కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 7/8 పేజీలు 10-11
  • నొప్పిలేని జీవితం సమీపంలోనే ఉంది!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నొప్పిలేని జీవితం సమీపంలోనే ఉంది!
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మానవాతీత శక్తిగల ఒక పరిపాలకుడు
  • ఇక ఎన్నడూ ఉండని నొప్పి
    తేజరిల్లు!—1994
  • దేవుని రాజ్యం అంటే ఏంటి?
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • మానవులందరూ ఒకరినొకరు ప్రేమించినప్పుడు
    తేజరిల్లు!—1999
  • క్రూరమైన శత్రువు కన్నా ఎక్కువైనదే
    తేజరిల్లు!—1994
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 7/8 పేజీలు 10-11

నొప్పిలేని జీవితం సమీపంలోనే ఉంది!

అపాయాన్నుండి మనలను కాపాడే శరీరము యొక్క సంకీర్ణ నిర్మాణక్రమం నిశ్చయంగా ఒక అద్భుతం. వాటిని గూర్చిన అధ్యయనం, బైబిలు కీర్తనల గ్రంథకర్త స్తుతించినట్లుగానే సృష్టికర్తను స్తుతించడానికి మనలను ప్రేరేపిస్తుంది. ఆయనిలా వ్రాశాడు: “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి.” (కీర్తన 139:14) నిజంగా, దేవుడు మాత్రమే నొప్పిలేని జీవితాన్ని సాధ్యం చేయగలడు! అయితే ఇదెలా నెరవేర్చబడుతుంది?

వేదన (నొప్పి) కన్నీళ్లు తీసివేయబడుటను గూర్చిన వాగ్దానానికి కొంచెము ముందు, బైబిలు “క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని,” గూర్చి మాట్లాడుతు, “మొదటి ఆకాశమును, మొదటి భూమియు గతించిపోయెను,” అని చెప్పుటను గమనించండి. (ప్రకటన 21:1, 4) నిజమే, బైబిలు మన అక్షరార్థమైన భూమ్యాకాశములు గతించిపోవడాన్ని గూర్చి మాట్లాడడం లేదు. బదులుగా, ప్రస్తుతమున్న విధానం పూర్తిగా ఒక క్రొత్త విధానంతో మార్చబడుతుందని క్లుప్తంగా చెబుతుంది. అవును, ఒక క్రొత్త మానవాతీత ప్రభుత్వం ఇక్కడే భూమిపై ఒక నొప్పి (వేదన) లేని జీవితాన్ని అనుభవించుటను సాధ్యపరుస్తుంది.

ఈ ప్రభుత్వాన్ని గూర్చి వర్ణిస్తూ, బైబిలు “పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము [లేక, ప్రభుత్వాన్ని] స్థాపించును . . . అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.” అని చెబుతోంది (దానియేలు 2:44) యేసుక్రీస్తు భూమిపై ఉన్నప్పుడు, ఈరాజ్య ప్రభుత్వం కొరకు ప్రార్థించమని మనకు బోధించినప్పుడు ఆయనిలా అన్నాడు: “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.”—మత్తయి 6:9, 10.

అయినా, ఆ ప్రార్థన యొక్క నెరవేర్పు మీకు నొప్పి (వేదన) లేని జీవితమనే భావమెట్లు యివ్వగలదు?

మానవాతీత శక్తిగల ఒక పరిపాలకుడు

తన ప్రభుత్వ ప్రధానుడగుటకు దేవుడు ఎన్నుకొనిన వాని జ్ఞానము మరియు శక్తిపైనే కీలక విషయం ఆధారపడి ఉంది. ఆయన యేసుక్రీస్తే. ఆయనను గూర్చి ఒక బైబిలు ప్రవచనమిలా చెప్పింది: “ఆయన భుజముమీద రాజ్యభారముండును . . . ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగును.”—యెషయా 9:6, 7.

ఇప్పుడు పరలోకమందున్న, యేసు యొక్క జ్ఞానం, భూమి మీదనున్న వైద్యులందరి జ్ఞానంకన్నా బహు మిన్నయైనది. గాయాలనుండి దానంతటదే కాపాడుకొనే పద్ధతులతో పాటు, మన భౌతిక దేహ పనితీరులు పూర్తిగా ఆయనకు అర్థమౌతాయి. ఆయన 1900 సంవత్సరాల క్రిందట భూమిపై ఒక మనుష్యునిగా ఉన్నప్పుడు, ఆయన స్వస్థపర్చలేని ఒక్క రోగంగాని నొప్పిగాని లేదు. దేవునిరాజ్య పరిపాలకునిగా విస్తృత పరిధిలో ఆయన చేయబోవుదానిని ఆవిధంగా ప్రదర్శించాడు. ఒక సందర్భాన్ని గూర్చి, బైబిలిలా చెబుతుంది:

“బహు జనసమూహములు ఆయనయొద్దకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసికొనివచ్చి ఆయన పాదములయొద్ద పడవేసిరి; ఆయన వారిని స్వస్థపరచెను. మూగవారు మాటలాడుటయును అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటయును గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచిరి.” (మత్తయి 15:30, 31) తన రాజ్య పరిపాలన సమయమందు యేసు స్వస్థపర్చబోయే రోగాల్లో కూడా భయానకమైన దీర్ఘకాలనొప్పి ఉంది.

నిశ్చయంగా, అది ఎంతటి అద్భుతమైన ఆశీర్వాదమౌతుందో కదా! మరి అది కొద్దిమందికి మాత్రమే నెరవేర్చబడేదికాదు. సృష్టికర్త వాగ్దానమేమంటే: “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.” (యెషయా 33:24) తర్వాత, దేవునిరాజ్య పరిపాలన క్రింద, “వేదనయైనను ఇక ఉండదనే” వాగ్దానం నెరవేరుతుంది.—ప్రకటన 21:4.

క్రీస్తు మహిమాయుతమయిన రాజ్యపరిపాలన క్రింద, ఉనికియందున్న పాపం తీసివేయబడుతున్నందున అపాయాల నుండి మనలను కాపాడే మెకానిజమ్‌లతో పాటు మన శరీర మెకానిజములు కూడా పరిపూర్ణంగా పనిచేస్తాయి. మన శరీరపు నొప్పిని గూర్చిన లక్షణాలు మరెన్నడూ బాధాకరమైనవిగా మారవు. సంతోషదాయకముగా, ప్రస్తుతం నెరవేరుతున్న బైబిలు ప్రవచనాల ప్రకారం నొప్పి (వేదన) మరెన్నడూ బాధాకరమైనదిగా వుండని, క్రొత్త లోకానికి మనం అతిసమీపమందున్నాము.—మత్తయి 24:3-14, 36-39; 2 తిమోతి 3:1-5; 2 పేతురు 3:11-13.

ఇప్పుడు లక్షలాదిమంది ప్రజలను బాధించే నొప్పి ఉనికియందు ఉండని దేవుని రాజ్యము క్రింద జీవితాన్ని మీరు అనుభవించవచ్చు. అయితే మీరు చేయవలసినది కొంత ఉంది. దేవునికి చేయు ప్రార్థనయందు యేసుక్రీస్తు ఒక ప్రాథమికమైన అవసరతను సూచిస్తూ యిలా అన్నాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.”—యోహాను 17:3.

ఈ ప్రాముఖ్యమైన జ్ఞానాన్ని పొందుటయందు మీకు సహాయపడడానికి యెహోవాసాక్షులు సంతోషిస్తారు. మీ ప్రాంతమందున్న వారిలో ఒకరిని అడగండి, లేదా మీ గృహమందైనా మీకనుకూలమైన ఏ ప్రదేశమందైనా బైబిలు పఠనాన్ని కలిగి ఉండాలనే మీకోరికను వ్యక్తపరుస్తూ ఈ పత్రిక ప్రచురణకర్తలకు వ్రాయండి. నొప్పి (వేదన) లేని జీవితాన్ని అనుభవించడానికి మానవుల యెడల దేవుని సంకల్పాన్ని గూర్చి మరింత నేర్చుకొనడానికి మీ కొరకు అప్పుడు ఏర్పాట్లు చేయబడతాయి. (g94 6/22)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి