఉపయోగిస్తున్న గొప్పవానిపై పూజ్యభావము కలిగియుండుటకు మనలను పురికొల్పుటలేదా? ఇశ్రాయేలీయుల రాజైన దావీదు భక్తితో వ్రాస్తూ: “నీ చేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?” ఆకాశములు మనలను వినయస్థులనుగా చేస్తూ, మన జీవితాలలో మనం ఏమి చేస్తున్నామనే ప్రశ్నను వేస్తున్నవి.—ఆదికాండము 1:1; కీర్తన 8:3, 4.

ఒక సందర్భంలో దావీదు యిలా ప్రార్థించాడు: “నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము.” (కీర్తన 143:10) ఆయన ప్రార్థన ఆలకించబడినదని దావీదు జీవిత చరిత్రే తెలియజేస్తుంది. ధర్మశాస్త్రంలో నిర్దేశించబడిన దేవుని చిత్తాన్ని చేయుటను ఆయన నేర్చుకొన్నాడు. మానవులయెడల సృష్టికర్త సంకల్పమేమిటోకూడ ఆయన నేర్చుకొని, దానిని గూర్చి వ్రాశాడు. “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు . . . దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహు క్షేమము కలిగి సుఖించెదరు. . . . కీడు చేయుట మాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. . . . నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు.” ఆ సంకల్పము జ్ఞానముతో కూడినదై ఒక బాధ్యతను తెచ్చెను: “కీడు చేయుట మాని మేలు చేయాలి.”—కీర్తన 37:10, 11, 27-29.

మానవజాతికంతటికి నక్షత్రాలు ఒకే సమాచారాన్ని కలిగివున్నాయి. వాటిని ఆరాధించకుండా, లేదా “సంప్రదించ”కుండా, వాటిలో ప్రతిబింబిస్తున్న సృష్టికర్త లక్షణాలైన ప్రేమ, జ్ఞానము మరియు శక్తిని మనం చూడగలము. జ్యోతిశ్శాస్త్రానికి వ్యతిరేకమైన ఖగోళశాస్త్ర అధ్యయనం, మన హృదయాల్లో భక్తిని క్రమక్రమంగా ఎక్కువ చేయాలి. అంతకన్న ఎక్కువగా, దేవునిగూర్చి ఎక్కువగా నేర్చుకోవాలనే కోరికను లోతుగా నాటుటకు దోహదపడదా? ఆ సంకల్పము కోసమే, ఆయన వాక్యమైన బైబిలును ఇచ్చియున్నాడు. ఈ సమాచారాన్ని నక్షత్రాలనుండి నీవు వివేచించగల్గితే, యెహోవా మానవజాతికొరకు ఏమి దాచియుంచాడో నీవు నేర్చుకొనగలవు, అంతకంటే ప్రాముఖ్యంగా, ఆయన సిద్ధపరచిన వాటిలోని ఆశీర్వాదాలను నీవుకూడ పొందగలవు. దేవునిగూర్చికాని, జీవిత సంకల్పాన్నిగూర్చిగాని ప్రశ్నలుంటే, మీ ప్రాంతములోని యెహోవాసాక్షులను సంప్రదించండి, లేదా 5వ పేజీలో యివ్వబడిన మీకు సమీపంగా వుండే చిరునామాకు వ్రాయండి.

[19వ పేజీలోని చిత్రం]

నక్షత్రాలు మనకు వినయాన్ని బోధించగలవు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి