కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 3/8 పేజీ 32
  • గాలిని మరల్చుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • గాలిని మరల్చుట
  • తేజరిల్లు!—1994
తేజరిల్లు!—1994
g94 3/8 పేజీ 32

గాలిని మరల్చుట

లండన్‌ యొక్క ది ఇండిపెండెంట్‌ పత్రిక ప్రకారం, పళ్లచక్రాన్ని నిలబెట్టడానికి ఉపయోగించే క్రేనుల్లో ఒకటి వీదురుగాలికి ఎగిరిపోవడంతో బ్రిటన్‌ యొక్క మొదటి గాలిమరను నెలకొల్పేటప్పుడు ఒక తాత్కాలిక ఆటంకం ఎదురయ్యింది. అయిననూ, శక్తిని అతి త్వరగా, చౌకగా ఉత్పత్తి చేయగల మార్గాల్లో గాలిని స్వాధీనపర్చుకోవడం ఒకటని చెప్పబడింది. అంతేకాకుండా బొగ్గువంటి ధాతువు ఇంధనాలు కాలడం వలన కలిగే రసాయన కాలుష్యం దానివలన ఎంతమాత్రం ఉండదు.

అనేక ఐరోపా రాష్ట్రాలైన—జర్మనీ, డెన్మార్క్‌, మరియు నెదర్లాండ్స్‌ వంటివి—కాలిఫోర్నియాతో సహా, గాలిని మరల్చడం క్రొత్తగా చేయబడగల శక్తిని ఉత్పత్తి చేయడానికి మూలమని భావిస్తున్నా, వాతావరణాన్ని గూర్చి చింతించే వారందరూ సంతోషించడం లేదు. తిరిగే పళ్లచక్రాల రెక్కల శబ్దం విషయమై కొందరు అభ్యంతరం తెల్పుతున్నారు; ఇతరులు వాటి ఆకారాన్ని, ప్రాముఖ్యంగా ఆ యంత్రం ప్రకృతి అందాలున్న ప్రాంతాల్లో నిలబెట్టబడినప్పుడు దాన్ని ఇష్టపడటం లేదు.

అయిననూ, ఐరోపా నందు అతి ఎక్కువగా గాలులు వీచే దేశమైన బ్రిటన్‌లో మాత్రం, తీరాన ఉన్న గాలి శక్తిని “స్వల్ప కాలంలో లభించే చాలా వాగ్దానపూరితమైన ఏకైక శక్తి మూలంగా” ప్రభుత్వ సలహాదారులు ప్రస్తుతిస్తున్నారని న్యూ సైంటిస్ట్‌ పత్రిక నివేదిస్తుంది. ఇంకోవైపు, ఎక్కువ ఖర్చులు ఇమిడి ఉన్నా, తీరాన ఉంచబడటాన్ని విమర్శించే వారు మాత్రం పళ్లచక్రాలను తీరానికి దూరంగా నిలువబెట్టడాన్నే సిఫారసు చేస్తున్నారు. సముద్రం యొక్క బలమైన గాలుల సహాయాన్ని తీసుకుంటూ—వారు బరువైన సామాగ్రిని కదల్చడానికి క్రేనులకు బదులు బరువులు ఎత్తే ప్రత్యేక చక్రం యంత్రాలను ఉపయోగిస్తున్నారు. (g93 12/8)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి