విలువైన మద్దతు
“నేను మరణ భయాన్ని మరియు కృంగి పోయిన సమయాలను ఎదుర్కొనవలసి ఉంటిని,” అని అర్జెంటీనాలోని యెహోవా సాక్షులలో ఒకరైన వర్జీనియా అలా చెప్పింది. రొమ్ము క్యాన్సర్‌కు విరుద్ధంగా ఆమె సల్పిన పోరాటంలో ఆమెకు రాడికల్ మాస్టెక్టమీ శస్త్రచికిత్స జరిగింది మరియు రెండు అండాశయాలు తీసివేయబడ్డాయి.a
వాస్తవానికి, రొమ్ము క్యాన్సర్ వలన కలిగే మరణమును గూర్చిన భయము ప్రపంచమంతటా అందరికీ ఉంది. ఈ భయంతోపాటు, స్త్రీతనానికి, పోషించే సామర్థ్యానికి చాలా సన్నిహితంగా ఉండే అంగాలను తాను ఇక కలిగి ఉండలేను, వాటిని పోగొట్టుకుంటున్నాను అనే భీతి ఒక స్త్రీ జీవితాన్ని మానసికంగా కకావికలం చేయగలదు. తాను ఒంటరిదాన్ననే భావాలు చాలా ఎక్కువగా కలగటం వలన ఆమె త్వరగా నిరాశకు గురికాగలదు. ఇటువంటి మానసిక చిత్రవధ నుండి ఆమెను ఎలా తప్పించవచ్చు?
మద్దతు యొక్క అవసరం
“ఆమెకు మద్దతు అవసరం!” అని అమెరికాలోని జోన్ జవాబిస్తుంది. ఆమె తల్లి, అమ్మమ్మ కూడ రొమ్ము క్యాన్సర్ రోగులే, మరి ఇప్పుడు ఆమె కూడ వారెదుర్కొన్నటువంటి పోరాటాన్నే ఎదుర్కొంటుంది. ఈ సమయంలోనే నమ్మకమైన కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఓదార్పుకరమైన మద్దతును, సహాయాన్ని అందించగలరు. జోన్ భర్తయైన, టెర్రీ, ఆమెకు ఒక దృఢమైన అనుకూల సలహాదారుడయ్యాడు. టెర్రీ యిలా వివరిస్తున్నాడు: “నేను గమనించిన విధంగా, నా స్థానం, ఒక స్థయిర్యానిచ్చే ప్రభావంగా ఉండాలి. తాను విరమించుకొనకుండా పోరాడటానికి ఆమెకు కావలసిన దృఢనమ్మకాన్ని, బలాన్నిచ్చే చికిత్స విషయంలో ఆమె ఎంపిక చేసుకొనటానికి నేను జోన్‌కు సహాయం చేయవలసిన అవసరం ఉంది. క్యాన్సర్ శస్త్రచికిత్సను గూర్చిన ఆమె భయాన్ని మేము ఎదుర్కోవలసి ఉండెను, మేము వైద్యులతో జరిపిన చర్చలలో ఆమె ప్రశ్నలను, భయాలను గురించి తప్పక ప్రస్తావించడానికి నేను కృషి చేశాను.” టెర్రీ ఇంకా ఇలా చెబుతున్నాడు: “మనము మన కుటుంబాల కొరకు మరియు కుటుంబ మద్దతులేని తోటి క్రైస్తవుల కొరకు చేయగలిగినది అదే. వైద్య సిబ్బందితో మనము వారి కన్నులు, చెవులు, మరియు స్వరంగా ఉండవచ్చు.”
అవివాహితులు లేక వితంతువులకు ప్రత్యేక అవధానాన్ని ఇవ్వవలసిన అవసరం ఉంది. ఆస్ట్రేలియాలోని డయానా మనకిలా చెబుతుంది: “నా భర్త ఐదు సంవత్సరాల క్రితం క్యాన్సర్ శస్త్రచికిత్స అయిన తరువాత మరణించాడు, కాని నా పిల్లలు ఆ లోటును భర్తీ చేయటానికి సహాయం చేశారు. వారు దయగల వారు కాని భావోద్రేకమైన వారుకాదు. అది నాకు బలాన్నిచ్చింది. అవసరమైనవన్నీ త్వరగా, నెమ్మదిగా అందజేయబడేవి.”
రొమ్ము క్యాన్సర్ పూర్తి కుటుంబంపై భావోద్రేకమైన తాకిడిని కలుగజేస్తుంది. కావున వారందరికీ ఇతరుల నుండి (ఒకవేళ వారు యెహోవా సాక్షులు అయినట్లైతే, ప్రాముఖ్యంగా తమ ఆత్మీయ సహోదర సహోదరీల నుండి) ప్రేమపూర్వక శ్రద్ధ మరియు మద్దతు కావలసిన అవసరం ఉంది.
రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లిని కలిగి ఉన్న, అమెరికాలోని రెబేకా, యిలా వివరిస్తుంది: “సంఘం మీ విస్తృత్త కుటుంబం, వారి ప్రవర్తన మీ భావోద్రేకాలపై ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మా అమ్మ ఎన్నుకున్న నిబద్ధంకాని పద్ధతిని అనేకులు అంగీకరించక పోయిననూ, తమ టెలిఫోను పిలుపులు, సందర్శనాల వలన వారు మాకు మద్దతును ఇచ్చారు. కొందరు ఆమెకు పత్యాన్ని సిద్ధం చేయటంలో సహాయపడటానికి కూడ వచ్చేవారు. పెద్దలు రాజ్యమందిరంలోని సౌండ్ సిస్టమ్‌కు మా టెలిఫోన్‌ను కలపటం ద్వారా మేము అక్కడి కార్యక్రమాలన్నీ వినగలిగేలా చేసి మేము కూటాలను ఎప్పుడూ కూడ తప్పిపోకుండా చేశారు. గ్రీటింగ్ కార్డుతోపాటు డబ్బును కూడ బహుమతిగా పంపించారు.”
జోన్ యిలా ఒప్పుకొంటుంది: “నా ఆత్మీయ సహోదర సహోదరీలు ప్రదర్శించిన ప్రేమను గూర్చి నేను ఆలోచిస్తే, ఈనాటికి కూడ నాకు గగుర్పాటు కలుగుతుంది! ఏడు వారాలు, వారానికి ఐదు రోజులు, ప్రేమగల నా సహోదరీలు నన్ను చికిత్స కొరకు ఆసుపత్రికి తీసుకుని వెళ్లి, తీసుకుని రావటానికి ఒకరి తరువాత ఒకరు వంతులు వేసుకొనే వారు. మరి అందుకు 150 కిలోమీటర్లు వెళ్లిరావాలి! ఈ గొప్ప క్రైస్తవ సహోదరత్వమనే దీవెన విషయమై నేను యెహోవాకు ఎంతగా కృతజ్ఞతలు తెల్పుకుంటున్నానో!”
మనమందరము కూడ ప్రోత్సాహకరంగా మరియు మద్దతును ఇచ్చే వారముగా ఉండటాని ఇంకొక మార్గము మన నిర్మాణాత్మకమైన వ్యాఖ్యానాలు. ప్రతికూలమైన విషయాలను గూర్చి అదే పనిగా మాట్లాడి పొరపాటుగా దుఃఖాన్ని కలిగించకుండా ఉండటానికి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. దకిణాఫ్రికాకు చెందిన జూన్ యిలా వివరిస్తుంది: “క్యాన్సర్ కలిగిలేని వ్యక్తి సరైన విషయాన్నే మాట్లాడాలని ఎవ్వరూ ఎదురు చూడలేరు. ఇతర క్యాన్సర్ రోగుల విషయాలు అనుకూల ఫలితాలు కలిగిలేనప్పుడు వాటిని గురించి వారు మాట్లాడకుండా ఉంటేనే మంచిదని నా మట్టుకు నేను భావించాను.” జపాన్‌లోని నొరికో కూడ యిలా అంగీకరిస్తోంది: “కోలుకొన్న తరువాత అది మళ్లీ రాకుండా ఉన్న వారిని గురించి ప్రజలు నాకు చెబితే, అప్పుడు నేను కూడ వాళ్లవలే కాగలనేమోననే నిరీక్షణ నాకు కలుగుతుంది.”
కొందరు స్త్రీలు ఎప్పుడూ తమ ఆరోగ్యాన్ని గురించే మాట్లాడటాన్ని ఇష్టపడరు అనే విషయాన్ని మదిలో ఉంచుకోండి. అయితే మరికొందరు, తమ యోగక్షేమాలను గూర్చి, రొమ్ము క్యాన్సర్‌తో వారికి కలిగిన అనుభవాన్ని గూర్చి, ప్రత్యేకంగా తమ సన్నిహిత స్నేహితులతో మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. వారికి ఏది ఎక్కువ సహాయకరమైన విషయమో ఒకరు తెలిసికొనటం ఎలా? అమెరికానందలి, హెలెన్ యిలా సలహా ఇస్తుంది: “ఒకవేళ ఆమె దానిని గురించి మాట్లాడటానికి ఇష్టపడుతుందేమో ఆమెనే అడగండి, మరి ఆమెనే ఎక్కువ మాట్లాడనివ్వండి.” అవును, “ఆలకించటానికి సిద్ధంగా ఉండండి,” అని డెన్మార్క్‌కు చెందిన ఇంజెలిసీ చెబుతుంది. “ఆమె తన బాధాకరమైన తలంపులతో ఒంటరిగా ఉండకుండా ఆమెకు భావోద్రేక మద్దతును ఇవ్వండి.”
ఒక అనుకూలమైన దృక్పథం కొరకు కృషిచేయటం
రొమ్ము క్యాన్సర్ చికిత్స రోగికి వారాలు, నెలలు, లేక సంవత్సరాల వరకు నిస్సత్తువను, అలసటను కలిగించవచ్చు. రొమ్ము క్యాన్సర్‌గల స్త్రీలకు కలిగే అతి పెద్ద శ్రమలన్నిటిలో ఒకటి, తాను పూర్వం చేయగలిగినంత ఇప్పుడు చేయలేదనే వాస్తవాన్ని ఎదుర్కొనడంలో కావచ్చు. ఆమె శరీరం యొక్క పరిమితులను అంగీకరించటమంటే ఎక్కువ పని కల్పించుకోకుండా దినంలో విశ్రాంతి తీసుకొనటం అని అర్థము.
నిరుత్సాహం కలిగినప్పుడు, అనుకూలమైన వైఖరిని కలిగి ఉండటానికి వెంటనే చర్యలు గైకొనాల్సిన అవసరం ఉంది. నొరికో తన అనుభవాన్ని చెబుతుంది: “హార్మోను చికిత్స నన్ను కృంగదీసింది. ఈ నేపథ్యలో నేను చేయాలనుకున్న పనులను నేను చేయలేకపోయాను, మరి నేను యెహోవాకు, మరి క్రైస్తవ సంఘంలో పనికిరాని దానిగా భావించటం ప్రారంభించాను. నా ఆలోచనలు మరీ ప్రతికూలంగా మారుతున్న కొద్దీ, నా కుటుంబంలో క్యాన్సర్ వలన మరణించిన వారి చివరి బాధలను నేను జ్ఞప్తికి తెచ్చుకొనే దాన్ని. ‘వాళ్లు భరించినట్లు నేను దాన్నంతా భరించగలనా?’ అని నేను యిలా సందేహిస్తుంటే భయం నన్ను ఆవరించేది.”
నొరికో ఇంకా యిలా చెబుతుంది: “ఆ సమయంలోనే, యెహోవా మన ఉనికిని గూర్చి ఎలా భావిస్తున్నాడు అనే దానిని ఆలోచించటానికి నేను యెహోవా సాక్షుల ప్రచురణలను ఉపయోగించటం ద్వారా నా ఆలోచనలను సరిదిద్దుకొనటానికి నేను ప్రయత్నాలు చేశాను. ఎంత ఎక్కువ పని చేశాము అనే దానిని బట్టికాక అది ఏ ఉద్దేశ్యంతో చేయబడుతుందో దాని ద్వారా దైవభక్తి చూపబడుతుందని నేను నేర్చుకున్నాను. నా హృదయ పరిస్థితి మరియు నా ఆలోచనలనుబట్టి యెహోవా సంతోషించాలని నేను కోరుకున్నాను గనుక, నేను క్రైస్తవ పరిచర్యలో కొద్దిగా మాత్రమే చేయగల్గుతున్ననూ పూర్ణ హృదయంతో చేస్తూ, నేను ఆయనను ఆనందముతో సేవించాలని నిర్ణయించుకున్నాను.”
రొమ్ము క్యాన్సర్‌కు విరుద్ధంగా దీర్ఘకాలంగా అనిశ్చయంగా పోరాడుతున్న స్త్రీల అనుకూల దృక్పథం నీరుకారి పోవచ్చు. యెహోవా దేవుడు ఆమెకు ఇచ్చిన అనేక ప్రేమపూర్వక విషయాలతో ఆమె తన హృదయాన్ని, మనస్సును నింపుకొనటం తనకు ఎక్కువగా సహాయం చేశాయని డయానా వివరిస్తుంది: “నా కుటుంబం, స్నేహితులు, మనోహరమైన సంగీతం, మరియు మహోన్నత సముద్రాన్ని, చక్కని సూర్యాస్తమయాన్ని చూడటం.” ఆమె ప్రత్యేకంగా యిలా ప్రోత్సహిస్తుంది: “ఇతరులకు దేవుని రాజ్యాన్ని గూర్చి చెప్పండి. ఆ రాజ్యం క్రింద భూమిపైన ఉండే పరిస్థితులపట్ల వాస్తవమైన ఆశను పెంపొందించుకొనండి, ఆ పరిస్థితిలో వ్యాధి కూడ ఎంతమాత్రమును ఉండదు!”—మత్తయి 6:9, 10.
జీవితంలో ఆమె కలిగి ఉన్న సంకల్పాన్ని గూర్చి ధ్యానించటం వలన ఆమె తనకు కలుగుతున్న నిరుత్సాహాన్ని ఎదిరించటానికి వర్జీనియా కూడ బలాన్ని పొందుతుంది: “నేను అంతటి అమూల్యమైన పనిని చేయవలసి ఉంది గనుక నేను నిజంగా జీవించాలని కోరుకొంటున్నాను.” క్లిష్టమైన గడియలు వచ్చి భయం కమ్ముకునే సమయాలను గూర్చి ఆమె యిలా చెబుతుంది: “ఆయన నన్ను ఎన్నడునూ ఎడబాయడని ఎరిగి, నేను యెహోవా యందు నా పూర్తి నమ్మకాన్ని ఉంచాను. ‘యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును’ అని నాకు అభయమిస్తున్న కీర్తన 116:9లోని బైబిలు వచనాలను గూర్చి నేను ఆలోచిస్తాను.”
ఈ స్త్రీలందరూ కూడా తమ నిరీక్షణను బైబిలు యొక్క దేవుడైన, యెహోవాపై, కేంద్రీకరించారు. బైబిలు పుస్తకమైన 2 కొరింథీయులు, 1వ అధ్యాయము, 3 మరియు 4 వచనాలలో, యెహోవాను గురించి “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, . . . ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు” అని చెబుతోంది. ఓదార్పు అవసరమైన వారికి మద్దతును ఇవ్వటానికి యెహోవా తన చేతిని చాపుతాడా?
జపాన్‌లోని మెయికో జవాబిస్తుంది: “ఆయన సేవలో ఉండటం ద్వారా, నేను యెహోవా యొక్క బలమైన ఓదార్పును, సహాయాన్ని అందుకున్నానని నాకు రూఢి అయ్యింది.” యోషికో కూడ యిలా చెబుతుంది: “ప్రజలు నా బాధను అర్థం చేసుకొనకపోయిననూ, యెహోవాకు అంతా తెలుసు. మరి ఆయన నా అవసరతలకు తగినట్లు నాకు సహాయం చేశాడని నాకు రూఢి అయ్యింది.”
జోన్ యిలా చెబుతుంది: “మీరు దుఃఖాన్ని అధిగమించి మీ మామూలు స్థితికి చేరటానికి ప్రార్థన మీకు బలాన్నిస్తుంది. యేసు భూమిపై ఉన్నప్పుడు ఆయన చేసిన మహత్తరమైన స్వస్థతను గురించి, అలాగే నూతన లోకంలో ఆయన చేయబోయే సంపూర్ణ స్వస్థతను గూర్చి నేను ఆలోచించినప్పుడు ఆ మాటలు నాకు ఎంతగా ఓదార్పును అందించాయో!”—మత్తయి 4:23, 24; 11:5; 15:30, 31.
అసలు రొమ్ము క్యాన్సరే లేని లోకాన్ని, వాస్తవానికి, ఏ రుగ్మతలూ లేని దానిని మీరు ఊహించగలరా? ఇది సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడైన, యెహోవా యొక్క వాగ్దానం. భూమిపైన ఉన్న వ్యక్తులలో ఎవరూ కూడ ఆమె లేక అతను రోగిగా ఉన్నానని చెప్పని సమయాన్ని గురించి యెషయా 33:24 మాట్లాడుతుంది. దేవుని రాజ్యము ఆయన కుమారుడైన, యేసుక్రీస్తు ఆధ్వర్యంలో, వ్యాధి, బాధ, మరియు మరణమునకు కారణమైన వాటినన్నిటినీ తుడిచిపెట్టడం ద్వారా తన పూర్తి పరిపాలనను భూమిపైకి విస్తరించినప్పుడు ఈ నిరీక్షణ త్వరలో వాస్తవమవుతుంది! ప్రకటన 21:3 నుండి 5 వరకు ఉన్న ఈ ఆశ్చర్యకరమైన నిరీక్షణను గురించి ఎందుకు చదువకూడదు? నిజమైన ఓదార్పును ఇచ్చే మద్దతుతో భవిష్యత్తును ఎదుర్కొనడానికి ధైర్యాన్ని తెచ్చుకోండి.
[అధస్సూచీలు]
a రుతుక్రమం ఇంకా ఆగని స్త్రీలలో ఈస్ట్రోజెన్‌కు అండాశయాలే ప్రధాన మూలము.