జీవించడానికి కీలకాలు
ఒకవేళ ఒక హంతకుడు మీ ప్రాంతంలో ఉన్నాడన్న వార్తా నివేదికను మీరు వింటే, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకోడానికి మీరు చర్యలుగైకొనరా? బహుశా మీ ఇంట్లోకి రాకుండా ఉండేందుకు మీరు మీ తలుపులకు గడియపెట్టి తాళము వేస్తారు. అనుమానాస్పదంగా కనిపించే అపరిచితులను కనిపెట్టి మీరు వెంటనే పోలీసులకు తెలియజేస్తారు.
ప్రాణాంతక రోగమైన రొమ్ము క్యాన్సర్ విషయంలో స్త్రీలు ఏమైనా అజాగ్రత్తగా ఉండాలా? వారు తమ్మును తాము రక్షించుకొని జీవించగల అవకాశాలను పెంచుకొనటానికి వారు ఎటువంటి చర్యలు తీసుకోవాలి?
నిరోధించడం, ఆహారం
అమెరికాలోనున్న 3 క్యాన్సర్లలో ఒకటి ఆహార విషయాలను బట్టి వచ్చిందే. మీ శరీర వ్యాధినిరోధక వ్యవస్థను కాపాడటానికి సహాయం చేయగల మంచి ఆహారాన్ని తీసుకొనటమే మీరు తప్పించుకొనే మార్గాలలో మొదటిది. మనకు తెలిసిన ఏ ఆహారం కూడ క్యాన్సర్‌ను నయం చేయలేకపోయినా, కొన్ని ఆహారాలను తీసుకొని మరి కొన్నింటిని మానటం, నిరోధించటంలో ఒక భాగం కాగలదు. “సరైన ఆహారాన్ని తీసుకొనడం, రొమ్ము క్యాన్సర్ రాగల ప్రమాదాన్ని యాభై శాతం వరకు తగ్గించగలదు,” అని న్యూయార్క్, వాల్హలాలోని అమెరికన్ హెల్త్ ఫౌండేషన్‌కు చెందిన డా. లెనార్డ్ కోహెన్ చెప్పారు.
పీచు ఎక్కువగా ఉండే ఆహారం, అంటే రొట్టె మరియు కాయధాన్యాన్ని తీసుకొనడం ప్రొలాక్టిన్ మరియు ఈస్ట్రోజెన్ పరిమాణాన్ని తగ్గించడానికి సహాయకంగా ఉండవచ్చు, వాటిని హార్మోనులకు కట్టి శరీరంలోనుండి బయటకు పంపడం ద్వారా అలా చేస్తుంది. న్యూట్రీషన్ అండ్ క్యాన్స్‌ర్ అనబడే పత్రిక ప్రకారం, “ఈ ప్రభావాలు క్యాన్సర్ ప్రేరక పదార్థం వృద్ధి చెందకుండా అణచివేయగలవు.”
జంతు క్రొవ్వును తగ్గించడం కూడ ప్రమాదాన్ని తగ్గించగలదు. పుష్టిగల పాలుమాని, వెన్న తీసిన పాలు తీసుకోవటం, వెన్నను తినటం తగ్గించడం, కండ తక్కువ ఉండే మాంసాన్ని తినటం, మరియు చర్మాన్ని తీసేసిన కోడి మాంసాన్ని తినటం క్రొవ్వును అవసరమైనంత తగ్గించగలదని ప్రివెన్‌షన్ అనే పత్రిక చెప్పింది.
విటమిన్ ఎ ఎక్కువగా ఉండే కూరగాయలైన, క్యారెట్, దోసకాయలు, చిలకడ దుంపలు, మరియు పాలకూర, కోలార్డ్, మస్టర్డ్ గ్రీన్ వంటి పచ్చని ఆకుకూరలు తినటం సహాయకరంగా ఉండగలదు. క్యాన్సర్‌ని కలుగజేసే మార్పులను విటమిన్ ఎ ఆపుచేయగలదని భావిస్తున్నారు. బ్రకోలి, బ్రసెల్స్ స్ప్రౌవుట్స్, క్యాలీఫ్లవర్, క్యాబేజ్, మరియు చిన్న ఉల్లిపాయల వంటివి రక్షణకరమైన ఎన్‌జైమ్‌లను తయారు చేయగల రసాయనాలను కలిగి ఉంటాయి.
బ్రెస్ట్ క్యాన్సర్—వాట్ ఎవ్రీ వుమన్ షుడ్ నో అనే పుస్తకంలో, అస్వాభావికమైన కణాలను గుర్తించి నాశనం చేసే మన వ్యాధి నిరోధక వ్యవస్థను ఆహారం ద్వారా బలపరచవచ్చని డా. పాల్ రాడ్రిగజ్ చెబుతున్నారు. విటమిన్ సి ఎక్కువగా ఉండే కూరగాయలను మరియు ఇనుము ఎక్కువగా ఉండే ఆహారమైన తక్కువ కండగల మాంసాలు, పచ్చని ఆకుకూరలు, గుల్ల చేప, మరియు పండ్లను తినటం మంచిదని ఆయన సలహా ఇస్తున్నారు. విటమిన్ సి ఎక్కువగా ఉండే పళ్లూ, కూరగాయలను తినటం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలదని జర్న్‌ల్ ఆఫ్ ది నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ నివేదిస్తుంది. సోయాబీన్స్ మరియు పులియని సోయా ఉత్పత్తులు జెనిస్టెన్‌ని కలిగి ఉంటాయి, అది గ్రంథి పెరుగుదలను అణచివేయగలదని ప్రయోగశాల ప్రయోగాల్లో తేలింది, కాని మనుష్యులపై దాని ప్రభావం ఇంకా స్థిరపరచబడ లేదు.
తొలిదశలోనే కనిపెట్టడం
“రొమ్ము క్యాన్సర్‌ను తగ్గించడానికి దానిని తొలిదశలోనే గుర్తించడమే అతి ప్రాముఖ్యమైన చర్యగా మిగిలియుందని” రేడియీలజిక్ క్లినిక్స్ ఆఫ్ నార్త్ అమెరికా అనే ప్రచురణ తెలియజేస్తుంది. ఈ విషయంలో చేయవలసిన మూడు కీలక చర్యలేవంటే క్రమంగా రొమ్ములను స్వయంగా పరీక్ష చేసుకొనటం, వైద్యునిచే ప్రతి సంవత్సరం పరీక్ష చేయించుకొనటం, మరియు రొమ్ములను ఎక్సెరే తీయించుకొనటము వున్నాయి.
రొమ్ములను స్వయంగా పరీక్షించుకొనటం ప్రతి నెలా క్రమంగా జరగాలి, ఒక స్త్రీ తన రొమ్ములలో ఏదైనా గట్టిగా ఉండటం లేక వాపు కనిపిస్తుందేమో అని ఆమె జాగ్రత్తగా వాటి రూపాన్ని లేక స్పర్శను గమనించాలి. ఆమె కనుగొన్నది ఎంత చిన్నగా ఉన్నప్పటికీ ఆమె వెంటనే తన వైద్యుని వద్దకు వెళ్లాలి. ఆ వాపు ఎంత త్వరగా కనిపెట్టబడితే ఆమెకు తన భవిష్యత్తుపై అంత అదుపు ఉంటుంది. ఒకవేళ పాకెడిది కాని రొమ్ము క్యాన్సర్ 15 మిల్లీమీటర్లకు కొద్దిగా ఎక్కువ లేక కొంచెం చిన్నగా ఉండి శస్త్రచికిత్స ద్వారా తీసివేయబడినట్లైతే, 12 సంవత్సరాలు జీవించగల్గే అవకాశం 94 శాతం ఉంటుందని స్వీడెన్ నుండి వచ్చిన ఒక నివేదిక చూపింది.
