కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g 10/15 పేజీలు 14-15
  • మలేరియా గురించి మీరు తెలుసుకోవాల్సినవి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మలేరియా గురించి మీరు తెలుసుకోవాల్సినవి
  • తేజరిల్లు!—2015
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • 1 మలేరియా అంటే ఏమిటి?
  • 2 మలేరియా ఎలా వస్తుంది?
  • 3 ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు?
  • మృదువైన రెక్కలపై మరణం
    తేజరిల్లు!—1993
  • మలేరియాపై యుద్ధంలో మళ్లీ ప్రాథమిక పద్ధతులు
    తేజరిల్లు!—1997
  • మలేరియాను ఎదుర్కొనుటకు క్రొత్త ఆయుధం
    తేజరిల్లు!—1994
  • “నయంకాగల” వ్యాధులు మళ్ళీ ఎందుకొస్తున్నాయి?
    తేజరిల్లు!—1994
మరిన్ని
తేజరిల్లు!—2015
g 10/15 పేజీలు 14-15

మలేరియా గురించి మీరు తెలుసుకోవాల్సినవి

2013లో దాదాపు 20 కోట్ల మందికి మలేరియా వ్యాధి సోకిందని, దాదాపు 5,84,000 మంది దానివల్ల చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా. అందులో దాదాపు 80 శాతం ఐదేళ్ల లోపు పిల్లలే. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో ఈ వ్యాధి చాలా తీవ్రంగా ఉంది. దానివల్ల 320 కోట్ల మంది ప్రమాదంలో ఉన్నారు.

1 మలేరియా అంటే ఏమిటి?

కొన్ని సూక్ష్మజీవులు వేరే జీవుల శరీరంలో నివసిస్తాయి. అలాంటి ఒక సూక్ష్మజీవి వల్ల వచ్చే వ్యాధి మలేరియా. ఆ వ్యాధి లక్షణాలు: జ్వరం, చలి, చెమటలు పట్టడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కడుపులో తిప్పినట్లు ఉండడం, వాంతులు. వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి రకాన్ని బట్టి, వ్యాధి ఎంతకాలం నుండి ఉంది అనే దాన్నిబట్టి ఈ లక్షణాలు 48-72 గంటల వ్యవధిలో మళ్లీమళ్లీ కనిపిస్తుంటాయి.

2 మలేరియా ఎలా వస్తుంది?

  1. మనిషి శరీరంలో మలేరియాకు కారణమైన సూక్ష్మజీవి ఎలా వ్యాప్తి చెందుతుందో చూపించే చిత్రం

    ఆడ అనాఫిలిస్‌ దోమ కాటువల్ల మలేరియాకు కారణమైన ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవులు మనిషి రక్తంలోకి ప్రవేశిస్తాయి.

  2. ఆ సూక్ష్మజీవులు రక్తంలో నుండి కాలేయ కణాల్లోకి (liver cells) ప్రవేశిస్తాయి. అక్కడ వాటి సంఖ్య వృద్ధి చెందుతుంది.

  3. కాలేయ కణాలు పగిలినప్పుడు, ఈ సూక్ష్మ జీవులు బయటకు వచ్చి రక్త కణాల్లోకి ప్రవేశిస్తాయి. అక్కడ మళ్లీ వీటి సంఖ్య వృద్ధి చెందుతుంది.

  4. మలేరియాకు కారణమైన సూక్ష్మజీవి రక్త కణాల్లోకి ప్రవేశించి అవి పగిలిపోయేలా చేస్తుంది

    ఎర్రరక్త కణాలు పగిలినప్పుడు బయటకు వచ్చి మరిన్ని రక్తకణాల్లోకి ప్రవేశిస్తాయి.

  5. ఎర్రరక్త కణాల్లోకి ప్రవేశించడం, అవి పగిలిపోవడం జరుగుతూనే ఉంటుంది. ఎర్రరక్త కణాలు పగిలిన ప్రతీసారి వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి.

3 ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు?

మీరు మలేరియా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నివసిస్తుంటే . . .

  • దోమ తెర ఉపయోగించండి. దోమతెరను

    • శుభ్రంగా ఉతకాలి.

    • రంధ్రాలు, చినుగులు లేకుండా చూసుకోవాలి.

    • కింద ఖాళీల్లో నుండి దోమలు రాకుండా పరుపు కిందకు పూర్తిగా నెట్టండి.

  • దోమలను చంపడానికి ఇంట్లో దోమల మందు కొట్టండి.

  • వీలైతే తలుపులు, కిటికీలకు దోమలు రాకుండా ఆపే నెట్‌లు బిగించండి. దోమలు వచ్చి నిలవకుండా ఉండేందుకు ఫ్యాన్లు, ఎ.సి.లు ఉపయోగించండి.

  • లేత రంగులో ఉండి, శరీరాన్ని మొత్తం కప్పే బట్టలు వేసుకోండి.

  • దోమలు కొన్ని చెట్లు, పొదల దగ్గరగా గుంపులుగా ఉంటాయి. వీలైతే, అలాంటి చోట్లకు వెళ్లకండి. నీళ్లు ఎక్కడా నిల్వ ఉండకుండా చూసుకోండి, ఎందుకంటే దోమలు అక్కడ గుడ్లు పెడతాయి.

  • వ్యాధి వస్తే, వెంటనే డాక్టరు సహాయం తీసుకోండి.

దోమ, మనిషిలో మలేరియాకు కారణమైన సూక్ష్మజీవి జీవిత చక్రం

ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి ఉన్న దోమ కుట్టినప్పుడు ఒక వ్యక్తికి మలేరియా వస్తుంది. అలాగే వ్యాధి సోకిన వ్యక్తిని మామూలు దోమ కుట్టినప్పుడు కూడా ప్లాస్మోడియం ఆ దోమలోకి వెళ్తుంది. అదే దోమ మళ్లీ వేరేవాళ్లను కుట్టినప్పుడు వాళ్లకు కూడా మలేరియా వస్తుంది

మీరు మలేరియా ఎక్కువగా ఉండే ప్రాంతానికి వెళ్తుంటే . . .

  • వెళ్లేముందు అక్కడున్న పరిస్థితుల గురించి ముందుగా తెలుసుకోండి. ఈ వ్యాధి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ప్లాస్మోడియం వల్ల వస్తుంది. దాన్ని బట్టి వాడాల్సిన మందులు కూడా మారుతాయి. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి, ఈ వ్యాధి విషయంలో మీరేమైనా అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా అని మీ డాక్టరును అడగడం మంచిది.

  • మీరు ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు, పైన ఇచ్చిన జాగ్రత్తలు పాటించండి.

  • వ్యాధి వస్తే, వెంటనే డాక్టరు సహాయం తీసుకోండి. వ్యాధి సోకిన 1 నుండి 4 వారాల తర్వాతే వ్యాధి లక్షణాలు బయటపడతాయని గుర్తుంచుకోండి.

ఇంకా ఏమి చేయవచ్చు . . .

  1. ప్రభుత్వ లేదా ఇతర సంస్థలు నిర్వహించే ఆరోగ్య సంరక్షణా కార్యక్రమాల నుండి ప్రయోజనం పొందండి.

  2. గుర్తింపు ఉన్న సంస్థల మందులే వాడండి. (నాసిరకం మందుల వల్ల వ్యాధి ఇంకా ఎక్కువ కాలం ఉండవచ్చు లేదా ప్రాణాపాయం రావచ్చు.)

  3. ఇంటి చుట్టు పరిసరాల్లో దోమలు పెరిగే ప్రాంతాలు ఉండకుండా చూసుకోండి.

మీరు మలేరియా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉంటున్నారా? లేదా ఆ ప్రాంతానికి వెళ్లి వచ్చారా? అయితే, మలేరియా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టరు సహాయం తీసుకోండి . . .

  • ఒళ్లు వేడెక్కడం (జ్వరం)

  • చెమటలు పట్టడం

  • చలితో వణికిపోవడం

  • తలనొప్పి

  • ఒళ్లునొప్పులు

  • నీరసం

  • కడుపులో తిప్పినట్లు ఉండడం

  • వాంతులు

  • విరేచనాలు

మలేరియా వచ్చినప్పుడు డాక్టరు సహాయం తీసుకోకపోతే, రక్తహీనత వస్తుంది, దానివల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. వ్యాధి లక్షణాలు ఎక్కువ కాకముందే, వెంటనే డాక్టరు దగ్గరకు వెళ్లండి. పిల్లలు, గర్భిణి స్త్రీలు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.a

a ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే, నవంబరు 2011 తేజరిల్లు! (ఇంగ్లీషు) పత్రికలో 24-25 పేజీలు, నవంబరు 2009 తేజరిల్లు! (ఇంగ్లీషు) పత్రికలో 26-29 పేజీలు చూడండి.

మీకు తెలుసా?

ఆఫ్రికా పటంలో గడియారం బొమ్మ

మలేరియా వల్ల కేవలం ఆఫ్రికాలోనే ప్రతీ నిమిషానికి ఒక పిల్లవాడు చనిపోతున్నాడు.

  • ఈ వ్యాధి గర్భిణి స్త్రీలకు, పిల్లలకు వస్తే మరింత ప్రమాదకరం.

  • మలేరియా వల్ల కేవలం ఆఫ్రికాలోనే ప్రతీ నిమిషానికి ఒక పిల్లవాడు చనిపోతున్నాడు.

  • రక్త మార్పిడి వల్ల మలేరియా చాలా అరుదుగా వచ్చింది. (g15-E 07)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి