సంరక్షించే వారొకరున్నారని తెలుసుకొనుట ఓదార్పుగా ఉంటుంది
కొంతమంది ప్రజలు చూడ్డానికి పర్వాలేదన్నట్లుంటారు, కాని వారు తీవ్రంగా బాధపడుతుంటారు. అట్టివారికి సహాయం చేసేదేమిటి? శ్రద్ధ మరియు అర్థంచేసుకొనే స్వభావం అనేవి ప్రాముఖ్యం. అలాంటి వ్యక్తి గత సంవత్సరం న్యూయార్క్‌నందలి బ్రూక్లిన్‌లోని వాచ్‌టవర్ సొసైటీకి యిలా వ్రాశాడు:
“నేను ఈ మధ్యనే కృంగిన వారికి ఓదార్పు అనే కరపత్రం చదివాను. రసాయన అస్థిరతవల్ల కాలక్రమంగా నేను కృంగుదలతో బాధపడుతున్నాను. ఆ కరపత్రం చాలా ఓదార్పుగా ఉంది.
“కృంగుదలకు సంబంధించి నిరీక్షణ ఉందని, దానిని జయించే మార్గాలున్నాయనీ తెలుసుకోవడం ఓదార్పుగా ఉంది. కృంగుదలతో బాధపడే నాలాంటి వారిని సంరక్షించే వారొకరున్నారని తెలుసుకోవడం కూడ ఓదార్పుగా ఉంది.”
ఈ కరపత్రం కొంచెం స్థలంలోనే ఎంతో చెబుతుంది. మీకు దాని పత్రి ఒకటి కావాలంటే లేదా మరెక్కువ సమాచారం కావాలనుకుంటే, దయచేసి Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah. లేదా రెండవ పేజీలో ఇవ్వబడిన చిరునామాలలో మీ కనుకూలమైన దానికి వ్రాయండి.
[32వ పేజీలోని చిత్రం]
కృంగిన వారికి ఓదార్పు