కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 1/8 పేజీలు 20-22
  • సీతాకోక చిలుక జీవితం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సీతాకోక చిలుక జీవితం
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఉదయ కాల సూర్యరశ్మి అవసరత
  • ‘తొలి చూపులోనే ప్రేమ’
  • మకరందపు రుచి
  • అపాయం నుండి తప్పించుకొనుట
  • ప్రయాణం ముగింపు
  • V ఆకారంలో రెక్కలు తెరిచే క్యాబేజ్‌ వైట్‌ సీతాకోకచిలుక
    సృష్టిలో అద్భుతాలు
  • పాఠం 1
    బైబిలు పాఠాలు నేర్చుకుందాం
  • వలస వెళ్లే మోనార్క్‌ సీతాకోకచిలుక
    సృష్టిలో అద్భుతాలు
  • ఈ అందమైన సీతాకోకచిలుకలు విషపూరితమైనవా?
    తేజరిల్లు!—1994
తేజరిల్లు!—1994
g94 1/8 పేజీలు 20-22

సీతాకోక చిలుక జీవితం

మీ అనుదిన చర్య ఒత్తిడి, కష్టంతో ఉన్నట్లు అనిపిస్తున్నట్లయితే, కష్టించి పనిచేసే సీతాకోక చిలుకను గూర్చి ఒక్కసారి ఆలోచించండి. మొదట్లో మీరు సీతాకోక చిలుక చేసే పని స్వప్నంలో విహరించినట్లు అనిపించవచ్చు. ఒక పువ్వు నుండి మరొక పువ్వుమీదికి ఎగురుతూ, ఒక చోట నుండి మరొక చోటికి వెళ్తూ మకరందం తాగుతూ, ఇష్టం వచ్చినప్పుడెల్లా సూర్యరశ్మిలో ఒళ్ళార్చుకొంటూ చీకూ-చింతా లేని జీవిత విధానానికి ఉత్తమ ఉదాహరణ అన్నట్లు కన్పిస్తుంది సీతాకోక చిలుక వ్యవహారం.

కాని కీటకాల ప్రపంచంలో, పరిస్థితులు ఎప్పుడూ పైకి కన్పించినట్లు కాదు. సీతాకోక చిలుకలు సమయం దాటిపోతున్నట్లు కంగారు పడుతూ అతి ప్రధానమైన సేవ చేస్తూ పనితొందరలో నిమగ్నమై ఉండే ప్రాణులు. పనిదినంలో రూపకార్థ సీతాకోక చిలుకతో మనం కూడ చేరదాం.

ఉదయ కాల సూర్యరశ్మి అవసరత

మీరు తూలుతూ లేస్తారా? సీతాకోక చిలుకలు ఉదయాన్నే లేవకపోవడం ఒక జబ్బువంటిది. కొన్ని ఉదయాల్లో అవి అసలు కదలలేవు. వాటి చుట్టుప్రక్కల వాతావరణాన్ని బట్టి వాటి శరీర ఉష్ణోగ్రత మారుతూ ఉండడమే వాటి సమస్య. ఒక ఆకుపై చల్లని రాత్రంతా కూర్చున్న తర్వాత, వాటి రక్తం చల్లబడడం వలన అవి కదలలేవు, ఇక ఎగిరేదెక్కడ. కాబట్టి అవి సూర్యోదయం కొరకు ఎదురు చూడవలసిందే.

సూర్యుడు ఉదయించినప్పుడు, సీతాకోక చిలుక తన రెక్కలు విప్పి, సూర్యరశ్మి తగిలేవైపు పరిచి పెడుతుంది. విప్పి పెట్టిన రెక్కలు సూర్యరశ్మిని ఉపయోగించే బ్యాటరీలా పనిచేస్తాయి. కావలసినంత వేడిని పొందిన తర్వాత సీతాకోక చిలుక ఎగరడం మొదలు పెడుతుంది. అయితే ఆకాశం మేఘావృతమై ఉంటే ఏమిటి? శీతల ప్రాంతాల్లో, సీతాకోక చిలుకలు సూర్యోదయం వరకు—అనువైన చిన్న కొమ్మలపైనో, పువ్వులపైనో నిశ్చలంగా—పడుకోవలసిందే. ఇది సోమరితనం కాదు. అలా ఉండడం తప్పనిసరి.

ఆ రోజు పెద్దగా వేడి లేనట్లయితే, సీతాకోక చిలుక అప్పుడప్పుడు సూర్యరశ్మి కొరకు ఆగుతూ ఉంటుంది. ఒక కారు పెట్రోల్‌ పంపుకి వెళ్ళి ఎలా పెట్రోల్‌ నింపుకుంటుందో, అలాగే సీతాకోక చిలుక సూర్య శక్తిని నింపుకోవలసిన అవసరముంది. ఉష్ణమండలాల్లో సీతాకోక చిలుకలు ఉదయాన్నే లేదా వర్షం పడిన తర్వాత మొదట చేయవలసిన పనేమంటే, ఒళ్ళార్చుకోవడమే. మామూలుగా చెప్పాలంటే, వాతావరణం ఎంత చల్లగా ఉంటే, అంత ఎక్కువగా ఒళ్ళార్చుకోవలసి ఉంటుంది. తనకు కావలసిన శక్తిని సేకరించిన తర్వాత అది తన పని చేయడం మొదలు పెడుతుంది.

‘తొలి చూపులోనే ప్రేమ’

అత్యావశ్యకమైన పని ఏమంటే జతను కనుక్కోవడమే. కొన్ని వారాలు కూడ మించని దాని ఆయుస్సులో కొంచెం సమయం కూడా వృధా చేయడానికి లేదు. సీతాకోక చిలుకల సామ్రాజ్యంలో ఒక జతను కనుక్కోవడం అంత సులభమైన పని కాదు—దానికి వీరోచితమైన ఓపిక, పట్టుదల అవసరం.

సీతాకోక చిలుకలకు “తొలి చూపులోనే ప్రేమించడం” తెలియదు. అవి హ్రస్వ దృష్టికి ప్రసిద్ధిగాంచాయి. అవి తరచూ ఇతర జాతి ప్రాణులను తమ జాతేనని అపార్థం చేసుకుంటాయి. ఇది నిష్ఫలమైన ప్రయత్నానికి నడిపించి, చివరికి ప్రేమను అభ్యర్థించే సీతాకోక చిలుక తాను చూసింది ఆడది కాదని తెలుసుకొన్నప్పుడు దాని ప్రయత్నం ముగుస్తుంది.

జీవితాన్ని మరింత కష్టతరం చేయడానికి ఆడ సీతాకోక చిలుక సాధారణంగా స్పందించదు. ఆడ సీతాకోక చిలుక చివరికి జాలిపడుతుందనే నిరీక్షణతో మగ సీతాకోక చిలుక పట్టుదలతో దాని చుట్టూ, అతి వేగంగా వాయువులా నృత్యం చేస్తుంది. ఆడ సీతాకోక చిలుక ఎగిరిపోవడంతో ఈ చూడదగిన సీతాకోక చిలుక నృత్యం అకస్మాత్తుగా ఆగిపోతుంది, దానితో నిస్సహాయమైన మగ సీతాకోక చిలుక తన ప్రయత్నం కొనసాగిస్తుంది.

అయినా ఆశ్చర్యకరమేమంటే, ఆడ సీతాకోక చిలుక, తన జత మగ సీతాకోక చిలుకకున్న అందమైన రంగులు చూసి పరవశమైపోదు. సీతాకోక చిలుకకున్న తేజోమయమైన రంగులు కొంత ‘పరిణామ ప్రయోజనం’ కలుగజేసాయని డార్విన్‌ పరిస్థితులను పట్టించుకోకుండా ఊహించినప్పటికీ దానికి సాక్ష్యమేమి లేదు. ఉత్తర అమెరికాకు చెందిన ఆడ అనార్షియా అమేతియా ముదురు ఎరుపు, నలుపు రంగు రెక్కలు గల మగ వాటికి పూర్తిగా నలుపురంగు ఉన్నపుడు కూడ సంతోషంగా వాటితో జత కూడినట్లు ఒక పరిశోధనలో తేలింది. అన్నిటికంటె ముఖ్యమైందేమంటే మగదాని ఎగిరే రీతి, దాని ప్రయత్నం, అంతకంటె వాని అద్వితీయమైన “ప్రేమ దుమారం” గమనించతగ్గది.

దాని ప్రేమ దుమారంలో రసాయనిక పదార్థం అంటే శక్తివంతమైన ఆకర్షణ చేరి ఉంది. దానికున్న మత్తు కల్గించే సుగంధం ఆడ జాతులను ఆకర్షించడానికి తోడ్పడతాయి. తన ప్రణయాభ్యర్థన వేళలో తన “సుగంధంతో” దాన్ని ముంచెత్తడానికి ప్రయత్నిస్తుంది. ప్రేమ దుమారం నిజమైన విజయం కాకపోయినప్పటికీ, ఇష్టపడే ఆడది చివరికి లభించినప్పుడు అది మంచి ఫలితాన్నిస్తుంది.

మకరందపు రుచి

జతకొరకైన వేటలో ఉపయోగించిన శక్తిని మళ్ళీ నింపుకోవాలి. అందుకే సీతాకోక చిలుక మకరందాన్ని ఆశిస్తుంది. పుష్పాలు ఆకర్షణీయమైన రంగులు, రూపాల ద్వారా ఈ మంచి శక్తిగల ఆహారాన్ని ప్రదర్శనలో పెడతాయి. సీతాకోక చిలుక ఒకసారి ఒక పువ్వు మీద వాలితే, దాని పొడుగైన గొట్టం వంటి తొండంతో పుష్పం అడుగు భాగాన కలియ ద్రిప్పి నేర్పుతో మకరందాన్ని తాగుతుంది.

మకరందాన్ని తాగేటప్పుడు, ఈ కీటకపు రోమావృతమైన శరీరంపై పుప్పొడి పడుతుంది, అలా ఆ పుప్పొడితోనే మరో పుష్పాన్ని అది సందర్శిస్తుంది. ఒక్క రోజు పనిలోనే వందల చొప్పున పుష్పాలు పరాగమం చెందుతాయి. అయినా, ఉష్ణమండల అడవుల్లో పుష్పాలు సమృద్ధిగా ఉండవు. మరి ఉష్ణమండల సీతాకోక చిలుకలు సాధారణంగా ఏం తాగుతాయి?

ఉష్ణమండల సీతాకోక చిలుకలకు కుళ్ళిపోయిన పండ్లు తినడం తప్ప వేరే మార్గం లేదు. నేల మీద పడే పండిపోయిన పండ్లు వాటికి కావలసినంత మధురమైన శక్తినిస్తాయి.

సీతాకోక చిలుకలకు ఉప్పు కూడ ఇష్టమే. తడి నేలలో ఉప్పగా ఉన్న తేమను అవి పీల్చుకుంటాయి, ఒక్కోసారి, వాటిని ఇష్టపడే మనుష్యుల చేతిపైనున్న చెమటను కూడ తాగుతాయి. ధైర్యంగల కాగడా సీతాకోక చిలుకలు మొసలిజాతి జంతువుల ఉప్పగా ఉండే కన్నీటిని తాగుతున్నట్లు కనబడుతుంది.

జోడీ కొరకు తీవ్రంగా ప్రయత్నిస్తూ, పూలలో పుప్పొడిని వెదజల్లుతూ, మంచి ఆహారాన్ని సేవిస్తూ, రెక్కలున్న మన స్నేహితుడు శత్రువులనుండి కాపాడుకోవాలి. అతనికి ఆత్మరక్షణ లేనట్లు కన్పించినా, పట్టుబడకుండా ఉండడానికి అతనికి చాలా తంత్రాలున్నాయి.

అపాయం నుండి తప్పించుకొనుట

తేమగల బయళ్ళలోని గులాబీ మొక్కలపై వాలి ఉల్లసించే సీతాకోక చిలుకలు, కీటకాలను తినే పక్షులకు ప్రలోభం కల్గించే ఆహారం. కాని అనుకోకుండా తటాలున ఎగిరిపోయే సీతాకోక చిలుకలను పట్టుకోవడం చాలా క్లిష్టమైన పని. అనేక పక్షులు చాలా సార్లు ప్రయత్నం చేసి చివరికి వదిలి పెడ్తాయి. ఒక వేళ ఏదైనా పక్షి సీతాకోక చిలుకను పట్టుకున్నా, ఆ పక్షి ముక్కులో తన రెక్కలో కొంత భాగాన్ని వదిలి పెట్టి, విజయవంతంగా తప్పించుకోవచ్చు.

కంటిచూపు మరొక రక్షణ. సీతాకోక చిలుకలు హ్రస్వదృష్టి కలవైనప్పటికీ, రసాయన ఆవరణంకల వాటి కళ్ళు కదలికలను కనుక్కోవడంలో చాలా సామర్థ్యం కలవి. ఏదైనా అపాయ సూచన ఉన్నట్లయితే అవి అక్కడనుండి వేగంగా ఎగిరిపోతాయి. దాని ఫోటో తీయాలని ప్రయత్నం చేసేవారెవరికైనా, సీతాకోక చిలుకను గూర్చి బాగా తెలుసు.

నెమ్మదిగా ఎగిరే సీతాకోక చిలుకలకు రక్షించుకొనే వేరొక సామర్థ్యముంది—వాటి రోత తిండి. దీనికి కారణం, అవి గొంగళిపురుగుగా ఉన్నప్పుడు విషపూరితమైన మొక్కలను తినడమే. ఒక పక్షి ఒక సారి సీతాకోక చిలుకను కొరికినట్లయితే, రెండవసారి ఇక అలా చెయ్యదు. తరచూ అసహ్యంగా రుచించే యీ సీతాకోక చిలుకలు—ముదురు లేక ఎరుపు రంగులో ఉండే పెద్ద సీతాకోక చిలుకలవలె—కన్పించగానే పక్షిని దూరంగా ఉండమన్నట్లు పెద్దరంగుల్లో కనబడుతుంటాయి.

ప్రయాణం ముగింపు

ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా తెలిపేదేమంటే దాదాపు అన్ని సీతాకోక చిలుకలు కొన్ని వారాలకన్నా ఎక్కువగా బ్రతకవు, కాని కొన్ని జాతులు 18 నెలల వరకు జీవించవచ్చు. కొన్ని అతి శీతలంగా ఉండే చలికాలంలో లేక ఉష్ణమండలాల్లో సుదీర్ఘంగా పొడిగా ఉండే రుతువుల్లో కదలకుండా పడుకుంటాయి.

వాటి ఆయుష్కాలం చాలా చిన్నదైనప్పటికీ, సీతాకోక చిలుకలు అద్భుతమైన వీరకృత్యాలను నిర్వర్తించగలవు. గత శతాబ్దంలో నల్లగా పెద్దగా ఉండే ఎన్నో సీతాకోక చిలుకలు అట్లాంటిక్‌ మహా సముద్రాన్ని దాటి, ఆఫ్రికా తీరప్రాంతమైన కానరీ దీవులకు చేరడానికి ఎంతో కృషి చేశాయి. వనేసా కార్డూయే అనే అందమైన రంగులున్న వేరొక గొప్ప యాత్రికురాలు, వేసవిలో ఉత్తర ఆఫ్రికా నుండి ఉత్తర ఐరోపా వరకు క్రమంగా ప్రయాణం చేస్తుంది.

అలసిపోకుండా సీతాకోక చిలుకలు వాటి చిన్న ఆయుస్సులో, పువ్వులు, మొక్కలు, ఫల వృక్షాల్లో పుప్పొడిని వెదజల్లే అతి ప్రధానమైన పనిని నిర్వహిస్తాయి. వాటి సాన్నిధ్యం గ్రామప్రాంతాల్లో అందాన్ని పెంచుతూ సంతోషాన్నిస్తాయి. సీతాకోక చిలుకలు లేని వేసవి వేసవే కాదు. (g93 10/8)

[20వ పేజీలోని చిత్రం]

ఉదయాన్నే ఒళ్ళార్చుకొనుట

[21వ పేజీలోని చిత్రం]

పుష్పం నుండి మకరందాన్ని తాగుట

[22వ పేజీలోని చిత్రం]

నేలమీది తడిని పీల్చుకొనుట

[క్రెడిట్‌ లైను]

Courtesy of Buckfast Butterfly Farm

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి