కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 1/8 పేజీ 30
  • మా పాఠకుల నుండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మా పాఠకుల నుండి
  • తేజరిల్లు!—1994
  • ఇలాంటి మరితర సమాచారం
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1994
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1994
  • మా పాఠకులనుండి
    తేజరిల్లు!—1994
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1994
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 1/8 పేజీ 30

మా పాఠకుల నుండి

ఇంటిలో విద్య “ఇంట్లో విద్యాబోధన—మీ కొరకా?” అనే మీ శీర్షికను నేనెంతో మెచ్చుకున్నాను. (జూలై 8, 1993) నేను మా ఇంటివద్ద నాయంతట నేనే చదువుకుంటున్నాను, అయితే నేను చేయాల్సింది చేయలేక నా పాఠశాల పనిలో వెనుకబడ్డాను. కాని నేను మీ శీర్షిక చదివినప్పుడు, అది నన్నెంతో ఉత్సాహితున్ని చేసింది. ప్రస్తుతం నేను పట్టిక ప్రకారంగా చేయగల్గడానికి మొదలుపెట్టాను.

ఎన్‌. ఎస్‌., అమెరికా

కుటుంబ నియంత్రణ జూన్‌ 8, 1993లో “కుటుంబ నియంత్రణ—ప్రపంచవ్యాప్త సమస్య” అనే అంశాలతోనున్న మీ శీర్షికలను చూసి నాకు చాలా కోపంవచ్చింది. బాధ్యతాయుతమైన క్రైస్తవులు తమ కుటుంబ పరిమాణాన్ని పరిమితం చేసుకోవాలని సలహా యివ్వడం అయుక్తమైనది. ఆదికాండములోని [“భూమిని నిండించు”టకు] దేవుని ఆజ్ఞ క్రైస్తవులకు అన్వయించదని ఏ ఆధారంతో మీరు సలహా యిచ్చారు?

ఎ. డి., అమెరికా

“భూమిని నిండించాలని” ఆదాము, హవ్వకు దేవుడిచ్చిన ఆజ్ఞ మరలా నోవహు, అతని కుటుంబానికి ఇవ్వబడింది. అయినను, పునరుత్పత్తి శాసనం బైబిల్లో మరెక్కడా కూడ క్రైస్తవులపై విధింపబడలేదు. (ఆదికాండము 1:28; 9:1-5; అపొస్తలుల కార్యములు 15:29) వాస్తవానికి, “పరలోక రాజ్యమునిమిత్తము” అవివాహితులుగా ఉన్నవారిని బైబిలు మెచ్చుకుంటుంది. (మత్తయి 19:12; 1 కొరింథీయులు 7:38) కాబట్టి పిల్లలను కనడం, కుటుంబ నియంత్రణ అనే విషయాల్లో, దంపతులు తమ స్వంత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. క్రైస్తవులు తమ పిల్లల భౌతిక, మానసిక, ఆత్మీయ అవసరతల యెడల శ్రద్ధ వహించాలని ఆజ్ఞాపించబడ్డారు గనుక, బాధ్యతాయుతమైన తలిదండ్రులు తమ కుటుంబ పరిమాణాన్ని పరిమితం చేసుకోసుకుని తద్వారా అలాంటి శ్రద్ధవహించుట జ్ఞానయుక్తమైందిగా భావించవచ్చు. (1 తిమోతి 5:8) పిల్లలు “యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము” అనే వాస్తవాన్ని ఇది ఏవిధంగా కూడ తక్కువ చేయదు. (కీర్తన 127:3)—ఎడి.

త్రాగుబోతుతనం ఏప్రిల్‌ 8 మరియు మే 8, 1993 సంచికలలో“యౌవనస్థులు ఇట్లడుగుదురు . . . ” అనే భాగంలో “నేను త్రాగుడుకు బానిసనై పోయానా?,” “నేనెలా త్రాగుడు మానగలను?” అనే అనే అద్భుతమైన శీర్షికలకు మీకు కృతజ్ఞతలు. నాకు 48 ఏండ్లు, మరి త్రాగుబోతుతనం నుండి [కోలుకుంటున్నాను]. ఈ “వ్యాధి” వల్ల శరీరానికి, మనస్సుకు, స్ఫూర్తికి సంబంధించిన హానికరమైన ప్రభావాలు హృదయాన్ని విరిచేలా ఉంటాయి. నేను త్రాగుడుకు బానిసనైపోయానని గుర్తించినప్పుడు, యెహోవా నన్నిక ఎన్నటికీ క్షమించడని నేను భావించాను. కాని నేను పెద్దల దగ్గరకు వెళ్లాను, అయితే వారు ప్రేమపూర్వక సహాయమందించారు. మరలా దానికి అలవాటు పడిన తర్వాత, నేను వైద్యచికిత్స పొందాను. ప్రస్తుతం త్రాగాలనే తపన వచ్చినట్లైతే, నేను ప్రార్థించి, దేవుని నూతన లోకాన్ని గూర్చి ధ్యానిస్తాను. త్రాగుడు లేదా ప్రోత్సాహకరమైన జీవిత అనుభవాలను చర్చించేటటువంటి అనేకమైన కావలికోట మరియు తేజరిల్లు! శీర్షికలు కూడా నేను చదువుతాను. యెహోవాప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గూర్చిన మీ మంచి అవగాహనకు, మాకు మంచి శీర్షికలను అందిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు.

సి. డి., అమెరికా

హోమ్‌ వర్క్‌ “యౌవనస్థులు ఇట్లడుగుదురు . . . ఇంత ఎక్కువ హోమ్‌ వర్క్‌ ఉంటే నేనేం చేయాలి?” (జూలై 8, 1993) అనే శీర్షికకు మీకు చాలా కృతజ్ఞతలు. నేను ఎక్కువ హోమ్‌ వర్క్‌తో దిగులుగా ఉన్నప్పుడు ఒకే ఒకసారి ఆ శీర్షికను చదివాను. విరామం తీసుకోడానికైనా లేదా క్రైస్తవ కూటములకు సిద్ధపడడానికైనా నాకు సమయముండేది కాదు. నేను ప్రస్తుతం మీ సలహాను పాటిస్తున్నాను.

ఎమ్‌. హెచ్‌., అమెరికా

“ఇంత ఎక్కువ హోమ్‌ వర్క్‌ ఉంటే నేనేం చేయాలి?” (జూలై 8, 1993) అనే శీర్షికకు మీకు కృతజ్ఞతలు. వెంటనే దానిలో ఉన్న సలహాలను పాటించాను, మరి నేను నిజంగా వాటినుండి ప్రయోజనం పొందాను. ప్రస్తుతం నేను ఆత్మీయ విషయాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించగలను. చాలా వందనాలు!

ఎమ్‌. ఎమ్‌., ఇటలీ

అంగవైకల్యత “యౌవనస్థులు ఇట్లడుగుదురు . . . అనే భాగంలో “నేనెందుకు అంగవైకల్యంతో బాధపడాలి?” (సెప్టెంబరు 8, 1993) అనే శీర్షిక ఈ సమస్యను వాస్తవంగా వివరించింది. నాకు రెండు కాళ్లు అవిటివే. ప్రజలు నన్ను పాపం అనే భావంతో చూస్తున్నప్పుడు నేను చాలా బాధపడేవాన్ని. నేనొక బిక్షగాడినన్నట్టు—ఎవరైనా నాకు చందా ఇచ్చినప్పుడు నాకు చాలా బాధ కలిగేది! యెహోవా శరీర స్థితిని లక్ష్యపెట్టడు గాని “హృదయమును లక్ష్యపెట్టును,” అనే విషయమే నన్ను ఓదార్చింది.—1 సమూయేలు 16:7.

ఎ. ఎ. ఎ. ఎస్‌., బ్రెజిల్‌

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి