మలేరియాను ఎదుర్కొనుటకు క్రొత్త ఆయుధం
మే 8, 1993 అవేక్!లో తెలుపబడినట్లుగా, ప్రపంచ విపత్తుగా మలేరియా మళ్లీ వచ్చేస్తుంది. “గత సంవత్సరం, బ్రెజిల్లో 5,60,000 మలేరియా కేసులు నమోదు చేయబడ్డాయి” అని ది న్యూయార్క్ టైమ్స్ (మార్చి 23, 1993) తెలియజేసింది. బ్రెజిల్లో సంవత్సరానికి 8,000 మంది మలేరియా మూలంగా మరణిస్తున్నారు. కొలంబియా దేశ పరిశోధకుడైన డా. మాన్యుల్ ఎల్కిన్ పాటారోయో ఇప్పుడు ఒక క్రొత్త పద్ధతిని అంటే మూడు డోసులు, కేవలం 30 సెంట్లు మాత్రమే ఖరీదుచేసే, ఒక కృత్రిమ రసాయనిక టీకామందును కనుగొన్నారు. “ఇది ఒక కోకొకోలా [కొలంబియాలో] ఖరీదు కంటే తక్కువే,” అని డా. పాటారోయో అన్నారు. చికిత్స చేసిన కేసుల్లో 67 శాతం వాటిలో ఇది ప్రభావవంతంగా పనిచేసినట్లు నిరూపించబడింది. మరణకరమైన మలేరియాను ఇది పూర్తిగా నిర్మూలించకపోయినప్పటికీ, మలేరియాకు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటంలో ఇదొక ముందడుగనిపిస్తున్నది. (g93 11/8)