మీ నక్షత్రరాశిలో ఉన్నదేమిటి?
బ్రెజిల్‌లో తేజరిల్లు! ప్రతినిధి
“వచ్చే జూలైలో, మన భూగ్రహం, అంగారకున్ని ఢీకొనబోతుందని జ్యోతిష్కులు అంచనా వేసిన ఈ వార్తను మీరు విన్నారా?” కొల్ పొట్స్రాయొక్క ఉల్లాసగీతంలో ఈ మాటలు, మానవుని భవిష్యత్తు ఏదో ఒక విధంగా నక్షత్రాలపై ఆధారపడి యున్నదని ప్రాచీన కాలంనుండి ఉన్న సాధారణమైన నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నాడు.a ఆకాశంలో ఉండే నక్షత్రాదులకు, భూమిపై జీవించే మానవులకు ఏమైన సంబంధమున్నదా? ఉన్నట్లయితే, మానవజాతిపై వాటి ప్రభావమేమిటి? లేనట్లయితే, కేవలం నక్షత్రాలు ఎందుకోసం ఉన్నాయి?
బెర్లిన్ గోడ కూలిపోవడం, మునుపున్న సోవియట్ యూనియన్ త్వరితగతిన ఛిన్నాభిన్నం కావడం, రాజకీయ నాయకులపై నమ్మకం లోపించడం, ఆఫ్రికా, యూరప్‌లల్లో పెరిగిపోతున్న జాతివైషమ్యాలు, ఇండియా, ఐర్లాండ్‌లల్లో మతపరమైన శత్రుత్వం, ద్రవ్యోల్బణం త్వరితగతిని అనేక దేశాలలో వృద్ధిచూపుతున్నాయి, యువత తిరుగుబాటు మొదలగు యిటీవలి సంభవాలను మనం యోచిస్తే, చాలమంది వారి భవిష్యత్తు విషయంలో ఆసక్తికల్గి ఉన్నారని అనడంలో ఏమి ఆశ్చర్యంలేదు. హమ్‌బర్గ్ యూనివర్సిటీ నివేదిక ప్రకారంగా, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత, 1992వ సంవత్సరం ఎక్కువ జగాడలతోకూడిన సంవత్సరంగా గుర్తించబడింది. ఎందుకనగా, వివిధ దేశాలలో 52 సాయుధ పోరాటాలు జరిగాయి. సహజంగా శాంతిని ప్రేమించే ప్రజలు: ‘స్థయిర్యం, సమాధానం, మరియు భద్రతకోసం మన మెటువైపునకు చూడగలం?’ అని ప్రశ్నిస్తున్నారు.
భవిష్యత్తునుగూర్చిన అనిశ్చయత, భవిష్యత్తుని చెప్పడంలోనున్న వివిధ పద్ధతులు హెచ్చుగా పెరగడానికి కారణమైంది. జ్యోతిశ్శాస్త్రము చాలవరకు అందరికి తెలిసిందే. విజ్ఞానశాస్త్రంలోని ఖగోళశాస్త్రానికి, జ్యోతిశ్శాస్త్రము భిన్నమైనది. “భవిష్యత్తును చెప్పటంలో నక్షత్రాలు, గ్రహాలు వాటి స్థానాలు, వాటి ఆకృతులు మానవుని వ్యవహారాలలో, ఇహలోకసంబంధమైన కార్యాలలో ప్రభావాన్ని కలిగివున్నాయి.” ఈ రోజున, లక్షలాదిమంది ప్రజలు వారి భవిష్యత్తుకోసం తమ జాతకంలోని సూచనలను చూడడానికి, చదవడానికి వారు ఏమాత్రం వెనుకాడుటలేదు.b
ఇతర విషయాలలోకూడా అనగా వైవాహిక ఇబ్బందులు, ఆరోగ్యపరమైన సమస్యల పర్యవసానమేమిటి, రాజకీయ నాయకులు ఎలా ఏలి కూలుతారు, క్రొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఒక మంచి తారీఖును నిర్ణయించడం, ఒక లాటరీని గెలవటానికి సంఖ్యను ఎన్నుకోవడంకూడ జ్యోతిష్కులు భవిష్యత్తును చెబుతామని చెప్పుకుంటారు.
నాన్సీ రీగన్ అమెరికాకు అప్పటి ప్రెసిడెంట్ అయిన తన భర్త, ఎప్పుడు తన ప్రసంగాలను యివ్వాలో, ఎప్పుడు అతని విమానం బయలుదేరాలో నిర్ణయించటానికి జాన్ క్యూగ్వీలే అనే ఒక జ్యోతిష్కురాలిని క్రమముగా కలుస్తుందని రోయిటర్స్ అనే వార్తాసంస్థ నివేదించింది. న్యూ కాథోలిక్ ఎన్‌సైక్లోపీడియా, “రెండవ పోప్ జూలియస్ [1503-13] పట్టాభిషేకానికి నిర్ణయించే దినంకొరకు, మూడవ పాల్ [1534-49] కూడా తన ఆచార్యపనికి తగిన కాలాన్ని నిర్థారించడానికి జ్యోతిష్కాన్ని ఉపయోగించేవారని” బయలుపర్చింది. స్విస్ వ్యాపార సంస్థల డైరెక్టర్ ఆల్‌ఫ్రెడ్ హగ్, పెట్టుబడిదారులకు, పూచీదార్లకు స్టాకు మార్కెట్టులో పెట్టుబడి పెట్టడానికి అద్భుతమైన ఫలితాల గ్యారంటీ కొరకు జ్యోతిష్కాన్ని ఉపయోగించమని సలహానిచ్చేవాడు. “ఇది అంతాకూడ నక్షత్రరాశిలో వ్రాయబడియుంది” అనికూడా ఆయన ధృవపర్చేవాడు.
కావున, మానవుల జీవితాలపై నక్షత్రాలు ప్రభావాన్ని కల్గి ఉన్నాయని అనేకమంది భావిస్తారు. జ్యోతిశ్శాస్త్రం ఏవిధంగా మొదలైనది? పురాతన గ్రంథమైన బైబిలు జ్యోతిశ్శాస్త్రాన్నిగూర్చి, జ్యోతిష్కులనుగూర్చి ఏమైనా చెబుతుందా? (g94 7/8)
[అధస్సూచీలు]
a “ప్రాచీన చైనాలో, . . . చక్రవర్తి, ఆయన ప్రభుత్వము యొక్క కార్యాలు, దుష్కార్యాలు, ఆకాశములోని సూచనలకు ప్రకృతి వైపరీత్యాలు అద్దంపట్టేవని తలంచేవారు.”—ది ఇంటర్నేషనల్ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఎస్ట్రానమీ.
b జాతకమనగా “ఒక నిర్దిష్ట సమయంలో ఆయా గ్రహాల స్థానాలు, రాశి చక్రసూచనల రేఖాచిత్రం” ఒక వ్యక్తి జీవితంలో భవిష్యత్తునందు జరుగు సంఘటనలను చెప్పటం కొరకు జ్యోతిష్కులు దీనిని ఉపయోగిస్తున్నారు.