ఇక ఎన్నడూ ఉండని నొప్పి
బైబిలు వాగ్దాన నెరవేర్పు మూలంగా తీసివేయబడే నొప్పే, మొదటి మానవుని అపరిపూర్ణత ఫలితంగా అనుభవించబడుతున్న నొప్పి. ఈ నొప్పి నందు, దీర్ఘకాల నొప్పిగా వర్ణించబడినది కూడా యిమిడివున్నది.
రోగానికి లేక గాయానికి ఒక హెచ్చరికా విధానమై ఉండడానికి బదులు, దీర్ఘకాలనొప్పి నిలిపివేయనిష్టపడని “అనవసరమైన ఒకమ్రోతకు” పోల్చబడింది. ఉపశమనం కోసమైన అన్వేషణలో బాధితులు సంవత్సరానికి కోట్లాది డాలర్లు వెచ్చించడానికి ఈ నొప్పే కారణమైంది, ఇది లక్షలాదిమంది జీవితాలను పాడుచేస్తుంది.
నొప్పి నివారణ నిపుణుడైన డా. రిచర్డ్ ఎ. స్టెర్నబాక్ ఇలా వ్రాశాడు: “తీక్షణమైన నొప్పివలె గాక, దీర్ఘకాలనొప్పి ఒక రోగలక్షణం కాదు; దీర్ఘకాలనొప్పి ఒక హెచ్చరికా సంకేతం కాదు.” ఎమర్జెన్సీ మెడిసిన్ ఇలా నొక్కి చెప్పింది: “దీర్ఘకాలనొప్పికి సంకల్పమేదీ లేదు.”
ఆవిధంగా, అటువంటి నొప్పిని ఒక వాస్తవమైన బాధగా ఇటీవల సంవత్సరాలలో అనేకమంది వైద్యులు దృష్టించారు. “తీక్షణమైన నొప్పినందు నొప్పి ఒక రోగలక్షణమే లేక గాయమేనని,” డా. జాన్ జె. బొనీకా, నొప్పిపై నేటి ప్రామాణిక ప్రతి అయిన ది మేనేజ్‌మెంట్ ఆఫ్ పెయిన్ నందు, వివరిస్తున్నాడు. “దీర్ఘకాల నొప్పి నందు నొప్పే అసలు రోగము.”
నొప్పిని అర్థంచేసుకొనుటకు ప్రయత్నాలు
ఇప్పటికీ నొప్పి పూర్తిగా అర్థం కాలేదు. “నొప్పి అంటే ఏమిటోననే చిక్కుముడిని విప్పడం నిరంతర పరిశోధనా ప్రయత్నమని, శాస్త్రవేత్తలు దానిని గూర్చి తీవ్రంగా కృషి చేస్తున్నారని,” అమెరికన్ హెల్త్ పత్రిక అంటుంది. కొన్ని దశాబ్దాల క్రిందట, చూపు, వినికిడి, స్పర్శల వలే, నొప్పి అంటే చర్మములోవుండు ప్రత్యేక నరాల చివరల ద్వారా కూర్చబడే మరియు మెదడుకు ప్రత్యేక నరాల అల్లిక ద్వారా అందజేయబడే, భావానుభూతి రూపమేనని వారు భావించారు. అయితే నొప్పిని గూర్చిన ఈ సూక్ష్మమైన తలంపు నిజం కాదని తేలింది. ఎలా?
నొప్పి లేని ఒక యౌవ్వనస్తురాలిని గూర్చిన అధ్యయనం ఈ క్రొత్త తలంపుకు నడిపించడానికి ఒక కారణమైంది. పందొమ్మిదివందల యాభై అయిదులో ఆమె మరణం తర్వాత, ఆమె మెదడు, నరముల విధానాన్ని గూర్చిన ఒక పరీక్ష నొప్పికి గల కారణాన్ని గూర్చిన ఒక క్రొత్త తలంపునకు నడిపింది. జూలై 30, 1960, ది స్టార్ వీక్లీ మేగజైన్ ఇలా వివరించింది: “వైద్యులు నాడ్యగ్రముల కోసం పరీక్షించారు. [ఆమెకు] నాడ్యగ్రములు లేకపోవడమే, ఆ బాలిక భౌతిక సంబంధమైన నొప్పిని ప్రభావితం చేయవచ్చు. అయితే అవి (నాడ్యగ్రములు) ఉన్నాయి, మరియు పరిపూర్ణంగా కనబడ్డాయి.
