కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 7/8 పేజీలు 3-4
  • క్రూరమైన శత్రువు కన్నా ఎక్కువైనదే

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రూరమైన శత్రువు కన్నా ఎక్కువైనదే
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రధానమైన ఆరోగ్య సమస్య
  • నొప్పిలేని జీవితమా?
  • కన్నీళ్ళు లేని జీవితమా?
  • ఇక ఎన్నడూ ఉండని నొప్పి
    తేజరిల్లు!—1994
  • నొప్పికి చికిత్సచేయడంలో పురోభివృద్ధి
    తేజరిల్లు!—1994
  • ‘ఇదిగో! సమస్తాన్నీ నూతనం చేస్తున్నాను’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • మీరు వెన్నునొప్పితో బాధపడుతున్నారా?
    తేజరిల్లు!—1994
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 7/8 పేజీలు 3-4

క్రూరమైన శత్రువు కన్నా ఎక్కువైనదే

ఉపశమనంలేని నొప్పి ప్రజల జీవితాలను ధ్వంసం చేయగలదు. అది వారి సమాధానాన్ని, ఆనందాన్ని, జీవనాధారాన్ని దోచుకొంటూ, కొందరు ఆత్మహత్య ద్వారా ఉపశమనాన్ని వెదికేంత దుర్భరంగా జీవితాన్ని తయారు చేస్తుంది. వైద్య మిషనరీ ఆల్బెర్ట్‌ స్క్వీట్జర్‌ ఈ నిర్ణయానికొచ్చాడు: “మరణం కన్నా నొప్పి, మానవజాతికి ఒక క్రూరమైన ప్రభువుగా ఉంది.”

అక్షరార్థంగా కోట్లాదిమంది భయానకంగా బాధింపబడుతున్నారు. ‘భూభ్రమణ శబ్దం మన చెవులకు వినబడుతున్న అగాధం నుండి అనంతమైన దూరంలో మనం కొంతకాలం ఉంచబడినట్లైతే, బాధననుభవిస్తున్న మానవజాతి ముక్తకంఠంతో వ్యక్తపరుస్తున్న నొప్పికి సంబంధించిన మూలుగును మనం వింటాము’ అని ఒక ఫ్రెంచి శస్త్రచికిత్సా నిపుణుడు చెప్పాడు.

నిశ్చయంగా, 1,900 సంవత్సరముల క్రిందట క్రైస్తవ అపొస్తలుడైన పౌలు వ్రాసినదే నేడు మరింత బలీయముగా పని చేస్తున్నది: “సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచునున్నదని యెరుగుదుము.”—రోమీయులు 8:22.

ప్రధానమైన ఆరోగ్య సమస్య

కీళ్ళనొప్పిలో అతి సామాన్యమైన, అస్థికీళ్ళకు సంబంధించిన భయంకరమైన నొప్పిని అమెరికా దేశస్థులలోని ప్రతి ఎనిమిదిమందిలో ఒకరు అనుభవిస్తున్నారు. ప్రజలలో అత్యధికులు వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఇతరులు కేన్సర్‌, గుండెజబ్బులకు సంబంధించిన బాధాకరమైన ఫలితాలను సహించవలసి వస్తున్నది.

తీవ్రమైన తలపోటు, పంటినొప్పి, చెవిపోటు, మూలవ్యాధులతోను, అసంఖ్యాకమైన ఇతర బలహీనతలతోను గాయములతోను, లక్షలాదిమంది మరింత బాధింపబడుతున్నారు. ఇటీవలి సంవత్సరములో వైద్యులు సిఫారసుచేయని నొప్పినివారణల కోసమే 210 కోట్ల డాలర్లను అమెరికా దేశీయులు వెచ్చించారనేది లేక “అమెరికాలో గుప్తమైన రోగం,” అని ఆ నొప్పి పిలువబడిందనడంలో ఆశ్చర్యంలేదు.

బహుశా నొప్పి నివారణలో గొప్ప ప్రగతిని సాధించిన, జాన్‌ జె. బొనీకా ఇట్లన్నాడు: “ద్రవ్యసంబంధం దృష్ట్యా, మానవ దురవస్థ దృష్ట్యా చూస్తే, నిజానికి ఇతర ఆరోగ్య సమస్యలన్నింటి కంటే దీర్ఘకాలంగా ఉన్న నొప్పి మరింత ప్రాముఖ్యమైంది.”

నొప్పిలేని జీవితమా?

అటువంటి కఠోర వాస్తవాన్ని ఎదుర్కోవడంలో, నొప్పిలేని జీవిత సాధ్యతను సూచించడం దొందుడుకుతనంగా కన్పించవచ్చు. అందునుబట్టి బైబిలు చెప్పేది అసహజంగా కన్పించవచ్చు. అంటే: “[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, . . . దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను (నొప్పి) ఇక ఉండదు.”—ప్రకటన 21:4.

అయినా, నొప్పిలేని జీవిత సాధ్యత అసహజమైనదేమీ కాదు. అయితే ఒక క్షణమాలోచించండి. ఆ లేఖనం యొక్క నిజమైన భావమేమిటి? నొప్పిలేని ప్రజలు నేడు ఉన్నారు. అటువంటిది లేకుండానే వారు జన్మించారు. వారిని బట్టి అసూయ చెందాలా? శరీరశాస్త్రజ్ఞుడైన అలన్‌ బస్‌బామ్‌ ఇలా చెప్పాడు: “అసలు నొప్పిలేకపోవడం విపత్కరము.”

నొప్పి ఉన్నట్టు మీకు అన్పించకపోతే, నయంకాని బాధాకరమైన పుండుగా తయారయ్యేంత వరకు ఒక నీటిపొక్కు పెరుగుతుండడాన్ని బహుశా మీరు గుర్తించలేకపోవచ్చు. నొప్పి తెలియని ఒక బాలిక తల్లిదండ్రులు “కొన్నిసార్లు శరీరం కాలుతున్న వాసనను పసిగట్టి స్టౌకు ఉదాసీనంగా ఆమె ఆనుకొని ఉండడాన్ని కనుగొన్నారని,” ఒక పత్రికా నివేదిక తెలియజేసింది. కావున, నొప్పి క్రూరమైన శత్రువు కన్నా ఎక్కువైనదే. అది ఆశీర్వాదకరమైందిగా కూడా ఉండగలదు.

అయితే మరి, బైబిలు వాగ్దానం విషయమేంటి: ‘వేదనయైనను ఇక ఉండదా?’ మనం నిజంగా నెరవేరాలని కోరుకొనే వాగ్దానమిదేనా?

కన్నీళ్ళు లేని జీవితమా?

ఈ వాక్యం యొక్క సందర్భం కూడా ఏమి చెబుతోందో గమనించండి: “[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును.” (ప్రకటన 21:4) కన్నీళ్ళు అవసరమే గనుక, అది సూచనార్థకమైనదే. గ్రాహ్యనొప్పి పనిచేసినట్లుగానే అవి మనలను కాపాడతాయి.

కన్నీళ్ళు మన కన్నులను తేమగా ఉంచి కంటికి, కనురెప్పలకు నడుమ రాపిడిలేకుండా చేస్తాయి. అవి మన కన్నుల నుండి అనవసరమైన పదార్థములను కూడా శుభ్రపరుస్తాయి. అంతేకాకుండా, కన్నులను శుభ్రపరిచి అంటురోగాల నుండి కాపాడే, లైసోజైమ్‌ అనబడే ఒక ఏంటీసెప్టిక్‌ని అవి కల్గివున్నాయి. మనకున్న నొప్పిలాంటి భావన వలె, కన్నీళ్ళను రాల్చే సామర్థ్యం అద్భుతంగా నిర్మింపబడిన మన శరీరముల యొక్క గుర్తింపదగిన ఒక విశిష్టలక్షణము.—కీర్తన 139:14.

అయినా, విచారం, దుఃఖం, కలతలతో కూడా కన్నీళ్ళు సంబంధం కల్గివున్నాయి. “నేను మూలుగుచు అలసియున్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను.” అని బైబిలు కాలమునాటి రాజైన దావీదు విలపించాడు. (కీర్తన 6:6) ఒక స్నేహితుని మరణమందు యేసు సహితం “కన్నీళ్లు విడిచెను.” (యోహాను 11:35) ప్రజలు, అట్టి విచారముతో కన్నీళ్లను రాల్చాలన్నది దేవుని ఆది సంకల్పం కాదు. మొదటి మానవుడైన ఆదాము చేసిన పాపమే, మానవ కుటుంబ అపరిపూర్ణతకు, మరణస్థితికి కారణమయ్యింది. (రోమీయులు 5:12) కావున, మన అపరిపూర్ణత, మరణించేస్థితి మూలంగా కల్గే ఆ కన్నీళ్లు ఇక ఉండవు.

తుడిచివేయబడబోయే ప్రత్యేకమైన కన్నీళ్లను గురించి బైబిలు తెలియజేయుచున్నది, గనుక వేదన ఇక ఉండదనే వాగ్దానమెలా నెరవేరబోతోంది? విచారం మరియు ఏడ్పులకు కారణమయ్యే వేదనను అనుభవించే సందర్భమొక్కటైనా, ప్రజలకుండదా? (g94 6/22)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి