మా పాఠకుల నుండి
కార్టూన్లు “హింసాత్మకమైన టి.వి. కార్టూన్లు హానికరమా?” అనే మీ శీర్షిక నాకు నచ్చింది. (జనవరి 8, 1994) అటువంటి హింసాత్మకమైన కార్యక్రమాల వలన చాలామంది చిన్న పిల్లలు ప్రభావితులౌతున్నారు గనుక నేను ఆ శీర్షికను ఆనందించాను. నాకు 13 సంవత్సరాల వయస్సు.
డి. ఎల్., అమెరికా
క్షమాగుణం “బైబిలు ఉద్దేశం . . . దేవుని క్షమాగుణం ఎంత పూర్ణమైనది?” (మార్చి 8, 1994) అనే శీర్షికను నేనిప్పుడే చదవడం ముగించాను. నాకు అవసరమైనది వాస్తవంగా అదే. మన దేవుడు పాపాలను తీసివేసినప్పుడు, అవి పోతాయని, తుడిచి వేయబడతాయని, కడగబడతాయని నేను తెలుసుకోడానికి ఈ శీర్షిక నాకు సహాయం చేసింది. నేను ఈ ఉత్తరం వ్రాస్తూ, నేను నిజమైన మనశ్శాంతిని పొందాను.
జె. డబ్ల్యు., అమెరికా
యెహోవా మన హృదయాన్ని చూస్తాడని, మన పాపాలను తుడిచి వేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడని తెలుసుకోవడం నాకు ఓదార్పును కలుగజేసింది. నేను యెహోవా క్షమాగుణానికి అర్హురాలిని కానని భావించేదాన్ని, అందుకు నేను కృంగిపోయాను. నేను ఆత్మహత్య చేసుకోవాలని కూడ ఆలోచించాను. సంఘంలోని సన్నిహిత స్నేహితులు నాకు సహాయం చేశారు. కానీ ఇంకా ఓదార్పు అవసరం, ఈ శీర్షిక నాకు సహాయం చేసింది.
కె. హెచ్., అమెరికా
కళ్లద్దాలు “కళ్లద్దాలపై దృష్టిని సారించుట” అనే శీర్షిక విషయమై మీకు కృతజ్ఞతలు. (అక్టోబరు 8, 1993) నాకు కంటిచూపు సమస్య ఉందని, నేను కంటి వైద్యున్ని సందర్శించాలని నాకు తెలుసు, కానీ నేను ఆ విషయాన్ని వాయిదా వేస్తూ వచ్చాను. మీ శీర్షిక చదివిన తరువాత, నేను అపాయింటుమెంటు తీసుకున్నాను. నేను అలా చేసినందుకు నాకు సంతోషంగా ఉంది. ఈ శీర్షిక నా కొరకు సరైన సమయంలో వచ్చింది.
జె. డబ్ల్యు., ఇంగ్లాండ్
సీతాకోక చిలుకలు “సీతాకోక చిలుక జీవితం,” అనే శీర్షిక విషయమై మీకు కృతజ్ఞతలు తెలుపుకోడానికి నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఇష్టపడుతున్నాను. (జనవరి 8, 1994) క్రితం నెల, నేను, నా భార్య జయన్ నేషనల్ పార్క్‌లో కాస్త విశ్రాంతి తీసుకుంటున్నాము. మేమీ శీర్షికను కలిసి చదువుతూ ఉన్నాం, ఉన్నట్టుండి ఒక సీతాకోక చిలుక నేలపై వాలి దాని రెక్కలను వెడెల్పుగా చాచింది. అవి అలా ఎందుకు చేస్తాయో మాకు ముందెప్పుడూ తెలియదు! యెహోవా సృష్టి యొక్క అద్భుతాలను మెచ్చుకోడానికి ఈ శీర్షిక మాకు వాస్తవంగా సహాయపడింది.
కె. బి., అమెరికా
ప్రపంచ పరిశీలన మీరు ఎంత గొప్ప పని చేస్తున్నారో చెప్పడానికే నేను వ్రాయాలని ఇష్టపడ్డాను. నేను పాఠశాల కొరకు చిన్న వార్తా నివేదికను వ్రాసుకోవలసి వచ్చినప్పుడు “ప్రపంచ పరిశీలన” అనే శీర్షిక చాలా సహాయం చేసింది.
జె. డబ్ల్యు., అమెరికా
నాకు 14 సంవత్సరాల వయస్సు, నేను అవేక్!ను క్రమంగా చదువుతాను. నేను అన్ని శీర్షికలను ఇష్టపడతాను. అయితే, నేను మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత చెల్లించాలని అనుకుంటున్న భాగము, “ప్రపంచ పరిశీలన” అనేది. నేను దానినుండి అనేక వేర్వేరు విషయాలను నేర్చుకుంటున్నాను. అది ఎప్పుడూ సమయానికి సరిపోయేదిగా ఉంటుంది, అందులో తరచూ మేము పాఠశాలలో ఆ సమయంలో చర్చించే విషయాలను నేను చూచాను. ఈ విషయాలను గురించి మీరు మీ స్వంత అభిప్రాయాలను ఎప్పుడూ చెప్పరనే వాస్తవాన్ని కూడ నేను మెచ్చుకుంటున్నాను. ఇతర ప్రజలతో వాదనలోకి దిగకుండానే సమాచారాన్ని పంచుకోడాన్ని అది సులభతరం చేస్తుంది.
టి. ఎమ్., అమెరికా
మంత్రవిద్య “బైబిలు ఉద్దేశ్యము . . . మంత్రవిద్య నభ్యసించుటలో ప్రమాదమున్నదా?” (డిశంబరు 8, 1993) అనే శీర్షికను నేనిప్పుడు చదివాను గనుక మంత్రవిద్య చాలామట్టుకు ఎందుకు తప్పైనదో నేను నిజంగా అర్థం చేసుకున్నాను. భవిష్యత్తును ముందే చెప్పడానికి ఆత్మలను పురికొల్పడమనేది ఇటీవల మా పాఠశాలలో పరిపాటి అయ్యింది. ఇతరులు ‘నువ్వు మాతోపాటు రావా?,’ అని నన్ను అడుగుతారు. నేను రానని నిరాకరించినప్పటికీ, అదెందుకు తప్పోనని నేను ఆలోచించాను. నేను జవాబు కనుగొనాలని ప్రయత్నించాను, కానీ నన్ను సంతృప్తిపర్చే జవాబును కనుగొనలేకపోయాను. నేను వెదకడం మానేశాను, అప్పుడే మీ శీర్షిక వచ్చింది. అది సంతృప్తికరమైన జవాబునిచ్చింది. దాన్ని ప్రచురించినందుకు మీకు ధన్యవాదాలు.
ఎమ్. కె., జపాను