“తరువాత, మెదడుతో నాడ్యగ్రములు కలసివుండాల్సిన నాడీ తంతువులను వైద్యులు పరీక్షించారు. ఇచ్చట, కచ్చితంగా, ఒక లోపం కనిపించివుండాలి. కాని కనిపించలేదు. పరీక్షింపబడినంత మట్టుకు గాయమువల్ల క్షీణింపబడినవి తప్ప, నాడీ తంతువులన్నీ సక్రమంగానేవున్నాయి.
“చివరగా, బాలిక మెదడుపై పరీక్షలు చేయబడ్డాయి మరొక్కసారి, ఏరకమైన లోపం కనుగొనబడలేదు. ప్రస్తుతపు జ్ఞానము మరియు సిద్థాంతములన్నింటి ప్రకారంగా, ఈ బాలికకు సాధారణంగా నొప్పి ఉండి ఉండాల్సిందే, అయినా ఆమెకు కితకితలు సహితం లేవు.” అయితే, చర్మంపై ఉపయోగించిన ఒత్తిడికి ప్రతిస్పందిస్తుంది, సూదిని గ్రుచ్చడం గాయంచేయకున్నను సూది పైభాగం, సూది మొనల మధ్య తేడాను ఆమె గ్రహించగల్గింది.
నొప్పిని వివరించడానికి 1960వ దశకంలో ప్రఖ్యాతిగాంచిన ఒక క్రొత్త సిద్ధాంతానికి సహగ్రంథకర్తయైన రొనాల్డ్ మెల్‌జ్యాక్, దాని సంక్లిష్టతను గూర్చి మరొక ఉదాహరణను అందించాడు. ఆయనిలా వివరించాడు: “శ్రీమతి హల్ తనకు లేని (తీసివేయబడిన) పాదమును చూపెట్టి తన కాలివ్రేళ్లలో ఎర్రగా కాలిన ఊచ పొడుస్తున్నప్పుడు కల్గే బాధవంటి బాధ తనకు కల్గుతుందని వివరించింది.” మెల్‌జ్యాక్ 1989లో మక్లియన్స్ పత్రికకు “ఆయన ‘అవాస్తవిక’ నొప్పి అని పిలిచిన దానిని గూర్చిన వివరణల కొరకు తాను అప్పటికి యింకా ఎదురు చూస్తున్నానని,” చెప్పారు. అంతేకాకుండా, శరీరంలో ఒక భాగం సరిగ్గా పనిచేయకపోవడం నొప్పి వేరొకచోట కలగడం, అని పిలువడే నొప్పి కూడావుంది.
మెదడు దేహం రెండూ ఇమిడి ఉన్నాయి
“మెదడు దేహముల సన్నిహితమైన ఒక సంకీర్ణ అంతర్గతచర్యగా” నొప్పి ఇప్పుడు గుర్తింపబడింది. తన 1992వ నాటి పుస్తకమైన పెయిన్ ఇన్ అమెరికా నందు, మేరి యస్. శారిడాన్ ఇలా చెబుతోంది: “ఒక తీవ్రమైన గాయం మానిపోయిన తర్వాత చాలా కాలానికి కొన్నిసార్లు ఆ నొప్పి లేనట్టుగను కొన్నిసార్లు దానిని సృష్టించి ఎక్కువ చేసేదిగాను మెదడు చేయగల్గే మానసిక రుగ్మతే నొప్పి యొక్క అనుభవము.”
ఒకని మానసికతీరు, కేంద్రీకరణ వ్యక్తిత్వము, సలహాకు సులభంగా ప్రభావితమయ్యేతత్వం మరియు ఇతర కారకములన్నీ ఒకడు నొప్పికి ఎలా ప్రతిస్పందిస్తాడనడంలో ప్రాముఖ్యమైయున్నవి. “భయం చింత అతిగా ప్రతిస్పందించడానికి కారణం,” అని నొప్పిని అదుపుచేయగల డా. బొనీకా గుర్తించారు. అలాగే, నొప్పి అంటే ఏమిటో ఒకడు నేర్చుకోవచ్చు. నొప్పికి గురిచేసే సమస్యలపై ప్రత్యేక అధ్యయనం చేసిన ఒక మానసికశాస్త్ర ప్రొఫెసర్ డా. విల్‌బెర్ట్ పోర్డిస్, ఇలా వివరిస్తున్నాడు:
“నొప్పి నిజమైనదా అనేది ప్రశ్న కాదు. నిజమే అది వాస్తవమైనదై ఉండవచ్చు. దానిని ప్రభావితం చేసే క్రూరమైన కారకములేమిటి అనేదే ప్రశ్న. ఒక హామ్ శాన్డ్‌విచ్ గురించి రాత్రి భోజనానికి ముందు నేను మీతో మాట్లాడితే, మీకు లాలాజలం ఊరుతుంది. అది అతి సహజమే. అయినా పరిస్థితిని బట్టి అది సంభవిస్తుంది. అక్కడ హామ్ శాన్డ్‌విచ్ లేదు. మానవులు పరిస్థితికి ఎక్కువగా ప్రతిస్పందిస్తారు. అది సామాజిక ప్రవర్తన, లాలాజలం ఊరుతుండడం, రక్తపోటు, ఆహారం జీర్ణమయ్యే వేగం, నొప్పి, మిగిలిన విషయాలన్నింటిని ప్రభావితం చేస్తుంది.”
మీ భావోద్రేకాలు, మానసికస్థితి నొప్పిని తీవ్రతరం చేయగల్గినట్లుగానే, అవి దానిని తగ్గించివేయగలవు లేక బలహీన పర్చగలవు. ఒక ఉదాహరణను పరిశీలించండి: ఆయన ఒక యౌవనునిగా ఒక బాలికను అతిగా మోహించి ఆమెతో మంచుగోడపై కూర్చుండగా తన పిరుదులలో తీవ్రమైన చలి లేక నొప్పి అనే భావన తనకు కలగలేదని ఒక న్యూరో సర్జన్ చెప్పారు. “నేను దాదాపు చలికి ఒంకర్లు తిరిగి పోయేవాడినే, మేము 45 నిమిషాలు అక్కడ కూర్చునివుంటాము, మరియు కొంచెం కూడా చలిగా ఉన్నట్టు నేను భావించలేదు.” అని ఆయన వివరించాడు.
అటువంటి ఉదాహరణలు కోకొల్లలు. ఆటయందు పూర్తిగా నిమగ్నమైన పుట్‌బాల్ ఆటగాళ్లు లేక తీక్షణమైన యుద్ధమందున్న సైనికులు తీవ్రంగా గాయపడవచ్చు అయినా ఆ సమయమందు కొద్దిగా నొప్పి ఉండవచ్చు లేక అసలు నొప్పి లేకపోవచ్చును. ఒక సింహం తనపై దాడిచేయడం ఒక ఎలుకను కుక్క దాడి చేసినంతగా తనకు భయం కల్గించిందని, నొప్పి అనే భావన లేని ఒక రకమైన భ్రమకు. . . . విస్మయం కారణమైందని,” ఆఫ్రికన్ అన్వేషకుడైన డేవిడ్ లివింగ్‌స్టన్ చెప్పాడు.
పూర్ణనమ్మకంతోను మరియు విశ్వాసముతోను యెహోవా దేవుని వైపు నిశ్చలంగా చూచు ఆయన సేవకులు కూడా ఒక్కొక్కసారి తమ నొప్పి అణగార్చివేయబడిన అనుభవాన్ని కూడా కల్గియున్నారనేది గుర్తించదగిన విషయం. “మొదట కొన్ని దెబ్బలుతిన్న తరువాత, నేను నిజంగా దెబ్బలు తింటున్నానని నాకు అనిపించలేదు. బదులుగా, నేను వాటిని కేవలం వినడం, దగ్గరలో మ్రోగుతున్న డప్పుమ్రోతను విన్నట్టుగానే ఉందని, అది వింతగా అన్పించిందని,” బాగా కొట్టబడిన ఒక క్రైస్తవుడు చెప్పాడు.—ఫిబ్రవరి 22, 1994, అవేక్!, పేజి 21.
నొప్పి అనుభవాలు ఎలా సవరించబడ్డాయి
నొప్పిని గూర్చి దిగ్భ్రాంతిని కలిగించే కొన్ని కారణములను వివరించే ఒక ప్రయత్నమందు, 1965లో ఒక మానసిక ప్రొఫెసరు అయిన రొనాల్డ్ మెల్‌జ్యాక్, మరియు శరీరశాస్త్ర ప్రొఫెసర్ అయిన పాట్రిక్ వాల్ విస్తృతంగా ప్రకటింపబడిన నొప్పిని గూర్చిన ద్వార-నియంత్రణ సిద్ధాంతాన్ని రూపొందించారు. “నొప్పిని గూర్చిన పరిశోధన మరియు చికిత్సా రంగమందలి అతి ప్రాముఖ్యమైన వికాసాల మధ్య” ఈ సిద్ధాంతం ఉందని నొప్పిని గూర్చి డా. బొనికా ప్రచురించిన పాఠ్యపుస్తకపు 1990వ ప్రతి చెప్పింది.”
ఆ సిద్ధాంతం ప్రకారంగా, వెన్నుపామునందలి ఒక సిద్ధాంత ద్వారం ప్రారంభ, ముగింపులు మెదడునకు చేరే నొప్పి సంకేతాల ప్రవాహాన్ని నిలిపివేస్తాయి లేక అనుమతిస్తాయి. నొప్పి కన్నా నొప్పి అనుభవాలు ద్వారాన్ని ముంచివేస్తుంటే, అప్పుడు మెదడుకు చేరుకొనే నొప్పి సంకేతాలు తగ్గిపోవచ్చును. అలా, ఉదాహరణకు, నొప్పి సంకేతాలను గూర్చిన ప్రవాహముతో జోక్యము చేసుకొనుటకు వెన్నుపామునకు పంపబడిన సంకేతాలు నొప్పి సంకేతాల కన్నా వేరైన సంకేతాలైనప్పుడు కొద్దిగా కాలిన ఒక వ్రేలును రుద్దినా లేక కదిలించినా నొప్పి తగ్గుతుంది.
ఎన్‌డార్‌ఫిన్స్ అని పిలువబడిన నల్లమందు వంటి పదార్థములను మన దేహములే స్వయంగా ఉత్పన్నం చేస్తున్నాయని 1975 నందు కనుగొనడం నొప్పిని గూర్చిన నిగూఢమైన ఆకృతులను అర్థము చేసుకొనేందుకు పరిశోధన జరపడానికి మరింతగా సహాయపడింది. ఉదాహరణకు, కొంత మంది ప్రజలకు ఎన్‌డార్‌ఫిన్స్ అధికంగా ఉత్పన్నం అవుతున్నందున నొప్పి కొద్దిగా లేక అసలు లేదనే అనుభూతి కల్గుతున్నది. వెంట్రుక వాసిగల సూదులను శరీరంలోనికి ప్రవేశపెట్టే ఒక వైద్య పద్ధతి అయిన అక్యుపంచర్ ద్వారా నొప్పి ఎందుకు తగ్గింపబడుతుంది లేక ఎందుకు తీసివేయబడుతుందనే రహస్యాన్ని సహితం ఎన్‌డార్‌ఫిన్స్ వివరించవచ్చును. అక్యుపంచర్‌ని మాత్రమే నొప్పి నివారిణిగా ఉపయోగించి రోగి మేల్కొని, చురుకుగాను విశ్రాంతిదాయకంగాను ఉండగా, ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహింపబడిందని ప్రత్యక్ష సాక్షులు నివేదిస్తున్నారు. ఎందుకు నొప్పి కలుగలేదు?
నొప్పి తాత్కాలికంగా తీసివేయగల్గే ఎన్‌డార్‌ఫిన్స్ ఉత్పత్తిని సూదులు ప్రేరేపించగలవని కొందరు నమ్ముదురు. నొప్పివి కాక మరొక సంకేతాలను పంపే నాడీ తంతువులను సూదులు ప్రేరేపించడమే అక్యుపంచర్ నొప్పిని నివారించడానికి గల మరొక కారణము. వెన్నుపామునందలి ఈ క్రిక్కిరిసిన సంకేతాల ద్వారములు, నొప్పి ఉందనే అనుభూతిని కలిగించే మెదడును చేరకుండా నొక్కిపెట్టడం ద్వారా నొప్పి సంకేతాలు అడ్డుకొనబడుతున్నాయి.
ద్వార-నియంత్రణ సిద్ధాంతం, మరియు శరీరం దాని స్వంత నొప్పి నివారిణులను ఉత్పన్నం చేస్తుందనే నిజం, అనుభవించే నొప్పి స్థాయిని ఒకని మానసిక స్థితి, ఆలోచనలు, మరియు భావోద్రేకాలు ఎందుకు ప్రభావితం చేస్తాయో కూడా వివరించవచ్చును. అదేవిధంగా, ఒక సింహం అకస్మాత్తుగా దాడి చేస్తుందన్న భయం లివింగ్‌స్టన్ యొక్క ఎన్‌డార్‌ఫిన్స్ ఉత్పన్న ప్రేరణ అలాగే ఆ నొప్పికి సంబంధించిన సంకేతములకన్నా ఆయన వెన్నుపాములో వేరే సంకేతాలు ప్రవహించడం జరిగియుండవచ్చును. ఫలితంగానే, నొప్పిని గూర్చిన ఆయన భావనలు తగ్గించబడ్డాయి.
అయినా, ముందు గమనించినట్టుగానే, ఒకని మానసిక మరియు భావోద్రేకాల అల్లిక వ్యతిరేక ప్రభావాన్ని కల్గివుండగలదు. మరీ అధికమైన సాదృశ్య ఆధునిక జీవితపు ప్రతిదిన ఒత్తిడి ఒక వ్యక్తి యొక్క నొప్పి అనే భావన చింత, ఉద్రిక్తత, మరియు కండరాలు కుంచించుకుపోవడం మూలంగా పెరగవచ్చును.
అయినప్పటికి, సంతోషదాయకంగా, నొప్పిని అనుభవించేవారు ఆశావాదులుగా ఉండుటకు కారణముంది. దీనికి గల కారణం ఏమంటే మెరుగైన చికిత్సా పద్ధతుల నుండి ఇప్పుడు అనేకమంది రోగులు ప్రయోజనమును పొందడమే. ఈ భయానకమైన బాధను బాగా అర్థం చేసుకోవడం నుండి వచ్చిన ఫలితములే అటువంటి పురోభివృద్ధులు. అమెరికన్ అకాడమీ ఆఫ్ పెయిన్ మెడిసిన్ అధ్యక్షుడైన డా. శ్రీధర్ వాసుదేవన్, ఇలా వివరించారు: “నొప్పి కొన్నిసార్లు ఒక రోగంవలె ఉండవచ్చుననే ఆలోచన 80వ దశకమందలి చికిత్సా విధానమును విప్లవాత్మకం చేసింది.”
నొప్పిని గూర్చిన చికిత్సా విధానము ఎలా విప్లవాత్మకమైనది? ఏ చికిత్సావిధానములు ప్రతిభావంతమైనవని నిరూపించ బడుతున్నాయి? (g94 6/22)
[7వ పేజీలోని చిత్రం]
అక్యుపంచర్ నొప్పిని ఎలా తగ్గిస్తుంది లేక తొలగిస్తుంది?
[క్రెడిట్ లైను]
H. Armstrong Roberts