కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 6/8 పేజీలు 15-17
  • నేను అవిశ్వాసితో ప్రేమలో పడితే ఏమి చేయాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నేను అవిశ్వాసితో ప్రేమలో పడితే ఏమి చేయాలి?
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అదెలా జరుగుతుంది
  • అపాయాలు
  • అవిశ్వాసులతో మిమ్మును మీరు జోడుగా చేసుకొనకుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • నా మీద ఆసక్తి చూపించే అమ్మాయితో నేను ఎలా ప్రవర్తించాలి?
    తేజరిల్లు!—2005
  • ఆయన నన్ను ప్రేమించకపోతే నేనేం చేయను?
    తేజరిల్లు!—1998
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 6/8 పేజీలు 15-17

యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .

నేను అవిశ్వాసితో ప్రేమలో పడితే ఏమి చేయాలి?

“నాకు ఒక సమస్య ఉంది,” అని ఒక క్రైస్తవ అమ్మాయి ఒప్పుకుంది. “నేను మా పొరుగువానిపై ఆశపడ్డాను. అతడు దయగలవాడు, మర్యాదస్థుడు, యితరుల కష్టసుఖాలను చూసేవాడు, అయితే, ఒకటి మాత్రం చేయడు—అతను యెహోవాను ప్రేమించడు. అతన్ని యిష్టపడడం తప్పని నాకు తెలుసు, కాని, అతని యెడల నాకు గల భావాలను ఎలా అదుపులో ఉంచుకోవాలో నాకు తెలియదు.”

మార్కుకు 14 ఏండ్లున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో తాను ఉన్నాడని కనుగొన్నాడు. తన మత విశ్వాసాల్లో పాలుపంచుకొనని ఒక అమ్మాయి వ్యామోహంలో పడ్డాడు.a “పెళ్ళి చేసుకొని యిద్దరం కలిసి ఉంటే ఎలా ఉంటుందోనని తరచూ నేను పగటి కలలు కనేవాణ్ణి, అయితే అది తప్పని నాకు తెలుసు,” అని అతడు అంటున్నాడు.

పదమూడు నుండి 19 సంవత్సరాల లోపు వయస్సులో ప్రణయ భావాలు బలీయంగా ఉన్నప్పుడు, వ్యామోహం అన్నది సాధారణమే. (1 కొరింథీయులు 7:36 పోల్చండి.) యిలాంటి భావాలను వ్యక్తపర్చడానికి సరైన మార్గం లేనందున యౌవనస్థులు తమ అభిమాన ఉపాధ్యాయులయెడల, సరదాగా ఉండే వారియెడల మరితరుల యెడల వ్యామోహాన్ని పెంచుకుంటారు. ఇలాంటి పెద్దలతో వ్యక్తిగత సంబంధాలు కలిగివుండడం చాలావరకు అసాధ్యం గనుక, యీ ఆకర్షణలు యిలాంటి ఆకర్షణ సాధారణంగా స్వల్పకాలికమైనవి, మరి కొంతవరకు హాని లేనివి.b అయినప్పటికీ, సంబంధం కలిగి ఉండడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, మీ మత విశ్వాసాల్లో పాలుపంచుకోని—ఎవరైనా మీ తోటివారెవరి యెడలనైనా మీరు బలమైన భావాలను పెంపొందించుకున్నట్లయితే అప్పుడేం చేస్తారు?

కొందరు యిదొక సమస్య అని అనుకోకపోవచ్చు. ఒక కారణమేంటంటే, చాలా మంది యౌవనస్థులకు మతంలో ఆసక్తి లేదు. ఆసక్తి ఉన్నవారు కూడా వేరే మతంలోని వారితో కలిసి తిరగడాన్ని ఎల్లవేళలా నిరాకరించకపోవచ్చు. మతాచార నిష్ఠలు లేని ప్రజలు దీన్ని అంగీకరించవచ్చు కూడా. ప్రాముఖ్యంగా అవి తరచూ వివాహానికి దారి తీస్తాయి గనుక, అనేక మంది పెద్దలు యిలాంటి సంబంధాల్లో పొంచివున్న సమస్యలను గమనిస్తారు. కాబట్టి ఆండ్రియా ఈగెన్‌ అనే రచయిత యౌవనస్థులకు యిలా సలహా యిస్తుంది: “మీరిద్దరూ మతనిష్ఠ లేని వారైతే మీరిద్దరూ ఒకే మతానికి చెందినవారై ఉండడమన్నది అంత ప్రాముఖ్యమేమీ కాదు. అయితే మీలో ఒకరికి లేదా యిద్దరికీ, మతాచరణ ప్రాముఖ్యమైతే, మత భేదాలను పరిగణనలోకి తీసుకోవలసిందే. . . . మతానికి సంబంధించిన మీరిద్దరి అభిప్రాయాలు ఒకటిగా ఉండనవసరం లేదు . . . , కాని, మీరు ఒకరితో ఒకరు సహజీవనం చేయగల్గాలి.”

ఇలాంటి సలహా మంచిదే అన్నట్లు అనిపిస్తుండవచ్చు. నిజానికి యిది “ఈ లోక జ్ఞానమును” ప్రతిబింబిస్తుంది. (1 కొరింథీయులు 3:19) విశ్వాసికి, అవిశ్వాసికి మధ్య ఉండే ప్రణయం వైవాహిక సహజీవనానికన్నా ఎక్కువ ప్రాముఖ్యమైన వివాదాలను లేవదీస్తుందని బైబిలు చూపిస్తుంది. అది “ప్రభువునందు మాత్రమే” వివాహం చేసుకోవాలని క్రైస్తవులకు ఆజ్ఞాపిస్తున్న దేవుని వాక్యానికి లోబడవలసిన విషయమని, యెహోవాసాక్షులైన యౌవనస్థులకు తెలుసు. (1 కొరింథీయులు 7:39) కలిసి తిరగడమనేది ఏదో వినోదం కాక, అది వివాహానికి తొలిమెట్టు కాబట్టి, తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకొననివారితో తన సేవకులు ప్రేమలో పడడం దేవునికి అసంతోషాన్ని కలిగిస్తుంది.

అలాగైనప్పటికీ, సాక్షులైన కొందరు యౌవనస్థులు అవిశ్వాసులైనవారివైపుకు తాము ఆకర్షించబడినట్లు కనుగొన్నారు. ఇదెలా జరుగుతుంది? మీరు యిలాంటి పరిస్థితిలో ఉన్నట్లు కనుగొన్నట్లయితే మీరు ఏమి చేయాలి?

అదెలా జరుగుతుంది

మానవులందరూ తప్పు చేయడానికి మొగ్గు చూపుతారని మొదట గ్రహించండి. “తన పొరపాటులు కనుగొనగలవాడెవడు?” అని కీర్తన రచయిత అడిగాడు. (కీర్తన 19:12) మరి ముఖ్యంగా ప్రణయం విషయంలో యౌవనస్థులు పొరపాట్లు చేయగలరు. ఎందుకని? ఎందుకంటే, అనుభవముతో, వయస్సుతో వచ్చే లోక జ్ఞానం వారికి లేకపోవడమే. (సామెతలు 1:4) వ్యతిరేక లింగ వ్యక్తులతో వ్యవహరించడంలో అనుభవం లేనందున, ప్రణయ ఆకర్షణతో లేదా వారు చూపే శ్రద్ధతో ఎలా వ్యవహరించాలో క్రైస్తవ యౌవనస్థులకు తెలియకపోవచ్చు.

తన పాఠశాలలోని విద్యార్థి తనను మోహిస్తున్నాడని షీలా గ్రహించినప్పుడు ఆమె విషయంలో యిదే జరిగింది. “అతడు నన్ను యిష్టపడుతున్నాడని నేను చెప్పగలను, భోజన సమయంలో నా దగ్గరికి వచ్చి, నాతో పాటు భోంచేసేవాడు. లైబ్రరీలో చదువుకునే పీరియడ్‌లో అతడు నా కొరకు వెదికే వాడు,” అని షీలా చెప్పింది. షీలాకి అతని యెడల ఆసక్తి పెరగనారంభమైంది. ముందు చెప్పబడిన మార్కు కూడా అదే రీతిలో గుర్తు చేసుకుంటున్నాడు: “నేను వ్యాయామ క్లాసులో ఎప్పుడూ ఆ అమ్మాయిని చూసేవాణ్ణి. ఆమె నా దగ్గరకు రావడానికి, నాతో మాట్లాడడానికి ప్రత్యేక ప్రయత్నం చేసేది. స్నేహం వృద్ధిచెందడానికి పెద్ద కష్టం కలుగలేదు.” పద్నాలుగేండ్ల వయస్సు గల పామ్‌ విషయంలో ఏం జరిగిందంటే, పొరుగింటి ఒక అబ్బాయి, ఆమె యెడల తనకు గల ప్రేమకు గుర్తుగా ఆమెకొక ఉంగరాన్నిచ్చాడు.

ఎదుటి వ్యక్తి ప్రయత్నాలకు ఎల్లప్పుడూ నిర్దోషిగా సాక్షి మాత్రమే గురికావడం లేదన్నది ఒప్పుకోవలసిందే. జిమ్‌ అనే పేరుగల ఒక క్రైస్తవ బాలుడు చూపించిన ఆసక్తికి బదులుగా మాత్రమే ఒక అమ్మాయి ప్రతిస్పందించింది. అయితే, ఆ అమ్మాయి ఒక రోజు అతన్ని వెదుక్కుంటూ యెహోవాసాక్షుల రాజ్యమందిరానికి వచ్చినప్పుడు, అతడు తాను చేసినదాన్ని ఒప్పుకోడానికి బలవంతపెట్టబడ్డాడు!

పరిస్థితులేవైనప్పటికీ, అలా వ్యామోహంలో పడిపోవడం తప్పని మీకు తెలిసే ఉండవచ్చు. కాని, కొన్నిసార్లు వ్యతిరేక లింగవ్యక్తుల అవధానాన్ని నిరోధించడం కష్టంగా ఉంటుంది. ఆండ్రూను గమనించండి. ఉన్నతపాఠశాలలో తన మొదటి సంవత్సరంలో అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకోబోతున్నారు. “మాట్లాడుకోడానికి నాకు ఎవరైనా ఒకరి అవసరం ఉండేది,” అని అతడు గుర్తు చేసుకుంటున్నాడు. పాఠశాలలోని ఒక అమ్మాయి అతన్ని ప్రోత్సహించే సరైన మాటలు చెప్పేది. పరస్పరం ప్రణయ భావాలు త్వరగా పెంపొందాయి.

అపాయాలు

పరీక్షించకుండా వదిలేస్తే, యిలాంటి భావాలు మిమ్మల్ని వాస్తవంగా అపాయంలోకి యీడ్చగలవు. సామెతలు 6:27 యిలా చెబుతుంది: “ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనినయెడల వాని వస్త్రములు కాలకుండునా?” ఉదాహరణకు, కిమ్‌ అనే పేరుగల ఒక అమ్మాయి అనుభవాన్ని గమనించండి. ఒక క్రైస్తవురాలిగా పెరిగినప్పటికీ, పాఠశాలలోని ఒక అబ్బాయితో భావోద్రేకంగా దగ్గర కావడానికి తనను తాను అనుమతించింది. “పాఠశాలలో ఎక్కువ ఖ్యాతి గల, ఉత్సాహం గల అబ్బాయిల్లో అతడు ఒకడు,” అని కిమ్‌ గుర్తు చేసుకుంటుంది. ఆమె కొంత కాలానికే బాహాటంగా మత్తు పదార్థాలు ఉపయోగించబడిన పార్టీలకు రహస్యంగా హాజరయ్యేది. “నేను చాలా భయపడ్డాను. అయినా నేను అతన్ని ప్రేమించాను నేను గర్భవతి అయ్యాను.” అని కిమ్‌ గుర్తు చేసుకుంటుంది. కిమ్‌ తన ప్రియుణ్ణి వివాహం చేసుకుంది, అతడు చివరికి ఆయుధాలతో దొంగతనం చేసి జైల్లో పడ్డాడు. బైబిలు హెచ్చరిక నిజమని, మరొకసారి నిరూపించబడింది: “దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.”—1 కొరింథీయులు 15:33.

యెహోవాసాక్షులు కానటువంటి యౌవనస్థులందరూ అవినీతిపరులని లేదా మాదక ద్రవ్యాలు ఉపయోగిస్తారని యిది సూచించడం లేదు. అయినప్పటికీ, యిలాంటి యౌవనస్థులు సాక్షులైన యౌవనస్థులకున్నటువంటి అవే విలువలను, దృక్కోణాలను లేదా లక్ష్యాలను ఎంత మాత్రం పంచుకోరు. అవిశ్వాసి “దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు,” అని 1 కొరింథీయులు 2:14 వివరిస్తుంది. మీ మత విలువలు, క్రైస్తవ కూటాల్లో మీరనుభవించే సంతోషం, అనుకూలంగా ప్రతిస్పందించే వ్యక్తితో బైబిలు సందేశాన్ని పంచుకోవడంలోని ఆనందం, బైబిలును చదవడంలోని సంతృప్తివంటి మీ భావోద్రేకాలను ఎలా రూపుదిద్దాయో ఆలోచించండి. ఒక అవిశ్వాసి యిలాంటి భావాలను పంచుకోకపోయినా కనీసం గ్రహించగలడా? లేనే లేదు.

కాబట్టి పౌలు క్రైస్తవులకు యిలా బోధిస్తున్నాడు: “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?” (2 కొరింథీయులు 6:14, 15) యువతియైన సోన్యా అవిశ్వాసితో భావోద్రేకంగా దగ్గరైనప్పుడు అనుభవపూర్వకంగా యీ పాఠాన్ని నేర్చుకుంది. ఆమె యిలా ఒప్పుకుంటుంది: “యెహోవా యెడల మీ ఆసక్తిని, ప్రేమను పంచుకోలేని చెలికాడు ఉండడమంటే, ఊహించలేనంత మహా చెడ్డ ఒంటరితనమే. అది భావోద్రేకంగా కృంగదీస్తుంది. సత్యం మీ జీవితాన్ని ప్రేరేపించేదిగా ఉన్నప్పుడు, మీరు దాన్ని పంచుకోవాలి—మీరు తప్పకుండా పంచుకోవాలి! మీరు అవిశ్వాసితో ఉంటున్నందువల్ల, మీరు దాన్ని మీ జతతో పంచుకోలేకపోయినప్పుడు ఏదో కోల్పోయినట్లు ఉంటుంది.”

అలాంటి బంధంలో, మతం సంతృప్తికి సామాన్యమైన కారణం కాకుండా, ముఖ్య కారణంగా ఉంటుంది. శాంతిని పరిరక్షించుకునేందుకు మీ రాజ్యాసక్తుల్లో ఉదాసీనులుగా ఉండడానికి బలవంతపెట్టబడినట్లు మీరు సులభంగా భావించవచ్చు. అయితే అలా చేయడం కేవలం మీ ఆత్మీయతను దెబ్బతీస్తుంది. ఒక యువతి యిలా చెబుతుంది: “సాక్షి కాని ఒక యువకునికి నేను బాగా దగ్గరయ్యాను. అయితే సన్నిహిత సంబంధం పెంపొందుతున్న కొలది, నేను ఆయనతో ప్రేమలో పడ్డానని గ్రహించాను. మెల్లమెల్లగా నాకు యెహోవాతో గల సంబంధం అంత ప్రాముఖ్యం కానిదిగా మారింది; యీ యువకునితో గల సంబంధమే నాకు అతి ప్రాముఖ్యమైనదైంది. నేనిక కూటాలకు వెళ్ళాలని, నా క్రైస్తవ సహోదరులతో సహవసించాలని, లేదా ప్రకటన పనికి వెళ్ళాలని కోరుకోలేదు. ఆయనతో ఉండాలని మాత్రమే నేను కోరుకున్నాను. తరువాతి రెండు సంవత్సరాల వరకు సాక్షినైన నేను నిష్క్రియురాలిగా ఉన్నాను. ఈ సమయమంతటిలోను నా ‘స్నేహితుడు’ నా ప్రేమకు ప్రతిగా నన్ను ప్రేమించలేదు. చివరికి ఏదో ఒకరోజు ఆయన ప్రేమిస్తాడని నేను తలంచాను, కాని అలా జరగలేదు.”

అవును, మీ మతపరమైన విలువలను, నైతిక విలువలను పంచుకోని వారితో కలిసిపోవడం మీకు దుఃఖాన్ని, అసంతోషాన్ని కలిగిస్తుందన్నది నిజం. జ్ఞానయుక్తమైన పనేమంటే పొసగని సాంగత్యాన్ని విసర్జించడమే. అయితే ఎవరి గురించయినా అంత తీవ్రంగా మీరు భావిస్తున్నట్లయితే మీరు దాన్నెలా విసర్జించగలరు? ఈ పరంపరలోని మా తదుపరి శీర్షిక అంశం యిదే. (g94 5/22)

[అధస్సూచీలు]

a కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

b వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన క్వశ్చన్స్‌ యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌—ఆన్సర్స్‌ దట్‌ వర్క్‌ పుస్తకంలోని 28వ అధ్యాయం చూడండి.

[16వ పేజీలోని చిత్రం]

ఒక అవిశ్వాసి ఆత్మీయ విషయాల్లో మీకున్న ఉత్సాహాన్ని పంచుకుంటాడా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి