ప్రపంచ ప్రభుత్వం—ఐక్యరాజ్య సమితే దీనికి పరిష్కారమా?
ఇటీవల సంవత్సరాలలో ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో విశ్వాసాన్ని, పొగడ్తను సంపాదించింది. “యుఎన్” అనే సంకేతాక్షరం, శాంతిని నెలకొల్పడానికి నీలం రంగు కవచాలు ధరించిన సైన్యాలు యుద్ధ కల్లోలిత ప్రాంతాలకు పరుగులిడటం, ఆఫ్రికాలో ఆకలితో అలమటించే శరణార్థులకు పునరావాస కార్యకర్తలు ఆహారం తీసుకురావడం, నూతనలోక విధానాన్ని స్థాపించడానికి అంకితం చేసుకొన్న స్త్రీపురుషులు నిస్వార్థంగా పనిచేయడం అనే వీరోచిత దృశ్యాలను లక్షలాది మందికి జ్ఞప్తికి తెస్తుంది.
ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నివేదించినట్లుగా, ది వాషింగ్టన్ పోస్ట్ నిర్వహించిన 9 మాసాల అన్వేషణ ప్రకారం, “బారీ ఎత్తులో, అపరిమితంగా అదుపుచేయలేనటువంటి బ్యూరాక్రసీ (దొరతనం), దాని విలువను తగ్గించే కొట్లాటలకు, లోపాలకు గురికావడమే” యీ కథానాయక రూపమే వెనుకనున్న అసలు నిజత్వం. కొత్తగా వచ్చినటువంటి మరియు మాజీ యుఎన్ అధికారులతో జరిపిన సదస్సులు, వేల కొలది పేజీల వ్రాతలపై ఆధారపడి చేసిన అధ్యయనం ఈ క్రింది విషయాన్ని వెల్లడించింది.
ఆఫ్రికాకు సహాయం: యుద్ధం, కరువు, పేదరికం మరియు రోగాలవల్ల చిత్రహింసలపాలైన ఆఫ్రికా ఖండానికి అత్యంత అవసరమైన కోటానుకోట్ల డాలర్లను యుఎన్ ధారపోసింది. అసంఖ్యాకమైన జీవితాలు కాపాడబడ్డాయి.
అయినను, సరైన కార్యనిర్వాహణ లేనందువల్ల, నిర్లక్ష్యంవల్ల, కొన్ని సమయాల్లో అవినీతివల్ల కూడ అనేక లక్షల డాలర్లు, వేలకొద్దీ జీవితాలు మటుమాయమయ్యాయి. ప్రతీరోజు అనేకమంది చనిపోతున్నటువంటి కరువు సంతరించిన సొమాలియాకు యుఎన్ పునరావాస సహాయాన్ని కుండపోతగా కుమ్మరించింది. కాని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థకు కార్యనిర్వాహక డైరెక్టరు ఆర్యే నాయర్, ట్రిబ్యూన్ వార్తాపత్రికలో ఈ విధంగా ఎత్తి చెబుతున్నాడు: “ఐక్యరాజ్య సమితి మరియు దాని వివిధ సంస్థలు గగుర్పాటు కల్గించేలా చాలా అలక్ష్యంగాను అసమర్థంగాను ఉన్నాయి, అందుకే అవి సొమాలియా విషాదాన్ని తొలగించడంలో అసలు దాదాపు ఎలాంటి పాత్రకూడా వహించనేలేదు.”
ఆహార సదుపాయాన్ని దారి మళ్లించడం, మానవుల సహాయార్థ ధనాపహరణ, కపటంగా దోచుకోవడం, అక్రమంగా అమ్మడం, మోసంతో దొంగడబ్బు మార్పిడిచేయడంలో కొంతమంది యుఎన్ అధికారులు ఇరికించబడ్డారని కూడా ఈ నివేదన ఆరోపించింది. యుఎన్ అన్వేషకులు దాదాపు ఏడు ఆఫ్రికా దేశాల్లో అలాంటి దోపిడికి ఆధారాలను కనుగొన్నారు.
శాంతిని కాపాడటం: సంవత్సరాల తరబడి అనగా 1945లో యుఎన్ స్థాపించినప్పటినుండి, వందకు పైగా ఘోర పోరాటాలు జరిగి, యుద్ధంలో 2 కోట్లమంది చనిపోయినప్పటికి, శాంతిని కాపాడటమే యుఎన్ ప్రాథమిక లక్ష్యం. అయినను, 1987 నుండి, అంతకు మునుపు దాని చరిత్రంతటిలోను చేపట్టిన కార్యక్రమాలకు సమానమైన, శాంతిని కాపాడే 13 కార్యక్రమాలను యుఎన్ ప్రవేశపెట్టింది.
ఈ కార్యక్రమాల నిమిత్తమైన ఖర్చు మేలైనదేనని కొంతమంది వాదిస్తుండగా, అనేకమంది ఈ పనులు విపరీతమైపోయాయని అంటారు. ఉదాహరణకు, శాంతిని కాపాడే కార్యక్రమాలు దశాబ్దాలుగా కొనసాగాయి, లక్షల కొలదిగా డబ్బును కాజేసినప్పటికి రాయబారాల ప్రయోజనం స్తంభించిపోయింది. కంబోడియాలోని శాంతిని కాపాడే యుఎన్ సంఘం 10 లక్షలకంటే ఎక్కువ డాలర్లను సైన్యాల టీవీ మరియు విసిఆర్లకు, మరొక 6,00,000 డాలర్లు వార్తాపత్రిక, పత్రికల చందాలకూ పంపకం చేసింది.
సవరింపు: యుఎన్లోనే సవరణలను గూర్చిన ఉద్ఘాటనలు వ్యాపించి ఉన్నాయి, కాని దేన్ని సవరించాలనే దాని విషయంలో వేర్వేరు అభిప్రాయాలున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ నిర్ణయ విచారణలో వారితో వంతపలకడానికి పిలుపునిస్తున్నాయి, మరియు ఆర్థిక, సాంఘిక పరమైన కార్యక్రమాలను వృద్ధిచేయాలని యిష్టపడుతున్నాయి. పారిశ్రామికంగా వృద్ధిచెందిన దేశాలు ఈ కార్యక్రమాలను తగ్గించి, అవినీతిని, అవ్యవస్థను, దుర్వినియోగాన్ని అంతమొందించాలని కోరుతున్నాయి.
ఒక ఉన్నతాధికారి ఇలా చెప్పాడు: “నిజంగా సవరించాలంటే, బ్యూరాక్రసీలో అసాధ్యమైన ఒకదాన్ని మీరు చేయాలి: ఆ స్థలాన్ని పూర్తిగా నిర్మలం చేయాలి. అర్థవంతమైనదేదో ఒకటి చేయాలంటే, మీరు 45 ఏండ్లుగా ఉన్న బార్నకల్లాంటి వారిని (ఓడయొక్క స్థూలభాగంలో పొరలా అంటుకుని దాని గమనాన్ని తగ్గించే సముద్రజీవి) చెక్కేయాలి, మరి దానిలో అనేకమైన బార్నకల్లున్నాయి.”
ఒకే ఒక ప్రభుత్వం మానవజాతి కార్యకలాపాలను నడిపే అవసరత ఉందని క్రైస్తవులు ఎదురుచూస్తున్నారు గనుక, వారు ఐక్యరాజ్య సమితే దీనికి పరిష్కారమని విశ్వసించరు. బదులుగా, వారు యేసు తన అనుచరులకు ప్రార్థించమని చెప్పిన ప్రభుత్వమైన దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తారు.—మత్తయి 6:10. (g93 9/22)