డా. పెట్రీషియా కెల్లీ యిలా వ్యాఖ్యానించింది: “ఒకవేళ మీకు 12 1/2 సంవత్సరాలో రొమ్ము క్యాన్సర్ తిరిగి రానట్లైతే, అది మళ్లీ రావడం జరగదు. . . . మరియు కేవలం ఒక సెంటీమీటరు కంటే తక్కువ పరిమాణంలో ఉండే రొమ్ము క్యాన్సర్‌ను కేవలం తమ వేళ్లను ఉపయోగించి కనిపెట్టడం స్త్రీలకు నేర్పవచ్చును.”
ఒక స్పెషలిస్టు లేక వైద్యుని ద్వారా ప్రతి సంవత్సరం క్రమంగా పరీక్ష చేయించుకోవాలి, ప్రాముఖ్యంగా స్త్రీ 40 సంవత్సరాలకు చేరితే అలా చేయాలని చెప్పబడుతోంది. ఒకవేళ ఏదైనా వాపు కనిపిస్తే, రొమ్ము స్పెషలిస్టు లేక శస్త్రచికిత్స నిపుణుని నుండి రెండవ అభిప్రాయం పొందటం మంచిది.
క్రమం తప్పకుండా మమ్మోగ్రామ్ తీయించుకొనడం రొమ్ము క్యాన్సర్‌కు మంచి ఆయుధమని అమెరికాలోని జాతీయ క్యాన్సర్ సంస్థ చెబుతుంది. ఈ విధమైన ఎక్స్‌రే పద్ధతి గ్రంథివున్నదని స్పర్శ ద్వారా తెలుసుకొనడానికి బహుశా రెండు సంవత్సరాలు ముందే ఆచూకి తెలుసుకొనగలదు. ఈ పద్ధతి 40 కంటే ఎక్కువ సంవత్సరాలు గల స్త్రీల కొరకు సూచించబడింది. అయినప్పటికి, డా. డానిఏల్ కోపెన్జ్ మనకిలా తెలియజేస్తున్నాడు: “అది అంత ఖచ్చితమైనది కాదు.” అది అన్నిరకాల రొమ్ము క్యాన్సర్‌లను కనుగొనలేదు.
ఒకవేళ ఒక స్త్రీ లేక ఆమె వైద్యుడు ఏదైనా లోపాన్ని కనుగొన్నప్పుడు మమ్మోగ్రామ్ ఎటువంటి సూచన ఇవ్వకపోతే, తరచుగా మనం కనుగొన్న దానిని అలక్ష్యం చేసి ఎక్స్‌రే చూపిన దానిని విశ్వసిస్తుంటాము అని న్యూయార్క్‌లోని బ్రెస్ట్ క్లినిక్‌కు చెందిన డా. వెండే లోగన్-యంగ్ తేజరిల్లు!కు చెప్పింది. “ఈ దినాల్లో మనం చేస్తున్న అతి పెద్ద తప్పు” అదేనని ఆమె చెప్పింది. క్యాన్సర్‌ను కనుగొనగల్గే మమ్మోగ్రఫీకున్న సామర్థ్యంపై అంత ఎక్కువ ఆధారపడకుండా తాము రొమ్ములను స్వయంగా పరీక్ష చేసినప్పుడు వచ్చిన ఫలితాలపై కొంతవరకు ఆధారపడాలని ఆమె స్త్రీలకు సలహా ఇచ్చింది.
మమ్మోగ్రఫీ గ్రంథులను కనిపెట్టగలిగినా, ఆ గ్రంథి ప్రమాదరహితమైనదో (క్యాన్సర్ లేనిది) లేక ప్రాణాంతకమైనదో (క్యాన్సర్ గలది) అది తెలుసుకొనలేదు. అది కేవలం బయాప్సీ వలననే కనుగొనవచ్చును. మమ్మోగ్రామ్ కొరకు వెళ్లిన ఎరెన్ విషయాన్ని గమనించండి. ఎక్స్‌రే ఫిల్మ్‌పై ఆధారపడి, ఆమె వైద్యుడు ఆమె వాపును ప్రమాదకరంకాని ఒక రొమ్ము వ్యాధి అని ఇలా చెప్పాడు: “నీకు క్యాన్సర్ లేదని నేను కచ్చితంగా చెప్పగలను.” రొమ్ము ఎక్స్‌రే చేసిన నర్సు మాత్రం కంగారు పడింది, కాని ఎరెన్ ఇలా చెప్పింది: “వైద్యుడు అంత కచ్చితంగా చెబుతున్నప్పుడు ఒకవేళ నేనే మరీ ఎక్కువ భయపడుతున్నానేమో.” త్వరలో ఆ వాపు పెద్దదిగా మారింది, కావున ఎరెన్ ఇంకొక వైద్యున్ని సందర్శించింది. బయాప్సీ చేయడం జరిగింది మరియు ఆమెకు అతి త్వరగా పెరిగే క్యాన్సరైన ఇన్‌ఫ్లేమేటరీ కార్సినోమా ఉంది. ఒక గ్రంథి ప్రమాదరహితమైనదో (10 వాటిల్లో 8 వరకు అట్టివే) లేక ప్రాణాంతకమైనదో తేల్చటానికి బయాప్సీ చేయబడాలి. ఒకవేళ ఒక వాపు వైద్యపరంగా అనుమానాస్పదంగా తోచటం లేక కనిపించటం జరిగితే లేక అది పెరుగుతుంటే, బయాప్సీ చేయవలసి ఉంటుంది.
వైద్యము
శస్త్రచికిత్స, రేడియేషన్, మరియు మందుల వైద్యం, ప్రస్తుతం రొమ్ము క్యాన్సర్‌కు ప్రాచుర్యంలో ఉన్న వైద్యాలు. గ్రంథి యొక్క విధం, దాని పరిమాణం, అది పాకే పద్ధతి, మరియు అది ఒకవేళ కీళ్లకు పాకిందేమో అది, మీకు రుతుస్రావం ఆగిపోయి ఉంటే దాని విషయం ఇలాంటివి ఏ విధమైన వైద్యం చేయాలన్నది నిర్ణయించే విషయంలో మీకు మరియు మీ వైద్యునికి సహాయం చేయగలవు.
శస్త్రచికిత్స. కొన్ని దశాబ్దాలుగా ర్యాడికల్ మాస్టెక్టమీ, రొమ్మును దానితో సహా దాని క్రింద ఉండే నరాలను మరియు శోషరస గ్రంథులను తీసివేయడం విస్తృతంగా ఉపయోగింపబడేది. కాని ఈమధ్య కాలాల్లో, కేవలం గ్రంథిని మరియు శోషరసగ్రంథులను, దానితోపాటు రేడియేషన్ చేసే రొమ్మును కాపాడే వైద్యం ఉపయోగింప బడుతుంది మరియు దాని వలన మాస్టెక్టమీకి వలెనే రోగులు కోలుకొంటున్నారు. కొన్నిసార్లు చిన్న గ్రంథి తీసివేయవలసినప్పుడు, కొందరు స్త్రీలకు అది మనశ్శాంతిని కలిగిస్తుంది. ఎందుకంటే అది రొమ్ము రూపాన్ని ఎక్కువ పాడుచేయదు. కాని యౌవన స్త్రీలు, అదే రొమ్ములో అనేక చోట్ల గ్రంథులు ఉంటే లేక మూడు సెంటీమీటర్ల కంటే పెద్ద గ్రంథులు ఉన్న వారికి, ఈ రొమ్మును కాపాడే చికిత్స వలన వ్యాధి మళ్లీ వచ్చే అవకాశం ఉందని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సర్జరీ చెబుతోంది.
వ్యాధి మళ్లీ రాకుండా ఉండటానికి ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తిస్తూ క్లీవ్‌లాండ్ క్లినిక్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ యిలా చెబుతోంది: “ఎద యొక్క పెద్ద నరాలు తీసివేయబడని మాడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ తరువాత, బ్రతకటం మరియు మళ్లీ రాకుండా ఉండే విషయంపై రక్తం ఎక్కించుకోవటం చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.” రక్తం ఎక్కించుకున్న ఒక గుంపు ఐదు సంవత్సరాలు జీవించే అవకాశాలు 53 శాతం కలిగి ఉంటే, దానికి విరుద్ధంగా రక్తం ఎక్కించుకొనని ఒక గుంపు 93 శాతం అవకాశాలు కలిగి ఉండిరని ఒక నివేదిక చూపించింది.
బ్రతకటానికి ఇంకొక సహాయకాన్ని గూర్చి ది లాన్‌సెట్ పత్రికలో డా. ఆర్. ఎ. బాడ్‌వె యిలా నివేదిస్తున్నాడు: “రుతుస్రావం ఆగిపోని రొమ్ము క్యాన్సర్ వున్న రోగులకు వారి రుతుస్రావం యొక్క గతిని బట్టి, శస్త్రచికిత్స చేయటం దీర్ఘకాల ప్రగతిలో ఎక్కువ ప్రభావాన్ని చూపగలదు.” ఈస్ట్రోజెన్ స్రవిస్తున్న సమయంలో గ్రంథి తీయబడటం జరిగిన స్త్రీలు, రుతుస్రావం యొక్క ఇతర సమయాల్లో జరుపబడిన వారికంటే ఎక్కువ బాధపడ్డారు—54 శాతం మంది పది సంవత్సరాలు బ్రతుకగా, రెండవ కోవకు చెందిన వారు 84 శాతం జీవించారు. రుతుక్రమం ఇంకా ఆగిపోని రొమ్ము క్యాన్సర్‌గల స్త్రీలకు శస్త్రచికిత్స చేయవలసిన అత్యంత అనుకూలమైన సమయం రుతుక్రమం అయిపోయిన తరువాత కనీసం 12 దినాలు గడిచాక జరపబడగలదని చెప్పబడుతోంది.
రేడియేషన్ చికిత్స. రేడియేషన్ చికిత్స క్యాన్సర్ కణాలను చంపుతుంది. రొమ్మును సంరక్షించే చికిత్స విషయంలో, వైద్యుడు రొమ్మును కాపాడటానికి ప్రయత్నిస్తుండగా సూక్ష్మమైన క్యాన్సర్ గ్రంథులు అతని కత్తిని తప్పించుకొనగలవు. రేడియేషన్ చికిత్స అన్ని కణాలనూ తుడిచిపెట్టేయ గలదు. కాని ఈ రేడియేషన్ రెండవ రొమ్ములో క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కలుగజేయగలదు. రెండవ రొమ్ము రేడియేషన్‌కు ఎక్కువ గురి కాకుండా చూడాలని డా. బెనెడిక్ ఫ్రాస్ చెబుతున్నారు. “మొదటి రొమ్ములోనుండి క్యాన్సర్‌ను తీసివేసే సమయంలో కొన్ని చిన్న ప్రయత్నాలు గనుక చేస్తే, ఇంకొక దానికి రేడియేషన్ ఎక్కువ తగులకుండా చేయవచ్చు” అని ఆయన చెబుతున్నారు. రెండున్నర సెంటీమీటర్లు మందం ఉండే సీసపురేకును ఇంకొక రొమ్ముకు అడ్డం పెట్టాలని ఆయన సలహా ఇస్తున్నారు.
మందుల చికిత్స. రొమ్ము క్యాన్సర్‌ను శస్త్రచికిత్స ద్వారా నయం చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్ననూ, రొమ్ము క్యాన్సర్ క్రొత్తగా కనుగొన్న 25 నుండి 30 శాతం మంది స్త్రీలు, మొదట్లో లక్షణాలను నిర్ధారించటం కష్టమయ్యేంత అతి చిన్న పాకే క్యాన్సర్ గ్రంథులను కలిగి ఉంటారు. శరీరం యొక్క ఇతర అవయవాలలోకి పాకే కణాలను చంపడానికి ప్రయత్నించే రసాయనాలను ఉపయోగించటమే కెమోథెరపీ చికిత్సా విధానము.
క్యాన్సర్ గ్రంథులు వేర్వేరు రకాల కణాలను కలిగి ఉంటాయి, మరియు ఆ కణాలు ఒకొక్కటి మందులకు ప్రత్యేక సంవేదనను కలిగి ఉంటాయి గనుక కెమోథెరపీ దాని ప్రభావాలలో తక్కువ ఉపయుక్తమైనది. ఆ చికిత్సను తప్పించుకున్న కణాలు, మందులకు తట్టుకొని ఉండగల గ్రంథుల క్రొత్త తరాన్ని ఉత్పత్తి చేయగలవు. కాని 1992 జనవరి నెలలోని ది లాన్‌సెట్ పత్రిక కెమోథెరపి ఒక స్త్రీ తన వయస్సునుబట్టి ఒక దశాబ్దం ఎక్కువ జీవించే సాధ్యతను 5 నుండి 10 వరకు పెంచిందని రుజువుపరిచింది.
కెమోథెరపీ యొక్క ఇతర ప్రభావాలు వికారం, వాంతికి, వెంట్రుకలు ఊడిపోవటం, రక్తస్రావం, గుండె జబ్బు, రోగనిరోధక శక్తిని అణచివేయటం, గొడ్రాలితనం, మరియు రక్త క్యాన్సర్‌ను కలిగించవచ్చు. జాన్ క్రెన్స్, సైంటిఫిక్ అమెరికన్ అనే పత్రికలో వ్రాస్తూ యిలా వ్యాఖ్యానించాడు: “రోగం ముదిరిన, త్వరగా పాకే క్యాన్సర్ ఉన్న రోగులకు ఇవి ఏమంత చెప్పుకోదగినంత ప్రమాదాలుగా అనిపించకపోవచ్చు, కాని ఒక సెంటీమీటరున్న చిన్న గ్రంథివున్న మరియు ఒక ప్రాంతంలోనే రొమ్ము క్యాన్సర్ ఉన్న వారికి అవి చాలా గంభీరమైన నిర్ణయాలుగా ఉంటాయి. ఆమె శస్త్రచికిత్స తరువాత వేరే అదనపు వైద్యాన్ని తీసుకొనక పోయినా, ఆమె క్యాన్సర్ వలన ఐదు సంవత్సరాలకు మరణించే సాధ్యత కేవలం 10 శాతం మాత్రమే ఉంటుంది.”
హార్మోనుల చికిత్స. ఈస్ట్రోజెన్‌కి విరుద్ధంగా ఇవ్వబడే చికిత్స, ఈస్ట్రోజెన్ యొక్క పెరుగుదలను పెంచే ప్రభావాన్ని తీసివేస్తుంది. రుతుస్రావం ఇంకా ఆగని స్త్రీలలో, బీజ కోశాలను శస్త్రచికిత్స ద్వారా తీసివేయటం ద్వారానో లేక మందుల ద్వారానో ఈస్ట్రోజెన్ యొక్క పరిమాణాన్ని తగ్గించడం జరుగుతుంది. ఈ రెండు పద్ధతులలోను వైద్యం చేయబడిన 100 మంది స్త్రీలలో 8 నుండి 12 మంది స్త్రీలు పది సంవత్సరాలు బ్రతికారని ది లాన్‌సెట్ నివేదిస్తుంది.
రొమ్ము క్యాన్సర్ ఉన్న స్త్రీలు ఆ తరువాత కూడ జీవితాంతం జాగ్రత్త తీసుకోవలసి ఉంటుంది. పూర్తిగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఏఒక్క భాగంలోనైనా మళ్లీ వ్యాధి గనుక వస్తే, ఇతర విధాలైన చికిత్సలు అవసరమైన ఆయుధాన్ని అందించగలవు.
ఇంకొక రకమైన క్యాన్సర్ చికిత్స కాకెక్సియా అనబడే వ్యాధి వైపు తన అవధానాన్ని ఉంచుతూ వేరే విధంగా పని చేస్తుంది. క్యాన్సర్ యొక్క అన్ని మరణాల్లోనూ మూడింట రెండు మరణాలు కాకెక్సియా వలననే, ఆ పదం కండరాలు మరియు ఇతర కణజాలం వృధా అయిపోటాన్ని వివరించడానికి ఉపయోగింప బడుతుందని క్యాన్సర్ రీసెర్చ్ అనే పత్రిక వివరిస్తుంది. అమెరికాలోని సైరేకస్ క్యాన్సర్ రీసర్చ్ సంస్థకు చెందిన డా. జోసఫ్ గోల్డ్, తేజరిల్లు!కు యిలా చెబుతున్నారు: “కాకెక్సియాకు జీవ రసాయన మార్గములు తెరవబడి ఉండకపోతే వ్రణము పెరిగి శరీరమంతటా పాకటం సాధ్యం కాదని మేము భావిస్తున్నాము.” విష పూరితమైనది కాని హైడ్రాజైన్ సల్ఫేట్‌ను ఉపయోగించిన ఒక క్లినిక్‌లో జరుపబడిన పరీక్ష ఈ మార్గములు ఆపబడగలవని చూపించింది. చివరి దశ రొమ్ము క్యాన్సర్ ఉన్న వారు 50 శాతం మంది నిలదొక్కుకొన గలిగారు.
నిబద్ధంకాని వైద్యం అని పిలువబడే సహాయకాలను, రొమ్ము క్యాన్సర్‌కు శస్త్రచికిత్సలేని లేక విషపదార్థంలేని వైద్యమని కొందరు స్త్రీలు ఇష్టపడటం జరుగుతుంది. చికిత్సలు వేరుగా ఉంటాయి, హోక్సే చికిత్సలో వలె పత్యం మరియు మూలికలను ఉపయోగిస్తారు. కాని ఈ చికిత్సల సామర్థ్యాలను గూర్చి ఎవరైనా తెలిసికొనడానికి ప్రచురమైన అధ్యయనాలు చాలా కొద్దిగా మాత్రమే ఉన్నాయి.
ఈ శీర్షిక జీవించటానికి కీలకాలను అందించటానికే రూపొందింపబడింది గనుక, ఏ చికిత్సను కూడ బలపరచటం తేజరిల్లు! ధ్యేయం కాదు. ఈ వ్యాధి యొక్క వైద్యం విషయమై ఈ వేర్వేరు పద్ధతుల వైపు తమ పరిస్థితుల అనుసారంగా పరికించమని మేము అందరినీ ప్రోత్సహిస్తున్నాము.—సామెతలు 14:15.
ఒత్తిడి మరియు రొమ్ము క్యాన్సర్
తీవ్రంగా లేక దీర్ఘకాలంగా ఉండే ఒత్తిడి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ గ్రంథిలోని పోరాడగల శక్తిని తగ్గించగలదని ఆక్టా న్యూరాలజికా అనే పత్రికలో, డా. హెచ్. బల్టురూష్ వివరిస్తున్నారు. అలసిపోయిన వారు, కృంగిపోయిన వారు, లేక భావోద్రేక మద్దతును కలిగిలేని స్త్రీల రోగనిరోధక వ్యవస్థ, 50 శాతం వరకు ప్రమాదంలో ఉంటుంది.
కావున, మైండ్ అండ్ క్యాన్సర్ ప్రోగ్నోసిస్ పత్రికలో వ్రాస్తూ, డా. బాసిల్ స్టోల్ యిలా నొక్కి చెబుతున్నారు: “వారి వ్యాధికి చేయబడే చికిత్సకు ముందు, అటు తరువాత కూడ వారు ఎదుర్కొనే తప్పనిసరైన భౌతిక మరియు మానసిక బాధను తగ్గించటానికి ప్రతి ప్రయత్నం చేయబడాలి.” కాని ఏ విధమైన మద్దతు అవసరము?
[7వ పేజీలోని చిత్రం]
మనకు తెలిసిన ఏ ఆహారం కూడ క్యాన్సర్‌ను నయం చేయలేకపోయినా, కొన్ని ఆహారాలను తీసుకొని మరి కొన్నింటిని మానటం, నిరోధించటంలో ఒక భాగం కాగలదు. “సరైన ఆహారాన్ని తీసుకొనడం, రొమ్ము క్యాన్సర్ రాగల ప్రమాదాన్ని యాభై శాతం వరకు తగ్గించగలదు,” అని డా. లెనార్డ్ కోహెన్ చెప్పారు
[8వ పేజీలోని చిత్రం]
“రొమ్ము క్యాన్సర్‌ను తగ్గించడానికి దానిని తొలిదశలో గుర్తించడమే అతి ప్రాముఖ్యమైన చర్యగా మిగిలియుందని” రేడియోలజిక్ క్లినిక్ ఆఫ్ నార్త్ అమెరికా అనే ప్రచురణ తెలియజేస్తుంది. ఈ విషయంలో మూడు కీలక చర్యలేవంటే; క్రమంగా రొమ్ములను స్వయంగా పరీక్ష చేసుకొనటం, వైద్యునిచే ప్రతి సంవత్సరం పరీక్ష చేయించుకొనటం, మరియు మమ్మోగ్రఫీ తీయించుకొనటము వున్నాయి
[10వ పేజీలోని చిత్రం]
లావుగా ఉండటం, కృంగిపోవటం, లేక భావోద్రేక మద్దతును కలిగిలేని స్త్రీల రోగనిరోధక వ్యవస్థ, 50 శాతం వరకు రాజీపడటానికి ఒప్పుకొంటుంది
[9వ పేజీలోని బాక్సు]
స్వయం పరిశీలన—ఒక నెలసరి పరీక్ష
రుతుస్రావం జరిగిన నాలుగు నుండి ఏడు దినాల తరువాత రొమ్ములను స్వయంగా పరిశీలించుకోవాలి. రుతుస్రావం ఆగిపోయిన స్త్రీలు కూడ ప్రతి నెలా అదే రోజున చేయాలి.
ప్రతి నెలా అదే రోజున వెదకవలసిన సూచనలు
• రొమ్ములో ఏ పరిమాణంలోనైనా (చిన్నదిగాని లేక పెద్దదిగాని) గడ్డ లేక అది మందమగుట.
• రొమ్ము చర్మంలో ముడతలు లేక గుంటలు పడటం, లేక రంగు మారిపోవటము.
• చనుమొన లోనకు పోవటం లేక మార్పు రావడము.
• చనుమొనలపై పొక్కులు రావటం లేక పొలుసు ఊడిపోవటం లేక ద్రవం కారటము.
• చంకల క్రింది గ్రంథులు పెద్దవి అవ్వటం.
• రొమ్ము యొక్క మచ్చలు లేక గాటులలో మార్పులు.
• గుర్తించిన రొమ్ముల అసౌష్ఠవం అంటే మామూలుగా ఉండేదానికన్నా మార్పు చెందటము.
స్వయం పరిశీలన
నిలబడి ఉన్నప్పుడు, ఎడమ చేతిని ఎత్తండి. కుడి చేతిని ఉపయోగిస్తూ రొమ్ము యొక్క బయటి చివరి భాగంనుండి ప్రారంభించి, వేళ్ల చదును భాగాలను వలయాలుగా నొక్కుతూ, రొమ్ము చుట్టూ తిప్పుతూ చనుమొన వరకు రండి. చంక క్రింద మరియు రొమ్ము భాగాన్ని కూడ పరిశీలించండి.
వెల్లకిలా పండుకొని, ఎడమ భుజము క్రింద ఒక దిండును పెట్టుకోండి, మరియు ఎడమ చేతిని తల పైన లేక వెనుక పెట్టండి. పైన వివరించబడిన అదే వలయాకారపు ప్రక్రియను ఉపయోగించండి. కుడి వైపు కూడ అలాగే చేయండి.
ఏదైనా ద్రవం వస్తుందేమో అని చూడటానికి చనుమొనను సున్నితంగా నొక్కండి. కుడి రొమ్ముకు కూడ అలానే చేయండి.